• facebook
  • whatsapp
  • telegram

రవాణా వ్యవస్థ

ఆ ఓడరేవు అరేబియా సముద్రపు రాణి!


ఆధునిక యుగంలో అభివృద్ధికి కావాల్సిన ప్రాథమిక, మౌలిక అవస్థాపనా సౌకర్యమే రవాణా. ఆర్థిక కార్యకలాపాల వినియోగం, ఉత్పత్తి, పంపిణీ, అనుసంధానానికి రవాణా కీలకం. ప్రజలను, వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే రవాణా సౌకర్యం మెరుగ్గా ఉన్నచోట ప్రగతి పరుగులు తీస్తుంది. విస్తృత భౌగోళిక వైవిధ్యం, విశాల భూభాగం ఉన్న మన దేశంలో రవాణా వ్యవస్థ సమగ్ర చిత్రంపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రోడ్డు, రైలు, జల, వాయు రవాణా సౌకర్యాల స్థితిగతులు, ముఖ్యమైన ప్రాజెక్టులు, అభివృద్ధి, నిర్వహణ వ్యవస్థలతో పాటు ప్రధాన రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల వివరాలు, రైల్వే రంగం తాజా స్థితిగతులను తెలుసుకోవాలి.
 


1.    ‘బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌’ను సరిహద్దు రహదారుల అభివృద్ధి కోసం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 

1) 1970  2) 1960  3) 1965  4) 1975


2.     కిందివాటిని జతపరిచి, సమాధానాన్ని గుర్తించండి. 

బీఆర్‌ఓ ప్రాజెక్టులు ప్రాంతం
ఎ) చేతక్‌ 1) జమ్ము-కశ్మీర్‌లో రోడ్ల నిర్మాణం
బి) బీకాన్‌ 2) రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లో రోడ్ల నిర్మాణం
సి) దంతక్‌ 3) హిమాచల్‌ ప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణం
డి) దీపక్‌ 4) అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణం

1) ఎ-2, బి-1, సి-4, డి-3       2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-1, బి-4, సి-3, డి-2       4) ఎ-4, బి-3, సి-2, డి-1


3. ‘నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI)’ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?    

1) 1978   2) 1948  3) 1968  4) 1988


4.     రైల్వే గేజ్‌ల్లో భాగంగా బ్రాడ్‌ గేజ్‌ వెడల్పు ఎంత?

1) 1.676 మీ.       2) 1.767 మీ. 

3) 1.610 మీ.     4) 1.710 మీ.


5.     ఆగ్నేయ మధ్య రైల్వే మండలం కింది ఏ ప్రాంతంలో ఉంది? 

1) కోల్‌కతా      2) బిలాస్‌పుర్‌   

3) భువనేశ్వర్‌      4) జబల్‌పుర్‌


6. భారతదేశంలోని అతిపెద్ద రైల్వేజోన్‌?

1) దక్షిణ రైల్వే      2) మధ్య రైల్వే   

3) ఉత్తర రైల్వే       4) తూర్పు రైల్వే


7. అత్యధిక రైల్వే జోన్‌లున్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర       2) తమిళనాడు  

3) ఉత్తర్‌ప్రదేశ్‌       4) పశ్చిమ బెంగాల్‌


8. కిందివాటిని జతపరిచి, సమాధానాలను గుర్తించండి.

    రైల్వేజోన్‌       ప్రాంతం
ఎ) ఉత్తర మధ్య రైల్వే 1) హజీపుర్‌
బి) తూర్పు మధ్య రైల్వే 2) అలహాబాద్‌
సి) ఈశాన్య సరిహద్దు రైల్వే 3) జైపుర్‌
డి) వాయవ్య రైల్వే 4) మాలెగావ్‌ (గువాహటి)

1) ఎ-1, బి-2, సి-3, డి-4       2) ఎ-2, బి-1, సి-4, డి-3

3) ఎ-4, బి-3, సి-2, డి-1       4) ఎ-3, బి-2, సి-1, డి-4


9.     కిందివాటిలో నూతనంగా ఏర్పడిన రైల్వే మండలం?    

1) ఆగ్నేయ మధ్య రైల్వే - బిలాస్‌పుర్‌     2) దక్షిణ మధ్య రైల్వే - సికింద్రాబాద్‌ 

3) దక్షిణ కోస్తా రైల్వే - విశాఖపట్నం     4) తూర్పు కోస్తా రైల్వే - భువనేశ్వర్‌ 


10. కిందివాటిలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు?

1) హిమసాగర్‌       2) వివేక్‌   

3) వందేభారత్‌      4) అరోనాయి


11. కిందివాటిలో తూర్పు తీరం ద్వారా వెళ్లే జాతీయ రహదారి?

1) ఎన్‌హెచ్‌ 17       2) ఎన్‌హెచ్‌ 18    

3) ఎన్‌హెచ్‌ 16       4) ఎన్‌హెచ్‌ 15


12. భారతదేశంలో తొలి విమానం ఏ సంవత్సరంలో నడిపించారు?

1) 1921  2) 1931  3) 1901  4) 1911


13. జాతీయ జలమార్గం-1 ను ఎప్పుడు  ప్రకటించారు?

1) 1946  2) 1976  3) 1986  4) 1936


14. జాతీయం జలమార్గం -2 ఏ నదికి సంబంధించింది?

1) గంగ      2) గోదావరి  

3) మహానది      4) బ్రహ్మపుత్ర 


15. ‘అరేబియా సముద్రపు రాణి’గా ఏ ఓడరేవును పిలుస్తారు?    

1) మంగళూరు      2) కొచ్చిన్‌  3) మర్మగోవా      4) నవసేన


16. కిందివాటిలో ‘దీన్‌ దయాళ్‌ పోర్టు’ అని ఏ ఓడరేవును పిలుస్తారు?
1) కాండ్ల - గుజరాత్‌            2) నవసేన - ముంబయి

3) ట్యూటికోరిన్‌ - తమిళనాడు  4) కొచ్చిన్‌ - కేరళ


17. ‘నేషనల్‌ హైవేస్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌  (NHDP)’ ను ఎప్పుడు ప్రారంభించారు?

1) 1978  2) 1988  3) 1998  4) 1968


18. స్వర్ణ చతుర్భుజి  (Golden Quadrilateral)  ప్రాజెక్టులో భాగంగా ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు?

1) 8456 కి.మీ.      2) 5486 కి.మీ.  

3) 5846 కి.మీ.      4) 5631 కి.మీ.


19. ‘నీలగిరి మౌంటెన్‌ రైల్వే’ యునెస్కో వారసత్వ జాబితాలో ఎప్పుడు చోటు దక్కించుకుంది?

1) 1999  2) 2005  3) 2004  4) 2008 


20. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

ఎ) ఛత్రపతి శివాజీ టర్మినల్‌ - కోల్‌కతా 

బి) నీలగిరి మౌంటెన్‌ రైల్వే - కేరళ

సి) డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే -  పశ్చిమ బెంగాల్‌

డి) కల్క - సిమ్లా రైల్వే - హిమాచల్‌ ప్రదేశ్‌ 

1) ఎ, బి    2) బి, సి   3) సి, డి   4) ఎ, డి


21. మనదేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్‌?    

1) ఉత్తర రైల్వే       2) దక్షిణ రైల్వే       

3) తూర్పు రైల్వే      4) పశ్చిమ రైల్వే 


22. కిందివాటిని జతపరిచి, సమాధానాలను గుర్తించండి.

      రైల్వేజోన్‌      ఏర్పడిన సంవత్సరం
ఎ) ఉత్తరమధ్య రైల్వే 1) 2002
బి) తూర్పుమధ్య రైల్వే 2) 2003
సి) పశ్చిమ రైల్వే 3) 1966
డి) దక్షిణమధ్య రైల్వే 4) 1951

1) ఎ-1, బి-2, సి-3, డి-4       2) ఎ-1, బి-4, సి-2, డి-3

3) ఎ-2, బి-1, సి-4, డి-3   4) ఎ-4, బి-1, సి-3, డి-2


23. కొంకణ్‌ రైల్వే ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు?

1) 2004  2) 2008  3) 2009   4) 1998 


24. ‘ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను ఏ   సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1978   2) 1995   3) 1998  4) 1975


25. బిర్‌ టికేంద్రజిత్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) అస్సాం  2) మణిపుర్‌   3) బిహార్‌  4) కేరళ


26. లోక్‌ప్రియ్‌ గోపీనాథ్‌ బోర్డోలాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) బిహార్‌   2) ఒడిశా   3) అస్సాం   4) గోవా


27. పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1981  2) 1985  3) 2007  4) 1927


28. ‘పాలెం’ అంతర్జాతీయ విమానాశ్రయం అని దేనిని పిలుస్తారు?

1) కెంపగౌడ          2) కొచ్చిన్‌  

3) సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌   4) ఇందిరాగాంధీ


29. ‘గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ గా ఏ ఓడరేవును పిలుస్తారు?

1) ట్యూటికోరిన్‌      2) చెన్నై     3) విశాఖపట్నం     4) కృష్ణపట్నం


30. కిందివాటిలో వేటి మధ్య హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుంది? 

1) ముంబయి - చెన్నై        2) కోల్‌కతా - దిల్లీ  

3) జముతావి - కన్యాకుమారి 4) దిల్లీ - ముంబయి


31. భారతదేశంలో ‘సివిల్‌ ఏవియేషన్‌ డిపార్ట్‌మెంట్‌’ ను ఎప్పుడు స్థాపించారు?

1) 1945  2) 1927   3) 1947   4) 1967


32. కిందివాటిలో కొంకణ్‌ రైల్వేకు సంబంధించనిది- 

1) మహారాష్ట్ట్ర్ర 2) కర్ణాటక     3) గోవా 4) గుజరాత్‌ 


33. కిందివాటిని జతపరిచి, సమాధానాలను గుర్తించండి.

ఎ) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 1) శ్రామికులకు 
బి) కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 2) సైనికులకు
సి) మాతృభూమి ఎక్స్‌ప్రెస్‌ 3) నిరుద్యోగులకు
డి) యువభూమి ఎక్స్‌ప్రెస్‌ 4) మహిళలకు 

1) ఎ-2, బి-1, సి-4, డి-3   2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-1, బి-2, సి-3, డి-4   4) ఎ-1, బి-4, సి-2, డి-3


34. భారతదేశంలో అతిపురాతమైన రైలు ఇంజిన్‌?

1) దక్కన్‌ క్వీన్‌      2) వివేక్‌  

3) ఫెయిరీ క్వీన్‌      4) తేజస్‌


35. కిందివాటిలో భారతదేశం, పాకిస్థాన్‌ మధ్య నడిచే రైలును గుర్తించండి. 

1) మైత్రి  2) బంధన్‌  3) మైథిలి  4) సంఝౌతా


36. భారతదేశంలో మొదటి ఎలక్ట్రికల్‌ రైలు ‘దక్కన్‌ క్వీన్‌’ ఏ ప్రాంతాల మధ్య నడిచేది?

1) ముంబయి - పుణె     2) ముంబయి - నాసిక్‌

3) బెంగళూరు - కోయంబత్తూర్‌    4) అహ్మదాబాద్‌ - గాంధీనగర్‌ 


37. ‘ప్యాలెస్‌ ఆన్‌ వీల్స్‌’ రైలును ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? 

1) రాజస్థాన్‌       2) మధ్యప్రదేశ్‌   

3) గుజరాత్‌      4) కర్ణాటక 


38. డబోలిమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక  2) కేరళ  3) గోవా 4) మహారాష్ట్ట్ర్ర


39. బాగ్ధోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?

1) కేరళ      2) కర్ణాటక  

3) గుజరాత్‌      4) పశ్చిమ బెంగాల్‌ 


40. ‘డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే’ యునెస్కో వారసత్వ జాబితాలో ఏ సంవత్సరంలో చేరింది?

1) 1999  2) 2004  3) 2005  4) 2008 


41. రైల్వే గేజ్‌లలో భాగంగా న్యారోగేజ్‌ వెడల్పు ఎంత?

1) 1.676 మీ.     2) 0.762 మీ. 

3) 0.610 మీ.     4) 1.435 మీ.


42. NHDP లో భాగంగా రెండో దశలోని ఉత్తర దక్షిణ కారిడార్‌ మధ్య ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తారు?

1) 4000 కి.మీ.       2) 3400 కి.మీ.   

3) 4500 కి.మీ.       4) 3800 కి.మీ.


43. ‘ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ’ ఏ ప్రాంతంలో ఉంది?

1) పెరంబదూర్‌      2) కపుర్తల  

3) ముంబయి      4) చెన్నై


44. ‘బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌’ సంస్థకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) రాష్ట్రపతి      2) ఆర్థికమంత్రి  

3) ప్రధానమంత్రి      4) హోంశాఖ మంత్రి


45. NHDP స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా ఏ రాష్ట్రంలోని జాతీయ రహదారులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి?

1) ఉత్తర్‌ప్రదేశ్‌     2) ఆంధ్రప్రదేశ్‌    

3) బిహార్‌           4) తమిళనాడుసమాధానాలు

1-2; 2-1; 3-4; 4-1; 5-2; 6-3; 7-4; 8-2; 9-3; 10-2; 11-3; 12-4; 13-3; 14-4; 15-2; 16-1; 17-3; 18-3; 19-2; 20-1; 21-2; 22-3; 23-4; 24-2; 25-2; 26-3; 27-2; 28-4; 29-2; 30-3; 31-2; 32-4; 33-1; 34-3; 35-4; 36-1; 37-1; 38-3; 39-4; 40-1; 41-2; 42-1; 43-1; 44-3; 45-2.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 15-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు