• facebook
  • whatsapp
  • telegram

ధ్వని 

అతిధ్వనుల సాయంతో అడ్డంకులను దాటే గబ్బిలాలు!
 


ధ్వనికంపించే వస్తువు నుంచి పుట్టి తరంగాలుగా ప్రయాణించే భౌతికశాస్త్ర అంశమే ధ్వని. మృదువైన మాట, వీనుల విందైన సంగీతం, కర్ణకఠోరమైన రణగొణ శబ్దాలన్నీ దాని రూపాలే. ప్రతిదానిలోనూ కొన్ని రకాల స్థాయులు, తరంగదైర్ష్ఘ్యాలు, సూత్రాలు ఇమిడి ఉన్నాయి. వాటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు ధ్వని స్వభావం, రకాలు, వివిధ యానకాల్లో ఆ తరంగాల ప్రయాణం, వాటి వేగం, పలు పరికరాలు, వాయిద్యాలు పనిచేయడంలో ఉన్న ధ్వని ధర్మాలు, వివిధ జీవులు ఉత్పత్తి చేసే పౌనఃపున్యాలు, అవి వినగలిగే శ్రవ్య అవధుల గురించి తెలుసుకోవాలి.


1.   ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం?

1) డెసిబెల్‌     2) హెర్ట్జ్‌    

3) ఆంపియర్‌   4) క్యాండిలా


2.  పిచ్‌ అనేది దేనిపై ఆధారపడుతుంది?

1) కంపనపరిమితి     2) పౌనఃపున్యం 

3) తరంగదైర్ఘ్యం     4) ఆవర్తన కాలం


3. ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది?

1) ఆవర్తన కాలం     2) పౌనఃపున్యం 

3) తరంగదైర్ఘ్యం     4) కంపన పరిమితి 


4. కిందివాటిలో అధిక పౌనఃపున్యం ఉన్నది?

1) పిల్లవాడు     2) కీటకాలు 

3) శిశువు     4) స్త్రీలు 


5.  సాధారణ శ్వాస ధ్వని తీవ్రత?

1) 30 డెసిబెల్‌      2) 50 డెసిబెల్‌  

3) 10 డెసిబెల్‌     4) 20 డెసిబెల్‌ 


6. కిందివాటిలో తీగ వాయిద్యం కానిది?

1) బుల్‌ బుల్‌     2) వీణ 

3) గిటారు     4) హార్మోనియం


7. కిందివాటిలో వాయు వాయిద్యం కానిది?

1) షెహనాయ్‌     2) క్లారినేట్‌ 

3) హార్మోనియం     4) ఏక్తార


8. మానవుడి చెవి లోపలి భాగం?

1) కర్ణభేరి     2) ఒవెల్‌ మిడో  

3) మ్యాలియస్‌   4) కోక్లియా


9. అసలు ధ్వనికి, ప్రతిధ్వనికి మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధి?


10. సముద్రపు నీటిలో ధ్వని వేగం 250C వద్ద?

1) 1498 మీటర్‌/సెకన్‌      2) 1284 మీటర్‌/సెకన్‌         

3) 1531 మీటర్‌/సెకన్‌      4) 343.2 మీటర్‌/సెకన్‌ 


11. శూన్యంలో ధ్వని వేగాన్ని గుర్తించండి.

1) 5300 మీటర్‌/సెకన్‌     2) 0   

3) 331 మీటర్‌/సెకన్‌    4) 1435 మీటర్‌/సెకన్‌ 


12. బహుళ పరావర్తన ధ్వనికి సంబంధించి సరైంది?

1) బుల్‌ బుల్‌     2) మృదంగం   

3) స్టెతస్కోపు     4) హార్మోనియం


13. ప్రతినాదం అంటే?

1) 0.1 సెకన్ల కంటే ఎక్కువ ప్రతిధ్వని

2)  0.1 సెకన్ల కంటే తక్కువ ప్రతిధ్వని   

3) 0.5 సెకన్ల కంటే ఎక్కువ ప్రతిధ్వని     

4) 0.5 సెకన్ల కంటే తక్కువ ప్రతిధ్వని


14. చిన్నపిల్లల శ్రవ్య అవధిని గుర్తించండి.    

1) 10 KHz - 12 KHz

2) 20 KHz - 100 KHz

3) 30 KHz

4) 2 KHz - 3 KHz


15. కిందివాటిలో పరశ్రవ్య ధ్వనిని వినగలిగేది?

1) కుక్క     2) గబ్బిలం   

3) డాల్ఫిన్‌  4) ఖడ్గమృగం


16. కిందివాటిలో అతిధ్వనిని వినగలిగేవి?

1) తిమింగళం    2) చేపలు      

 3) ఖడ్గమృగం      4) డాల్ఫిన్‌


17. SONARలో ఉపయోగించే ధ్వని ధర్మం?

1) పరావర్తనం    2) ప్రతినాదం   

3) ప్రతిధ్వని    4) అనునాదం


18. ధ్వనికాలుష్య నివారణకు సంబంధించి సరైన వాక్యం?

1) మొక్కలు నాటడం      2) సైలెన్సర్‌లు బిగించడం

3) తెరలు ఉపయోగించడం   4) పైవన్నీ


19. కిందివారిలో గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్‌ను గుర్తించండి.

1) చిట్టిబాబు    2) బిస్మిల్లాఖాన్‌     

3) నేరెళ్ల వేణుమాధవ్‌    4) గోమఠం శ్రీనివాస్‌


20. కిందివాటిలో అధిక పిచ్‌ కలిగి ఉండేవి?

1) సింహం      2) స్త్రీలు     

3) పిల్లవాడు      4) పురుషులు


21. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) ఫోటోమెట్రి     2) అకాస్టిక్స్‌     

3) కెలోరిమెట్రి    4) ఆప్టిక్స్‌


22. కిందివాటిలో ధ్వనితరంగాల స్వభావం కానిది?

1) వ్యాప్తి     

2) పౌనఃపుణ్యం, ఆవర్తనకాలం      

3) వేగం        

4) సాంద్రత


23. ఒక సెకను కాలంలో ధ్వనితరంగం పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలం?

1) ఆవర్తన కాలం     2) పానఃపున్యం      

3) తరంగదైర్ఘ్యం     4) కంపన పరిమితి


24. ధ్వని ప్రసారానికి అవసరమైన మాధ్యమం ఏ స్థితిలో ఉండాలి?

1) ఘనస్థితి     2) ద్రవస్థితి      

3) వాయుస్థితి      4) పైవన్నీ


25. ధ్వని వేగాన్ని కొలిచే సాధనాన్ని గుర్తించండి.

1) హైడ్రోఫోన్‌    2) థర్మామీటర్‌     

3) అనిమోమీటర్‌    4) ఆడియో మీటర్‌


26. సంపీడనం, విరళీకరణం కారణంగా తరంగం యొక్క .......... ఏర్పడుతుంది?

1) వక్రీభవనం      2) పరావర్తనం    

3) స్వభావ వ్యత్యాసం      4) వాయుపీడనం


27. ధ్వని తరంగం పౌనఃపున్యం కొలవడానికి ప్రామాణిక యూనిట్‌?

1) పాస్కల్‌    2) న్యూటన్‌     

3) హెర్ట్జ్‌     4) జౌల్‌


28. సింగిల్‌ ఫ్రీక్వెన్సీ ధ్వనిని ఏమని పిలుస్తారు?

1) పిచ్‌   2) టోన్‌    3) హెర్ట్జ్‌    4) నాట్‌


29. గాలిలోని ధ్వని తరంగాలు కింది ఏ విధంగా ఉంటాయి?

1) నిశ్శబ్దంగా     2) అక్షాంశంగా     

3) రేఖాంశంగా    4) పొడవుగా


30. మానవుడు వినలేని ధ్వని శక్తి స్థాయి?

1) 80 డెసిబెల్‌        2) 40 డెసిబెల్‌             

3) 100 డెసిబెల్‌       4) 120 డెసిబెల్‌


31. బాంబు పేలినప్పుడు దానికి దగ్గరలోని ఇల్లు కూలిపోవడానికి కారణమైన ధ్వని ధర్మం?

1) పౌనఃపుణ్యం    2) అనునాదం     

3) ధ్వనితీవ్రత    4) వక్రీభవనం


32. తాను ప్రయాణించే మార్గంలో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి గబ్బిలాలు వేటిని ఉత్పత్తి చేస్తాయి?

1) పరశ్రవ్య ధ్వనులు     2) అతిధ్వనులు   

3) సంగీత ధ్వనులు    4) కఠోర ధ్వనులు


33. గాలిలో ధ్వని వేగంపై ఒత్తిడి ప్రభావానికి సంబంధించి సరైన అంశం?

1) ఒత్తిడి పెరుగుదలతో ధ్వని వేగం పెరుగుతుంది

2) ఒత్తిడి పెరుగుదలతో ధ్వని వేగం తగ్గుతుంది

3) ఒత్తిడి వల్ల ధ్వని వేగం ప్రభావితం కాదు

4) ఒత్తిడి వల్ల ధ్వని వేగం మొదట పెరిగి క్రమంగా తగ్గుతుంది


34. ధ్వనివేగానికి సంబంధించి కింది వాక్యాలలో ఏది నిజం?

1) శీతాకాలం కంటే వేసవిలో ఎక్కువ

2) శీతాకాలం కంటే వేసవిలో తక్కువ

3) వేసవికాలం, శీతాకాలంలో సమానం

4) వాతావరణంపై అసలు ఆధారపడదు


35. గాలిలో ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువును ఏమంటారు?

1) సూపర్‌ సోనిక్‌ వేగం    2) సోనిక్‌ వేగం

3) సబ్‌సోనిక్‌ వేగం    4) హైపర్‌ సోనిక్‌ వేగం


36. ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో ధ్వనివేగంలో జరిగే మార్పు?

1) పెరగదు    2) పెరుగుతుంది    

3) తగ్గుతుంది    4) శూన్యం


37. కిందివాటిలో ఏ పదార్థాల్లో ధ్వనివేగం అధికం?

1) ద్రవపదార్థాలు    2) వాయు పదార్థాలు

3) ఘనపదార్థాలు    4) శూన్యం


38. నీటిలోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం ఏది?

1) మైక్రోఫోన్‌    2) హైడ్రోఫోన్‌

3) పాథోమీటర్‌    4) బారోమీటర్‌


39. స్ప్రింగ్‌ను దగ్గరగా నొక్కినప్పుడు ఏర్పడే తరంగాలు?

1) అనుదైర్ఘ్య తరంగాలు

2) తిర్యక్‌ తరంగాలు

3) విద్యుదయస్కాంత తరంగాలు

4) స్థిరతరంగాలు


40. ప్రతిధ్వనికోసం ధ్వనిజనకం, అవరోధం మధ్య ఉండాల్సిన కనీస దూరం?

1) 36 మీ. 2) 25 మీ. 3) 17 మీ. 4) 10 మీ.


41. ధ్వని అనుభూతి మానవ మెదడులో ఎంత సమయంపాటు ఉంటుంది?

1) 1 సెకన్‌    2) 0.2 సెకన్‌

3) 0.1 సెకన్‌    4) 0.5 సెకన్‌


42. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాల్లో ధ్వనివేగం?

1) ఎక్కువ    2) తక్కువ

3) శూన్యం    4) అనంతం


43. నీటిలోపల మునిగి ఉన్న వస్తువుల దూరాలను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) RADAR   2) SONAR

3) అల్టీమీటర్‌    4) మానోమీటర్‌


44. సాధారణ నీటిలో ధ్వనివేగం?

1) 330 మీటర్‌/సెకన్‌         

2) 1150 మీటర్‌/సెకన్‌

3) 1530 మీటర్‌/సెకన్‌       

4) 1435 మీటర్‌/సెకన్‌


45. ఒకే వరుసలో ఉన్న రెండు కణాల మధ్య దూరాన్ని ఏమంటారు?

1) కంపన పరిమితి    2) పౌనఃపున్యం

3) ఆవర్తనకాలం    4) తరంగ దైర్ఘ్యం


46. కిందివాటిలో 250C వద్ద గరిష్ఠ ధ్వనివేగాన్ని కలిగి ఉండేది?

1) ఇత్తడి    2) ఉక్కు

3) అల్యూమినియం    4) ఇనుము


47. అతిధ్వనుల ఉపయోగాలకు సంబంధించి సరైంది?

1) లోహాలను కోయడం

2) ECG

3) కంటిలో శుక్లాలు తొలగించడం

 4) పైవన్నీ


48. మానవుడి చెవులు చాలా స్పష్టంగా వినగలిగే పౌనఃపున్య ధ్వని?

1) 20Hz - 50Hz

2) 2000Hz - 3000Hz

3) 5000Hz - 10,000Hz

4) 10000Hz - 12000Hz


49. ధ్వనికాలుష్యం వల్ల జరిగే నష్టాలను గుర్తించండి.

1) నిద్రలేమి    2) రక్తపోటు

3) అల్సర్‌    4) పైవన్నీ


50. SONAR ను కనుగొన్న శాస్త్రవేత్త?    

1) జేమ్స్‌డెవర్‌    2) నిక్సన్‌

3) రాంట్‌జన్‌    4) న్యూటన్‌


సమాధానాలు
 

1-1; 2-2; 3-4; 4-2; 5-3; 6-4; 7-4; 8-4; 9-2; 10-3; 11-2; 12-3; 13-2; 14-3; 15-4; 16-4; 17-1; 18-4; 19-3; 20-3; 21-2; 22-4; 23-1; 24-4; 25-4; 26-3; 27-3; 28-2; 29-3; 30-4; 31-2; 32-2; 33-3; 34-1; 35-1; 36-2; 37-3; 38-2; 39-1; 40-3; 41-3; 42-3; 43-2; 44-4; 45-4; 46-3; 47-4; 48-2; 49-4; 50-2. 


 

Posted Date : 18-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు