• facebook
  • whatsapp
  • telegram

సాహిత్య ప్రక్రియలు

            తెలుగు బోధనాపద్ధతులకు హృదయం లాంటి అధ్యాయం 'సాహిత్య ప్రక్రియలు'. ఈ అధ్యాయంలో పద్యం - గద్యం - వ్యాకరణం అనే సాహిత్య ప్రక్రియలతోపాటు, రచనాపద్ధతులుగా చెప్పే వ్యాసరచన - నాటకరచన - కథారచన అనే రచనాపద్ధతులు; ఆధునిక బోధనాపద్ధతులు, బోధనానైపుణ్యాలను ఉపవిభాగాలుగా చదవాల్సి ఉంటుంది. 
           'పద్యబోధన' చదివేటప్పుడు ముందుగా పద్యబోధన లక్ష్యాలు, కవిత్వ నిర్వచనాలను అభ్యసించాల్సి ఉంటుంది.

ఉదా.1: పద్యబోధన లక్ష్యం-
ఎ) విషయావగాహన         బి) రసానుభూతి          సి) భాషాజ్ఞానం          డి) మానసికానందం
సమాధానం: బి.


ఉదా.2 : 'రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలే కవిత్వం అన్న లాక్షణికుడు'
ఎ) ముమ్మటుడు        బి) భామహుడు        సి) విశ్వనాథుడు        డి) జగన్నాథపండిత రాయలు
సమాధానం: డి.


* సాహిత్యజ్ఞానంలో భాగమైన 'పాకములు', 'రసము - స్థాయీ భావములు'; రస స్వరూపం చదవవలసి ఉంటుంది.

ఉదా.1 : సాహిత్య లాక్షణికుల అభిప్రాయం ప్రకారం 'చాలా సులభమైన రచనలు' ఏ పాకానికి చెందుతాయి?
ఎ) ద్రాక్ష పాకం      బి) కదళీ పాకం     సి) నారికేళ పాకం        డి) కుంభీపాకం
సమాధానం : ఎ.


ఉదా.2: బీభత్స రసానికి స్థాయీ భావం
ఎ) విస్మయం          బి) జుగుప్స          సి) క్రోధం          డి) భయం
సమాధానం : బి.


* పద్యబోధనలో కీలకమైన అంశాలు - పద్యబోధన పద్ధతులు, పద్యబోధన క్రమం.

ఉదా.1 : పద్యబోధనకు ఉత్తమ పద్ధతి
ఎ) ఖండ పద్ధతి      బి) ప్రతిపదార్థ పద్ధతి        సి) తాత్పర్య పద్ధతి       డి) పూర్ణ పద్ధతి

సమాధానం : డి.


ఉదా.2 : పద్య బోధనాక్రమంలో ఉపాధ్యాయుడు దేన్ని తప్పకుండా విద్యార్థుల దృష్టికి తీసుకురావాలి?
ఎ) అన్వయ క్రమం           బి) గృహకృత్యం           సి) సంశ్లేషణ           డి) సమాసాలు
సమాధానం : ఎ. 


*  సాహిత్య ప్రక్రియల్లో మరో ముఖ్యమైన ప్రక్రియ గద్యం. ఇందులో గద్య ప్రక్రియ విశిష్ఠత, గద్యబోధన ఉద్దేశాలపై విద్యార్థులు దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఉదా.1 : గద్యం కవీనాం నికషం వదన్తి అంటే-
ఎ) గద్యం రాయడం కవులకు నిషేధింపబడింది       బి) గద్యం రాసే కవులు అపవాదుకు గురి అవుతారు
సి) గద్యం రాయడం కవులకు పరీక్షలాంటిది         డి) గద్యం రాసే పండితులను కవులంటారు

సమాధానం : సి.


ఉదా.2: గద్యబోధన ఉద్దేశం-
ఎ) భాషాజ్ఞానం      బి) ఆనందానుభూతి         సి) హృదయ ద్రవీకరణ        డి) మానసికానందం

సమాధానం: ఎ.
 

* గద్యంలో గద్యపాఠ్య భేదాలతో పాటు చదవాల్సిన మరో ముఖ్యమైన అంశం గద్య బోధన పద్ధతులు

ఉదా: గద్య పాఠ్య భేదాలు-
ఎ) 8                బి) 6               సి) 11                డి) 14
సమాధానం : డి.


*   ఉపాధ్యాయుడు గద్య బోధనలో అంశాన్ని 'రసభావ' ప్రకటనాత్మకంగా ఆవిష్కరించే పద్ధతి
ఎ) వాస్తవిక పద్ధతి        బి) ఉపన్యాస పద్ధతి         సి) సాహిత్య పద్ధతి          డి) నిగమన పద్ధతి
సమాధానం : సి.


* గద్యబోధనలో విద్యార్థులు చివరగా చదవాల్సిన అంశం గద్య బోధనా క్రమం

ఉదా: గద్య పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి, సమాస, అర్థసంగ్రహణ సోపానాల తర్వాత నిర్వహింపబడే సోపానం
ఎ) ఆదర్శ పఠనం     బి) చర్చ        సి) రచయిత పరిచయం         డి) ఇంటిపని

సమాధానం : బి.


* ఈ అధ్యాయంలో గద్య బోధన తర్వాత దృష్టి సారించాల్సిన మరో ఉప విభాగం 'వ్యాకరణ బోధన'.ఇందులో వ్యాకరణం అంటే ఏమిటి?, దాని ఆవశ్యకత, ఉద్దేశ్యాలేమిటి అనే అంశాలను చదవాల్సి ఉంటుంది.

ఉదా : 'ప్రయోగ శరణమ్ వ్యాకరణమ్' అంటే-
ఎ) ప్రజల వాడుకలో ఉన్న భాషయే వ్యాకరణ నిర్మాణానికి శరణ్యం
బి) శిష్టులైన వారి వాడుకలో ఉన్న భాషయే వ్యాకర్తకు శరణ్యం
సి) వ్యాకరణ నిర్మాణానికి, ప్రామాణిక కవుల ప్రయోగాలే శరణ్యం
డి) వ్యాకర్తచే ప్రయోగించదగినదని శాసింపబడిన ప్రామాణిక భాషయే శరణ్యం

సమాధానం : ఎ.


* వ్యాకరణ బోధనలో అభ్యర్థులు చదవాల్సిన మరో ముఖ్యాంశం - వ్యాకరణంలోని రకాలు
ఉదా: చిన్నయసూరి 'బాలవ్యాకరణం' ఏ కోవకు చెందింది?
ఎ) తులనాత్మక వ్యాకరణం                              బి) చరిత్రాత్మక వ్యాకరణం              
సి) వర్ణనాత్మక వ్యాకరణం                                డి) విశ్లేషణాత్మక వ్యాకరణం
సమాధానం : సి.


* వ్యాకరణ బోధనలో చివరగా అభ్యర్థులు దృష్టి సారించాల్సిన వాటిలో ముఖ్యమైనవి - దశానుగుణమైన వ్యాకరణ బోధన, బోధనా పద్ధతులు, వ్యాకరణ బోధనాక్రమం.

ఉదా.1: 6వ తరగతి వ్యాకరణ నియమాలను ఏ రీతిలో బోధించవచ్చు?
ఎ) ప్రాయోగిక వ్యాకరణ బోధన                       బి) నైమిత్తిక వ్యాకరణ బోధన
సి) రూపాత్మక వ్యాకరణ బోధన                      డి) నాటకీయ వ్యాకరణ బోధన
సమాధానం : బి.


ఉదా.2: వ్యాకరణ బోధనలో ఉపయోగించే ఉత్తమ బోధన పద్ధతి-
ఎ) అనుమానోపపత్తి పద్ధతి                               బి) నిగమోపపత్తి పద్ధతి
సి) సూత్రపద్ధతి                                                డి) సాంప్రదాయిక పద్ధతి
సమాధానం : ఎ.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌