కేరళలో కలియుగ కల్పవృక్షం!
సృష్టిలో జీవుల మనుగడకు సంపూర్ణ ఆధారం మొక్కలు. ఆహారం, మందులు, వాణిజ్య అవసరాల కోసం వాటిని ఉపయోగించే మార్గాలు, విధానాల గురించి వివరించేదే ఆర్థిక వృక్షశాస్త్రం. వివిధ మొక్కలు, పంటల్లోని పోషకాలు, వాటికి ఉన్న ఆర్థిక విలువ, జాతుల వారీ వర్గీకరణ, జన్యు పరిణామంపై పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ప్రధాన ఆహార పంటలు, చిరుధాన్యాలు, ఎక్కువగా పండిస్తున్న ప్రాంతాలు, విభిన్నమైన సాగు విధానాలు, ప్రయోజనాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
1. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.
ఎ) నాగుల పద్ధతి అంటే విత్తనాలు అరువు తీసుకోవడం.
బి) కలుపు నియంత్రణకు ఉపయోగించే పరికరం తోళ్లుక.
సి) ప్రపంచంలో వరిని అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఏకైక దేశం జపాన్.
డి) మర నాగలితో దున్నినప్పుడు ఏర్పడే చాళ్ల ఆకారం U/V.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి
2. ప్రపంచ ఆర్థిక వృక్షశాస్త్ర పిత?
1) జి.పి.హెక్టార్ 2) హిల్
3) హెకేల్ 4) లిన్నేయస్
3. పూసా నాఫియర్ గడ్డి అనేది?
1) వన్యజాతి 2) పెరటి మొక్క
3) కుండీ మొక్క 4) సాగు మొక్క
4. ఖరీఫ్, రబీ అనే పదాలు?
1) అరబిక్ 2) జర్మన్ 3) లాటిన్ 4) గ్రీకు
5. కిందివాటిలో ఖరీఫ్ పంట కానిది?
1) మినుములు 2) సోయాబీన్స్
3) అవిసెలు 4) మిరప
6. ఒరైజా అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
1) లిన్నేయస్ 2) హెక్టార్
3) హిల్ 4) హెకేల్
7. అమెరికాలో పండే వరి రకం?
1) ఒరైజా గ్లోబెర్రిమా 2) గ్లూమో పాట్యులా
3) అమ్నల్సారి 4) సోనా
8. కిందివాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి.
ఎ) వరి - అతి పురాతన పంట
బి) వరి - విశ్వ ధాన్యపు పంట
సి) వరి - వేదకాలపు పంట
డి) వరి - ధాన్యాల రాణి
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి
9. జపాన్‌లో ఎన్ని మిలియన్ హెక్టార్లలో వరి పండిస్తున్నారు?
1) 37 2) 40
3) 2.5 4) 130
10. వరిలో అడవిజాతి రకాలు?
1) 18 2) 2 3) 10 4) 35
11. జాతీయ వరి పరిశోధనా సంస్థ (సీఆర్ఆర్ఐ) ఎక్కడ ఉంది?
1) ఒడిశా 2) మనీలా 3) అర్జెంటీనా 4) జపాన్
12. నీటిలో నానబెట్టిన 40 నిమిషాల్లో ఆహారం తయారయ్యే వరి రకాలు?
1) నల్‌బోరా 2) అగాని
3) బొగాలి 4) పైవన్నీ
13. గోధుమ శాస్త్రీయ నామం ఏమిటి?
1) ఒరైజా 2) జియామేజ్
3) ట్రిటికమ్ 4) పుంగామియా
14. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే మొక్క?
1) ఒరైజా 2) జియామేజ్
3) ట్రిటికమ్ 4) పుంగామియా
15. గ్లూకోజ్, ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే మొక్క?
1) పెన్నిసిటం 2) అరాఖిస్
3) రెసినస్ కమ్యూనస్ 4) జియామేజ్
16. కిందివాటిలో కేరళ కలియుగ కల్పవృక్షం?
1) కోకస్ న్యూసిఫెరా 2) గాసిపియం
3) టెక్టోనియా 4) సాల్విక్స్
17. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే మొక్క?
1) మోరస్ ఆల్బా 2) అజాడిరెక్టా
3) అభిస్ ఆల్బా 4) శాంటలం ఆల్బం
18. కిందివాటిలో కలప అధ్యయనం?
1) డెండ్రాలజీ 2) డాక్టాలజీ
3) ట్రైకాలజీ 4) పల్మనాలజీ
19. క్రికెట్ బ్యాట్ తయారీలో ఉపయోగించే మొక్క?
1) సోరియా రొబోస్టా 2) సాల్విక్స్ పర్పూరియా
3) పుంగామియా పిన్నెటా 4) డాల్ బర్జియా
20. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్క?
1) జినియా 2) పుంగామియా
3) నీలకురవంజి 4) వెదురు
21. కిందివాటిలో బంగారు నార?
1) జనప 2) కిత్తనార 3) బూరుగ 4) పత్తి
22. శానిటరీ ప్యాడ్స్ తయారీలో ఉపయోగించే మొక్క?
1) పత్తి 2) జనుము
3) అరటి 4) అగేవ్ అమెరికాన
23. సుగంధద్రవ్యాల రాజు?
1) పైపర్ నైగ్రం 2) ఎలేట్టరియా
3) సిన్నామోమం 4) యూజినియా
24. ‘పిన్నాటల్’ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి వస్తుంది?
1) వేప 2) అవిసె 3) కానుగ 4) గన్నేరు
25. కేంపర్ అనే ఆల్కలాయిడ్ లభించే మొక్క?
1) వేప 2) తులసి
3) పసుపు 4) సర్పగ్రంథి
26. కాఫీ మొక్క రుచిని పెంచేది?
1) అరాభికా 2) కేషియా
3) చికోరియా ఇంటిబస్ 4) ప్లాక్స్గ్లౌవ్
27. కిందివాటిలో మలేరియా వ్యాధి నివారిణి?
1) క్వినైన్ 2) నింబిన్
3) మెంథాల్ 4) రిసర్పిన్
28. కిందివాటిలో భిన్నమైంది?
1) అమృత సారీ 2) బంగారు తీగ
3) ఎస్ఆర్ఐ రకం 4) పైవన్నీ
29. ఎస్ఆర్ఐ వరిని ఎవరు కనుక్కున్నారు?
1) హెన్రీ పాయింకర్ 2) హెన్రీ డిలౌలా
3) లిన్నేయస్ 4) హెక్టార్
30. ప్రపంచంలో కందుల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశమేది?
1) జపాన్ 2) అమెరికా 3) చైనా 4) ఇండియా
31. ప్రపంచంలో అధికమంది వాడుతున్న వంట నూనె?
1) సోయాబీన్ 2) సన్‌ఫ్లవర్
3) వేరుశనగ 4) ఆవాలు
32. కిందివాటిలో బెంగాల్ గ్రామ్ ఏది?
1) కందులు 2) మినుములు
3) శనగలు 4) కేసరి పప్పు
33. కిందివాటిలో పేదవాడి మాంసం?
1) శనగలు 2) సోయాబీన్స్
3) చిక్కుడు 4) కందులు
34. కందెన తయారీలో ఉపయోగించే నూనె?
1) ఆముదం 2) వేరుశనగ
3) కానుగ 4) కుసుమ
35. కిందివాటిలో స్వల్పకాలిక పంట?
1) జొన్న 2) పెసర 3) కందులు 4) పైవన్నీ
36. కిందివాటిలో ప్రోటీన్లు అధికంగా ఉన్న వరి రకం?
1) బ్లాక్ రైస్ 2) నల్‌బోరా
3) అగాని 4) గోల్డెన్ రైస్
37. ఐఆర్ఆర్ఐ ఎక్కడ ఉంది?
1) మనీలా 2) ఒడిశా
3) ఇక్రిశాట్ 4) అమెరికా
38. బ్రాన్ ఆయిల్‌ను ఏ ధాన్యం నుంచి తీస్తారు?
1) నువ్వులు 2) పొద్దు తిరుగుడు
3) వరి 4) కుసుమ
39. ప్రస్తుతం రొట్టెల తయారీకి ప్రముఖ కంపెనీలు గోధుమ పిండిలో ఉపయోగిస్తున్న గోధుమ రకం?
1) ట్రిటికమ్ వల్గేర్ 2) ట్రిటికమ్ డైకోకమ్
3) ట్రిటికమ్ మోనోకోకమ్ 4) ట్రిటికమ్ ఎస్టీవమ్
40. వరి నుంచి ఏ దేశంలో సాకీ అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తారు?
1) జపాన్ 2) ఇండియా 3) చైనా 4) మెక్సికో
41. ‘గ్రేట్ మిల్లెట్’ అని దేనికి పేరు?
1) సజ్జలు 2) రాగులు 3) జొన్నలు 4) కొర్రలు
42. అతి పురాతన చిరుధాన్యాల పంట?
1) సజ్జలు 2) రాగులు 3) జొన్నలు 4) కొర్రలు
43. చిరుధాన్యాల్లో నిల్వ ఉండే ఆహార పదార్థం?
1) సుక్రోజ్ 2) మాల్టోజ్
3) రిబ్యులోజ్ 4) రైబోజ్
44. అపరాలు ఎక్కువగా పండిస్తున్న దేశం?
1) చైనా 2) జపాన్
3) అమెరికా 4) ఇండియా
45. కొబ్బరి నీరు దేని రూపాంతరం?
1) సంయుక్త బీజం 2) సంయోగ బీజం
3) అంకురచ్ఛదం 4) పైవన్నీ
46. కిందివాటిలో ఐరాస శతాబ్ది వృక్షంగా ఏ మొక్కను గుర్తించింది?
1) కొబ్బరి 2) మర్రి 3) రావి 4) వేప
47. సిసాల్ హెంప్ అని దేనికి పేరు?
1) పత్తి 2) కిత్తనార 3) కొబ్బరి 4) అరటి
48. బ్రూసిన్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి వస్తుంది?
1) నక్స్‌వామిక 2) వింకారోజియా
3) పుంగామియా 4) ప్లాక్స్గ్లౌవ్
49. ఒక టన్ను పేపర్ తయారీకి అవసరమయ్యే వృక్షాల సంఖ్య?
1) 5 2) 7 3) 10 4) 17
50. తన జీవిత కాలంలో ఒకేసారి పుష్పించే మొక్క?
1) వెదురు 2) సుబాబుల్
3) పైనస్ 4) 1, 2
51. కిందివాటిలో మన దేశంలో పెరుగుతున్న జనాభాకు కావాల్సిన, సరిపడా ఆహారం అందించే మార్గం?
1) పంటలు, పశుపోషణ ఉత్పత్తి సామర్థ్యం పెంచడం.
2) వ్యవసాయ భూమిని పెంచడం.
3) ఆధునిక వంగడాల ఎన్నిక 4) పైవన్నీ
52. కిందివాటిలో పశుగ్రాసాలను ఎన్నుకోండి.
1) బెర్సిన్ 2) ఓట్స్
3) సూడాన్ 4) పైవన్నీ
53. మొక్కల పెరుగుదల, పుష్పించడం దేనిపై ఆధారపడి ఉంటుంది?
1) లవణాలు 2) సూర్యకాంతి
3) ఉష్ణోగ్రత 4) నీటిలభ్యత
54. కిందివాటిలో భిన్నమైంది?
1) పత్తి 2) పెసలు
3) సోయాబీన్స్ 4) అవిసెలు
55. భారతదేశంలో 1952 నుంచి 2010 వరకు కేవలం 25% భూమి పెరిగితే ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది?
1) 4 2) 5 3) 6 4) 8
56. ఇసుక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేవి?
1) రసాయన ఎరువులు 2) సేంద్రియ ఎరువులు
3) స్థూల పోషకాలు 4) పైవన్నీ
57. కిందివాటిలో కలుపు మొక్క?
1) పార్దీనియా 2) జాంథియం
3) వంజ 4) పైవన్నీ
58. జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) ను కనుక్కున్నవారు?
1) సుభాష్ పాలేకర్ 2) ఆనంద చక్రవర్తి
3) అలెగ్జాండర్ పార్క్స్ 4) 1, 2
59. కిందివాటిలో కలుపు నివారణ పద్ధతి?
1) సరైన విత్తనం 2) సీడ్ బెడ్
3) అంతర పంటలు 4) పైవన్నీ
సమాధానాలు
1-3; 2-2; 3-4; 4-1; 5-3; 6-1; 7-2; 8-3; 9-3; 10-1; 11-1; 12-4; 13-3; 14-2; 15-4; 16-1; 17-3; 18-1; 19-2; 20-3; 21-1; 22-3; 23-1; 24-3; 25-2; 26-3; 27-1; 28-3; 29-2; 30-4; 31-1; 32-3; 33-2; 34-1; 35-2; 36-4; 37-1; 38-3; 39-4; 40-1; 41-3; 42-1; 43-2; 44-4; 45-3; 46-4; 47-2; 48-1; 49-4; 50-4; 51-1; 52-4; 53-2; 54-4; 55-1; 56-2; 57-4; 58-1; 59-4.
రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం