• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం 

1. విద్యార్థుల సృజనాత్మక శక్తిని, ఆసక్తిని, అభిరుచులను వెలికితీసి స్వయంకృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేలా చేయడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే మూల్యాంకనా అనుబంధ సాధనం?
జ. నియోజనం


2. పాఠ్యాత్మక సముపార్జనను మాపనం చేయడానికి తోడ్పడేది?
జ. పరీక్ష


3. నేడు భాషానైపుణ్యాల్లో పరీక్షిస్తున్నది?
జ. లేఖనం


4. విద్యార్థుల్లో దాగి ఉన్న సహజాతాలను బహిర్గతం చేసి నడవడికను, అలవాట్లను, హస్త నైపుణ్యాన్ని, సంప్రదాయసిద్ధంగా వస్తున్న జ్ఞాన సముపార్జనాభివృద్ధికి మూల్యాంకనం తోడ్పడుతుందని అభిప్రాయపడింది ఎవరు?
జ. ఆర్.కె. కపూర్


5. విద్యార్థి 'ప్రవర్తన' గురించి తెలుసుకోవడానికి ఏది మంచి సాధనం?
జ. పరిశీలన


6. విద్యార్థులు తప్పులను గ్రహించే సామర్థ్యాన్ని సాధించడం ఏ ప్రశ్నల ప్రధానోద్దేశం?
జ. తప్పొప్పుల ప్రశ్నలు


7. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా ఏ లక్ష్యాలను మాపనం చేయలేం?
జ. రసానుభూతి, వైఖరి, అభిరుచి


8. 3-4 వాక్యాల్లో సమాధానం రాయగోరే ప్రశ్నలు ఏవి?
జ. లఘుసమాధాన ప్రశ్నలు


9. స్వల్ప వ్యవధిలో ఎలాంటి సంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది?
జ. నికష


10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో 'నిలుపుదలరహిత విధానాన్ని' ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టింది?
జ. 1971


11. బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడేది?
జ. ఇంటిపని


12. అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాల్లో...
జ. ఆపేక్ష, నిరపేక్షలకు గురవుతుంది.


13. ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసుకున్న ప్రశ్నపత్రానికి వివిధ భారత్వ పట్టికలతోపాటు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సింది ఏది?
జ. మాదిరి సమాధాన పత్రం


14. తరగతిలో అందరు విద్యార్థుల ఆర్జనా స్థాయితో ప్రతి విద్యార్థి ఆర్జనా స్థాయిని పోల్చడానికి తోడ్పడే నికష?
జ. సూత్రాధారిత నికష


15. సామర్థ్యాధారిత మూల్యాంకన నిర్వహణలో బోధనకు ముందే నిర్వహించే నికష?
జ. పూర్వ నికష


16. రెండో తరగతిలో మౌఖిక పరీక్షకు ఎంత శాతం భారత్వాన్నివ్వాలి?
జ. 70%


17. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ఏ లక్షణం?
జ. సమగ్రత


18. వైయక్తికమైన నికష ఏది?
1) సంకలన నికష               2) రూపణ నికష
3) ప్రమాణాధారిత నికష      4) సూత్రాధారిత నికష

జ. 3 (ప్రమాణాధారిత నికష)


19. ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో 3 సరైనవి, ఒకటి సరికానిది. సరికాని దాన్ని గుర్తించే ప్రశ్న?
1) సహసంబంధ ప్రశ్న          2) విలోమరూప ప్రశ్న
3) బహుళైచ్ఛిక ప్రశ్న          4) తప్పొప్పుల ప్రశ్న

జ. 2 (విలోమరూప ప్రశ్న)


20. పాఠశాలలో సాధారణంగా నిర్వహించే పరీక్షలో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షించే రంగం?
జ. జ్ఞాన రంగం


21. విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణ విధానం మొదలైన వాటిని పరీక్షించడానికి వీలైంది?
జ. మౌఖిక పరీక్షలు


22. అంతర్గత మూల్య నిర్ధారణ అంశాలను పాఠశాల స్థాయిలో ఎలా ఇస్తారు?
జ. గ్రేడుల రూపంలో


23. పాఠ్య ప్రణాళిక పూర్తయ్యాక నిర్వహించే మూల్యాంకనం ఏది?
జ. సమగ్ర మూల్యాంకనం


24. ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక పద్యం కంఠస్థం చేసుకురమ్మన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది....?
జ. ఇంటిపని

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌