• facebook
  • whatsapp
  • telegram

శక్తివనరులు  

పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో రాజస్థాన్‌ ముందంజ!

ఆధునిక కాలంలో శక్తివనరులు లేకుండా మనుగడ సాధ్యం కాదు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలన్నింటికీ అవే ఆధారం.  దేశ ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా పనిచేస్తాయి.సంప్రదాయ, సంప్రదాయేతర శక్తివనరులుగా అందుబాటులో ఉండే వాటి లభ్యత తీరు, ఉత్పత్తి, వినియోగం తదితరాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విద్యుత్తు ఉత్పత్తి వనరులు, చమురుశుద్ధి కర్మాగారాలు, పునరుత్పాదక శక్తి ఉత్పత్తికి ఎక్కువ అనుకూలతలు ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాలవారీగా గణాంకాలు, సామర్థ్యాలు, పురోగతి గురించి తెలుసుకోవాలి.

1. కిందివాటిలో ఏ రకమైన బొగ్గులో కార్బన్‌ 95% పైగా ఉంటుంది?

1) ఆంథ్రసైట్‌   2) గ్రాఫైట్‌    3) బిట్యూమనస్‌   4) కోక్‌


 

2. భారతదేశంలో 2022, ఏప్రిల్‌ 1 నాటికి ఎన్ని బిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి?

1) 361.41   2) 371.71    3) 351.51   4) 381.41




3. బొగ్గు నిల్వల్లో 2020- 2021 నుంచి 2021-2022కు ఎంత శాతం పెరుగుదల ఉంది?

1) 3.64   2) 3.84   3) 2.64   4) 4.64


 


4.  భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్‌-2023 ప్రకారం బొగ్గు నిల్వల్లో మొదటి స్థానంలోని రాష్ట్రం ఏది?

1) ఝార్ఖండ్‌   2) ఒడిశా   3) ఛత్తీస్‌గఢ్‌  4) కర్ణాటక


 

5. భారతదేశంలో 2022, ఏప్రిల్‌ 1 నాటికి మొత్తం లిగ్నైట్‌ రకం బొగ్గు నిల్వలు ఎన్ని బిలియన్‌ టన్నులు?

1) 56.20    2) 36.20    3) 46.20    4) 58.20


6.  కిందివాటిలో ఏ రకమైన బొగ్గు నిల్వలు  తమిళనాడులో అధికంగా ఉన్నాయి?

1) కోక్‌    2) గ్రాఫైట్‌   3) లిగ్నైట్‌    4) పీట్‌ 


7. భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్‌-2023 ప్రకారం 2022, ఏప్రిల్‌ 1 నాటికి ముడిచమురు నిల్వలు ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 651.77    2) 671.77   3) 658.58    4) 641.71


 


8.  భారతదేశంలో 2022, ఏప్రిల్‌ 1 నాటికి సహజ   వాయువు నిల్వలు ఎన్ని బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు?

1) 1048.37      2) 1138.67    3) 1248.71    4) 1448.17


 


9.  దేశంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2022, మార్చి 31 నాటికి ఎన్ని మెగా వాట్లుగా ఉంది?

1) 15,90,447     2) 14,10,997  3) 14,90,727     4) 12,09,777


 


10. దేశంలో 2022, మార్చి 31 నాటికి సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఎన్ని మెగావాట్లు?

1) 7,48,990     2) 7,58,990    3) 8,78,990     4) 6,90,941


11. పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2022, మార్చి 31 నాటికి మన దేశంలో ఎన్ని మెగావాట్లు?

1) 6,59,505     2) 6,95,509     3) 7,59,109     4) 8,60,901


 

12. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి జీవ ద్రవ్యరాశి శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఎన్ని మెగావాట్లు?

1) 15,335      2) 14,445    3) 17,538     4) 18,338


13. కిందివాటిలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) రాజస్థాన్‌   2) గుజరాత్‌  3) కర్ణాటక   4) మధ్యప్రదేశ్‌ 




14. దేశంలోని మొత్తం పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో గుజరాత్‌ ఎన్ని మెగావాట్లు ఉత్పత్తి చేస్తోంది?

1) 2,71,219    2) 1,80,215    3) 1,90,210   4) 2,50,335


 


15. దేశంలో 2022, మార్చి 31 నాటికి మొత్తం పునరుత్పాదక శక్తిలో కర్ణాటక ఎంత శాతం ఉత్పత్తి చేస్తుంది?

1) 10.3    2) 11.3    3) 12.3    4) 14.3


 

16. మనదేశంలో 2022, మార్చి 31 నాటికి మొత్తం పునరుత్పాతక శక్తి ఉత్పత్తిలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి?

ఎ)  రాజస్థాన్‌     బి) గుజరాత్‌     సి) కర్ణాటక     డి) మహారాష్ట్ర

1) ఎ, బి  2) బి, సి 3) బి, డి  4) డి, ఎ

17. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి మొత్తం పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్,   తెలంగాణాల ఉత్పత్తి శాతాలు వరుసగా..

1) 7.70, 5.95    2) 6.60, 5.50     3) 8.80, 7.10    4) 5.40, 7.70




18. దేశంలో మొత్తం పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో రాజస్థాన్‌ అత్యధికంగా ఎంత శాతం కలిగి ఉంది?

1) 12.09    2) 11.09    3) 18.19    4) 17.19




19. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-2022 (P) సంవత్సరంలో మొత్తం పెట్రోల్‌ వినియోగం ఎంత శాతం?

1) 12    2) 15    3) 10    4) 9 





20. దేశంలో 2022, మార్చి 31 నాటికి ఎన్ని చమురుశుద్ధి కర్మాగారాలు ఉన్నాయి?

1) 25    2) 24    3) 22    4) 23




21. మన దేశంలో 2022, మార్చి 31 నాటికి మొత్తం చమురు శుద్ధి కర్మాగారాల్లో ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉన్నాయి?

1) 19     2) 20    3) 10    4) 11




22. దేశంలో 2022, ఏప్రిల్‌ 1 నాటికి ముడిచమురు నిల్వల్లో అస్సాంలో ఎంత శాతం ఉంది?

1) 18.1    2) 22.8   3) 15.9   4) 20.1





23. భారతదేశంలో 2022, ఏప్రిల్‌ 1 నాటికి సహజవాయు నిల్వల్లో అస్సాంలో ఎంత శాతం ఉంది?

1) 29.6     2) 13.4    3) 14.5    4) 23.6





24. మనదేశంలో ముడిచమురు నిల్వల్లో 2022, ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత శాతం ఉంది?

1) 1.7    2) 0.4    3) 22.8    4) 15.9


 



25. మన దేశంలో పునరుత్పాదక శక్తిలో 2022, మార్చి 31 నాటికి సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఎంత శాతం?  

1) 46.60     2) 50.24    3) 42.01    4) 54.44





26. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి  పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో పవన విద్యుత్తు ఎంత శాతం ఉంది?

1) 42.01    2) 51.14    3) 46.66    4) 50.24



 

27. భారతదేశంలో 2022, మార్చి 31 నాటికి మొత్తం పునరుత్పాదక శక్తిలో జమ్ము-కశ్మీర్‌లో ఎంత శాతం ఉత్పత్తి అవుతుంది?

 1) 7.70    2) 5.75   3) 8.75  4) 7.57


28. మన దేశంలోని మొత్తం చమురుశుద్ధి కర్మాగారాల్లో ప్రైవేట్, ఉమ్మడి రంగాల్లో ఎన్ని ఉన్నాయి?

1) 6    2) 7    3) 4    4) 5



29. భారతదేశంలో చమురుశుద్ధి కర్మాగారాల సామర్థ్యం 2021, మార్చి 31 నాటికి ఏడాదికి ఎన్ని టీఎంటీలు?

1) 2,51,216   2) 2,61,650   3) 3,16,640   4) 2,71,750


 



30. కింది ఏ ప్రాంతంలో 2022, మార్చి 31 నాటికి అత్యధికంగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది?

1) పశ్చిమ ప్రాంతం  2) తూర్పు ప్రాంతం   3) ఉత్తర ప్రాంతం   4) దక్షిణ ప్రాంతం




31. భారతదేశం దక్షిణ ప్రాంతంలో ఎంత శాతం విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది?

1) 34    2) 28    3) 26    4) 31





32. కర్ణాటకలో అత్యధికంగా ఎంత శాతం జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది (గిగావాట్లలో)?

1) 2.73    2) 4.43   3) 3.63   4) 2.93





33. రాజస్థాన్‌లోని పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఎంత (గిగావాట్లలో)?

1) 10.70    2) 17.70    3) 16.70    4) 11.43



34. భారతదేశంలోని ఏ రాష్ట్రం పునరుత్పాదక శక్తిలో అధిక వృద్ధి రేటు నమోదు చేసింది?

1) గుజరాత్‌       2) రాజస్థాన్‌     3) మహారాష్ట్ర     4) కర్ణాటక



35. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం 2022, మార్చి 31 నాటికి దేశంలోని విద్యుత్తు ఉత్పత్తిలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది?

1) 5    2) 3    3) 1   4) 2



36. భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) నాటికి బొగ్గు ఉత్పత్తి ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 717.18   2) 778.19   3) 710.18    4) 707.10

37. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2021-22 (P) నాటికి బొగ్గు ఉత్పత్తిలో పెరుగుదల శాతం ఎంత?

1) 7.67%      2) 9.67%   3) 8.67%      4) 6.67%


38. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశంలో లిగ్నైట్‌ రకం బొగ్గు ఎన్ని మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అయ్యింది?

1) 37.39        2) 47.49    3) 57.59        4) 27.79



39. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2020-21, 2021-22 (P) మధ్య కాలంలో లిగ్నైట్‌ రకం బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతం?

1) 24.32     2) 22.34    3) 25.32    4) 26.62




40. మనదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) సంవత్సరంలో ముడిచమురు ఉత్పత్తి ఎన్నిమిలియన్‌ టన్నులు?

1) 29.69    2) 39.29    3) 49.29    4) 30.19



41. భారతదేశంలో 2020-21, 2021-22 (P) సంవత్సరాల మధ్య కాలంలో ముడిచమురు ఉత్పత్తుల్లో తగ్గుదల శాతం ఎంత?

1) 3.63    2) 2.63   3) 4.17   4) 1.17



42. భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులు 2021-22 (P) ఏడాదికి ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 254.31    2) 233.41    3) 211.74    4) 261.51


43. భారతదేశంలో 2020-21, 2021-22 (P) సంవత్సరాలకు మధ్య పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదల ఎంత శాతం?

1) 8.90   2) 7.91   3) 4.41   4) 9.91


 


44. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం మన దేశంలో మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో 2021-22 (P) ఏడాదికి హైస్పీడ్‌ డీజిల్‌ ఉత్పత్తి శాతం ఎంత?

1) 42     2) 48     3) 41     4) 44


 


45. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P)  నాటికి మన దేశంలో లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) ఉత్పత్తి ఎంత శాతం?

1) 4    2) 6    3) 7    4) 5


 


46. భారతదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) సంవత్సరానికి వ్యవసాయ రంగంలో విద్యుత్తు వినియోగం ఎంత శాతం?

1) 26     2) 18     3) 41    4) 35


47. మనదేశంలో ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) లో అత్యధికంగా కింది ఏ రంగంలో విద్యుత్తును వినియోగించారు?

1) వ్యవసాయం   2) రైల్వే    3) పారిశ్రామిక   4) ఇతర రంగాలు


48. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) లో పారిశ్రామిక రంగ విద్యుత్తు వినియోగం ఎంత శాతం?

1) 18   2) 41   3) 26   4) 35

49. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) లో ఎల్‌పీజీ వినియోగం ఎంత శాతం?

1) 17   2) 10  3) 14   4) 11



50. ఎనర్జీ స్టాటిస్టిక్స్, 2023 ప్రకారం 2021-22 (P) లో హైస్పీడ్‌ డీజిల్‌ ఆయిల్‌ వినియోగం ఎంత శాతం?

1) 35   2) 38   3) 31  4) 32


సమాధానాలు

1-4; 2-1; 3-3; 4-2; 5-3; 6-3; 7-1; 8-2; 9-3; 10-1; 11-2; 12-3; 13-1; 14-2; 15-1; 16-3; 17-1; 18-3; 19-2; 20-4; 21-1; 22-2; 23-3; 24-1; 25-2; 26-3; 27-4; 28-3; 29-1; 30-1; 31-2; 32-3; 33-3; 34-2; 35-3; 36-2; 37-3; 38-2; 39-3; 40-1; 41-2; 42-1; 43-1; 44-2; 45-4; 46-2; 47-3; 48-2; 49-3; 50-2.

 

 

 

 

 

 

రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 13-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు