• facebook
  • whatsapp
  • telegram

ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు

ఆదిమ సమాజం ఆచరణలో సమజీవనం!


చరిత్ర అధ్యయనంలో తొలి దశ ఆదిమానవుడి గురించి తెలుసుకోవడంతో మొదలవుతుంది. నాగరికత ఆవిర్భÄవానికి పూర్వం శిలాయుగంలో జీవనవిధానం, ఆహార సేకరణ తీరు, వేటకు వాడిన రాతి పనిముట్లు, నిప్పుతో పొందిన ప్రయోజనాలు, తీరిక వేళల్లో వేసిన చిత్రాలు తదితరాలన్నీ ఆసక్తికర అంశాలే. సంచార జీవనం నుంచి స్థిర నివాసిగా మారే క్రమంలో జరిగిన మార్పులు, పండించిన పంటలు, మచ్చిక చేసుకున్న జంతువులు, ఆ పరిణామాలకు కేంద్రాలుగా ఉన్న ప్రదేశాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.  తెలుగు రాష్ట్రాల్లో ఆదిమానవుడి ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతాలతోపాటు నేటి అటవీ జాతులు, ప్రధాన గిరిజన సమూహాలు, వారు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు, పాలనా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి.

1. కొన్నివేల సంవత్సరాల కిందట మానవులు వేటిని తినేవారు?

1) దుంపలు   2) పండ్లు, తేనె   3) మాంసం  4) పైవన్నీ 


 

2. కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) కొన్ని వేల సంవత్సరాల కిందట మానవులు సంచార జీవనం గడపలేదు.

బి) ఆహార అన్వేషణ ప్రధాన ధ్యేయంగా ఉండేది.

సి) పచ్చిమాంసం తినేవారు.

డి) జంతు చర్మాలను ధరించేవారు.

1) ఎ, బి, సి, డి     2) సి, డి    3) బి, సి, డి     4) బి, డి
 


3. ప్రకటన - ఎ: రాళ్లను రాతితో రాపిడి చేసి రాతి పనిముట్లు తయారుచేసేవారు.

    ప్రకటన - బి: రాతి పనిముట్లను జంతు చర్మాలను, చెట్ల బెరడును తీయడానికి వాడేవారు.

1) ఎ, బి లు సరికావు   2) ఎ సరైంది, బి సరికాదు  

3) ఎ, బి లు సరైనవి   4) ఎ సరికాదు, బి సరైంది 


4. నెల్లూరు జిల్లా కామకూరులో బయల్పడినవి ఏవి?

1) ఎముకల పనిముట్లు

2) రాతి గొడ్డలి 

3) పురాతన రాతి పనిముట్లు 

4) సూక్ష్మ రాతి పనిముట్లు 

5. నిప్పును మానవుడు ఏ అవసరాలకు వాడేవాడు?

1) క్రూరమృగాలను తరమడానికి 

2) రాత్రి సమయాల్లో వెలుగు కోసం

3) మాంసం కాల్చి తినడానికి

4) పైవన్నీ

6. కిందివాటిలో సరికానిది?

1) రాళ్లను పిండి చేసి రంగులు తయారుచేసేవారు.

2) రాళ్లను పిండి చేసి జంతుకొవ్వును కలిపి రంగులు తయారుచేసేవారు.

3) వెదురు కుంచెలు ఉపయోగించి బొమ్మలు గీసేవారు.

4) బొమ్మలు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్నాయి.

7. కిందివాటిలో సరైన వాక్యాలు-

ఎ) ఆహార అన్వేషణలో పురుషులు మాత్రమే  పాల్గొనేవారు.

బి) దొరికిన ఆహారాన్ని అందరూ సమానంగా  పంచుకునేవారు.

సి) సమజీవనం వారిలో ఉండేది.

డి) ఆహార అన్వేషణలో అందరూ పాల్గొనేవారు.

 1) ఎ, బి    2) బి, సి    3) బి, సి, డి    4) సి, డి 

8. వాతావరణంలో మార్పులు ఎన్ని సంవత్సరాల కిందట వచ్చాయి?

1) 12000    2) 10000    3) 9000    4) 4000 

9. వాతావరణంలో మార్పుల వల్ల ఏం సంభవించింది?

1) అధిక వర్షం   2) అధిక ఉష్ణోగ్రత    3) అధిక వర్షం, ఉష్ణోగ్రత   4) అధిక మంచు

10. వాతావరణంలో మార్పుల వల్ల ఏం జరిగాయి?

ఎ) అటవీ ప్రాంతాలు గడ్డిభూములుగా మారాయి.

బి) గడ్డిభూములపై ఆధారపడి జంతువులు నివసించాయి.

సి) ఈ మార్పులే వ్యవసాయ ప్రారంభానికి కారణమయ్యాయి.

డి) ఈ మార్పులు వ్యవసాయ ప్రారంభానికి కారణమవలేదు.

1) ఎ, బి     2) బి, డి   3) ఎ, బి, సి    4) బి, సి, డి 

11. ప్రాచీన కాలంలో మానవులు వేటితో నివాసాలు ఏర్పరచుకున్నారు?

1) రాతితో   2) మట్టితో   3) గడ్డి/ఆకులతో     4) పైవన్నీ

12. భారత ఉపఖండంలో శిలాయుగంలో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు?

ఎ) 10,000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌లో

బి) 9,000 ఏళ్ల కిందట బెలూచిస్థాన్‌లో

సి) 4000 ఏళ్ల కిందట బిహార్‌లో

డి) 6,000 ఏళ్ల కిందట కశ్మీర్‌లో

1) ఎ, బి, సి, డి   2) బి, సి, డి   3) బి, సి    4) సి, డి  

13. జంతువుల మచ్చిక ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు?

1) ఆంధ్రప్రదేశ్‌  2) తెలంగాణ   3) కర్ణాటక   4) పైవన్నీ

14. శిలాయుగం కాలం నాటి మానవులు ఎండబెట్టిన పేడదిబ్బలను ఏ సందర్భాల్లో మండించేవారు? 

1)  పండగలు   2)  మరణించినప్పుడు  3) పెళ్లి  4)  పైవన్నీ

15. మధ్యప్రదేశ్‌లో రాతి పనిముట్లు లభించిన ఊరు?

1) కుంద్రా    2) నంద్రా    3) నందు    4) పైవన్నీ 

16. కిందివాటిని జతపరచండి.

ఎ) తమిళనాడులోని 1) సూక్ష్మరాతి గడియం పనిముట్లు
బి) కర్నూలు జిల్లా 2) ఎముకలతో తయారుచేసిన వస్తువులు 
సి) కడప జిల్లా 3) తెలుపు, ఎరుపు రంగుల బొమ్మలు
డి) నెల్లూరు జిల్లా 4) రాతి గొడ్డలి

1) ఎ-2, బి-3, సి-4, డి-1    2) ఎ-1, బి-2, సి-3, డి-4 

3) ఎ-1, బి-4, సి-3, డి-2     4) ఎ-3, బి-4, సి-1, డి-2 

17. కిందివాటిని జతపరచండి.

ఎ) కర్నూలు 1) బేతంచర్ల 
బి) కడప 2) చింతకుంట
సి) నెల్లూరు 3) కామకూరు
డి) అనంతపురం 4) పాళ్వాయి


1) ఎ-1, బి-2, సి-3, డి-4   2) ఎ-3, బి-4, సి-2, డి-1 

3) ఎ-4, బి-3, సి-1, డి-2   4) ఎ-3, బి-2, సి-4, డి-1  

18. ఆదిమానవుల సంచార జీవనానికి కారణం?

1) ఆవాసం   2) నీరు   3) ఆహారాన్వేషణ   4) పైవన్నీ 

19. వేటిని సూక్ష్మరాతి పనిముట్లు అంటారు? 

1) పెద్దరాయి     2) బరిసె    3) కొడవలి     4) పలుగు

20. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించేవారిని ఏమంటారు? 

1) సంచారజీవులు    2) స్థిరజీవులు     3) కష్టజీవులు    4) శ్రమజీవులు

21. ఆదిమానవులు చిత్రాలు చిత్రీంచడానికి కుంచెలుగా వేటిని ఉపయోగించేవారు? 

1) చెట్ల ఆకులు   2) వెదురు కుంచెలు    3) జంతు చర్మాలు   4) జంతువుల వెంట్రుకలు


తెగలు - సామాజిక నిర్ణయాధికారం  

22. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గిరిజన సమాజాలు?

1) చెంచులు, కొండరెడ్లు     2) కోయలు   3) యానాదులు    4) పైవారందరూ

23. కిందివాటిలో సరైన వాక్యాలు-

ఎ) గిరిజన తెగలోని వారంతా ఒకే మూలపురుషుడి నుంచి వచ్చామని భావిస్తారు.

బి) సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు.

సి) తెగల్లోని వారంతా అన్ని పనులు చేస్తారు.

డి) పురుషులకు నిర్ణయాధికారం లేదు.

1) ఎ, బి, సి, డి     2) బి, సి, డి    3) ఎ, బి, సి     4) బి, సి

24. 1940లో వ్యూరర్‌ హైమన్‌ డార్ఫ్‌ ఏ తెగలపై అధ్యయనం చేశారు?

1) చెంచులు     2) కొండరెడ్లు    3) గోండులు    4) పైవారందరూ

25. గోండు పంచాయతీలు నిర్ణయించే పనులు?

1) పండగల తేదీలు     2) విడాకులు    3) కర్మకాండలు     4) పైవన్నీ 

26. గిరిజన సమాజంలో గ్రామపెద్దను ఏమంటారు?

1) పంచాయతీ     2) గ్రామపెద్ద     3) పట్లా     4) సర్పంచ్‌

27. గోండు సమాజంలో మార్పులు ఏ మధ్యకాలంలో వచ్చాయి?

1) 1940  2) 1950   3) 1, 2  4) ఏదీకాదు 

28. కిందివాటిలో పట్ల/పాట్లల్‌ విధి కానిది?

1) గ్రామాన్ని సమైక్యంగా ఉంచడం.

2) పండగల సమయాల్లో సామాజిక కార్యక్రమాలు చేయడం.

3) ప్రభుత్వంతో అనుసంధానకర్తగా వ్యవహరించడం.

4) గ్రామానికి వచ్చిన అతిథులను గ్రామంలోని వివిధ ఇళ్ల వద్ద ఉంచడం.

29. క్రిమినల్‌ తెగల నివారణ చట్టం ఎప్పుడు చేశారు?

1) 1982   2) 1951     3) 1952   3) 1953

30. గోండు సమాజంలోని ప్రజలను ఏ విధంగా పరిగణిస్తారు?

1) బంధువులుగా    2) శత్రువులుగా    3) రాజులుగా   4) పైవన్నీ 

31. గోండు పంచాయతీ పేరు?

1) గణ     2) పంచాయతీ    3) పంచ్‌   4) గ్రామసభ 

32. కడపలో ఆదిమానవుడి చిత్రాలు దొరికిన ప్రాంతం?

1) పులివెందుల    2) చింతకుంట   3) పోరుమామిళ్ల    4) బద్వేల్‌

33. రాతి చిత్రకళ స్థావరాలకు సంబంధించి భిన్నమైంది?

1) వినుకొండ    2) నందిపాడు   3) తిరుపతి     4) దాపల్లి

34. రాతి చిత్రకళ స్థావరాలున్న జిల్లాల్లో కింది వాటిలో భిన్నమైంది?

1) పల్నాడు   2) చిత్తూరు   3) గుంటూరు    4) కర్నూలు

35. పురాతన రాతి చిత్రకళ స్థావరాలున్న ప్రాంతం?

1) వెల్పుమడుగు    2) నాగార్జున కొండ   3) నందికొండ   4) రాయుడుపల్ల

36. కింది వాక్యాల్లో సరైనవి? 

ఎ) మధ్యప్రదేశ్‌లో నంద్రా ఉంది.

బి) మహారాష్ట్రలో నవస ఉంది.

సి) కర్నూలు జిల్లాలో బెలూమ్‌ గుహలు ఉన్నాయి.

1) ఎ, బి     2) ఎ, సి     3) ఎ     4) ఎ, బి, సి

37. ప్రాచీన రాతి చిత్రకళ స్థావరమైన నేరుపల్లి ఏ జిల్లాలో ఉంది?

1) మహబూబ్‌నగర్‌     2) నల్గొండ   3) రంగారెడ్డి     4) మెదక్‌

38. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న ఆమ్రాబాద్‌లో  లభించిన ప్రాచీన శిలాయుగ పనిముట్టు?

1) కొడవలి    2) రాతి గొడ్డలి   3) రాతి గిన్నె   4) పైవన్నీ

39. తెలంగాణలో రాతి చిత్రకళ స్థావరాలున్న ప్రాంతాలకు సంబంధించి భిన్నమైంది?

1) పాండవుల గుట్ట    2) జూపల్లి   3) వనపర్తి    4) కోకాపేట

40. వరంగల్‌ జిల్లాలోని తిరుమలగిరిలో పాండవుల గుట్టలో దొరికిన రాతి పనిముట్టు ఏ రకమైంది?

1) సూక్ష్మ రాతి పనిముట్లు   2) మధ్య శిలాయుగం నాటివి

3) ప్రాచీన శిలాయుగం నాటివి   4) పైవన్నీ 


సమాధానాలు

1-4; 2-3; 3-3; 4-2; 5-4; 6-1; 7-3; 8-1; 9-2; 10-3; 11-4; 12-3; 13-4; 14-1; 15-2; 16-2; 17-1; 18-3; 19-3; 20-1; 21-2; 22-4; 23-3; 24-4; 25-4; 26-3; 27-3; 28-4; 29-3; 30-1; 31-3; 32-2; 33-3; 34-3; 35-1; 36-4; 37-1; 38-2; 39-3; 40-1.

Posted Date : 30-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌