• facebook
  • whatsapp
  • telegram

న్యాయవ్యవస్థ

సయోధ్యలతో సమస్యల పరిష్కారం!
 

స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై స్వతంత్రంగా పనిచేస్తోంది. ప్రజల ప్రాథమిక హక్కులను పాడటంతోపాటు ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం నడుచుకునే విధంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ న్యాయవ్యవస్థ నిర్మాణ క్రమం, అధికార పరిధుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పౌరులు - చట్టాలు - కోర్టులకు ఉన్న సంబంధంతోపాటు సహజ న్యాయసూత్రాలు, లా అండ్‌ ఆర్డర్‌ అంశాలు, న్యాయమూర్తుల నియామకం, సుప్రీంకోర్టు, హైకోర్టుల చరిత్ర, అందులో పనిచేసిన ముఖ్యమైన న్యాయమూర్తుల వివరాలను అధ్యయనం చేయాలి.


1. ‘వరకట్నం తీసుకోవడం’ కిందివాటిలో ఏ నేరానికి సంబంధించింది?

1) క్రిమినల్‌     2) సివిల్‌ 

3) 1, 2     4) పౌర శిక్షాస్మృతి


2. కిందివాటిలో ఏ కేసులో నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి?

1) నేరచట్టం     2) పౌరచట్టం     

3) 1, 2     4) నేరశిక్షాస్మృతి 


3. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో సరికానిది?

1) ఫిర్యాదు వివరాలు     2) నేరం జరిగిన తేదీ, స్థలం

3) సాక్షుల పేర్లు     4) డీఎస్పీని సంబోధిస్తూ ఫిర్యాదు చేయాలి


4. SHO పూర్తి వివరణ

1) Station House Officer 2) Station Head Officer

3) Station Hope Officer 4) Station House Office


5. కిందివాటిలో శివీదిళీవీ POCSO (Protection of Children From of Sexual Offences) కేసులను ఎవరు విచారిస్తారు?

1) సెషన్స్‌ కోర్టు     2) బాలల కోర్టు 

3) జిల్లా కోర్టు     4) హైకోర్టు 


6. ఢిల్లీ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం?

1) 1861  2) 1862  3) 1966  4) 1950 


7. భారతదేశంలో కలకత్తా, బాంబే, మద్రాసు   హైకోర్టులు ఎప్పుడు ఏర్పాడ్డాయి? 

1) 1861  2) 1862  3) 1726   4) 1793


8. భారతదేశంలో 25వ హైకోర్టు ఏది?

1) తెలంగాణ     2) మేఘాలయ     

3) మణిపుర్‌     4) ఆంధ్రప్రదేశ్‌


9. తెలంగాణ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం?

1) 2019, జనవరి 1     2) 2013, జనవరి 1 

3) 2018, జనవరి 1     4) 2014, జనవరి 1


10. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం?

1) 2014, జూన్‌ 2     2) 2018, జనవరి 1 

3) 2019, జనవరి 1     4) 2020, జనవరి 1


11. భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం?

1) 1950, జనవరి 25     2) 1950, జనవరి 26 

3) 1950, జనవరి 27     4) 1950, జనవరి 28


12. ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడిన సంవత్సరం?

1) 1935, అక్టోబరు 1     2) 1936, అక్టోబరు 1 

3) 1937, అక్టోబరు 1     4) 1774, అక్టోబరు 1


13. ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా చివరి ప్రధాన న్యాయమూర్తి?

1) హెచ్‌.జె.కానియా     2) సర్‌ ఎలిజాఇంఫే 

3) మారిస్‌ గ్వేయర్‌     4) రాబర్ట్‌ చాంబర్స్‌ 


14. ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా మొదటి ప్రధాన న్యాయమూర్తి?

1) మారిస్‌ గ్వేయర్‌     2) హెచ్‌.జె.కానియా 

3) సర్‌ ఎలిజాఇంఫే     4) సీడర్‌ లైమెస్టర్‌ 


15. భారతదేశంలో మొదటి హైకోర్టు?

1) కలకత్తా     2) మద్రాసు 

3) బాంబే     4) అలహాబాద్‌ 


16. భారతదేశంలో 4వ హైకోర్టు ఏది?

1) కలకత్తా     2) మద్రాసు 

3) బాంబే     4) అలహాబాద్‌ 


17. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి?

1) హెచ్‌.జె.కానియా     2) సర్‌ ఎలిజాఇంఫే 

3) మారిస్‌ గ్వేయర్‌     4) జాన్‌హైడ్‌ 


18. FIR (తొలి సమాచార నివేదిక)ను తయారుచేసేది?

1) SHO     2) డీఎస్పీ 

3) రైటర్‌     4) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 


19. ఒకవేళ కేసును తీసుకోవడానికి SHO తిరస్కరిస్తే ఎవరికి ఫిర్యాదు చేయవచ్చు?

1) డీఎస్పీ  2) మెజిస్ట్రేట్‌   3) 1, 2   4) సీఐ 


20. కిందివాటిలో ‘క్రిమినల్‌’ నేరాలకు సంబంధించనిది?

1) దొంగతనం     2) దోపిడి 

3) వరకట్నం తీసుకోవడం     4) అద్దె 


21. కిందివాటిలో ‘సివిల్‌’ నేరాలకు సంబంధించనిది? 

1) కల్తీమందులు తయారుచేయడం     2) సరకుల కొనుగోలు    

3) విడాకులు     4) ఆస్తి


22. హైకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు?

1) 60 సంవత్సరాలు     2) 65 సంవత్సరాలు 

3) 62 సంవత్సరాలు     4) 70 సంవత్సరాలు


23. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు?

1) 60 సంవత్సరాలు     2) 65 సంవత్సరాలు 

3) 62 సంవత్సరాలు     4) 70 సంవత్సరాలు


24. నేరతీవ్రత, సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశం ఆధారంగా బెయిల్‌ మంజూరు చేస్తారు. కిందివారిలో బెయిల్‌ ఎవరి హక్కు?

1) ఫిర్యాదుదారుడు     2) నిందితుడు 

3) సాక్షులు     4) పైవారందరు


25. నిందితుడు చట్టం ప్రకారం దోషి అవునో, కాదో ఎవరు నిర్ణయిస్తారు?

1) SHO     2) డీఎస్పీ  

3) న్యాయమూర్తి     4) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 


26. ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో వాదించేవారు?

1) న్యాయమూర్తి     2) ఎస్‌ఐ 

3) డీఎస్పీ    4) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌


27. బాలలపై లైంగిక వేధింపులు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, పోషకులు, పోలీసులకు (Special Juvenile Police Unit) ఫోన్‌ చేయాల్సిన నంబరు?

1) 108     2) 100 

3) 1098     4) 1800 425 3525


28. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య?

1) 34  2) 22,644  3) 17,509  4) 5,135


29. పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు? 

1) గువాహటి 2) చండీగఢ్‌ 3) చెన్నై 4) మహారాష్ట్ర 


30. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు? 

1) గువాహటి 2) చండీగఢ్‌ 3) చెన్నై 4) మహారాష్ట్ర


31. గువాహటి హైకోర్టుకు చెందిన ఐజ్వాల్‌ బెంచ్‌ ఎక్కడ ఉంది? 

1) అస్సాం     2) అరుణాచల్‌ప్రదేశ్‌ 

3) నాగాలాండ్‌     4) మిజోరాం


32. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా, రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు వాటిని రద్దు చేస్తుంది. వీటిని ఏమంటారు?

1) కోర్ట్‌ ఆఫ్‌ రికార్డు    2) న్యాయసమీక్ష 

3) లోక్‌ అదాలత్‌     4) పునర్విచారణాధికారులు


33. PIL (Public Interest Litigation) న్యాయ  వ్యాప్తిని పెంచడానికి ఏ సంవత్సరం/దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు ఈ యంత్రాంగాన్ని రూపొందించింది?    

1) 1979  2) 1978  3) 1980  4) 1985 


34. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిల్‌ ను దాఖలు చేయవచ్చు?

1) 32వ 2) 226వ 3) 32వ, 226వ 4) 225వ


35. సబార్డినేట్‌ న్యాయస్థానాలను సాధారణంగా ఏ పేర్లతో పిలుస్తారు?

1) ట్రయల్‌ కోర్టు    2) డిస్ట్రిక్‌ జడ్జి కోర్టు    

3) సివిల్‌ జడ్జి, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ 4) పైవన్నీ


36. 1773 రెగ్యులేటింగ్‌ చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు జ్యుడికేచర్‌ను ఏర్పాటు చేశారు?

1) 1772  2) 1773   3) 1774   4) 1775


37. సయోధ్య, రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వేటిని ఏర్పాటు చేసింది?

1) ట్రయల్‌ కోర్టు       2) లోక్‌ అదాలత్‌   

3) సాయంకాల న్యాయస్థానాలు   4) పైవన్నీ


38. జిల్లా న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?

1) రాష్ట్రపతి       2) ముఖ్యమంత్రి   

3) గవర్నర్‌      4) జిల్లా కలెక్టర్‌ 


39. లీగల్‌ సర్వీస్‌ అథారిటీస్‌ యాక్ట్‌ ప్రకారం లోక్‌ అదాలత్‌లకు చట్టబద్ధమైన హోదా ఎప్పుడు  కల్పించారు?

1) 2002  2) 1976  3) 1986  4) 1987


40. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?

1) రాష్ట్రపతి      2) ప్రధానమంత్రి   

3) మంత్రిమండలి సలహాపై ప్రధానమంత్రి       4) గవర్నర్‌


41. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?    

1) గవర్నర్‌      2) ప్రధానమంత్రి   

3) రాష్ట్రపతి       4) మంత్రిమండలి సలహాపై ప్రధానమంత్రి


42. సుప్రీంకోర్టులో అత్యధిక కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి?

1) కమల్‌ నారాయణ్‌ సింగ్‌      2) కె.జి.బాలకృష్ణన్‌  

3) హెచ్‌.జె.కానియా        4) వై.వి.చంద్రచూడ్‌


43. సుప్రీంకోర్టులో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి?

1) కమల్‌ నారాయణ్‌ సింగ్‌ 2) కె.జి.బాలకృష్ణన్‌      

3) హెచ్‌.జె.కానియా       4) వై.వి.చంద్రచూడ్‌


44. సుప్రీంకోర్టులో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి?

1) కమల్‌ నారాయణ్‌ సింగ్‌  2) కె.జి.బాలకృష్ణన్‌  

3) హెచ్‌.జె.కానియా       4) వై.వి.చంద్రచూడ్‌


45. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి?

1) బి.వి.నాగరత్న      2) బి.త్రివేది   

3) జస్టిస్‌ రూమాపాల్‌       4) మీర్‌సాహెబ్‌ ఫాతిమా బీవీ


46. సుప్రీంకోర్టులో పనిచేసిన తెలుగు ప్రధాన న్యాయమూర్తులు?

1) కోకా సుబ్బారావు      2) ఎన్‌.వి.రమణ 

3) 1, 2       4) బి.ఎన్‌.రావు


47. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?

1) హెచ్‌.జె.కానియా     2) జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా  

3) వై.వి.చంద్రచూడ్‌      4) పి.ఎన్‌.భగవతి


48. దేశంలోని హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి?

1) అన్నాచాందీ    2) మీర్‌సాహెబ్‌ ఫాతిమా బీవీ   

3) లీలాసేథ్‌       4) అమరేశ్వరి


49. దేశంలోని హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి?

1) అన్నాచాందీ    2) మీర్‌సాహెబ్‌ ఫాతిమా బీవీ   

3) లీలాసేథ్‌       4) అమరేశ్వరి


50. తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి?

1) రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌   2) బి.రాధాకృష్ణన్‌  3) హిమా కోహ్లి    4) సతీష్‌ కుమార్‌ శర్మ



సమాధానాలు


1-1; 2-2; 3-4; 4-1; 5-2; 6-3; 7-2; 8-4; 9-1; 10-3; 11-4; 12-3; 13-1; 14-1; 15-1; 16-4; 17-1; 18-3; 19-3; 20-4; 21-1; 22-3; 23-2; 24-2; 25-3; 26-4; 27-3; 28-1; 29-2; 30-1; 31-4; 32-2; 33-3; 34-3; 35-4; 36-3; 37-2; 38-3; 39-4; 40-1; 41-3; 42-4; 43-1; 44-2; 45-4; 46-3; 47-2; 48-3; 49-1; 50-2.


రచయిత: అయితరాజు లక్ష్మణ్‌ 
 

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌