మాదిరి ప్రశ్నలు
1. శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు?
జ: పెదకోమటి వేమారెడ్డి
2. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో శ్రీనాథుడు ఎవర్ని ఓడించాడు?
జ: డిండిమభట్టును
3. శ్రీనాథుడు ఎక్కువగా ఏ పురాణ భాగాలను అనువదించాడు?
జ: స్కాంద పురాణం
4. తెలుగులో తొలి దండకంగా దేన్ని పేర్కొంటారు?
జ: భోగినీ దండకం
5. కిందివాటిలో పోతన రచన కానిదేది?
1) సత్కవుల్ హాలికులైననేమి... 2) కారే రాజులు రాజ్యముల్ గలుగవే...
3) నా కవిత్వంబు నిజము కర్ణాట భాష 4) సిరికింజెప్పడు, శంఖచక్రయుగమున్...
జ: 3 (నా కవిత్వంబు నిజము కర్ణాట భాష)
6. 'పోతన తెలుగుల పుణ్యపేటి' అన్నదెవరు?
జ: విశ్వనాథ
7. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఇలా అన్నాడని ప్రసిద్ధి....
జ: వాణి నా రాణి
8. 'గోవ్యాఘ్ర సంవాదం' కథ ఎందులోది?
జ: భోజరాజీయం
9. భాగవతంలో పోతన రాసిన స్కంధాలు?
జ: 8
10. సింహాసన ద్వాత్రింశికలో ఉన్న కథలెన్ని?
జ: 32