• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలు

పాఠశాలలో ఒక మంచి ప్రయోగశాలను స్థాపించి విజ్ఞానశాస్త్ర బోధన సమర్థంగా జరగడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
 

పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు:
* పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రయోగశాల ఏర్పాటు
* ఉపాధ్యాయుల సంఖ్య
* ప్రయోగశాల పరికరాలు భద్రపరిచే గది

 

ప్రయోగకృత్యాల వల్ల ప్రయోజనాలు:
* విజ్ఞానశాస్త్ర విషయాలు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటాయి.
* విషయాల నిరూపణ జరుగుతుంది.

 

డాక్టర్ వైట్‌హౌస్ ప్రయోగశాల ప్రణాళిక:
డాక్టర్ వైట్‌హౌస్ ప్రకారం ప్రయోగశాలలో అంశాల అమరిక కింది విధంగా ఉండాలి.
ఉనికి: పాఠశాల కింది విభాగంలో ప్రయోగశాల ఉండాలి.
గది పరిమాణం: 45 × 25 అడుగులు ఉండాలి.
గోడలు: 1.5 అడుగుల మందంలో ఉండాలి.

నేల: చదునుగా ఉండి శుభ్రపరచడానికి వీలుగా ఉండాలి.
కిటికీలు: మూడు కిటికీలు 6 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల ఎత్తు ఉండాలి.

 

ప్రయోగశాల సామగ్రి:
బ్లాక్‌బోర్డు:
 10 × 4 అడుగుల బోర్డు ఉండాలి.
ప్రదర్శన బల్ల: 6 × 6 అడుగుల బల్ల 2.5 అడుగుల ఎత్తులో నల్లబల్లకు మూడు అడుగుల దూరంలో ఉండాలి.
బల్లలు: 3.5' × 1.5' × 2' కొలతలు ఉన్న 20 బల్లలు ఉండాలి.
కుర్చీలు: 2.5 అడుగుల ఎత్తు గల 40 కుర్చీలు ఉండాలి.

 

యునెస్కో ప్రయోగశాల ప్రణాళిక:
ఉనికి: 
పాఠశాల కింది విభాగంలో చివరివైపు ప్రయోగశాల ఉండాలి.
గది పరిమాణం: 825 చదరపు అడుగుల వైశాల్యంలో 42 మంది విద్యార్థులు ఒకేసారి ప్రయోగాలు చేయడానికి అనువుగా ఉండాలి.
సామాన్లు భద్రపరిచే గది: 160 చదరపు అడుగుల వైశాల్యంలో ఉండాలి.
బ్లాక్ బోర్డు కొలతలు: 8 × 3 అడుగులు, ఆకుపచ్చ లేదా బ్రౌన్ రంగు బోర్డు.
సింక్ పరిమాణం: 12 × 9 × 6 అంగుళాలు
కిటికీలు: కిటికీల వైశాల్యం, ప్రయోగశాల వైశాల్యంలో 15 - 20% ఉండాలి.

బహుళార్ధక ప్రయోగశాల:
* ఈ ప్రయోగశాల పాఠ్యబోధనకు, ప్రయోగశాలకు అనువుగా ఉంటుంది.
గది కొలతలు: 40 మంది విద్యార్థులకు సరిపడే విధంగా, 45 × 25 అడుగుల గది ఉండాలి.

 

ప్రయోగశాలల ఏర్పాటుకు అఖిల భారత విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయ సంఘం సిఫార్సులు:
* విజ్ఞానశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రయోగశాలలు ఉండాలి.
* ప్రయోగశాలలో ఒక్కో విద్యార్థికి 30 చదరపు అడుగుల స్థలం, గ్రీన్‌హౌస్, మంటలను ఆర్పే యంత్రాలతో పాటు గ్యాలరీ షీట్స్, ఎపిడయాస్కోప్, మ్యాజిక్ లాంతర్లు, నల్లతెరలు, వెంటిలేటర్లు ఉండాలి.

 

విజ్ఞానశాస్త్ర పేటికలు:
     విజ్ఞానశాస్త్రాన్ని సమర్థంగా బోధించడానికి యునిసెఫ్, N.C.E.R.T. లాంటి సంస్థలు విజ్ఞానశాస్త్ర పేటికలను తయారుచేశాయి. తరగతి గదిలో ప్రయోగాల నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు.
విజ్ఞానశాస్త్ర పేటికలను రెండు రకాలుగా రూపొందించారు. అవి:

 

ప్రదర్శన పేటికలు:
   ఉపాధ్యాయుడు ప్రయోగాలను నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, రసాయనాలు, గాజుపాత్రలు, ఇతర పరికరాలు చెక్కపెట్టెల అరల్లో అమర్చి ఉంటాయి. వీటితోపాటు ప్రాక్టికల్ మాన్యువల్ కూడా ఉంటుంది.

 

వ్యక్తిగత విద్యార్థుల పేటికలు:
   విద్యార్థులు స్వయంగా లేదా ముగ్గురు విద్యార్థులు కలిసి సమూహంగా ప్రయోగాలు చేయడానికి వీలుగా అనేక రకాల పరికరాలుంటాయి.

ప్రదర్శన పేటికలు - రకాలు:
తరగతి స్థాయి లేదా సబ్జెక్టును బట్టి కొన్ని రకాల పేటికలను తయారుచేశారు.

 

భౌతికశాస్త్ర విద్యార్థుల పేటికలు:
6, 7, 8 తరగతుల విద్యార్థుల కోసం భౌతికశాస్త్ర ప్రదర్శనా కిట్-1, కిట్-2, కిట్-3లను రూపొందించారు.

 

రసాయనశాస్త్ర విద్యార్థుల పేటికలు:
    ఒక్కో యూనిట్‌కు సంబంధించిన కిట్స్‌ను డైనమే కంపెనీవారు తయారుచేశారు. ప్రతి యూనిట్‌కు అనుబంధంగా వాటికి సంబంధించిన పేటికలను తయారుచేశారు.

 

సైన్స్ కిట్ ఉపయోగాలు:
* తక్కువ ఖర్చుతో లభిస్తాయి.
* సమయం ఆదా అవుతుంది.
* వీటివల్ల శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయి.

 

ప్రయోగశాలలో ఉపయోగించాల్సిన రిజిష్టర్లు:
వస్తు ప్రవేశ పట్టీ/ ఎక్సెషన్ రిజిష్టర్: 
ఇది కొనుగోలు చేసిన వస్తువులను ముందుగా నమోదు చేసే రిజిష్టర్.
పగలని వస్తువుల రిజిష్టర్: పగలని వస్తువులు లేదా వాడని, పగలడానికి తక్కువ అవకాశం ఉన్న వస్తువులను ఈ రిజిష్టర్‌లో నమోదు చేయాలి.

పగిలే వస్తువుల స్టాక్ రిజిష్టర్: ప్రయోగాలు జరుగుతున్నప్పుడు పగిలిపోవడానికి అవకాశం ఉండే గాజు లాంటి వస్తువులను దీనిలో నమోదు చేయాలి.
వినియోగించే వస్తువుల రిజిష్టర్: ప్రయోగ సమయంలో ఉపయోగించే రసాయనాలు, తీగలు, గ్యాస్, బ్యాటరీల లాంటి వాటికోసం ఈ రిజిష్టర్‌ను ఉపయోగిస్తారు.
ఆర్డర్ రిజిష్టర్: ప్రయోగశాలలో వస్తువులను కొనే ముందు పంపించే తేదీ, కంపెనీ పేరు, అడ్రస్, కొనే వస్తువు పేరు, కొలత, ఖరీదు లాంటివి దీనిలో నమోదు చేయాలి.
అవసరాల రిజిష్టర్: ప్రయోగశాలలోని అవసరాలను చూపే రిజిష్టర్.
ప్రథమ చికిత్స పేటిక: ప్రయోగశాలలో జరిగే ప్రమాదాలకు ప్రథమ చికిత్స చేయడానికి ఉపయోగించే వస్తువులను ఈ పేటికలో భద్రపరుస్తారు. దీని మీద రెడ్‌క్రాస్ (+) గుర్తు ఉంటుంది. బ్యాండేజీలు, అంటించే టేపులు, సన్నటి బ్రష్‌లు, డ్రాపర్లు, కత్తెర, ఫోర్‌సెప్‌లు, దూది, స్టెరిలైజ్డ్ వస్త్రం, బ్రష్‌లు, గాజ్, సర్జికల్‌లింట్, పిన్నులు, గరాటు, సూపాన్లు ఉంటాయి.

 

సాధారణంగా ప్రయోగశాలలో జరిగే ప్రమాదాలు, వాటి ప్రథమ చికిత్స:
మంటలు: 
ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు దుస్తులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* శరీరానికి మంటలు అంటుకుంటే దుప్పటితో కప్పి మంటల్ని ఆర్పాలి. దుస్తులు శరీరానికి అతికి ఉంటే తీసివేయకూడదు. గాయాలకు బర్నాల్ లాంటివి పూయాలి.
* గ్యాస్, విద్యుత్ వల్ల మంటలు వస్తే గ్యాస్ సిలిండర్‌ను కట్టివేయాలి. కరెంట్ మెయిన్ స్విచ్‌ను ఆపేయాలి.

కాలడం:
* భాస్వరం వల్ల కాలితే చల్లటి నీటితో శుభ్రం చేసి తర్వాత సజల సిల్వర్ నైట్రేట్‌తో కడగాలి.
* ఆమ్లం వల్ల కాలితే ముందు చల్లటి నీటితో శుభ్రం చేసి తర్వాత సజల సోడియం బై కార్బొనేట్‌తో కడిగి బర్నాల్ రాయాలి.
* క్షారం వల్ల కాలితే ముందు చల్లటి నీటితో కడిగి, తర్వాత ఎసిటిక్ ఆమ్లాన్ని ఉపయోగించాలి.

 

విషపదార్థాలు:
* ఆమ్లం తాగితే ఎక్కువ నీరు లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను తాగించాలి.
* క్షారం తాగితే ఎక్కువ నీరు, నిమ్మరసం లేదా టార్టారిక్ ఆమ్లాన్ని తాగించాలి.
* విషపూరిత వాయువు పీలిస్తే (క్లోరిన్ లాంటివి) మిథైలేటెడ్ స్పిరిట్ లేదా అమ్మోనియా వాసనను చూపి, ఆరు బయట స్వచ్ఛమైన గాలి పీల్చేలా చేయాలి.
* విషపదార్థమేదో మనకు తెలియనప్పుడు యూనివర్సల్ యాంటీడోట్ ఇవ్వాలి.

 

కంటి గాయాలు:
* ఆమ్లం పడితే మంచి నీటితో శుభ్రం చేసి, తర్వాత 1% సోడియం బై కార్బొనేట్‌తో కడగాలి.
* క్షారం పడితే శుభ్రమైన నీటితో శుభ్రం చేసి తర్వాత 1% బోరిక్ ఆమ్లంతో కడగాలి.

 

ప్రత్యామ్నాయ పరికరాలు:
* ఉపాధ్యాయుడు బోధించే విషయం విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేందుకు మన పరిసరాల్లో లభించే చవకైన లేదా పనికిరాని వస్తువులతో తయారు చేసే పరికరాలే 'ప్రత్యామ్నాయ పరికరాలు'.
* ఉపాధ్యాయుడు సులభంగా, ఆసక్తికరంగా ప్రయోగాలు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌