• facebook
  • whatsapp
  • telegram

రోగనిరోధక వ్యవస్థ

భూమిపై ఉద్భవించిన మొదటి జీవి అదే! 


 

జీవరాశుల ఆవిర్భావం ఏక కణజీవులతో ప్రారంభమైంది. జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి.  కణం ఒక అద్భుత జీవరసాయన కర్మాగారం. దీనిలో అనేక జీవక్రియలు జరుగుతుంటాయి. ఆ కణం నిర్మాణం, మూలాలను కణశాస్త్రం అధ్యయనం చేస్తుంది. దాని ద్వారా జీవుల మనుగడను తెలుసుకోవచ్చు. వ్యాధులను నిర్దారించవచ్చు. చికిత్స విధానాలను గ్రహించవచ్చు. కొత్త మందులను తయారు చేయవచ్చు. వైద్య పరిశోధనలకు ఆధారమైన కణశాస్త్రం ప్రాథమికాంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. కణాంగాలు, ప్రోటీన్లు, ఎంజైమ్‌లు తదితరాల పనితీరును అర్థం చేసుకోవాలి. 



 

1. కిందివాటిలో సరైన వాక్యాలను ఎన్నుకోండి.          

ఎ) కణాన్ని కనుక్కున్నది, పేరు పెట్టింది రాబర్ట్‌హుక్‌.

బి) జీవుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం కణం.

సి) జీవులన్నీ కణాలతో నిర్మితం.

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి  4) ఎ, బి, సి


2.     కణాలకు సంబంధించి కిందివాటిలో సరికానివి?      

ఎ) కేంద్రక పూర్వకణాలు అభివృద్ధి చెందిన కణాలు.

బి) బ్యాక్టీరియా కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ.

సి) కణాలన్నీ వాటి తల్లి కణం నుంచి విభజన ద్వారా ఏర్పడతాయి.

డి) కణ సిద్ధాంతం వైరస్‌లకు వర్తించదు.

ఇ) జంతు కణానికి కణ కవచం ఉంటుంది.

1) ఎ, ఇ   2) బి, సి   3) సి, డి   4) డి, ఇ


3.     కణాంగాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి.          

ఎ) మైటోకాండ్రియా  1) కణపు మెదడు

బి) హరితరేణువు   2) కణశక్తి భాండాగారం

సి) లైసోసోమ్‌      3) కణ ప్రోటీన్‌ కర్మాగారం

డి) రైబోసోమ్‌      4) కణ ఆహార కర్మాగారం

ఇ) కేంద్రకం       5) కణ ఆత్మహత్యాకోశాలు

1) ఎ-1, బి-3, సి-4, డి-5, ఇ-2   2) ఎ-2, బి-4, సి-5, డి-3, ఇ-1

3) ఎ-4, బి-3, సి-2, డి-5, ఇ-1   4) ఎ-1, బి-3, సి-4, డి-2, ఇ-5


4.     కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని ఎన్నుకోండి.          

ఎ) మన శరీరంలో అతి చిన్న కణం శుక్ర కణం.

బి) మన శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం.

సి) మన శరీరంలో కేంద్రకం లేని కణం ఎర్ర రక్తకణం.

డి) మన శరీరంలో విభజన చెందలేని కణం నాడీ కణం

1) ఎ, బి, సి       2) బి, సి, డి   

3) ఎ, బి, సి, డి       4) బి, డి


5.     కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) భూమిపైన మొదట ఉద్భవించిన జీవి సయనో బ్యాక్టీరియా.

బి) అతి చిన్న కణానికి ఉదాహరణ మైకోప్లాస్మా.

సి) అతి పెద్ద కణానికి ఉదాహరణ వైరస్‌.

డి) జంతు కణానికి ఉదాహరణ శైవలం.

1) ఎ, డి   2) బి, డి   3) ఎ, సి   4) ఎ, బి


6.     మొక్క కణానికి, జంతు కణానికి మధ్య తేడాను కింది వాక్యాల ఆధారంగా గుర్తించి సరైన వాటిని ఎంచుకోండి.     

ఎ) మొక్కల కణాలకు కణకవచం ఉంటుంది. జంతు కణాలకు ఉండదు.

బి) మొక్కల కణాల్లో హరితరేణువు ఉంటుంది. జంతు కణాల్లో ఉండదు.

సి) మొక్క కణం విటమిన్లను తయారు చేసుకుంటుంది. జంతు కణం తయారు చేసుకోదు.

డి) మొక్క కణం కణఫలక పద్ధతిలో విభజన చెందుతుంది. జంతు కణం నొక్కు ఏర్పడటం ద్వారా విభజన చెందుతుంది.

1) ఎ, బి, సి, డి       2) బి, సి, డి   

3) ఎ, డి       4) ఎ, బి, సి


7.     కిందివాటిలో సరైన క్రమాన్ని ఎంచుకోండి.          

1) కణం - కేంద్రకం - DNA - క్రోమోజోమ్‌ - జన్యువు

2) కణం - కేంద్రకం - క్రోమోజోమ్‌ - DNA - జన్యువు

3) కేంద్రకం - కణం - జన్యువు - DNA - క్రోమోజోమ్‌

4) జన్యువు - క్రోమోజోమ్‌ - DNA - కణం - కేంద్రకం


8.     కణాంగాల్లో వేటిని స్వయంప్రతిపత్తి ఉండే కణాంగాలని అంటారు? 

ఎ) హరితరేణువు       బి) రైబోసోమ్‌   

సి) మైటోకాండ్రియా       డి) కేంద్రకం   

ఇ) లైసోజోమ్‌

1) ఎ, బి, ఇ       2) బి, డి, ఇ   

3) ఎ, సి       4) డి, ఇ


9.     కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి. 

ఎ) ప్రోటీన్ల సంశ్లేషణ రైబోసోమ్‌ల ఉపరితలంపై జరుగుతుంది.

బి) రైబోసోమ్‌లు కేంద్రక పూర్వజీవులు. నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయి.

1) ఎ, బి లు సరైనవి. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం చూపుతాయి.

2) ఎ సరైంది. బి సరైంది కాదు.

3) ఎ సరైంది కాదు. బి సరైంది.

4) ఎ, బి లు సరైనవి కావు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం చూపవు.


10. కేంద్రక పూర్వకణానికి సంబంధించి కిందివాటిలో సరికానివి?         

ఎ) వీటిలో నిజమైన కేంద్రకం ఉండదు.

బి) ఈ కణంలో కణాంగాలు ఉండవు.

సి) సమ విభజన ద్వారా విభజన చెందుతాయి.

డి) స్పష్టమైన క్రోమోజోమ్‌లు ఉంటాయి.

ఇ) మొక్కల కణాలు కేంద్రక పూర్వకణానికి ఉదాహరణ.

1) ఎ, బి  2) డి, ఇ  3) సి, డి  4) సి, డి, ఇ


11. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) మానవుడిలో ఆటోసోమ్‌లు 1) 23 జతలు
బి) మానవుడిలో అల్లోసోమ్‌లు 2) 23
సి) సంయోగబీజాల్లో క్రోమోజోమ్‌లు 3) 22 జతలు
డి) చర్మకణాల్లో క్రోమోజోమ్‌లు 4) ఒక జత
ఇ) పురుషుల్లో అల్లోసోమ్‌లు 5) శ్రీశ్రీ
ఎఫ్‌) స్త్రీలలో అల్లోసోమ్‌లు 6) శ్త్ర్రీ

1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5, ఎఫ్‌-6

2) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-6, ఎఫ్‌-5

3) ఎ-4, బి-2, సి-3, డి-1, ఇ-5, ఎఫ్‌-6

4) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-6, ఎఫ్‌-5


12. కింది వాటిలో సరైనవి ఎన్నుకోండి. 

ఎ) క్రోమోజోమ్‌ల్లో డీఎన్‌ఏ ఉంటుంది.

బి) డీఎన్‌ఏలో భాగాన్ని జన్యువు అంటారు.

సి) డీఎన్‌ఏ మడతలు పడి క్రోమోజోమ్‌ ఏర్పడుతుంది.

డి) ప్రతి జీవి కణ కేంద్రకంలో నిర్దిష్ట సంఖ్యలో క్రోమోజోమ్‌లుంటాయి.

ఇ) సంయోగబీజాల్లో సగం సంఖ్యలో క్రోమోజోమ్‌లు ఉంటాయి

1) ఎ, బి, సి     2) బి, సి, డి, ఇ 

3) ఎ, బి, సి, డి, ఇ     4) సి, డి, ఇ


13. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) మొక్కల కణకవచం 1) కణపు మెదడు
బి) మొక్కల కణాలు   2) దేహకణాల్లో జరుగుతుంది
సి) కేంద్రకం  3) బీజకోశాల్లో జరుగుతుంది
డి) సమవిభజన  4) హరితరేణువు
ఇ) క్షయకరణ విభజన 5) సెల్యులోజ్‌

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1    2) ఎ-5, బి-4, సి-3, డి-1, ఇ-2

3) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-3   4) ఎ-3, బి-2, సి-4, డి-1, ఇ-5


14. నిజకేంద్రక కణంలో కణాంగాల గురించి సరైన వాటిని ఎన్నుకోండి.

ఎ) కణాంగాలు కొన్ని మొక్కల కణాల్లో మాత్రమే ఉంటాయి.

బి) కేంద్రక పూర్వ కణాలతో పోలిస్తే నిజకేంద్రక కణాలు అభివృద్ధి చెందినవి.

సి) మానవ కణం నిజకేంద్రక కణానికి ఉదాహరణ.

డి) ఈ కణాలకు నిర్దిష్ట కేంద్రకం ఉంటుంది.

1) సి, డి  2) బి, సి  3) ఎ, సి 4) ఎ, బి, సి, డి


15. సమవిభజన, క్షయకరణ విభజనల మధ్య ఉండే తేడాలకు సంబంధించి కిందివాటిని జతపరచండి.    

ఎ) సమవిభజనలో క్రోమోజోమ్‌లు 1) దేహకణాలు
బి) క్షయకరణ విభజనలో క్రోమోజోమ్‌లు 2) బీజకోశాలు
సి) సమ విభజనలో ఏర్పడే కణాల సంఖ్య 3) 4
డి) క్షయకరణ విభజనలో ఏర్పడే కణాల సంఖ్య 4) 2
ఇ) సమవిభజన జరిగే ప్రదేశం 5) పిల్ల కణాల్లో సగం సంఖ్యలో ఉంటాయి
ఎఫ్‌) క్షయకరణ విభజన జరిగే ప్రదేశం 6) పిల్ల కణాల్లో తల్లి కణాల్లో సమానం

1) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-2, ఎఫ్‌-1

2) ఎ-6, బి-2, సి-1, డి-4, ఇ-5, ఎఫ్‌-3

3) ఎ-6, బి-5, సి-4, డి-3, ఇ-1, ఎఫ్‌-2

4) ఎ-1, బి-4, సి-3, డి-6, ఇ-2, ఎఫ్‌-5


16. కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) సమవిభజన వల్ల పెరుగుదలతోపాటు, గాయాలు మానతాయి.

బి) క్షయకరణ విభజన వల్ల సంయోగ బీజాలు  ఏర్పడతాయి.

సి) సమవిభజన కణాలు ప్రత్తుత్పత్తికి ఉపయోగపడతాయి.

డి) క్షయకరణ విభజనలో వినిమయం జరుగుతుంది.

ఇ) సమవిభజన అన్ని భాగాల్లో జరుగుతుంది.

1) సి, ఇ   2) బి, సి   3) సి, డి   4) డి, ఇ


17. కణాల ప్రత్యేకతలకు సంబంధించి కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.    

ఎ) అతి పెద్ద కణం ఆస్ట్రిచ్‌ అండం.    

బి) అతి చిన్న కణం మైకోప్లాస్మా.

సి) సయనో బ్యాక్టీరియా కేంద్రక పూర్వకణం. 

డి) మన శరీరంలో అన్ని కణాలు విభజన చెందుతాయి.

ఇ) ఎర్రకర్త కణంలో అనేక కేంద్రకాలుంటాయి. 

1) ఎ, బి, సి        2) డి, ఇ

3) సి, డి, ఇ        4) బి, సి, డి


18. కేంద్రకామ్లాల గురించి కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని గుర్తించండి.

ఎ) DNA, RNA లను కేంద్రకామ్లాలు అంటారు. 

బి) DNA లో ఉండే చక్కెర డీ ఆక్సీరైబోజ్‌. 

సి) RNA లో చక్కెర రైబోజ్‌. 

డి) కేంద్రకామ్లాల్లో నత్రజని క్షారాలుంటాయి. 

1) ఎ, బి, సి, డి        2) బి, సి, డి   

3) ఎ, డి            4) ఎ, బి 


19. క్షయకరణ విభజనకు సంబంధించి కింది వాక్యాల్లో సరికానిది?  

ఎ) ఈ విభజన వల్ల నాలుగు కణాలు ఏర్పడతాయి.

బి) తల్లికణంతో పోలిస్తే పిల్లకణంలో క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది.

సి) ఈ విభజనలో వినిమయం జరుగుతుంది. 

డి) ఇది పెరుగుదల, అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

1) ఎ     2) సి      3) డి     4) బి 


20. కింది వాక్యాలను పరిశీలించి, సరైన వాటిని  గుర్తించండి.     

ఎ) ప్రతి జీవి కణ కేంద్రకంలో నిర్దిష్ట సంఖ్యలో క్రోమోజోమ్‌లుంటాయి. 

బి) DNA అనేక సార్లు మడతలు పడి ప్రోటీన్లతో కలిసి క్రోమోజోమ్‌ను ఏర్పరుస్తుంది. 

1) ఎ, బి లు సరికావు. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధం లేని వాక్యాలు.

2) ఎ, బి లు సరైనవి. ఇవి రెండూ ఒకదాంతో  మరొకటి సంబంధం చూపుతాయి.

3) ఎ సరైంది, బి సరైంది కాదు.

4) బి సరైంది, ఎ సరైంది కాదు.



సమాధానాలు

1-4; 2-1; 3-2; 4-3; 5-4; 6-1; 7-2; 8-3; 9-1; 10-4; 11-2; 12-3 13-3; 14-4; 15-3; 16-1; 17-2; 18-1; 19-3, 20-2.


రచయిత: డాక్టర్‌ బి.నరేష్‌ 
 

Posted Date : 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌