• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ విద్యా చరిత్ర


‘సత్యాన్వేషణ చేసేదే విద్య’

ప్రాచీన కాలం నుంచి విద్య నేర్చుకోవడం వివిధ రీతుల్లో సాగింది. వినడం, వల్లె వేయడం, మననం చేసుకోవడం, అనుకరించడం తదితర పద్ధతుల నుంచి ఆధునిక విధానాల వరకు అనేక రకాలుగా పరిణామం చెందింది. సత్వాన్వేషణ చేయడం విద్య పరమావధిగా నిలిచింది. సత్ప్రవర్తన, మానసిక బలం, స్వతంత్రత  లక్ష్యాలుగా మారాయి. ఈ నేపథ్యంలో వేదకాలం నుంచి విద్యాభ్యాసం తీరుతెన్నులు, సంబంధిత ఉత్సవాలు, విద్యాలయాల ఏర్పాటు, ఆచరణాత్మక బోధన మొదలైన అంశాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.  


1. బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు ఎన్ని సంవత్సరాలు?

1) 4     2) 6     3) 8     4) 12 


2. ఎవరి విద్యావిధానంలో ‘పబ్బజ్జ’ అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య ఆరంభమవుతుంది?    

1) వేద విద్య       2) బౌద్ధ విద్య  3) ఇస్లాం విద్య      4) క్రైస్తవ విద్య 


3. మధ్యయుగం నాటి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి పాఠశాలను ఏమని పిలుస్తారు?

1) మక్తబ్‌  2) మదరసా  3) బిస్మిల్లా  4) పబ్బజ్జ


4. ఇస్లాం విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయసు?

1) 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు    2) 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు  3) 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు   4) 6 సంవత్సరాల 6 నెలల 6 రోజులు


5. బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు?

1) అంతేవాసి  2) గురువులవాసి  3) మౌల్వి  4) సమనేరులు


6. వేద విద్యావిధానంలో ఉండే విద్యా పద్ధతి వాచక పద్ధతి. ఇందులోని మూడు దశల్లో ఒకటి కానిది?

1) శ్రవణం   2) మననం  3) నిధి ధ్యాసనం  4) ఉపవాచకం


7. జైనుల బోధనా విధానం ఏది?

1) అనుకరణ      2) వైయుక్తిక అభ్యసనం     3) వల్లె వేయడం    4) పైవన్నీ


8. వేద విద్యావిధానంలో ప్రస్తావించిన అపర విద్య అంటే?

1) ముక్తి, మోక్షానికి ఉపయోగపడే విద్య    2) ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడే విద్య   3) వల్లె వేసే విద్యా విధానం    4) పరులకు అందించే విద్య


9. భారత్‌లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా విధానం?

1) జైన విద్యా విధానం  2) బౌద్ధ విద్యా విధానం  3) ఇస్లాం విద్యా విధానం      4) వేద విద్యా విధానం


10. బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి?

1) ప్రశ్నోత్తర, చర్చ, సంభాషణ   2) రాత పద్ధతి    3) ఆచరణాత్మక పద్ధతి   4) పైవన్నీ


11. చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలో విద్యబోధన చేసిన వారిలో ఆద్యులు?

1) బౌద్ధులు   2) వైదికులు   3) ముస్లింలు      4) ఆంగ్లేయులు


12. ‘భారతదేశంలోని పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక అల్మారాకు కూడా సరిపోవు’ అని పేర్కొన్నదెవరు?    

1) ఉడ్‌        2) లార్డ్‌ మెకాలే   3) హంటర్‌     4) చార్లెస్‌ గ్రాంట్‌


13. వేద విద్యా విధానంలో విద్యార్థి దశ దిగువ పేర్కొన్న ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? 

1) పబ్బజ్జ      2) సమవర్త ఉత్సవం 3) ఉపనయనం      4) అహిష్మికం


14. బౌద్ధ విద్యా విధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు?

1) ఉపనయనం      2) పరిషత్‌  3) ఉపసదస్సు        4) సమ్మేళనం


15. ఇస్లామిక్‌ విద్యా నిర్వహణలో ఉన్నత స్థాయి పాఠశాల?

1) మక్తబ్‌      2) దర్గా  3) మదరసా ఐల       4) మదరసా


16. ముస్లిం బాలిక విద్యాలయంలో చేరేటప్పుడు జరిపే ఉత్సవం?

1) జార్ఫీపాని       2) ఇలాహి  3) బిస్మిల్లా      4) మక్తబ్‌


17. వేద కాలంలో సమస్త జ్జానానికి కేంద్ర బిందువు?

1) దేవుడు      2) గురువు  3) ఆశ్రమం      4) విద్యాలయం


18. వృత్తి, పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం?

1) వేద విద్య      2) బౌద్ధ విద్యా విధానం   3) జైన విద్యా విధానం     4) ఇస్లాం విద్యా విధానం


19. వేద విద్యా విధానంలో విద్యార్థి దశ ముగింపును తెలియజేసే ఉత్సవం?

1) ఉపనయనం      2) పబ్బజ్జ  3) సమవర్తన ఉత్సవం      4) ఉపసదస్సు


20. వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి?

1) ఆశ్రమం      2) పరిషత్‌  3) సమ్మేళనం      4) గురుకులం


21. వేద కాలంలో విద్యాబోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది?    

1) సంస్కృత  2) ప్రాకృత  3) హిందీ  4) గ్రీకు


22. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం?

1) సంస్కృత, తమిళ భాషలు  2) పాళీ, ప్రాకృతం భాషలు   3) పాళీ, సింధు భాషలు   4) సంస్కృతం, హిందీ భాషలు


23. వేదకాల అనంతరం వివిధ క్రతువులు ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు?

1) హోత్రి  2) ఉద్ఘాత  3) ఆధ్వర్య 4) బ్రహ్మణ్‌


24. ఉపనిషత్తుల కాలంలో శిష్యులకు ఉండే ఆచరణాత్మక విద్య?

1) యజ్ఞం, సంగీతం నేర్చుకోవడం   2) భిక్షాటన, నేల సాగు   3) ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకోవడం   4) పైవన్నీ


25. మంత్రాలను ఒకసారి విని గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు?

1) శ్రుతదరులు      2) బ్రహ్మవాదినులు  3) త్రియాదవులు      4) సంహితులు


26. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు?

1) కౌసల్య      2) పరిపూర్ణ      3) విద్యావాదిని      4) బ్రహ్మవాదిని


27. వేదకాలంలో ఆవు పాలు పితికే విద్య నేర్చిన అమ్మాయిలను ఏమని పిలిచేవారు?

1) దుద్దారు      2) దుహిత   3) దుగ్గహిత      4) గౌహిత 


28. విద్య భావనకు సంబంధించిన శిక్ష అనే పదం సంస్కృత మూలమైన క్లాస్‌ నుంచి గ్రహించారు. క్లాస్‌ అంటే?

1) బోధించడం      2) నేర్పడం  3) నియంత్రించడం  4) బోధించడం, నేర్పడం, నియంత్రిచడం


29. ‘ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపు దిద్దుకుంటుందో, మానసిక బలం పెరిగి విస్తరిస్తుందో, తద్వారా వ్యక్తులు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారో అలాంటి విద్య మనకు కావాలి’ అని ప్రబోధించినవారు?

1) మహాత్మా గాంధీ     2) అరవిందుడు  3) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌  4) స్వామి వివేకానందుడు


30. 1976లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు?

1) 41వ   2) 42వ   3) 43వ   4) 44వ


31. ఉచిత విద్యావిధానం ఎవరి ముఖ్య లక్షణం?

1) బౌద్ధ విద్యా విధానం     2) ముస్లిం విద్యా విధానం   3) క్రైస్తవ విద్యా విధానం   4) హైందవ విద్యా విధానం


32. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది?

1) నలంద  2) తక్షశిల  3) విక్రమశిల  4) నాగార్జునకొండ


33. ‘గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం’ అన్నది?

1) అరవింద్‌ ఘోష్‌  2) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 3) అరవిందుడు  4) వివేకానందుడు


34. వారసత్వ లక్షణాలు విచారించిన తర్వాత విద్యను అందించే విధానం?

1) బౌద్ధ విద్యా విధానం  2) ముస్లిం విద్యా విధానం   3) హైందవ విద్యా విధానం    4) పైవన్నీ


35. విద్యార్థులు తమకు వచ్చిన సందేహాలను చర్చా పద్ధతి ద్వారా నివృతి చేసుకోవడంలో దేనికి సంబంధించింది?

1) మననం      2) నిధి ధ్యాసనం  3) శ్రవణం      4) పైవన్నీ


36. లాటిన్‌ భాషలో ఎడ్యుకేషన్‌ అంటే అర్థం?

1) వృద్ధిలోకి తేవడం     2) దారి చూపడం  3) ముందుకు చూపడం      4) పైవన్నీ  


37. ‘విద్య అంటే దారి చూపడం’ అని తెలిపింది?

1) శంకరాచార్యులు      2) రుగ్వేదం  3) ఉపనిషత్తులు      4) భగవద్గీత


38. ‘అల్ప సంఖ్యాకులు వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు’ అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధన?

1) 25    2) 29    3) 15    4) 14


39. చార్లెస్‌ గ్రాంట్‌ అబ్జర్వేషన్‌ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఏ చర్యలు తీసుకోవాలని పేర్నొన్నారు?

1) ఆంగ్లం      2) విద్యను అందించడం  3) క్రైస్తవం వ్యాప్తి      4) పైవన్నీ


40. ఎవరి విద్యావిధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది?

1) జైన విద్య      2) ఇస్లాం విద్య  3) క్రైస్తవ విద్య      4) బౌద్ధ విద్య


41. కిందివాటిలో వేద విద్య లక్షణం? 

1) మోక్షానికి దారి చూపడం    2) ఉచిత విద్య  3) అందరికీ విద్య           4) నైతిక విద్య


42. ‘సత్యాన్వేషణ చేసేదే విద్య’ అన్నదెవరు?

1) సోక్రటీస్‌ 2) ప్రోబెల్‌ 3) ప్లేటో 4) ఎమర్సన్‌


43. జైన మతంలోని పంచ మహావ్రతాల్లో లేనిది ఏది?

1) ధర్మం      2) అహింస      3) అస్తేయం      4) బ్రహ్మచర్యం


44. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య ఎవరి విద్యా విధానంలో భాగం?

1) వేద విద్య       2) బౌద్ధ విద్య  3) జైన విద్య      4) ఇస్లాం విద్య


45. వర్ణ వ్యవస్థ ఎవరి విద్యా విధానంలో ఎక్కువ ప్రభావం చూపింది?

1) వేద విద్య      2) బౌద్ధ విద్య  3) జైన విద్య     4) ఇస్లాం విద్య


46. Educare, Educere అనేవి ఏ భాష పదాలు?

1) గ్రీకు  2) ఆంగ్లం  3) లాటిన్‌  4) ఫ్రెంచ్‌


47. త్రిధ్రువ విధాన ప్రక్రియను ప్రతిపాదించిన విద్యావేత్త?

1) జాన్‌ ఆడమ్స్‌      2) జాన్‌ డ్యూయీ     3) జాన్‌ అబ్రహం      4) విల్సన్‌


48. కిందివాటిలో సమకాలిన విద్యాధేయాలకు సంబంధించి సరికానిది ఏది?

1) పౌరసత్వం కోసం విద్య      2) ప్రపంచ శాంతి కోసం విద్య   3) ప్రజాస్వామ్యం కోసం విద్య   4) వృత్తి కోసం విద్య


49. ఏ విధానంలో లక్ష్యాలు, ప్రణాళిక ఉంటాయి. కానీ, నియమ నిబంధనలు సరళంగా ఉంటాయి?

1) నియత విద్య  2) నిరంతర విద్య  3) యాదృచ్ఛిక విద్య      4) ఏదీకాదు



సమాధానాలు: 1-3; 2-2; 3-1; 4-2; 5-4; 6-4; 7-4; 8-2; 9-3; 10-4; 11-1; 12-2; 13-3; 14-3; 15-4; 16-1; 17-2; 18-2; 19-3; 20-2; 21-1; 22-2; 23-3; 24-4; 25-1; 26-4; 27-2; 28-4; 29-4; 30-2; 31-1; 32-2; 33-3; 34-3; 35-1; 36-1; 37-3; 38-4; 39-4; 40-4; 41-2; 42-1; 43-1; 44-3; 45-1; 46-3; 47-2; 48-4; 49-2. 

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌