• facebook
  • whatsapp
  • telegram

రుసుము - లాభనష్టాలు

అసలు ధర: ఒక వస్తువును కొన్న ధరను అసలు ధర లేదా కొనుగోలు ధర (CP - Cost Price) అంటారు.
అమ్మకం ధర: ఒక వస్తువును అమ్మిన ధరను 'అమ్మకపు ధర' (SP - Selling Price) అంటారు.
లాభ నష్టాలు: వస్తువు కొన్నవెల కంటే అమ్మిన వెల ఎక్కువైతే వచ్చే అధిక డబ్బును 'లాభం' అంటారు.
*  లాభం = అమ్మిన వెల -  కొన్న వెల
*  అమ్మిన వెల = కొన్న వెల + లాభం
  వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువైతే నష్టం వస్తుంది.
 *   నష్టం = కొన్నవెల - అమ్మిన వెల
 *  కొన్న వెల = అమ్మిన వెల + నష్టం

 

లాభ, నష్ట శాతాలు:
       లాభశాతం లేదా నష్టశాతాన్ని ఎల్లప్పుడూ కొన్నవెలపై మాత్రమే లెక్కిస్తారు.

 
           
* లాభానికి గుర్తు '+', నష్టానికి '-' గుర్తు ఉపయోగించాలి.
* ఒక వస్తువును A% లాభానికి అమ్మితే దాని అమ్మిన వెల = కొన్నవెలలో (100 + A)%
* ఒక వస్తువును B% నష్టానికి అమ్మితే, దాని అమ్మిన వెల = కొన్నవెలలో (100 - B)%

* ఒక వ్యక్తి రెండు ఒకే విధమైన వస్తువులను ఒక దాన్ని x% లాభానికి, రెండో దాన్ని x% నష్టానికి
   అమ్మితే ఆ రెండింటి మీద వర్తకుడు ఎప్పుడూ నష్టమే పొందుతాడు. 

         

     ఒక వస్తువును A% లాభం లేదా నష్టానికి అమ్మి, తర్వాత మళ్లీ B% లాభం లేదా నష్టానికి

 
          
       x వస్తువుల కొన్నవెల y వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే

 
         
       ఒక వ్యక్తి రెండు వస్తువులను రూ.x లకు కొని ఒక దాన్ని A% లాభం లేదా నష్టానికి, రెండో దాన్ని B%
         లాభం లేదా నష్టానికి అమ్మితే రెండింటి అమ్మిన వెలకు సమానమైతే మొదటి వస్తువు

 
         

       x ను m% లాభంతో y ను n% లాభంతో, z ను p% లాభంతో అమ్మితే మొత్తం మీద రూ.R లాభం వస్తే  

            
విలువ ధనాత్మకమైతే లాభం, రుణాత్మకమైతే నష్టం వస్తుంది.  ఒక వ్యక్తి x వస్తువులను రూ.xలకు కొని రూ.x లకు y వస్తువులను అమ్మితే నష్టశాతం

 
          
(మొదటి సందర్భంలో వస్తువులు = రెండో సందర్భంలో రూపాయలు అయినప్పుడు ఈ సూత్రం ఉపయోగించాలి)

రుసుము
* వర్తకులు ఒక వస్తువు కొన్నవెల (C.P) పై కొంత లాభం (p) వేసుకొని దానిపై కొంత అధికంగా ప్రకటన  వెల నిర్ణయిస్తారు.
* ప్రకటన వెలనే పట్టీ వెల, క్యాటలాగు వెల, లిఖిత మూల్యం, గుర్తించిన వెల అని కూడా అంటారు.
* వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రకటన వెలపై కొంత తగ్గించి అమ్ముతారు. ఈ తగ్గింపును రుసుం,  వర్తక రుసుము, ముదరా డిస్కౌంట్ అంటారు.
* రుసుమును ఎల్లప్పుడూ ప్రకటన వెలపై లెక్కిస్తారు.

రుసుముకు సంబంధించిన సూత్రాలు:
1. రుసుము = ప్రకటన వెల - అమ్మిన వెల 
       [d = M.P. − S.P.]

 
        

 3. రుసుము ఇచ్చినప్పుడు ప్రకటన వెల = అమ్మిన వెల + రుసుము
                       [M.P. = S.P. + d]

 


     

 7. రుసుము, లాభం ఇచ్చినప్పుడు కొన్నవెల = ప్రకటన వెల - (రుసుము + లాభం)
                                  
 [C.P. = M.P. − (d + p)]

 
      
 9. రుసుము, లాభం ఇచ్చినప్పుడు ప్రకటన వెల = కొన్నవెల + (రుసుము + లాభం)
                                   [M.P. =  C.P. + (d + p)] 

      

1. ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మితే అతడికి లాభమా? నష్టమా?  ఎంత శాతం?
సాధన: వ్యాపారి పెట్టెను కొన్న ధర = రూ.480
                                అమ్మిన ధర = రూ.540
            లాభం = 540 - 480 = రూ.60 

          
       
  నష్టం శాతం = 6%

3. 12 మామిడి పండ్ల కొన్నవెల 15 మామిడి పండ్ల అమ్మిన వెలకు సమానమైతే మొత్తం మీద లాభం లేదా నష్టం ఎంత శాతం?
సాధన: కొన్న వెల : అమ్మిన వెల = 15 : 12
            నష్టం = 15 - 12 = 3

 
            

4. రాము ఒక స్థలం రూ.24,000 లకు అమ్మడం ద్వారా 20% లాభం పొందాడు. అయితే స్థలం కొన్నవెల ఎంత?
సాధన: రాము స్థలాన్ని అమ్మిన వెల = రూ.24,000
                                             లాభం = 20%

 
                                        
5. ఒక వస్తువును రూ.170 లకు అమ్మితే 15%  నష్టం వస్తుంది. అయితే కొన్నవెల ఎంత?
సాధన: వస్తువు అమ్మిన వెల = రూ.170
                             నష్టశాతం = 15% 

7. ఒక వ్యక్తి రెండు వస్తువులను ఒక్కొక్కటి రూ.2,500 లకు అమ్మితే మొదటిదానిపై 20% లాభం, రెండో
     దానిపై 10% నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి లాభమా, నష్టమా? ఎంతశాతం?

 

8. ఒక కానుక ప్రకటన వెల రూ.176. దుకాణదారుడు దాన్ని రూ.165 లకు అమ్మితే రుసుం, రుసుం శాతం   కనుక్కోండి.
సాధన: కానుక ప్రకటన వెల = రూ.176
                           రుసుము = 176 - 165
                                          = రూ.11

 
                 
9. ఒక ఫ్యాన్ ప్రకటన వెల రూ.1600. అమ్మకపుదారుడు దానిపై 6% రుసుము ఇస్తే ఫ్యాన్ అమ్మిన వెల ఎంత?
సాధన: ఫ్యాన్ ప్రకటన వెల = రూ.1600 
               రుసుము శాతం = 6% 

 
                    

10. ఒక వడ్రంగి తాను చేసిన వస్తువుపై 15% రుసుము ఇస్తూ రూ.680 లకు అమ్మితే వస్తువు ప్రకటన వెల ఎంత?

 

11. ఒక వ్యాపారి వస్తువు ప్రకటన వెలను కొన్నవెలపై 25% అంటే నిర్ణయించిన ధరపై కొంత రుసుము ఇచ్చిన 10% లాభం వస్తుంది. అయితే రుసుము శాతం ఎంత?
సాధన:  కొన్నవెల = 100 అనుకోండి
             ప్రకటన వెల = 125
            అమ్మిన వెల = 110
                రుసుము = 125 - 110 = 15
  రుసుము శాతం = 15/125 × 100
            = 12 %


12. ఒక రేడియో తయారీదారుడు రేడియోను రూ.1500 లకు కొని అతడు కొన్నవెలపై 20% అధికంగా ప్రకటన వెల నిర్ణయించాడు ,. అయితే ఆ వస్తువుపై ఎంత శాతం రుసుము ఇస్తే 10% లాభం వస్తుంది?
సాధన:    కొన్నవెల = 100 అనుకోండి.
                 ప్రకటన వెల = 120
                అమ్మిన వెల = 110
                    రుసుము = 120 - 100 = 10
          రుసుము శాతం = 10/120 × 100
                     = 100/12 = 8 1/3 %

    

పన్ను (VAT - విలువ ఆధారిత పన్ను)
        వ్యాపారులు వారు అమ్మిన వస్తువులపై కొంత సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే 'పన్ను' (Tax) అంటారు. ఈ పన్ను అమ్మే వస్తువు ధర ఆధారంగా ఉంటుంది. వ్యాపారులు ఈ సొమ్మును   వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు.
        VAT అనేది రవాణా చేసే సరకులపై మాత్రమే విధిస్తారు. దీన్ని సేవలపై వేయరు.

 

1. ఒక జత బూట్ల వెల రూ.450. దానిపై 6% అమ్మకం పన్ను విధిస్తే కట్టాల్సిన బిల్లు మొత్తం ఎంత?
సాధన: బూట్ల ఖరీదు = రూ.450
           బిల్లు మొత్తం = 450 + 450 లో 6%
                          = 450 + 450 × 6/100       
                               = 450 + 27
                               = రూ.477
* వ్యాట్‌ను అమ్మకపు వెలపై లెక్కిస్తారు.
* వ్యాట్ అనేది అమ్మకపు వెలపై పెరుగుదల శాతం.

2. ఒక ఏసీ ప్రకటన వెల రూ.2,800. దీన్ని 5% వ్యాట్‌తో కలిపి అమ్మితే దాని వెల ఎంత?
సాధన: ప్రకటన వెల = రూ.2,800
           అమ్మిన ధర = 2800 + 2800 లో 5%
                    = 2800 + 2800 × 5/100          
                    = 2800 + 140
       అమ్మిన ధర = రూ. 2940

 

3. ఒక వస్తువు ధర రూ.500. ఆ వస్తువుపై వ్యాట్ 8%  అయితే ఆ వస్తువును కొనాలంటే ఎంత చెల్లించాలి?
సాధన: మొత్తం = 500 + 500 లో 8%
              = 500 + (8/100 × 500)       
               = 500 + 40 
               = రూ.540

4. ఒక వజ్రం ధర ఒక శాతం వ్యాట్‌తో కలిపి రూ.10,100 అయితే దాని ప్రకటన వెల ఎంత?

సాధన: 100/101 × 10,100

= రూ.10,000

5. ఒక వస్తువు ధర 5% వ్యాట్‌తో కలిపి రూ.73.50 అయితే ఆ వస్తువు అసలు ధర ఎంత?
సాధన: వస్తువు అసలు ధర ×  అమ్మిన వెల 
            x + xలో 5% = 73.50
           
                                                                         

శ్రీప్రఙ్ఞ కాంపిటీటివ్ స్ట‌డీస‌ర్కిల్‌, తిరుప‌తి

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌