• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం - పరిశ్రమలు

నూనెలు లేదా కొవ్వులు జీవరసాయన ప్రాముఖ్యం ఉన్న ఒక ప్రత్యేక తరగతికి చెందిన పదార్థాలు.
* గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాల ట్రై ఎస్టర్‌లను నూనెలు లేదా కొవ్వులు అంటారు.
* నూనె లేదా కొవ్వుల సాధారణ ఫార్ములా
    
    ఇందులో R, R', R'' లు ఆల్కైల్ లేదా ఆల్కీనైల్ గ్రూపులు.
* మొక్కలు, వృక్షాలు, జంతువులు నూనె లేదా కొవ్వులకు ముఖ్యమైన వనరులు.


 

సంతృప్త ఫాటీ ఆమ్లాలు
   i) లారిక్ ఆమ్లం       - C11H23COOH
  ii) మిరిస్టిక్ ఆమ్లం   - C13H27COOH
  iii) పామిటిక్ ఆమ్లం - C15H31COOH
  iv) స్టియరిక్ ఆమ్లం  - C17H35COOH
 

అసంతృప్త ఫాటీ ఆమ్లాలు
  i) మిరిస్టోలిక్ ఆమ్లం        -  C13H25COOH
  ii) ఫామిటోలియిక్ ఆమ్లం -  C15H29COOH
  iii) ఓలియిక్ ఆమ్లం       -  C17H33COOH
  iv) లినోలియిక్ ఆమ్లం     -  C17H31COOH
  v) లినోలినిక్ ఆమ్లం         -  C17H29COOH

* కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెలను వంటకు ఉపయోగిస్తారు.
* కొబ్బరి నూనె, ఆముదాన్ని వెంట్రుకలకు ఉపయోగిస్తారు.
* పురాతన కాలంలో ఆముదంను దీపాల్లో వాడేవారు.
* సబ్బులు, పెయింట్లు, వార్నిష్‌లు, ఫాటీ ఆమ్లాల తయారీలోనూ; తోలు, జనుము, ప్లాస్టిక్ పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది.
* చేప కాలేయం నూనెను అనేక మందుల్లో ఉపయోగిస్తారు.
* గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాల ట్రై ఎస్టర్‌లను నూనెలు అంటారు.
ఉదా: గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే వేరుశెనగ నూనె.
* గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న గ్లిసరాల్, ఫాటీ ఆమ్లాల ట్రై ఎస్టర్‌లను కొవ్వు అంటారు.
ఉదా: నెయ్యి గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం కాబట్టి దీన్ని కొవ్వు అంటారు.
* ఒకటి లేదా ఎక్కువ C = C బంధాలున్న నూనెలను అసంతృప్త నూనెలు అంటారు.
* అసంతృప్త నూనెలను నికెల్ సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే సంతృప్త నూనెలు లేదా కొవ్వు లభిస్తాయి. సంతృప్త నూనెలు ఎక్కువ ద్రవీభవన స్థానం కలిగి గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాలుగా ఉంటాయి. అంటే నూనెలను హైడ్రోజనీకరణ చేస్తే డాల్డా, మార్గరీన్ లాంటి సంతృప్త కొవ్వులు లభిస్తాయి.

* హైడ్రోజనీకరణం చేసిన కొవ్వులు ఆహారంగా తీసుకోవడానికి తగినవి.హైడ్రోజనీకరణం నూనెల రుచిని, సువాసనను పెంచి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తుంది.
* వనస్పతి (డాల్డా) అనేది వృక్ష సంబంధమైన నూనెలను హైడ్రోజనీకరణం చేయగా లభించే కొవ్వు. పత్తి గింజల నూనె ఓలియిక్ ఆమ్లం అనే అసంతృప్త ఫాటీ ఆమ్లం ఉన్న ట్రై ఎస్టర్. Ni సమక్షంలో దీన్ని సంతృప్త స్టియరిక్ ఆమ్ల ట్రై ఎస్టర్‌గా మారిస్తే కొవ్వులు లభిస్తాయి.
* రసాయనికంగా సబ్బు పొడవైన కర్బన గొలుసు ఉన్న ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణం.
* ఏదైనా ఒక క్షార సమక్షంలో నూనె లేదా కొవ్వులను జల విశ్లేషణం చేసి సబ్బును నేరుగా పొందవచ్చు. ఈ చర్యను 'సపోనిఫికేషన్' అంటారు.

* సాధారణంగా సబ్బును కొబ్బరి, పత్తి, సోయా చిక్కుడు, పామోలిన్ లాంటి నూనెల నుంచి లేదా జంతువుల కొవ్వు నుంచి తయారు చేస్తారు.
 

సబ్బు తయారీలో మూడు దశలు ఉంటాయి
    i) నూనె లేదా కొవ్వును ఫాటీ ఆమ్లాలుగా జల విశ్లేషణం చేయడం.
    ii) ఫాటీ ఆమ్లాలను వేరుపరచడం.
    iii) ఫాటీ ఆమ్లాలను క్షారంతో తటస్థీకరించడం.
* నూనె లేదా కొవ్వును పెద్ద స్టీలు తొట్టిలో తీసుకోవాలి. దానికి జింక్ ఆక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ లేదా మెగ్నీషియం ఆక్సైడ్‌ను కలిపి ఈ మిశ్రమాన్ని 4.1 మెగా పాస్కల్ పీడనం వద్ద 240 - 250°C వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమంలోకి నీటి ఆవిరిని పంపి 2 నుంచి 3 గంటల పాటు జలవిశ్లేషణం చేయాలి. దీనిలో ఫాటీ ఆమ్లాల మిశ్రమం, నీటిలో కరిగి ఉన్న గ్లిసరాల్ లభిస్తాయి. గ్లిసరాల్‌ను స్వేదనం చేసి తొలగించవచ్చు.
* మిగిలిన ఫాటీ ఆమ్లాల మిశ్రమాన్ని ఎండబెట్టి అంశిక స్వేదనం ద్వారా వేరుపరచాలి. ఒక సబ్బు గుణాలు దానిలోని వివిధ ఫాటీ ఆమ్లాల పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల సబ్బు తయారీదారుడు వేరుపరిచిన ఫాటీ ఆమ్లాలను కావాల్సిన సబ్బు లక్షణాలకు అనుగుణంగా అవసరమైన పరిమాణాల్లో కలిపి సబ్బును తయారు చేస్తారు.
* ఈ విధంగా ఎన్నుకున్న ఫాటీ ఆమ్లాల మిశ్రమాన్ని KOH, NaOH, Mg(OH)2, Ca(OH)2, ట్రై ఇథనాల్ ఎమీన్ లాంటి క్షారాలతో తటస్థీకరిస్తారు.


పైన పేర్కొన్న సబ్బులన్నింటిలోనూ 30% నీరు ఉంటుంది.
* శరీర శుభ్రతకు వాడే సబ్బు ఫాటీ ఆమ్లాల K+ లవణం, 7% - 10% వరకు స్వేచ్ఛా ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.
* శరీర దుర్వాసనను తొలగించే సబ్బులు లేదా సూక్ష్మ క్రిమినాశక సబ్బులు 3, 4, 5 ట్రై బ్రోమో సాలిసిలేనిలైడ్‌ను కలిగి ఉంటాయి.
* షేవింగ్ చేసుకునే సబ్బులో K+ లవణం ఉండి ఎక్కువ మోతాదులో స్టియరిక్ ఆమ్లం ఉంటుంది.
* పారదర్శక సబ్బులు కొంత గ్లిసరాల్‌ను కలిగి ఉంటాయి.
* సబ్బు, పరిమళ ద్రవ్యాలు, ఉప్పు సోడాయాష్, సోడియం బై కార్బొనేట్, సోడియం సిలికేట్ లాంటి పదార్థాలతో నిర్మితమై ఉంటాయి.
* నీటితో ఎక్కువ నురగను ఇచ్చే సబ్బును మంచి సబ్బుగా గుర్తిస్తారు.
* సబ్బుతో వెంటనే నురగ వచ్చే జలాన్ని మృదుజలం అంటారు.
* సబ్బుతో నురగను ఇవ్వని జలాన్ని కఠిన జలం అంటారు.
* నీటిలో కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్‌లు; సల్ఫేట్, బై కార్బోనేట్‌లు కరిగి ఉండటం వల్ల నీటికి కఠినత్వం ఏర్పడుతుంది.
* సబ్బులు కఠిన జలంలోని Ca+2, Mg+2 అయాన్లతో చర్యనొంది తెల్లటి అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. అందువల్ల అవి నురగను ఇవ్వవు. శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతాయి.
* డిటర్జెంట్‌లు లేదా కల్మశహారులు కఠిన జలంలో అవక్షేపాన్ని, నురగను ఏర్పరచవు. నురగను ఏర్పరిచే, శుభ్రపరిచే గుణాన్ని కోల్పోవు. అందువల్ల డిటర్జెంట్‌లు సబ్బుల కంటే మెరుగైనవి.
* రసాయనికంగా కల్మశహారులు (డిటర్జెంట్‌లు) ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ లవణాలు లేదా ఫాటీ ఆల్కహాల్‌ల సల్ఫేట్ లవణాలు.


AB = ఆల్కైల్ బెంజీన్
ABS = ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్
FA = ఫాటీ ఆల్కహాల్
FAS = ఫాటీ ఆల్కహాల్ సల్ఫేట్
  సాధారణంగా ఉపయోగించే డిటర్జెంట్‌లలో సోడియం లారైట్ సల్ఫేట్ (C12H25 − O − SO2 − ONa), సోడియం సిటైల్ సల్ఫేట్ (C16H33 − O − SO2 − ONa)లు ఉంటాయి.
*   సబ్బు ఒక విద్యుత్ విశ్లేష్య పదార్థం. దీన్ని కొద్ది పరిమాణంలో నీటిలో కరిగించినప్పుడు తక్కువ గాఢత ఉన్న నిజద్రావణం ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట గాఢత వద్ద సబ్బు కణాలు దగ్గరగా చేరుతాయి. దీన్ని సందిగ్ధ మిసిలి గాఢత అంటారు. ఈ గాఢత వద్ద నీటిలో తేలియాడుతున్న సబ్బు కణాల సమూహాన్ని మిసిలి అంటారు.
* సబ్బు నీటిలో గోళాకారంలో దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహాన్నే మిసిలి అంటారు.


కలిగి ఉంటుంది.
* ధృవాంతం (polar end) హైడ్రోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. నీటివైపు ఆకర్షితమవుతుంది. అధృవాంతం (non-polar end) హైడ్రోఫోబిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది జిడ్డు లేదా మురికివైపు మాత్రమే ఆకర్షితమై, నీటివైపు ఆకర్షితమవ్వదు.
* నీటిలో సబ్బు కరిగినప్పుడు సబ్బు కణాల హైడ్రోఫోబిక్ కొనలు మురికికి అతుక్కుంటాయి. తర్వాత అవి దుస్తుల నుంచి మురికిని వేరు చేస్తాయి.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌