• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - అలంకారాలు

1. కావ్యాలంకార సంగ్రహ కర్త - 
జవాబు:  రామరాజభూషణుడు 


2. వృత్యనుప్రాస అంటే...? 
జవాబు: ఒకే హల్లు అనేకసార్లు రావడం


3. 'కందర్ప దర్ప' అనేది -
జవాబు: ఛేకానుప్రాస


4. అర్థభేదం లేకుండా తాత్పర్యభేదం ఉండేది -
జవాబు: లాటానుప్రాస


5. 'లేమా, దనుజుల గెలువగలేమా... ' ఇది దేనికి ఉదాహరణ? 
జవాబు: యమకం 


6. ఒక పాదం చివరి పదం పట్టుకుని మళ్లీ ప్రారంభిస్తే అది-
జవాబు: ముక్తపదగ్రస్తం


7. 'ఆపటేరాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశా చలంబుగన్...'  అనేది 
జవాబు: అంత్యానుప్రాస


8. లుప్తోపమ అంటే... 
జవాబు:  ఉపమేయ, ఉపమాన, సమాన ధర్మ ఉపమావాచకాల్లో ఒకటి లేకపోవడం

 

9. 'నరసరాజు కీర్తి పాలసముద్రం' - ఏ అలంకారం? 
జవాబు: రూపకం


10. ఆ రాజు కువలయానందకరుడు - ఇది ఏ అలంకారం? 
జవాబు: శ్లేషాలంకారం


11. గోరంతలు కొండంతలుగా చెప్పడం - 
జవాబు: అతిశయోక్తి 


12. దృష్టాంతాలంకారంలో 
జవాబు:  బింబప్రతిబంబం ఉంటుంది


13. 'ఓ గంగా! పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు వివేకం ఎక్కడిది?' - ఏ అలంకారం? 
జవాబు:  వ్యాజస్తుతి


14. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపిస్తే అది - 
జవాబు: రూపకం


15. 'ఈ మదించిన తుమ్మెద ఆమె ముఖాన్ని పద్మం అనుకుంటోంది' - అనేది
జవాబు: భ్రాంతిమదలంకారం

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌