• facebook
  • whatsapp
  • telegram

మధ్యయుగ భారతదేశ చరిత్ర

అతడే భారతదేశపు రామచిలుక!


ప్రాచీన, ఆధునిక యుగాలకు మధ్య ఉన్న సుదీర్ఘ కాలమంతా మధ్యయుగమే. అది భారత ఉపఖండం రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరంగా సమూల మార్పులకు గురైన సమయం. స్థూలంగా ఆరో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు భారతదేశ చరిత్రలో మధ్యయుగంగా చెప్పవచ్చు. అప్పట్లో ఉత్తరాదిన రాజపుత్రులు, మొగల్‌ పాలకులు, దక్షిణాదిన కాకతీయ, విజయనగర రాజ్యాలు ఉజ్వలంగా వెలిగాయి. హిందూ, ముస్లిం పాలకుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరిగాయి. ఆ యుగంలోని వివిధ రాజవంశాల పాలనా పద్ధతులు, ఆర్థిక సంస్కరణల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. నాటి గొప్ప రాజులు, వారి హయాంలోని విశేషాలతో పాటు, వాటిని తర్వాత తరాలకు అందించిన ఆధారాలపై అవగాహన పెంచుకోవాలి. 


1. రెండో తరైన్‌ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?

1) పృథ్వీరాజ్‌ చౌహాన్, మహ్మద్‌ గజనీ    

2) పృథ్వీరాజ్‌ చౌహాన్, మహ్మద్‌ ఘోరీ

3) జయచంద్ర, మహ్మద్‌ గజనీ   

4) జయచంద్ర, మహ్మద్‌ ఘోరీ


 

2. సుల్తాన్‌ ప్రతిష్ఠను పునరుద్ధరించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ    2) కుతుబుద్దీన్‌ ఐబక్‌   3) ఇల్‌టుట్‌ మిష్‌    4) బాల్బన్‌


 

3. మార్కెట్‌ సంస్కరణలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ   2) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌   3) గియాజుద్దీన్‌ బాల్బన్‌   4) ఇబ్రహీం లోడి



4. భారతదేశ రామచిలుక అని ఎవరిని పిలుస్తారు?

1) అల్‌ బెరూని    2) అమీర్‌ ఖుస్రూ   3) జియావుద్దీన్‌ బరౌని   4) మిన్హస్‌ సిరాజ్‌



5. రెండో తరైన్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది?

1) 1191  2) 1192   3) 1193  4) 1194


 

6. కాకతీయులకు ఆ పేరు రావడానికి కారణం?

1) కాకతి అనే దేవతను పూజించడం 

2) కాకతి అనే కోటకు ద్వార సంరక్షకులుగా ఉండటం 

3) కాకతీపురానికి చెందినవారు కావడం

4) పైవన్నీ


 

7. కాకతీయుల మొదటి రాజధాని ఏది?

1) హనుమకొండ    2) ఓరుగల్లు    3) రేకపల్లె     4) కరీంనగర్‌



8. నీతిసారం అనే గ్రంథాన్ని రచించినవారు?

1) రుద్రదేవుడు   2) గణపతి దేవుడు   3) మహాదేవుడు   4) రెండో ప్రోలరాజు



9. కిందివాటిలో గణపతి దేవుడికి సంబంధించి    సరికానిది?    

1) ఈయన 63 ఏళ్లు పరిపాలించాడు.

2) మహా మండలేశ్వరుడు అనే బిరుదు పొందాడు. 

3) కాకతీయుల్లో చివరివాడు.

4) మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు.


 

10. పేరిణి నాట్యం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది?

1) కల్యాణి చాళుక్యుడు   2) కాకతీయులు    3) విజయనగర రాజులు     4) ఢిల్లీ సుల్తానులు


11. కింది సాహిత్య రచనల్లో సరికానిది?

1) బసవ పురాణం - పాల్కురికి సోమనాథుడు

2) కుమార సంభవం - నన్నెచోడుడు

3) ప్రతాప రుద్రీయం - శ్రీనాథుడు

4) క్రీడాభిరామం - వినుకొండ వల్లభరాయుడు



12. విలస శాసనాన్ని ఎవరు రాయించారు?

1) ప్రతాపరుద్రుడు       2) ప్రోలయ నాయక   

3) కాపయ నాయక       4) రుద్రదేవుడు



13. ‘ఘటికలు’ అని పిలిచే విద్యాసంస్థలను    స్థాపించిన రాజవంశం?

1) కల్యాణి చాళుక్యులు       2) యాదవ వంశం   

3) పశ్చిమ చాళుక్యులు       4) కాకతీయులు


14. శ్రీకృష్ణ దేవరాయలు ఏ విజయనగర రాజవంశానికి చెందినవారు?

1) సాళువ   2) తులువ   3) అరవీటి   4) సంగమ


15. ఏ ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో విజయనగర     సామ్రాజ్యాన్ని స్థాపించారు?

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ       2) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌   

3) ఫిరోజ్‌ షా తుగ్లక్‌       4) గియాజుద్దీన్‌ తుగ్లక్‌



16. జతపరచండి.

1) శ్రీకృష్ణదేవరాయలు ఎ)ముఖ్యమంత్రి
2) మహ్మద్‌ గవాన్‌ బి)బహమనీ రాజధాని నగరం
3) విజయనగర సామ్రాజ్యం సి) ఆంధ్రభోజ
4) గుల్బర్గా డి) పర్షియన్‌ యాత్రికుడు
5) అబ్దుల్‌ రజాక్‌ ఇ) తుంగభద్ర నద

1) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-డి    2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి, 5-ఇ 

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ    4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ, 5-ఇ



17. బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు?

1) అల్లావుద్దీన్‌ ముజాహిద్‌ షా   2) అహ్మద్‌ షా

3) అల్లావుద్దీన్‌ బహమన్‌ షా     4) ఫిరోజ్‌ షా



18. ‘మధురా విజయం’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) గంగాదేవి   2) తిరుమలమ్మ  3) నాగలాంబ  4) హనుమాయమ్మ

19. రాక్షసతంగడి లేదా తళ్లికోట యుద్ధం ఎప్పుడు  జరిగింది?

1) 1563  2) 1564   3) 1565  4) 1566



20. కిందివాటిలో విజయనగర సామ్రాజ్యం సాంస్కృతిక సేవకు సంబంధించి సరికానిది?

1) విజయనగర స్తంభాలపై కనిపించే సాధారణ జంతువు గుర్రం.

2) విజయనగర రాజులు ఎత్తయిన గోపురాలను నిర్మించారు.

3) వీరి నిర్మాణాలను హంపిలో చూడొచ్చు.

4) వీరి నిర్మాణాలు ఎక్కువగా నగరా శైలిలో ఉన్నాయి.


 

21. విజయనగర రాజుల కాలం నాటి బంగారు నాణెం?

1) టంకా  2) జిటాల్‌  3) వరాహ  4) దినార్‌



22. సంగమ వంశంలో గొప్పవారు?

1) హరిహరరాయలు         2) బుక్కరాయలు    

3) రెండో దేవరాయలు      4) శ్రీకృష్ణ దేవరాయలు


23. కిందివాటిలో శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి సరైంది?

1) విజయనగర రాజుల్లో గొప్పవాడు.

 2) ఈయన వద్ద అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు.

3) ‘ఆముక్తమాల్యద’ అనే గ్రంథాన్ని రచించారు.

4) పైవన్నీ 


 

24. ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

1) అల్లసాని పెద్దన       2) మాదయగారి మల్లన

3) నంది తిమ్మన         4) తాళ్లపాక అన్నమయ్య


25. అమర నాయక వ్యవస్థ ఎవరి కాలానికి చెందింది?

1) కాకతీయులు   2) విజయనగర రాజులు   3) ఢిల్లీ సుల్తానులు  4) కల్యాణి చాళుక్యులు

26. కిందివాటిలో సరికాని జత?

1) అల్లసాని పెద్దన - హరికథాసారం

2) నంది తిమ్మన  - పారిజాతాపహరణం

3) అయ్యలరాజు రామభద్రుడు  - సకలనీతి సంగ్రహం

4) పింగళి సూరన - వసుచరిత్ర



27. భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్య స్థాపనకు    కారణమైన యుద్ధం?

1) మొదటి పానిపట్టు యుద్ధం   2) రెండో తరైన్‌ యుద్ధం

3) తళ్లికోట యుద్ధం                 4) రెండో పానిపట్టు యుద్ధం



28. ‘హుమాయూన్‌ నామా’ గ్రంథకర్త?

1) హమీద్‌ అబ్దుల్‌ లాహోరి    2) గుల్‌బదన్‌ బేగం   3) అమీర్‌ ఖుస్రూ  4) అబుల్‌ ఫజల్‌



29. ‘నవరత్నాలు’ అనే ప్రముఖులను పోషించిన మొగల్‌ రాజు?

1) ఔరంగజేబు   2) అక్బర్‌   3) షాజహాన్‌    4) హుమాయూన్‌


 

30. రామచరిత మానస్‌ను రచించినవారు?

1) కంబన్‌   2) బమ్మెర పోతన   3) తులసీదాస్‌    4) వ్యాస మహర్షి



31. ఏ మొగల్‌ చక్రవర్తి గోల్కొండను మొగల్‌    సామ్రాజ్యంలో విలీనం చేశాడు?

1) ఔరంగజేబు   2) షాజహాన్‌  3) హుమాయూన్‌  4) అక్బర్‌



32. రూపాయి, దామ్‌ అనే నాణేలను ప్రవేశపెట్టినవారు?

1) ఔరంగజేబు    2) సికిందర్‌ సూర్‌   3) అక్బర్‌   4) షేర్షా సూర్‌



33. కిందివాటిలో ‘దీన్‌-ఇ-ఇలాహి’ మతానికి    సంబంధించి సరికానిది?

1) దీన్ని అక్బర్‌ చక్రవర్తి స్థాపించాడు.

2) దీని అర్థం విశ్వజనీన శాంతి

3) 1582లో స్థాపించారు.

4) ఇది భారతదేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.


 

34. ఏ మొగల్‌ చక్రవర్తి కాలంలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది?

1) షాజహాన్‌   2) ఔరంగజేబు   3) అక్బర్‌    4) జహంగీర్‌



35. కిందివాటిని జతపరచండి.

1) మొదటి పానిపట్టు యుద్ధం ఎ)1526
2) రెండో పానిపట్టు యుద్ధం బి)1556
3) మూడో పానిపట్టు యుద్ధం సి) 1761
4) రెండో తరైన్‌ యుద్ధం డి) 1192

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి     4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


36. శివాజీ అష్టప్రధానుల్లో వాకియనలీస్‌ విధి?

1) ప్రధానమంత్రి            2) రాజశాసనాలు తయారు చేయడం

3) అంతరంగిక మంత్రి   4) ప్రధాన న్యాయమూర్తి


 

37. ఇబాదత్‌ ఖానా ఎక్కడ ఉంది?

1) ఫతేపుర్‌ సిక్రీ    2) ఢిల్లీ    3) జహంగీరాబాద్‌    4) ఔరంగబాద్‌



38. దక్షిణ భారతదేశంలో సమాధి చేసిన ఏకైక మొగల్‌ రాజు?

1) రెండో బహదూర్‌ షా   2) ఔరంగజేబు   3) అక్బర్‌   4) ఫరూక్‌ సియర్‌


39. శివాజీకి సమకాలీన మొగల్‌ రాజు?

1) అక్బర్‌   2) జహంగీర్‌   3) షాజహాన్‌   4) ఔరంగజేబు



40. కిందివాటిని జతపరచండి.

1) రాగి నాణెం ఎ)దామ్‌
2) మన్సబ్‌దార్‌ బి)ర్యాంక్‌
3) తాజ్‌మహల్‌ సి) షాజహాన్‌
4) తోడర్‌మల్‌   డి) మంత్రి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి      4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి



41. శివాజీ మతగురువు ఎవరు?

1) దాదాజీ కొండాదేవ్‌     2) సమర్థ రామదాసు

3) అల్లసాని పెద్దన        4) రాజా తోడర్‌మల్‌



42. రుద్రమదేవి భర్త ఎవరు?

1) చాళుక్య వీరభద్రుడు  2) గోన గన్నారెడ్డి   

3) రాజరాజ చోళుడు       4) మహాదేవుడు



43. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్‌ యాత్రికుడు?

1) ఇబన్‌ బటూటా   2) అబ్దుల్‌ రజాక్‌   3) డొమింగో పేస్‌  4) ఫెర్నాండో నూనిజ్‌



44. కిందివారిలో ఎవరు రెండో దేవరాయల ఆస్థానాన్ని సందర్శించారు?

1) నికోలో కాంటి   2) అబ్దుల్‌ రజాక్‌   3) 1, 2   4) ఇబన్‌ బటూటా



45. ‘మహానాటక సుధానిధి’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) విద్యారణ్య స్వామి    2) రెండో దేవరాయలు

3) హరిహరరాయలు     4) శ్రీకృష్ణ దేవరాయలు

సమాధానాలు

1-2; 2-4; 3-1; 4-2; 5-2; 6-4; 7-1; 8-1; 9-3; 10-2; 11-3; 12-2; 13-1; 14-2; 15-2; 16-1; 17-3; 18-1; 19-3; 20-4; 21-3; 22-3; 23-4; 24-1; 25-2; 26-4; 27-1; 28-2; 29-2; 30-3; 31-1; 32-4; 33-4; 34-4; 35-1; 36-3; 37-1; 38-2;  39-4; 40-1; 41-2; 42-1; 43-2; 44-3; 45-2.



రచయిత: 

కాకులూరు వెంకటేశ్వర్లు 


 

Posted Date : 27-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌