• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళిక

మాదిరి ప్ర‌శ్న‌లు

1. విజ్ఞానశాస్త్ర పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి?
ఎ) సామాజిక మార్పులకు అనుగుణంగా  బి) సామాజిక అవసరాలు తీర్చే విధంగా
సి) శిశు కేంద్రంగా  డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

2. కిందివాటిలో పాఠ్య ప్రణాళికలో చూపించని అంశం?
జ: వార్షిక ప్రణాళికలు

 

3. కిందివాటిలో పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏవి?
ఎ) సంరక్షణ, సమాజ కేంద్రీకృత బి) సమైక్యత, శిశు కేంద్రీకృత
సి) సృజనాత్మక, కృత్యాధార డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

4. పాఠ్య ప్రణాళికలో వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు, ఇతర క్షేత్ర అభ్యసనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేసే సూత్రం
జ: కృత్య కేంద్రీకృత

 

5. భౌతిక రసాయన శాస్త్రాల పాఠ్యప్రణాళికలోని లోపం
ఎ) ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యం లేదు
బి) విద్యార్థుల వయోస్థాయిలకు తగినట్లుగా లేదు 
సి) భౌతిక శాస్త్రం పట్ల ఉత్సాహం పెంచే కార్యక్రమాలు లేవు
డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

6. ఉపాధ్యాయుడిని ఒక కళాకారుడితో పోల్చి చెప్పిన విద్యావేత్త?
జ: కన్నింగ్‌హమ్

 

7. పాఠ్యగ్రంథం విధి ఏమిటి?
ఎ) స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేలా ఉండాలి.
బి) సహ పాఠ్య కార్యక్రమాలు, ప్రయోగాలకు సూచనలు ఇవ్వాలి.
సి) ఉపయోగకరమైన సమస్యలు, కృత్యాలను సూచించాలి.
డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

8. ఉత్తమ పాఠ్యగ్రంథం రాయడానికి ఎలాంటి అర్హత ఉన్న రచయిత కావాలి?
ఎ) రాసే సబ్జెక్టును బోధిస్తూ ఉండాలి.
బి) బోధనానుభవం ఉండనవసరం లేదు.
సి) తగిన విద్యార్హతలు ఉండాలి.
డి) రాసే సబ్జెక్టును బోధిస్తూ ఉండాలి, తగిన విద్యార్హతలు ఉండాలి.
జ: డి (రాసే సబ్జెక్టును బోధిస్తూ ఉండాలి, తగిన విద్యార్హతలు ఉండాలి)

 

9. తరగతి గది, ఆట స్థలం, గ్రంథాలయం, పాఠశాల బయట విద్యార్థి పొందే ఉద్దేశపూర్వకమైన అనుభవాల మొత్తాన్ని ఏమంటారు?
జ: పాఠ్య ప్రణాళిక

 

10. పాఠ్య ప్రణాళిక నిర్మాణానికి సంబంధించిన సూత్రం ఏది?
జ: వ్యక్తిగత పరిశుభ్రతా సూత్రం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌