• facebook
  • whatsapp
  • telegram

శిల్పం, కట్టడాలు

బుద్ధుడి పూజకు దిగివచ్చిన దేవతలు!

ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు నేటికీ సాక్ష్యాలుగా నిలిచిన నిర్మాణాలన్నీ వేటికవే ప్రత్యేకం. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను తర్వాతి తరాలకు తెలియజెప్పే నమూనాలుగా, భారతీయ శిల్పకళకు మకుటాయమానాలుగా నిలిచిపోయాయి. మౌర్య వంశ పాలకులు మొదలు విజయనగర రాజుల వరకు నిర్మించిన ఆలయాలు, భవనాలు, స్తూపాలు, స్తంభాలు, గుహలు, విహారాలు, చైత్యాలతో పాటు దేవతలు, చారిత్రక పురుషుల విగ్రహాలన్నీ చరిత్రను కళ్లముందు ఆవిష్కరిస్తాయి. చరిత్ర పాఠాలను, అప్పటి గాథలను వివరించే అలాంటి అద్భుత కట్టడాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ముస్లిం పాలకుల హయాంలో మారిన నిర్మాణ శైలి, వెలిసిన నిర్మాణాలతో పాటు చరిత్ర సంగతులను అందించిన యాత్రికులు, అన్వేషకుల గురించి అవగాహన కలిగి ఉండాలి.


 1.  సారనాథ్‌ స్తూపాన్ని ఎవరు నిర్మించారు?

1) అశోకుడు   2) బిందుసారుడు     

3) అజాతశత్రువు   4) బుద్ధుడు


2. కర్ణాటకలోని కనగనహల్లి వద్ద బయల్పడిన అశోకుడి బొమ్మలో బ్రాహ్మీ లిపిలో ఏమని రాసి ఉంది?

1) రాజా అశోక     2) మహారాజ అశోక 

3) రాణ్య అశోక    4) చక్రవర్తి


3. కిందివాటిలో బుద్ధుడి అస్థికలపై నిర్మించిన నిర్మాణాలు?

1) విహారాలు   2) స్తూపాలు

3) చైత్యాలు   4) ఆరామాలు


4. బౌద్ధ స్తూపాల్లోని గుమ్మటాన్ని ........గా భావిస్తారు?

1) భూమి  2) స్వర్గం  3) విశ్వం  4) పైవన్నీ


5. ఆంధ్రాలో బౌద్ధమత పురాతన కేంద్రాలు?

1) అమరావతి  2) భట్టిప్రోలు 

3) రామతీర్థం  4) పైవన్నీ


6. గుంటూరు జిల్లాలోని అమరావతి ఎవరి కాలంలో నిర్మించిన స్తూపం?

1) శాతవాహనులు    2) ఇక్ష్వాకులు 

3) చోళులు    4) చాళుక్యులు 


7. ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు లభించిన ప్రాంతాలు?

1) గాంధార     2) మధుర 

3) సారనాథ్‌ 4) పైవన్నీ 


8. బౌద్ధ భిక్షువుల ప్రార్థనా స్థలాలు?

1) చైత్యం      2) స్తూపం

3) విహారం     4) పైవన్నీ


9. తక్షశిల, నలంద, నాగార్జున కొండ విహారాలను వేటితో నిర్మించారు?

1) రాతి   2) ఇటుకలు   3) మట్టి   4) 1,2


10. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) బౌద్ధ విహారాలు విద్యాబోధన కేంద్రాలు.

బి) విహారాల్లో శిష్యులకు బౌద్ధ భిక్షువులు బౌద్ధ గ్రంథాలు బోధించేవారు.

సి) శారీరక రుగ్మతలకు భిక్షువులు చికిత్స చేసేవారు.

డి) వీటి నిర్మాణానికి ధనవంతులు విరాళాలు ఇచ్చేవారు.

1) ఎ, బి, సి, డి    2) ఎ, బి, సి

3) బి, సి, డి      4) ఎ, బి, డి


11. మనదేశ బౌద్ధ విశ్వవిద్యాలయాలను సందర్శించిన చైనా వారు?

1) ఫాహియాన్‌  2) ఇత్సింగ్‌ 

3) హ్యుయాన్‌త్సాంగ్‌ 4) పైవారందరూ


12. నలందా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ప్రముఖ చైనా యాత్రికుడు?

1) ఫాహియాన్‌  2) ఇత్సింగ్‌ 

3) హ్యుయాన్‌త్సాంగ్‌ 4) పైవారందరూ


13. సాంచీ స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది?

1) బిహార్‌     2) మధ్యప్రదేశ్‌     

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) రాజస్థాన్‌


14. బుద్ధుడి అస్థికలున్న స్ఫటిక పేటికను ఏ ప్రాంతంలో కనుక్కున్నారు?

1) శాలిహుండం     2) భట్టిప్రోలు 

3) అమరావతి     4) వడ్లమాను 


15. ‘బుద్ధుడిని పూజించడానికి స్వర్గం నుంచి వచ్చిన దేవతలు’, ‘నలగిరి ఏనుగును శాంతింపచేయడం’ లాంటి శిల్పసంపద ఉన్న స్తూపం?

1) నాగార్జున కొండ స్తూపం 2) సాంచీ స్తూపం

3) అమరావతి స్తూపం    4) శాలిహుండం స్తూపం


16. గ్రామంలోని దినచర్యను తెలిపే శిల్పసంపదను కనుక్కున్న ప్రాంతం?

1) నాగార్జున కొండ     2) సాంచీ 

3) అమరావతి  4) వడ్లమాను


17. గుహవిహారాలను కనుక్కున్న ప్రాంతాలు?

1) నాసిక్‌    2) కార్లే 

3) నాగార్జున కొండ   4) 1, 2 


18. దూళాలపై బరువును ఉంచి అదనపు నిర్మాణం చేయడాన్ని ఏమంటారు?

1) ట్రూఆర్చ్‌    2) ఆర్కూయోట్‌ 

3) ట్రాబిట్‌     4) పైవన్నీ


19. 1199లో కుతుబ్‌ మినార్‌ నిర్మాణం ప్రారంభించినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌    2) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 

3) ఘోరి     4) గజినీ


20. 1229లో కుతుబ్‌మినార్‌ నిర్మాణాన్ని పూర్తి చేసినవారు?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 

3) ఘోరి     4) గజినీ


21. దిల్లీలోని ఖువ్వత్‌-ఉల్‌-ఇస్లామ్‌ను నిర్మించిన వ్యక్తి?

1) ఇల్‌టుట్‌మిష్‌     2) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 

3) ఘోరి  4) గజినీ


22. భవంతుల్లో అనేక గదులు, తలుపులు, కిటికీలు నిర్మించడం ఏ శతాబ్దాల  మధ్యకాలంలో ప్రారంభమైంది?

1) 7 - 10     2) 7 - 11  

3) 8 - 12     4) 7 - 9


23. 7 - 10 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించిన కట్టడాలను ఏమంటారు?

1) ట్రాబిట్‌    2) కార్‌బెల్ట్‌  

3) గుమ్మటం     4) 1, 2


24. కందరియా మహాదేవ శివాలయాన్ని 999లో నిర్మించిన ఛందేల రాజు? 1) రామదేవుడు  2) ధంగదేవుడు 

3) కృష్ణదేవుడు   4) గోపదేవుడు 


25. తంజావూరులోని రాజరాజేశ్వర (బృహదీశ్వర) ఆలయం నిర్మించినవారు?

1) రాజరాజచోళ     2) రాజేంద్రచోళ 

3) విజయాల చోళ     4) పరాంతకుడు 


26. అలయ్‌ దర్వాజను నిర్మించినవారు?

1) ఐబక్‌ 2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ 

3) జలాలుద్దీన్‌ ఖిల్జీ  4) ఇల్‌టుట్‌మిష్‌


27. అలయ్‌ దర్వాజ ఎక్కడ ఉంది?

1) ఢిల్లీ  2) ఆగ్రా  

3) లఖ్‌నవూ  4) కాన్పూర్‌


28. ముస్లిం సుల్తానులను  పర్షియన్‌ చరిత్ర ఎలా వర్ణించింది? 

1) భగవంతుడి ప్రతిరూపం 

2) భగవంతుడి నీడ 

3) భగవంతుడికి సమానం 

4) భగవంతుడి కుమారుడు 


29. ఢిల్లీ మసీదులోని ఒక శాసనంలో ఏ రాజును భగవంతుడు నియమించాడు అని ఉంది? 

1) అల్లావుద్దీన్‌ ఖిల్జీ  2) జలాలుద్దీన్‌ ఖిల్జీ 

3) షేర్షా  4) తుగ్లక్‌ 


30. ‘హౌజ్‌-ఇ-సుల్తాని’ (రాజుగారి జలాశయం)ని నిర్మించినవారు?

1) జలాలుద్దీన్‌ ఖిల్జీ  2) అల్లావుద్దీన్‌ ఖిల్జీ 

3) ఇల్‌టుట్‌మిష్‌     4) కుతుబుద్దీన్‌ ఐబక్‌


31. రాజులు దేవాలయాలను నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం ........... ని కనపరచుకోవడానికి.

1) భక్తి  2) సంపద  

3) అధికారం  4) పైవన్నీ


32. శ్రీలంకపై దాడి చేసిన సేన-1ని ఓడించినవారు ఎవరు?

1) సేన-2     2) శ్రీమార 

3) శ్రీమార శ్రీవల్లభుడు     4) నరసింహవర్మ 


33. 11వ శతాబ్దంలో ఏ రాజు మిగతా రాజుల నుంచి పొందిన బహుమతులను శివాలయంలో భద్రపరిచాడు?

1) రాజేంద్ర చోళుడు  2) రాజరాజ చోళుడు 

3) కరికార చోళుడు  4) విజయాలయ చోళుడు 


34. కిందివాటిని జతపరచండి. 

ఎ) నిలబడి ఉన్న సూర్యుడు 1) చాళుక్యులు 

బి) గణేశ్, దుర్గాదేవి    2) తూర్పు చాళుక్యులు 

సి) భైరవుడి ప్రతిరూపం  3) కళింగరాజులు

డి) కాళీమాత   4) బెంగాల్‌ పాలవంశం 

1) ఎ-4, బి-3, సి-2, డి-1  

2) ఎ-4, బి-1, సి-2, డి-3 

3) ఎ-1, బి-2, సి-3, డి-4  

4) ఎ-3, బి-2, సి-1, డి-4


35. సోమనాథ్‌ దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌ 2) మహమ్మద్‌ ఘోరి 

3) గజినీ      4) మహమ్మద్‌


36. విరూపాక్ష ఆలయాన్ని ఎవరు నిర్మించారు?

1) కాకతీయ రాజులు 2) విజయనగర రాజులు

3) చోళ రాజులు    4) పాండ్య రాజులు


37. విజయనగర సామ్రాజ్యంలోని ప్రముఖ నిర్మాణాలు?

1) పద్మమహల్‌    2) రాణుల స్నానఘట్టం

3) గజశాల    4) పైవన్నీ


38. మహానవమి దిబ్బ ఏ సామ్రాజ్యంలో ఉంది? 

1) కాకతీయ 2) విజయనగర 

3) శాతవాహన     4) ఇక్ష్వాక


39. మహానవమి దిబ్బపై విజయనగర రాజు ఏం నిర్వహించేవారు?

1) నవరాత్రి పూజ     2) దసరా దర్బారు

3) 1, 2    4) సభలు


40. తన స్వీయచరిత్రలో తోటలపై మక్కువను వివరించినవారు?

1) బాబర్‌     2) అక్బర్‌ 

3) హుమాయున్‌     4) జహంగీర్‌ 


41. కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రాల్లో ఉద్యానవనాలు నిర్మించిన    వారు?

1) షాజహాన్‌ 2) జహంగీర్‌ 

3) బాబర్‌  4) 1, 2 


42. అక్బర్‌ నిర్మించిన సమాధులు ఏ ప్రాంతం/ రాజు నిర్మాణాలను పోలి ఉన్నాయి?

1) పర్షియా     

2) ఇరాక్‌ 

3) మధ్య ఆసియాకు చెందిన తైమూర్‌ 

4) షేర్షా 


43. దివాన్‌-ఇ-ఖాస్‌ను నిర్మించినవారు?

1) షాజహాన్‌  2) జహంగీర్‌ 

3) బాబర్ 4) 1, 3 


44. షాజహాన్‌ పెద్ద కుమారుడు?

1) పాషుజా     2) మురాద్‌ 

3) దారాషుకో  4) ఔరంగజేబు


సమాధానాలు
 

1-1; 2-3; 3-2; 4-3; 5-4; 6-1; 7-4; 8-1; 9-4; 10-1; 11-4; 12-3; 13-2; 14-2; 15-3; 16-2; 17-4; 18-3; 19-2; 20-1; 21-2; 22-1; 23-4; 24-2; 25-1; 26-2; 27-1; 28-2; 29-1; 30-3; 31-4; 32-3; 33-1; 34-3; 35-2; 36-2; 37-4; 38-2; 39-3; 40-1; 41-4; 42-3; 43-1; 44-3. 


 

Posted Date : 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌