• facebook
  • whatsapp
  • telegram

లోహసంగ్రహణ శాస్త్రం

బిట్లు

1. భూమి వల్కలంలో ఉన్న మూలకాలన్నింటిలో అత్యధికంగా లభించే మూలకం
  A) ఐరన్       B) అల్యూమినియం       C) సిలికాన్       D) ఆక్సిజన్


2. భూమి వల్కలంలో ఉన్న మూలకాలన్నింటిలో ఆక్సిజన్ తర్వాత అధికంగా లభించే మూలకం ఏది?
  A) ఐరన్       B) అల్యూమినియం       C) సిలికాన్       D) కాల్షియం


3. భూమి వల్కలంలోని ఆక్సిజన్ మూలకం విస్తార శాతం
  A) 46.6       B) 27.7       C) 8.3       D) 5.1


4. భూమి వల్కలంలోని సిలికాన్ మూలకం విస్తార శాతం
  A) 5.1       B) 27.7       C) 8.3       D) 46.6


5. భూమి వల్కలంలోని అల్యూమినియం మూలకం విస్తార శాతం      
  A) 2.6       B) 3.6       C) 2.1       D) 8.3


6. భూమి వల్కలంలోని ఐరన్ మూలకం విస్తార శాతం
  A) 2.1       B) 2.6       C) 5.1       D) 0.1


7. భూమి వల్కలంలోని కాల్షియం మూలకం విస్తార శాతం
  A) 3.6       B) 2.6       C) 46.6       D) 2.1


8. భూమి వల్కలంలోని మెగ్నీషియం మూలకం విస్తార శాతం
  A) 0.1       B) 0.4       C) 2.1       D) 2.6


9. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే మూలకం
  A) సిలికాన్       B) ఆక్సిజన్       C) ఐరన్       D) కాల్షియం


10. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే మూలకాల్లో మూడోది
  A) ఆక్సిజన్       B) సిలికాన్       C) కాల్షియం       D) అల్యూమినియం


11. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం
  A) Mg       B) Ca       C) Al       D) Fe


12. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహాల్లో రెండోది
  A) Ca       B) Fe       C) Al       D) Mg


13. సాధారణంగా సహజస్థితిలో లభించే మూలకం
  A) Fe       B) Mg       C) Au       D) Cu


14. కిందివాటిలో సహజ స్థితిలో లభించనిది?
  A) Ag       B) Pt       C) Au       D) Fe


15. కిందివాటిలో సిన్నబార్ ధాతువు
  A) ZnO       B) NaCl      C) PbS       D) HgS


16. సిన్నబార్ దేని ధాతువు?
  A) Mg       B) Cu       C) Hg       D) Zn


17. కార్నలైట్ ఏ లోహం ధాతువు?
  A) Ca       B) Cu       C) Zn       D) Mg


18. హార్న్‌సిల్వర్ ధాతువు ఫార్ములా
  A) NaCl       B) AgCl       C) MgCl2       D) KCl


19. హెమిమార్ఫైట్ ధాతువు స్వభావం
  A) ఆక్సైడ్       B) సల్ఫైడ్       C) క్లోరైడ్       D) సిలికేట్లు


20. ఎప్సమ్ లవణంలోని నీటి అణువులు సంఖ్య
  A) 2       B) 3       C) 7       D) 4


21. MgCl2.KCl.6 H2O సంఘటనం కలిగిన ధాతువు
  A) బెరైటీస్       B) మాలకైట్       C) సెడిరైట్       D) కార్నలైట్


22. CuCO3.Cu(OH)2 ధాతువు స్వభావం
  A) ఆక్సైడ్       B) కార్బొనేట్       C) సిలికేట్       D) సల్ఫేట్


23. కిందివాటిలో 'Al' ధాతువు ఏది?
  A) జింకైట్       B) కార్నలైట్       C) మాలకైట్       D) బాక్సైట్


24. కిందివాటిలో రాక్‌సాల్ట్ ధాతువు స్వభావం
  A) ఆక్సైడ్       B) క్లోరైడ్       C) కార్బొనేట్       D) సిలికేట్


25. కిందివాటిలో దేనికి సల్ఫైడ్ ధాతువు స్వభావం లేదు?
  A) CaSO4.2 H2O       B) CuFeS2       C) ZnS       D) PbS


26. కిందివాటిలో దేనికి సల్ఫైడ్ ధాతువు స్వభావం ఉంటుంది?
  A) Cu2O       B) ZnS       C) CuFeS2       D) BaSO4


27. హెమటైట్ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది?
  A) Zn       B) Cu       C) Fe       D) Mg


28. బాక్సైట్ ధాతువు ఫార్ములాలోని నీటి అణువుల సంఖ్య
  A) 1       B) 2       C) 3       D) 7


29. క్యూప్రైట్ ధాతువు సంఘటనం
  A) CuFeS2       B) CuCO3       C) CuCO3.Cu(OH)2       D) Cu2O


30. జింక్ బ్లెండ్ ఏ లోహం ధాతువు?
  A) Cu       B) Fe       C) Zn       D) Al


31. కాపర్ గ్లాన్స్ ముడిఖనిజం సంఘటనం
  A) CuFeS2       B) CuCO3.Cu(OH)2       C) Cu2O       D) Cu2S


32. పూల్స్ గోల్డ్‌గా వ్యవహరించే ధాతువు ఏది?
  A) హెమటైట్       B) మాగ్నటైట్       C) ఐరన్ పైరటీస్       D) సెడిరైట్


33. యురేనియం లోహం ధాతువు ఏది?
  A) మోనజైట్       B) పెరుసైట్       C) లిధార్జ్       D) పిచ్‌బ్లెండ్


34. మోనజైట్ ధాతువు స్వభావం
  A) ఆక్సైడ్       B) కార్బొనేట్       C) సల్ఫైడ్       D) క్లోరైడ్

35. పిచ్‌బ్లెండ్ ధాతువు ఫార్ములా
  A) ThO2       B) PbCO3       C) U3O8       D) FeS


36. సిలికేట్ల రూపంలో లభించే లోహాలు ఏవి?
  A) Cu, Zn, Pb, Fe, Ag        B) Na, K, Mg, Ca, Ag 
  C) Mg, Ca, Sr, Cu, Zn        D) Li, Ni, Al, Zn, Ca, Be


37. గెలీనా అంటే?
  A) PbS        B) NaCl        C) ZnO        D) HgS


38. జతపరచండి.

1) జింక్‌బ్లెండ్ a) ZnO
2) మాగ్నసైట్ b) ZnS
3) జింకైట్ c) KCl.MgCl2. 6 H2O
4) కార్నలైట్ d) MgCO3

   A) 1-b, 2-d, 3-a, 4-c      B) 1-a, 2-b, 3-c, 4-d      
   C) 1-c, 2-d, 3-a, 4-b     D) 1-c, 2-a, 3-d, 4-b


39. జతపరచండి.

1) Fe3O4 a) కాలమైన్
2) ZnCO3 b) కాపర్ గ్లాన్స్
3) Cu2S c) మాగ్నటైట్
4) ZnS d) స్ఫాలరైట్

   A) 1-c, 2-d, 3-a, 4-b      B) 1-a, 2-b, 3-c, 4-d    
   C) 1-c, 2-a, 3-b, 4-d      D) 1-d, 2-c, 3-b, 4-a


40. జతపరచండి.

1) హెమటైట్ a) FeS2
2) మాగ్నటైట్ b) FeCO3
3) సిడరైట్ c) Fe3O4
4) ఐరన్‌పైరటీస్ d) Fe2O3

   A) 1-c, 2-d, 3-a, 4-b      B) 1-d, 2-c, 3-a, 4-b    
   C) 1-c, 2-a, 3-b, 4-d      D) 1-d, 2-c, 3-b, 4-a


41. జతపరచండి.

1) గెలీనా a) కార్బొనేట్
2) మాగ్నసైట్ b) సిలికేట్లు
3) క్యూప్రైట్ c) సల్ఫైడ్
4) హెమిమార్ఫైట్ d) ఆక్సైడ్

   A) 1-a, 2-b, 3-c, 4-d     B) 1-c, 2-b, 3-a, 4-d    
   C) 1-d, 2-a, 3-b, 4-c     D) 1-c, 2-a, 3-d, 4-b


42. జతపరచండి.

1) CaSO4.2 H2O a) కార్బొనేట్
2) MgCl2.KCl.6 H2O b) సల్ఫైడ్
3) CuCO3.Cu(OH)2 c) సల్ఫేట్
4) ZnS d) క్లోరైడ్

   A) 1-b, 2-d, 3-a, 4-c     B) 1-b, 2-a, 3-c, 4-d    
   C) 1-c, 2-d, 3-a, 4-b     D) 1-c, 2-a, 3-b, 4-d


43. జతపరచండి.

1) మోనజైట్ a) Ca
2) రాక్‌సాల్ట్ b) Th
3) జిప్సం c) Hg
4) సిన్నబార్ d) Na

  A) 1-b, 2-d, 3-a, 4-c    B) 1-b, 2-a, 3-d, 4-c    
  C) 1-a, 2-b, 3-c, 4-d     D) 1-d, 2-b, 3-c, 4-a


44. కిందివాటిలో మెగ్నీషియం ధాతువు
  A) మాగ్నసైట్        B) ఎప్సం లవణం        C) కార్నలైట్        D) అన్నీ


45. కార్నలైట్‌లో ఉన్న లోహ అయాన్లు
   A) Na, Mg        B) Zn, Mg        C) K, Mg        D) Al, Mg


46. అర్జెంటైట్ దేని ఖనిజం?
  A) Pt        B) Au        C) Zn        D) Ag


47. మాలకైట్ దేని ఖనిజం?
  A) కాపర్        B) ఇనుము        C) మెగ్నీషియం        D) అల్యూమినియం


48. కాలమైన్ అంటే?
  A) ZnO        B) ZnCO3        C) ZnS        D) ఏదీకాదు


49. కిందివాటిలో అల్యూమినియం ధాతువు ఏది?
  A) మాలకైట్        B) మాగ్నటైట్        C) బాక్సైట్        D) డోలమైట్


50. కిందివాటిలో ఆక్సిజన్ లేనిది
  A) ఎప్సమ్ లవణం        B) డోలమైట్        C) బాక్సైట్        D) కాపర్‌పైరటీస్


51. కింది ధాతువుల్లో మెగ్నీషియం లేనిది ఏది?
  A) కార్నలైట్        B) మాగ్నసైట్        C) క్యూప్రైట్        D) ఎప్సమ్ లవణం


52. కిందివాటిలో కార్బొనేట్ ధాతువు
   A) జిప్సం        B) జింకైట్        C) బెరైటీస్        D) సున్నపురాయి


53. కిందివాటిలో సల్ఫేట్ ధాతువు
  A) రాక్‌సాల్ట్        B) కార్నలైట్        C) బెరైటీస్        D) సెడిరైట్


54. లోహాలను వాటి చర్యాశీలతల అవరోహణ క్రమంలో అమర్చడాన్ని ............. అంటారు.
  A) ఆక్సీకరణ శ్రేణి        B) క్షయకరణ శ్రేణి        C) క్రియాశీల శ్రేణి        D) ఏదీకాదు


55. ఇనుము, మెగ్నీషియం, సోడియం, జింక్ చర్యాశీలతల వరుస క్రమం
  A) Fe > Na > Mg > Zn        B) Zn > Mg > Na > Fe
  C) Zn > Fe > Na > Mg         D) Na > Mg > Zn > Fe


56. లోహాల చర్యాశీలత శ్రేణి పరంగా ఉండే అమరిక
  A) Na > Cu > Zn > Ca        B) Ca > Na > Zn > Cu
  C) Na > Ca > Zn > Cu        D) Na > Cu > Ca > Zn


57. ప్లవన ప్రక్రియను ఏ ధాతువు సాంద్రీకరణలో ఎక్కువగా ఉపయోగిస్తారు?
  A) సల్ఫైడ్        B) ఆక్సైడ్        C) కార్బొనేట్        D) నైట్రేట్


58. ప్లవన ప్రక్రియలో వాడే నూనె
  A) కొబ్బరి నూనె        B) ఆలివ్ నూనె        C) పైన్ నూనె        D) సన్‌ప్లవర్ నూనె


59. నిరుపయోగమైన మలినాలను ధాతువుల నుంచి వేరు చేసే పద్ధతి
  A) ముడిలోహ నిష్కర్షణ                      B) శుద్ధి చేయడం
  C) ముడిలోహాన్ని సంగ్రహించడం         D) ముడిఖనిజ సాంద్రీకరణ


60. రంగు, పరిమాణం లాంటి ధర్మాల్లో వ్యత్యాసం ఉంటే ధాతువును ఏ పద్ధతిలో గాఢత చెందిస్తారు?
A) చేతితో ఏరివేయడం         B) నీటితో కడగడం  
C) ప్లవన ప్రక్రియ       D) అయస్కాంత వేర్పాటు పద్ధతి


61. ధాతువు, మలినాలకు మధ్య సాంద్రతలు తేడాగా ఉన్నప్పుడు ధాతువును శుద్ధిచేసే పద్ధతి
A) చేతితో ఏరివేయడం       B) నీటితో కడగడం      
C) ప్లవన ప్రక్రియ             D) అయస్కాంత వేర్పాటు పద్ధతి


62. ఆక్సైడ్, కార్బొనేట్ ధాతువులను గాఢత చెందించడానికి వాడే పద్ధతి
A) చేతితో ఏరివేయడం     B) సాపేక్ష సాంద్రత పద్ధతి    
C) ప్లవన ప్రక్రియ        D) అయస్కాంత వేర్పాటు పద్ధతి


63. టిన్‌స్టోన్ లాంటి ధాతువును గాఢత చెందించే పద్ధతి
  A) చేతితో ఏరివేయడం      B) సాపేక్ష సాంద్రత పద్ధతి    
  C) ప్లవన ప్రక్రియ          D) అయస్కాంత వేర్పాటు పద్ధతి


64. టిన్‌స్టోన్ నుంచి ఓల్‌ప్రమైట్‌ను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి
  A) చేతితో ఏరివేయడం     B) సాపేక్ష సాంద్రత పద్ధతి    
  C) ప్లవన ప్రక్రియ           D) అయస్కాంత వేర్పాటు పద్ధతి


65. బాక్సైట్ ధాతువును గాఢత చెందించడానికి ఉపయోగించే రసాయన పద్ధతి
  A) ప్లవన ప్రక్రియ       B) లీచింగ్       C) వడపోత       D) నీటితో కడగడం


66. స్వాభావిక లోహాన్ని ధాతువు నుంచి సంగ్రహించే ప్రక్రియ
  A) ఆక్సీకరణం      B) క్షయకరణం      C) ఆక్సీకరణం, క్షయకరణం      D) ఏదీకాదు


67. లోహాన్ని ధాతువుల నుంచి సంగ్రహించడానికి ఉపయోగించే ప్రక్రియ
  A) భస్మీకరణం         B) భర్జనం    
  C) ప్రగలనం         D) పైన సూచించిన ప్రక్రియల్లో ఏదో ఒకటి లేదా అవసరమైన ప్రక్రియ


68. ధాతువును గాలి లేకుండా బాగా వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించడాన్ని ...... అంటారు.
  A) భర్జనం     B) భస్మీకరణం     C) ప్రగలనం     D) లీచింగ్


69. లోహ ద్రవీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ధాతువును గాలి సమక్షంలో తీవ్రంగా వేడి చేయడాన్ని .......... అంటారు.
  A) భస్మీకరణం     B) భర్జనం     C) ప్రగలనం     D) ఏదీకాదు


70. భర్జన ప్రక్రియ (Roasting)ను నిర్వహించేందుకు ఉపయోగించే కొలిమి
  A) బ్లాస్ట్ కొలిమి     B) రిటార్ట్ కొలిమి     C) రివర్బరేటరీ కొలిమి     D) ఏదీకాదు


71. ప్రగలన ప్రక్రియ (Smelting)ను నిర్వహించేందుకు ఉపయోగించే కొలిమి
  A) బ్లాస్ట్ కొలిమి     B) రివర్బరేటరీ కొలిమి     C) రిటార్ట్ కొలిమి     D) ఏదీకాదు


72. సల్ఫైడ్ ధాతువును ఆక్సైడ్‌గా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియ
  A) భస్మీకరణం     B) ప్రగలనం     C) భర్జనం     D) ఏదీకాదు


73. భస్మీకరణం, భర్జనం ప్రక్రియలను నిర్వహించే కొలిమి
    A) బ్లాస్ట్ కొలిమి     B) రిటార్ట్ కొలిమి     C) రివర్బరేటరీ కొలిమి     D) ఏదీకాదు


74. ఒక ధాతువుకు ద్రవకారి కలిపి లేదా కలపకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా లోహాన్ని ద్రవస్థితిలో పొందేందుకు ఉపయోగపడే ప్రక్రియ
  A) భస్మీకరణం     B) ప్రగలనం     C) భర్జనం     D) ఏదీకాదు


75. ధాతువులోని మలినాలను తొలగించేందుకు దానికి బయట నుంచి కలిపే పదార్థాన్ని ........ అంటారు.
  A) గాంగ్     B) లోహమలం     C) ద్రవకారి     D) ఏదీకాదు


76. అపరిశుద్ధ లోహం నుంచి శుద్ధ లోహాన్ని పొందే ప్రక్రియ
  A) ధాతువును గాఢత చెందించడం     B) లోహ నిష్కర్షణ    
  C) ముడిఖనిజ సాంద్రీకరణ     D) లోహ శోధన


77. లోహాలను శుద్ధి చేసేందుకు ఉపయోగించని పద్ధతి
  A) స్వేదనం     B) పోలింగ్     C) ప్రగలనం     D) విద్యుత్ విశ్లేషణం


78. Zn, Hg లాంటి అల్ప బాష్పశీల, అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే, అలాంటి లోహాల శుద్ధిలో ఉపయోగపడే పద్ధతి ఏది?
  A) గలనం చేయడం     B) పోలింగ్     C) విద్యుత్ విశ్లేషణం     D) స్వేదనం


79. బ్లిస్టర్ కాపర్ (పొక్కుల కాపర్)ను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి
  A) గలనం చేయడం     B) విద్యుత్ విశ్లేషణం     C) పోలింగ్     D) స్వేదనం


80. టిన్ లాంటి అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలు, అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలను వేరు చేసేందుకు ఉపయోగపడే పద్ధతి
  A) స్వేదనం     B) గలనం చేయడం     C) పోలింగ్     D) విద్యుత్ విశ్లేషణం


81. రాగి, జింక్, లెడ్, నికెల్ లోహాలను శుద్ధి చేయడానికి ఉపయోగించే పద్ధతి
  A) స్వేదనం     B) గలనం చేయడం     C) పోలింగ్     D) విద్యుత్ విశ్లేషణం


82. థర్మైట్ దేని మిశ్రమం?
  A) ఒక భాగం Al పొడి, ఒక భాగం Fe2O3.            B) ఒక భాగం Al పొడి, మూడు భాగాల Fe2O3.
  C) రెండు భాగాల Al పొడి, ఒక భాగం Fe2O3.       D) మూడు భాగాల Al పొడి, ఒక భాగం Fe2O3.


83. థర్మైట్ విధానంలో క్షయకరణ కారకం
  A) Al     B) Si     C) Mg     D) Fe


84. విరిగిన రైలు పట్టాలు, పగిలిన యంత్ర పరికరాలను అతికించడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది?
  A) కార్బన్‌తో క్షయకరణం        B) కార్బన్ మోనాక్సైడ్‌తో క్షయకరణం 
  C) స్వయం క్షయకరణం           D) థర్మైట్ ప్రక్రియ


85. సల్ఫైడ్ ధాతువు స్వయం క్షయకరణం ద్వారా ఏ లోహాన్ని సంగ్రహిస్తారు?
  A) Zn           B) Mg           C) Pb            D) Cu


86. డైసైనార్జియేట్ అయాన్‌లను ఏ చూర్ణంతో చర్య జరపడం ద్వారా Ag లోహాన్ని అవక్షేప రూపంలో పొందుతారు?
  A) అల్యూమినియం చూర్ణం     B) రాగి చూర్ణం     C) మెగ్నీషియం చూర్ణం     D) జింక్ చూర్ణం


87. మట్టి కుండలు, ఇటుకలను కాల్చడం కింది ప్రక్రియల్లో దేన్ని సూచిస్తుంది?
  A) భస్మీకరణం     B) భర్జనం     C) ప్రగలనం     D) పోలింగ్


88. కిందివాటిలో గాలిలో చర్య జరపని లోహం?
  A) Na         B) K         C) Au          D) Fe


89. ఆర్నమెంట్ బంగారం అనేది
  A) 20 కారట్‌లు     B) 24 కారట్‌లు     C) 22 కారట్‌లు     D) ఏదీకాదు


90. కిందివాటిలో క్షార ద్రవకారి కానిది?
  A) CaO     B) MgO     C) SiO2     D) ఏదీకాదు


91. కిందివాటిలో ఆమ్ల ద్రవకారిణి ఏది?
  A) CaO     B) SiO2     C) MgO     D) Na2O


92. హెమటైట్ నుంచి ఇనుము తయారీలో కలిపిన సున్నపురాయి ఎలా ప్రవర్తిస్తుంది?
  A) స్లాగ్     B) ఆక్సీకరణి     C) క్షయకరిణి     D) ద్రవకారి


93. ఇనుము నిష్కర్షణలో ప్రగలనం జరపడానికి ముందు భస్మీకరణ ధాతువుకు కలిపే పదార్థాలు ఏవి?
  A) కోక్, సున్నపురాయి, సిలికా     B) కోక్, సున్నపురాయి     C) కోక్, సిలికా     D) సున్నపురాయి, సిలికా


94. బ్లాస్ట్ కొలిమిలో ఇనుమును నిష్కర్షణ చేసినప్పుడు ధాతువుకు ఉపయోగపడే క్షయకరణి ఏది?
  A) సిలికా     B) సున్నపురాయి     C) కార్బన్     D) కార్బన్ మోనాక్సైడ్


95. ఇనుము నిష్కర్షణలో ఏర్పడే లోహమలం ఏది?
  A) CaSiO3     B) FeSiO3     C) MgSiO3     D) FeSiO2


96. బ్లాస్ట్ ఫర్నేస్‌లో జరిగే చర్యల్లో ఇది కూడా ఒకటి
  A) C + O2 + H2O  CO + H2+ శక్తి         B) 2 C + O2 2 CO
  C) Fe2O3 + 3 CO  2 Fe + 3 CO2         D) 2 Fe + 3 O2 Fe2O3


97. బ్లాస్ట్ ఫర్నేస్‌లో 750°C వద్ద ఏర్పడే ఇనుము
  A) దుక్క ఇనుము     B) స్పాంజ్ ఇనుము     C) చేత ఇనుము     D) ఉక్కు


98. దుక్క ఇనుములో ఉండే కార్బన్ శాతం
  A) 0.1%     B) 0.2%     C) 0.1% -1.5%     D) 3% - 4%


99. చేత ఇనుములో ఉండే కార్బన్ శాతం
  A) అతి తక్కువ శాతం     B) 20%     C) 15%     D) 30%


100. చేత ఇనుములో ఎంత శాతం మలినాలు ఉంటాయి?
  A) 0.1%     B) 0.2%     C) 0.5% కంటే తక్కువ     D) 2% - 3%


101. కిందివాటిలో శుద్ధ ఇనుముగా పరిగణించేది
  A) స్పాంజ్ ఇనుము     B) దుక్క ఇనుము     C) చేత ఇనుము     D) ఉక్కు


102. దుక్క ఇనుమును రివర్బరేటరీ కొలిమి హెర్తుపై ఉంచి, శుద్ధిచేసి చేత ఇనుమును పొందే విధానాన్ని ఏమంటారు?
  A) లీచింగ్     B) పోలింగ్     C) గలనం     D) పుడలింగ్


103. గొలుసులు, బోల్టులు, మేకుల తయారీలో ఉపయోగించే ఇనుము
 A) స్పాంజ్ ఇనుము     B) దుక్క ఇనుము     C) చేత ఇనుము     D) ఉక్కు


104. గడియారపు స్ప్రింగ్‌లు, రైలుపట్టాలు, యుద్ధ సామగ్రి, శస్త్రచికిత్స సాధనాలు, బ్లేడుల తయారీలో ఉపయోగించే ఇనుము ఏది?
  A) స్పాంజ్ ఇనుము         B) ఉక్కు         C) దుక్క ఇనుము         D) చేత ఇనుము


105. లోహక్షయం ........ సమక్షంలో జరుగుతుంది.
  A) నీరు         B) గాలి         C) ఉష్ణం         D) గాలి, నీరు


106. ఇనుము తుప్పుపట్టడంలో జరిగే మొత్తం చర్య
  A) Fe + 6 CO  Fe(CO)6                                  
  B) 3 Fe + 3 O22 FeO2
  C) 2 Fe + O2 + 4 H+ 

 2 Fe2+ + 2 H2O        
  D) Fe + 3 H2O  Fe(OH)3 +  H2


107. స్టెయిన్‌లెస్ స్టీల్ మిశ్రమ లోహంలో ఇనుముతోపాటు కలిపే లోహాలు
  A) Cr, Ni         B) Cu, Cr         C) Zn, Cu         D) Zn, Ni


108. ఇనుమును తుప్పు నుంచి రక్షించేందుకు జింక్ పూత వేయడాన్ని ....... అంటారు.
  A) భర్జనం         B) ప్రగలనం         C) గాల్వనైజింగ్         D) భస్మీకరణం


109. స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ముఖ్యంగా ఇనుముతోపాటు ఉండే లోహం ఏది?
  A) Cu         B) Cr         C) Zn         D) Ni


110. అయస్కాంతాల తయారీకి ఉపయోగించే మిశ్రమ లోహం
  A) స్టీల్         B) ఆల్నికో         C) నిక్రోమ్         D) స్టెయిన్‌లెస్ స్టీల్


111. ఇనుము, నికెల్, క్రోమియం, మాంగనీస్‌తో ఏర్పడే మిశ్రమ లోహం ఏది?
  A) ఆల్నికో         B) నిక్రోమ్         C) స్టీల్         D) స్టెయిన్‌లెస్ స్టీల్


112. విద్యుత్ నిరోధాలు, విద్యుత్తు పరికరాలు, హీటర్లు లాంటి వాటిని రూపొందించడంలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏది?
  A) ఇత్తడి         B) కంచు         C) డచ్‌మెటల్         D) నిక్రోమ్


113. ఇనుము ఒక అనుఘటకంగా ఉండే మిశ్రమ లోహాన్ని ఏమంటారు?
A) ఫెర్రో మిశ్రమ లోహాలు            B) నాన్‌ఫెర్రో మిశ్రమ లోహాలు
C) అమాల్గమ్         D) బేరింగ్ మెటల్


114. ఇంజినీరింగ్ వస్తువులు, గేర్స్, బేరింగ్‌ల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏది?
  A) నైక్రోమ్         B) ఇన్వార్         C) గన్‌మెటల్         D) ఉడ్ లోహం

సమాధానాలు:  1-D;  2-C;  3-A;  4-B;  5-D;  6-C; 7-A;  8-C;  9-B;  10-D;  11-C;  12-B;  13-C; 14-D;  15-D;  16-C;  17-D;  18-B;  19-D;  20-C; 21-D;  22-B;  23-D;  24-B;  25-A;  26-D;  27-C; 28-B;  29-D;  30-C;  31-D;  32-C;  33-D;  34-A; 35-C;  36-D;  37-A;  38-A; 39-C;  40-D; 41-D;  42-C; 43-A;  44-D;  45-C;  46-D;  47-A; 48-B;  49-C;  50-D;
51-C;  52-D;  53-C;  54-C; 55-D;  56-C;  57-A;  58-C;  59-D;  60-A; 61-B;  62-B;  63-D;  64-D;  65-B;  66-B;  67-D; 68-B;  69-B;  70-C;  71-A;  72-C;  73-C; 74-B;  75-C;  76-D;  77-C;  78-D;  79-C; 80-B;  81-D;  82-B;  83-A;  84-D;  85-D; 86-D;  87-B;  88-C;  89-C;  90-C;  91-B;  92-D; 93-B;  94-D;  95-A;  96-C;  97-B;  98-D; 99-A;  100-C;
101-C;  102-D;  103-C;  104-B;  105-D; 106-C;  107-A;  108-C;  109-B;  110-B;  111-B; 112-D; 113-A; 114-C.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌