• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ విద్యాచరిత్ర

(స్వాతంత్య్రం అనంతర కమిటీలు - కమిషన్లు)

గ్రామీణ ప్రతిభావంతులకు నవోదయ పాఠశాలలు!

దేశంలో ప్రాచీన కాలం నుంచి ప్రామాణిక విధానాలతో కొనసాగుతూ వచ్చిన సంప్రదాయ విద్య, బ్రిటిష్‌ కాలంలో దెబ్బతింది. స్వాతంత్య్రం తర్వాత సరిదిద్దే ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలో, నియంత్రణలో  విద్య ఉంది.  ప్రాథమిక స్థాయి విద్యాసంస్థలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి, తొలుత విద్యను రాష్ట్రాల జాబితాలో చేర్చారు. విద్యా విధానాలు, ప్రణాళికలు, బోధనా శైలిలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు బాగా పెరిగిపోవడంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి మార్చారు. దేశవ్యాప్తంగా చదువుల్లో ఏకరీతి, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం ఎప్పటికప్పుడు జాతీయ విద్యావిధానాలు అమలవుతూ ఉన్నాయి. విద్యా సంబంధ కార్యక్రమాలు, విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు కేంద్రం వివిధ కమిటీలు, కమిషన్లను ఏర్పాటు చేసింది. వీటి గురించి అభ్యర్థులు  తెలుసుకోవాలి. కమిటీలు చేసిన ముఖ్యమైన సిఫార్సులు, బోధనారీతులు, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థులను తీర్చిదిద్దే తీరులో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలి.

1. ‘Towards an enlightened and human society' నివేదిక ఉన్న కమిటీ ఏది?

1) జాతీయ విద్యావిధానం - 1986    2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) మాల్కం ఆదిశేషయ్య కమిటీ  4) ఆచార్య రామ్మూర్తి కమిటీ


2.     ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 4 : 1 నుంచి 2 : 1కి పెంచాలని సూచించిన కమిటీ ఏది?

1) మాల్కం ఆదిశేషయ్య కమిటీ  2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ 4) జాతీయ విద్యా విధానం - 1986 


3.     విద్యతో పాటు వృత్తిపరమైన బోధనకు ప్రాధాన్యం ఇచ్చిన కమిటీ ఏది?

1) జాతీయ విద్యా విధానం - 1986    2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ 4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ


4.     ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సాధారణ పాఠశాలలోని సమ్మిళిత విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?

1) జాతీయ విద్యా విధానం - 1986    2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ 

3) జనార్దన్‌ రెడ్డి కమిటీ  4) ఆచార్య రామ్మూర్తి కమిటీ


5.     నల్లబల్ల పథకాన్ని ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించాలని పేర్కొన్న కమిటీ ఏది?

1) మాల్కం ఆదిశేషయ్య కమిటీ  2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ  4) జాతీయ విద్యా విధానం - 1986 


6.     బహుళ భాషా నిఘంటువులను రూపొందించి విద్యలో గుణాత్మకతను పెంచాలని చెప్పిన కమిటీ ఏది?

1) జాతీయ విద్యా విధానం - 1986  2) జనార్దన్‌ రెడ్డి కమిటీ 

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ    4) మాల్కం ఆదిశేషయ్య కమిటీ


7.     యశ్‌పాల్‌ కమిటీని ఎప్పుడు నియమించారు?

1) 1978  2) 1983  3) 1992  4) 1990


8.  ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలని ఎవరు సూచించారు?

1) జాతీయ విద్యావిధానం - 1986    2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ 

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ    4) జనార్దన్‌ రెడ్డి కమిటీ


9.     జాతీయ విద్యా విధానం - 1986 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 11 ఏళ్లు నిండిన పిల్లలందరూ ఐదు సంవత్సరాల పాఠశాల విద్య గడపాలని సూచించింది.

1) 1991  2) 1990  3) 1995  4) 1994


10. సమ్మిళిత విద్య దేనికి అనుగుణ్యం?

1) బాలల హక్కుల కన్వెన్షన్‌ 

2) ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన

3) 1986 జాతీయ విద్యా విధానం సూచనలు 

4) అసమర్థ పిల్లల హక్కుల ప్రకటన


11. జాతీయ విద్యావిధానం - 1986, ఆచరణీయ కార్యక్రమం - 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలు?

1) కేంద్రీయ విద్యాలయాలు     2) పబ్లిక్‌ పాఠశాలలు

3) నవోదయ పాఠశాలలు         4) రెసిడెన్షియల్‌ పాఠశాలలు


12. ‘‘ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందులోని వృత్తి పూర్వక వృత్యంతరాలు లేనిది’’ అని ప్రకటించింది-

1) జాతీయ విద్యావిధానం - 1986

2) ఉపాధ్యాయుల జాతీయ కమిషన్‌ 

3) సెకండరీ విద్యా కమిషన్‌ నివేదిక

4) విశ్వవిద్యాలయ విద్యా కమిషన్‌ నివేదిక


13. మనిషిని జాతీయ వనరుగా భావించకుండా అతడిలోని మానవత్వాన్ని వెలికితీసే విధంగా విద్యా విధానం ఉండాలని సూచించింది ఎవరు?

1) జాతీయ విద్యా విధానం - 1986 2) జాతీయ విద్యా విధానం - 1968 

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ      4) కొఠారి కమిషన్‌


14. 1993లో యశ్‌పాల్‌ కమిటీ ఏ పేరుతో కేంద్రానికి నివేదిక సమర్పించింది?

1) భారం ఉన్న అభ్యసనం    2) భారం లేని అభ్యసనం 

3) ఒత్తిడి ఉన్న అభ్యసనం     4) ఒత్తిడి లేని అభ్యసనం


15. ప్రాథమిక తరగతుల్లో ఎలాంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించరాదని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) యశ్‌పాల్‌ కమిటీ        2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ  4) కొఠారి కమిషన్‌


16. 1986 జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడం కోసం తీసుకొచ్చిన ఆచరణ కార్యక్రమాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?

1) 1991   2) 1992    3) 1993   4) 1994


17. ఏ కార్యక్రమంలో భాగంగా జిల్లా బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు?

1) జాతీయ విద్యావిధానం - 1986    2) ఆచరణాత్మక కార్యక్రమం - 1992

3) సవరించిన కార్యక్రమం - 1992  4) జాతీయ విద్యా విధానం - 1968


18. పాఠ్యప్రణాళిక నిర్మాణంలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చోటు ఉండాలని సూచించిన విద్యా కమిషన్‌?

1) ఆచార్య రామ్మూర్తి కమిషన్‌    2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) కొఠారి కమిషన్‌    4) యశ్‌పాల్‌ కమిటీ


19. వృత్తి పూర్వక, వృత్యంతర విద్యను వేరుచేసి చూడలేం. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఇవ్వడానికి D.IET లు స్థాపించాలి’ అని పేర్కొంది?

1) జాతీయ విద్యా విధానం - 1968 2) జాతీయ విద్యా విధానం - 1986

3) ఆచరణాత్మక కార్యక్రమం - 1992    4) కొఠారి కమిషన్‌


20. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించి, పూర్వ ప్రాథమిక విద్యను ఆదేశిక సూత్రాల్లో పొందుపరచాలని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) కొఠారి కమిషన్‌    2) యశ్‌పాల్‌ కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిషన్‌    4) జనార్దన్‌ రెడ్డి కమిటీ


21. 1986 జాతీయ విద్యా విధానాన్ని పరిశీలించి ఆచరణాత్మక సిఫార్సులు చేయమని నియమించిన విద్యా కమిషన్‌?

1) జనార్దన్‌ రెడ్డి కమిటీ    2) ఆచార్య రామ్మూర్తి కమిటీ

3) ఆచరణాత్మక కార్యక్రమం - 1992    4) చతుర్వేది కమిటీ


22. పాఠశాల లేని ప్రాంతాల్లో శిక్షా కర్మిని నియమించి ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్న విద్యా కమిషన్‌?

1) ఆచార్య రామ్మూర్తి కమిటీ    2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) కొఠారి కమిషన్‌    4) యశ్‌పాల్‌ కమిటీ


23. ఇంటర్‌ స్థాయిలో సెమిస్టర్‌ విద్యా విధానాన్ని కొనసాగించాలని సూచించింది?

1) మాల్కం ఆదిశేషయ్య కమిటీ    2) జాతీయ విద్యా విధానం - 1986

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ    4) జనార్దన్‌ రెడ్డి కమిటీ


24. ‘‘భారతదేశానికి రాజీవ్‌గాంధీ ఇచ్చిన వీలునామా.’’ అని పి.వి.నరసింహారావు దేనిని పేర్కొన్నారు?

1) జాతీయ విద్యావిధానం - 1986    2) యశ్‌పాల్‌ కమిటీ

3) ఆచరణాత్మక కార్యక్రమం - 1992  4) జనార్దన్‌ రెడ్డి కమిటీ


25. యశ్‌పాల్‌ కమిటీలోని సభ్యుల సంఖ్య?

1) 5      2) 7     3) 6      4) 8

26. ప్రతి రెండు ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని సూచించింది?

1) ఆచార్య రామ్మూర్తి కమిటీ    2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) మాల్కం ఆదిశేషయ్య కమిటీ    4) జాతీయ విద్యా విధానం - 1986


27. శిక్షా కర్మి అంటే...

1) విద్యాసంస్థలు    2) బోధన ఉపకరణాలు

3) విద్యా సహాయకులు    4) పైవన్నీ


28. అంగన్‌వాడీ కేంద్రాల్లో నియామకం పొందే వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది?

1) జాతీయ విద్యావిధానం - 1986     2) జనార్దన్‌ రెడ్డి కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ         4) ఆచరణాత్మ కార్యక్రమం - 1992


29. ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలను స్థాపించి వాటి ద్వారా విద్య నిర్వహణ అనేది కొనసాగించాలని ఆచరణాత్మక కార్యక్రమం - 1992 సూచించింది.

1) 71    2) 72    3) 73    4) 74


30. ‘‘21వ శతాబ్దంలోకి అడుగు పెట్టకముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలి’’ అని పేర్కొన్నదెవరు?

1) జాతీయ విద్యా విధానం - 1986    

2) కొఠారి కమిషన్‌   3) జనార్దన్‌ రెడ్డి కమిటీ        4) ఆచరణాత్మక కార్యక్రమం - 1992


31. ప్రాథమిక స్థాయిలో నల్లబల్ల పథకాన్ని అమలు పరచాలని సూచించింది?

1) జనార్దన్‌ రెడ్డి కమిటీ            2) ఆచార్య రామ్మూర్తి కమిటీ

3) జాతీయ విద్యావిధానం - 1986    4) ఆచరణాత్మక కార్యక్రమం - 1992


32. పాఠశాల సముదాయాలు ఏర్పాటు చేసి, సార్వత్రిక విద్యాలక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించింది?

1) ఆచరణాత్మక కార్యక్రమం - 1992        2) మాల్కం ఆదిశేషయ్య కమిటీ

3) ఆచార్య రామ్మూర్తి కమిటీ    4) జనార్దన్‌ రెడ్డి కమిటీ


33. జనార్దన్‌ రెడ్డి కమిటీలోని సభ్యుల సంఖ్య?

1) 14    2) 15    3) 16     4) 17


34. ఆచార్య రామ్మూర్తి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది?

1) 1990, మే 7    2) 1990, జూన్‌ 7 

3) 1991, మే 7     4) 1991, జూన్‌ 7


సమాధానాలు


1-2; 2-2; 3-4; 4-1; 5-2; 6-1; 7-3; 8-1; 9-2; 10-3; 11-3; 12-1; 13-3; 14-2; 15-3; 16-2; 17-2; 18-1; 19-2; 20-3; 21-3; 22-1; 23-1; 24-1; 25-2; 26-2; 27-3; 28-2; 29-3; 30-3; 31-3; 32-4; 33-3; 34-1.


రచయిత: కోటపాటి హరిబాబు
 

Posted Date : 13-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు