• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - సంధులు

1. భాను + ఉదయం -
జ: భానూదయం


2. గుణసంధికి ఉదాహరణ -
జ: సప్తర్షులు


3. ఐ, ఔ లను ఏమంటారు?
జ: వృద్ధులు


4. యణ్ణులు అంటే...?
జ: యవరలు


5. 'అభ్యుదయం' లో ఉన్న సంధి లాంటిది -
జ: అత్యున్నతం, గుర్వాజ్ఞ, అభ్యర్థి


6. చిన్మయం - విడదీయండి.
జ: చిత్+మయం


7. పిత్రంశం అనేది -
జ: యణాదేశసంధి


8. విసర్గ సంధికి ఉదాహరణలు -
జ: శిరోరత్నం, చతురాశన, మనస్తాపం


9. హ్రస్వమైన ఉకారాన్ని ఏమంటారు?
జ: ఉత్తు


10. ప్రథమ మీది పరుషాలకు వచ్చే సంధి -
జ: గసడదవా దేశసంధి


11. పేదరాలు, గుణవంతురాలులోని 'ఆలు' అంటే.
జ: స్త్రీ


12. దయఁజూచి అనేది-
జ: సరళాదేశ సంధి


13. ద్విరుక్తం యొక్క పరరూపం -
జ: ఆమ్రేడితం


14. యడాగమ త్రికసంధికి ఉదాహరణ-
జ: అయ్యది


15. కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాలకు వచ్చేది-
జ: ద్విరుక్తటకార సంధి

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తెలుగు పండిట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌