వడ్డీ: కొంత సొమ్మును అప్పుగా తీసుకొని దానికి చెల్లించే ప్రతిఫలాన్ని 'వడ్డీ అంటారు.
వడ్డీ రెండు రకాలు
1) బారువడ్డీ (సాధారణ వడ్డీ)
2) చక్రవడ్డీ
* అప్పు తెచ్చిన సొమ్మును (అసలు) (P) అంటారు.
* అప్పు మీద ఏ రేటున వడ్డీ చెల్లించాలో దాన్ని వడ్డీరేటు లేదా రేటు (R) అంటారు. రేటు ఎప్పుడూ సంవత్సరానికి 100 రూపాయలపై ఉంటుంది.
ఉదా: వడ్డీరేటు 5% అంటే ఒక సంవత్సరానికి రూ.100కు వడ్డీ 5 రూపాయలు.
* అప్పు తీసుకున్న రోజు నుంచి దాన్ని తీర్చే వరకు గల సమయాన్ని కాలం (T) అంటారు. తీసుకున్న రోజు, తీర్చే రోజుల్లో ఏదో ఒక దాన్నే లెక్కలోకి తీసుకోవాలి.
* వడ్డీతోసహా అప్పు చెల్లించడానికి ఇవ్వాల్సిన మొత్తం సొమ్మును అసలు (A) అంటారు.
బారువడ్డీ: కొంత సొమ్మును (P), R రేటు చొప్పున T కాలానికి అప్పుతీసుకుంటే చెల్లించాల్సిన సాధారణ వడ్డీ
ఇక్కడ R = 100కి సంవత్సరానికి శాతాల్లో ఉండాలి.
T = సంవత్సరాల్లో ఉండాలి.
బారువడ్డీ మొత్తం A = P + I
5. మొత్తం = అసలు + వడ్డీ (లేదా) మొత్తం = అసలు
A = P + I
చక్రవడ్డీ: వడ్డీపై వడ్డీ లెక్కించే పద్ధతిని 'చక్రవడ్డీ అంటారు.
ఇక్కడ A = చక్రవడ్డీ మొత్తం
P = అసలు
R = రేటు
n = వడ్డీ లెక్కించాల్సిన పర్యాయాలు
చక్రవడ్డీ సూత్రాలు:

సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కించే పద్ధతి
చక్రవడ్డీ - బారువడ్డీల మధ్య సంబంధం
1. రెండు సంవత్సరాలకు వడ్డీల వ్యత్యాసం (D)
2. మూడు సంవత్సరాలకు వడ్డీల వ్యత్యాసం (D)
3. సాధారణ వడ్డీలో అసలు x సంవత్సరాలకు రెండింతలైతే, 2x సంవత్సరాలకు మూడింతలు, 3x సంవత్సరాలకు నాలుగింతలు అవుతుంది.
4. చక్రవడ్డీలో అసలు x సంవత్సరాలకు రెండింతలైతే 2x సంవత్సరాలకు నాలుగింతలు, 3x సంవత్సరాలకు ఎనిమిదింతలు అవుతుంది.