• facebook
  • whatsapp
  • telegram

భాషా నైపుణ్యాలు

1. కాఫీలోని 'ఫ' అనే ధ్వని- 
జ:   దంతోష్ఠ్యం


2. 'నన్నయ ఉభయకవి మిత్రుడు' అనే భాషణ దోషం ఏ కోవకు చెందింది?
జ:  భావదోషం


3. భాషా కౌశలాలు ఎన్ని? 
జ:   4


4. అతి సులభంగా భావ గ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం-
జ:  శ్రవణం


5. చూపుమేర, పలుకుమేరల సహ సంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది? 
జ:  పఠనం


6. అల్ప ప్రాణం నాదాత్మకమైన భాషా ధ్వని- 
జ:   డ


7. 'కరము' బదులుగా 'ఖరము' అని పలకడం ఏ దోషం వల్ల కలుగుతుంది? 
జ:   అల్పప్రాణం బదులు మహాప్రాణం పలకడం


8. ఉభయోష్ఠ్యాలైన ప/ ఫ/ బ/ భ/ మ ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది? 
జ:  ప్రయత్నం


9. నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షతతో వ్యవహరించడానికి కావాల్సిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పఠనం-
జ:   విస్తార పఠనం


10. భాషణం కేవలం శ్రవణ గోచరం. లేఖనం- 
జ:  నయన గోచరం


11. భాషా నైపుణ్యాల క్రమం- 
జ:  శ్రవణం -భాషణం - పఠనం - లేఖనం


12. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోకజ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైంది- 
జ:  పఠనం 


13. ధ్వన్యనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు- 
జ: నీతి కథలు


14. అ - ఉ అనే రెండు స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన సంయుక్తాచ్చు- 
జ:  ఔ


15. విద్యార్థుల ఉచ్ఛారణ దోషాలను సవరించడానికి ఏ పఠనం చేయించాలి?
జ:  బాహ్య పఠనం


16. విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం- 
జ:  భావ దోషం


17. భాషా బోధనలో పఠన, లేఖనాల్లో ముందుగా జరిగేది- 
జ:  పఠనం


18. పంక్తి మధ్య పఠనం, ఆమూలాగ్ర పఠనం అనే పఠన విధానాలను సూచించిన కవి- 
జ:   నెల్లుట్ల వెంకటేశ్వరరావు


19. ఉపాధ్యాయుడు చెబుతుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తుకు తెచ్చుకుంటూ రాసే లేఖనం- 
జ:   ఉక్త లేఖనం


20. 'భాష ఆలోచనలకు ఆకృతి' అని చెప్పింది- 
జ:  జాన్సన్

 

21. 'ప్రాతిపదిక నైపుణ్యం' అని ఏ భాషా నైపుణ్యానికి పేరు?
జ:   శ్రవణం


22. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమంటారు? 
జ:  శ్వాసాలు


23. 'మల్లెమొగ్గ, మల్లెమొగ్గ మెల్లగ వచ్చి గిల్లిపో' అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం-
జ:  శ్రవణం


24. కరణం ఒక్కసారిగా వెనక్కువచ్చి పైనున్న స్థానాన్ని తాకి, కిందికి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని- 
జ:   తాడితం


25. వర్ణ వ్యత్యయ దోషానికి ఉదాహరణ-
జ:  సుతిలి


26. పదపద్ధతిలో పఠనాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించాల్సిన మెరుపు అట్టలు-
జ:  గుర్తింపు అట్ట


27. అంతస్థాలను సరిగా ఉచ్ఛరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్ఛారణ దోషం- 
జ:   అంత్రం


28. ప్రకాశ పఠనానికి భిన్నమైంది- 
జ:   మౌన పఠనం


29. బాహ్య నైపుణ్య చతుష్కంలో 'వాచిక చర్య' అని దేన్ని అంటారు?
జవాబు:  భాషణం


30. 'చిన్నది యిదిగో చిటికెన వ్రేల్.... ఉన్నది ప్రక్కన ఉంగరపు వ్రేల్' అనేది-
జవాబు:  అభినయ గేయం


31. మౌఖికంగా కూర్చే రచన-
జవాబు: ఉక్త రచన


32. వర్ణమాలలో తరచుగారాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పఠన పద్ధతి- 
జవాబు: నవీనాక్షర పద్ధతి


33. ఒక్కగుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం- 
జవాబు: పలుకుమేర


34. 'కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయమొక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు' అన్నది-
జవాబు: నాష్


35. 'లేఖనం' అనేది ఏ పదం నుంచి ఏర్పడింది?
జవాబు: లింపతి

 

36. వివరంగా ఉన్న విషయాన్ని కుదించి, అతి క్లుప్తంగా, సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారు?
జవాబు: సంక్షిప్త లేఖనం

 

37. పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా, అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం-
జవాబు:  భాషణం 


38. వాచిక చర్యను పెంపొందిచడానికి ఏది ఉపకరిస్తుంది? 
జవాబు: కథా కథనం


39. పిల్లల్లో జ్ఞాపకశక్తిని, సమస్యా పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞతను కలిగించేవి-
జవాబు: పొడుపు కథలు


40. అనునాసిక దోషానికి ఉదాహరణ-
జవాబు: వీన

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌