• facebook
  • whatsapp
  • telegram

 జర్మనీ, ఇటలీ ఏకీకరణ

దేశాలను సృష్టించిన జాతీయవాదం! 

ఆధునిక కాలంలో ఐరోపా కేంద్రంగా సంభవించిన పరిణామాలు చరిత్రపై బలమైన ముద్ర వేసి, మొత్తం ప్రపంచ గతినే మలుపు తిప్పాయి. పద్దెనిమిదో శతాబ్దంలో ఫ్రెంచ్‌ విప్లవం రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పులకు నాంది పలికితే, తర్వాతి శతాబ్దంలో ప్రబలిన జాతీయవాద భావాలు జర్మనీ, ఇటలీల ఏకీకరణలకు దారితీశాయి. ఉమ్మడి భాష, సంప్రదాయాలు, ఆర్థిక ప్రయోజనాలే ప్రాతిపదికగా సాగిన ఈ ఉద్యమాలు శక్తిమంతమైన దేశాల సృష్టికి కారణమైన తీరుపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రష్యా నుంచి జర్మనీ అవతరణ వరకు, రోమన్‌ సామ్రాజ్య శిథిలాల నుంచి ఇటలీ పునర్నిర్మాణం వరకు జరిగిన సంఘటనలు, యుద్ధాలు, వాటి ఫలితాలు, కీలక వ్యక్తుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


1.  సార్డీనియా, పీడ్మాంట్‌లను పరిపాలించిన రాజవంశం?

1) హప్స్‌బర్గ్‌ వంశం  2) సెవాయ్‌ రాజవంశం 

3) 1, 2   4) బూర్బన్‌ రాజవంశం


2.  ఇటలీ ఏకీకరణకు కృషి చేసిన వ్యక్తి?

1) జోసెఫ్‌ మాజినీ      

2) రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌    

4) పైవారంతా


3.  కిందివాటిలో జోసెఫ్‌ మాజినీకి సంబంధించి   సరికానిది?

1) ఇతడు జెనోవాలో జన్మించాడు.

2) కార్బోనరి అనే సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు.

3) జర్మనీ ఏకీకరణలో ప్రధానపాత్ర పోషించాడు.

4) ఇతడిని సవానా జైలులో నిర్బంధించారు.


4.  ‘యంగ్‌ ఇటలీ’ సంస్థను ఎవరు స్థాపించారు ?

1) జోసెఫ్‌ మాజినీ     

2) గుసెప్పి గారిబాల్డీ

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ 

4) విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌


5. కిందివాటిలో ‘యంగ్‌ ఇటలీ’ సంస్థకు సంబంధించి సరికానిది?

1) దీని స్థాపకుడు జోసెఫ్‌ మాజినీ.

2) 40 ఏళ్లలోపు వారు దీనిలో సభ్యులు.

3) దీనిలోని సభ్యులంతా నిరక్ష్యరాస్యులు.

4) ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఇటలీ నుంచి ఆస్ట్రియాను తొలగించడం.


6. చార్లెస్‌ ఆల్బర్ట్‌ తర్వాత సార్డీనియా సింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఎవరు?

1) రెండో చార్లెస్‌ ఆల్బర్ట్‌  

2) రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌

3) నెపోలియన్‌ బోనపార్టీ  

4) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌


7.  కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ నిర్వహించిన పదవులు?

1) పీడ్మాంట్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నారు.

2) సార్డీనియా సైన్యంలో ఇంజినీర్‌గా పనిచేశారు.

3) 1852లో సార్డీనియా ప్రధానిగా నియమితులయ్యారు.

4) పైవన్నీ


8. ‘విల్లా ప్రాంకా’ సంధి ఏ దేశాల మధ్య జరిగింది?

1) ఆస్ట్రియా, ఇటలీ   2) ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ 

3) ఆస్ట్రియా, ఫ్రాన్స్‌  4) ఇంగ్లండ్, ఆస్ట్రియా


9.  లంబార్డీ, వెనీషియాలను ఏ దేశం నుంచి పొంది,సార్డీనియాలో కలపాలని కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ భావించాడు?

1) ఆస్ట్రియా 2) ఫ్రాన్స్‌  3) ఇంగ్లండ్‌ 4) అమెరికా


10. 3వ నెపోలియన్‌ ఏ ప్రాంతాలను తీసుకుని దానికి ప్రతిగా ఇటలీని రిపబ్లిక్‌గా గుర్తించాడు?

1) లంబార్డీ, సార్డీనియా  2) వెనీషియా, పీడ్మాంట్‌ 

3) లంబార్డీ, పీడ్మాంట్‌  4) సెవాయ్, నైస్‌


11. ‘రెడ్‌షర్ట్స్‌’ స్వచ్ఛంద సంస్థను స్థాపించినవారు?

1) జోసెఫ్‌ మాజినీ     

2) రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ 

3) గుసెప్పి గారిబాల్డీ 

4) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌


12. ఏ ప్రాంత ఆక్రమణతో ఇటలీ ఏకీకరణ పూర్తయ్యింది?

1) సిసిలీ  2) వెనీషియా 3) రోమ్‌ 4) లంబార్డీ


13. ఏ సంధిలో భాగంగా ఆస్ట్రియా.. వెనీషియాను ఇటలీకి అప్పగించింది? 

1) విల్లా ప్రాంకా సంధి     

2) ఎక్స్‌-లా-చాపెల్‌ సంధి 

3) ప్రేగ్‌ సంధి    

4) ప్యారిస్‌ సంధి 


14. కిందివాటిలో గారిబాల్డీకి సంబంధించి సరికానిది?

1) అనేక సంవత్సరాలు అమెరికాలో ప్రవాస జీవితం గడిపాడు.

2) నైస్‌ ప్రాంతంలో జన్మించాడు.

3) గొప్ప రాజరికవాది.

4) నేపుల్స్‌ ప్రాంతాన్ని ఆక్రమించాడు.


15. ఐక్య ఇటలీ మొదటి రాజు?

1) చార్లెస్‌ ఆల్బర్ట్‌     

2) రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ 

3) మొదటి విలియం  

4) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌


16. ఇటలీ ఏకీకరణ జరిగిన సంవత్సరం?

1) 1870  2) 1871  3) 1872  4) 1873 


17. ఫ్రాన్స్‌ సాయంతో లంబార్డీ, వెనీషియాలను ఇటలీలో కలపాలని భావించిన వ్యక్తి? 

1) గుసెప్పి గారిబాల్డీ     

2) ఆటోవాన్‌ బిస్మార్క్‌

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ 

4) జోసెఫ్‌ మాజినీ


18. క్రిమియా యుద్ధంలో సార్డీనియా ఏ దేశానికి సహకరించింది? 

1) ఫ్రాన్స్‌  2) ఆస్ట్రియా  3) ప్రష్యా  4) ఇంగ్లండ్‌


19. ‘సిసిలీ రాజ్యాన్ని విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌కి అప్పగించిన ఇటలీ జాతీయవాది ఎవరు? 

1) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌  

2) గుసెప్పి గారిబాల్డీ

3) జోసెఫ్‌ మాజినీ        

4) ఆటోవాన్‌ బిస్మార్క్‌ 


20. గారిబాల్డీ నేపుల్స్‌ రాజ్యాన్ని ఆక్రమించిన  సందర్భంలో ఆ ప్రాంత రాజు? 

1) నెపోలియన్‌     

2) చార్లెస్‌ ఆల్బర్ట్‌ 

3) రెండో ఫ్రాన్సిస్‌     

4) రెండో విక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ 


21. కిందివారిలో ఎవరు జర్మనీలో జాతీయతా భావం, ప్రజాస్వామ్యాలకు జీజం వేశారు? 

1) మొదటి నెపోలియన్‌     

2) మెటర్నిక్‌ 

3) మూడో విలియం     

4) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ 


22. కార్ల్స్‌బాడ్‌ ఆజ్ఞలను ఎప్పుడు జారీ చేశారు?

1) 1815  2) 1816  3) 1817  4) 1819 


23. కార్ల్స్‌బాడ్‌ ఆజ్ఞలను జారీ చేసిన వ్యక్తి?

1) మెటర్నిక్‌     

2) నెపోలియన్‌ బోనపార్టీ 

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌      

4) గారిబాల్డీ


24. జోల్వెరిన్‌ అంటే.....?

1) జర్మనీలో ఇదొక రహస్య విప్లవ సంఘం.

2) ప్రష్యా ఏర్పరచిన వర్తక సుంకాల సంస్థ.

3) వజ్రాలు దాగి ఉండే ఒక దీవి.

4) జర్మనీలో ఒక విశ్వవిద్యాలయం పేరు.


25. జర్మనీ ఏకీకరణలో ప్రధానపాత్ర పోషించిన రాజ్యం?

1) ప్రష్యా  2) రష్యా  3) ఆస్ట్రియా  4) ఇంగ్లండ్‌


26. 1848లో జర్మనీలో ఏర్పడిన జాతీయ అసెంబ్లీని ఏమని పిలుస్తారు?

1) ఫ్రాంక్‌పర్ట్‌ పార్లమెంట్‌     2) వియన్నా కాంగ్రెస్‌ 

3) కన్వెన్షన్‌ అసెంబ్లీ     4) ఏదీకాదు


27. ఇటలీ ఏకీకరణకు సార్డీనియా ఎలాగో.. జర్మనీ   ఏకీకరణలో...

1) ప్రష్యా  2) రష్యా  3) ఫ్రాన్స్‌  4) లంబార్డీ


28. నాలుగో ఫ్రెడరిక్‌ విలియం తర్వాత ప్రష్యా   సింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి?

1) రెండో చార్లెస్‌  2) ఫ్రెడరిక్‌ జాన్సన్‌  

3) మొదటి విలియం  4) మూడో నెపోలియన్‌

29. మొదటి విలియం ప్రష్యా యుద్ధమంత్రిగా ఎవరిని నియమించుకున్నాడు? 

1) ఆటోవాన్‌ బిస్మార్క్‌    2) ఆల్బర్ట్‌ వాన్‌రూన్‌ 

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌    4) విలియం స్మిత్‌ 


30. ఎవరి సలహాతో మొదటి విలియం బిస్మార్క్‌ను ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు? 

1) నాలుగో ఫ్రెడరిక్‌ విలియం 

2) మెటర్నిక్‌ 

3) ఆల్బర్ట్‌ వాన్‌రూన్‌ 

4) గారిబాల్డీ


31. జర్మనీ ఏకీకరణకు ‘రక్తపాత విధానం’ను అనుసరించిన వ్యక్తి? 

1) ఫ్రెడరిక్‌ విలియం  2) గారిబాల్డీ 

3) నెపోలియన్‌ బోనపార్టీ  4) ఆటోవాన్‌ బిస్మార్క్‌ 


32. సెడోవా యుద్ధం ఏ దేశాల మధ్య జరిగింది?

1) ప్రష్యా-ఆస్ట్రియా  2) ఇటలీ-జర్మనీ 

3) ఇటలీ-ఇంగ్లండ్‌  4) ఆస్ట్రియా-ఇటలీ 


33. సెడోవా యుద్ధంలో విజయం సాధించిన దేశం? 

1) ప్రష్యా  2) ఫ్రాన్స్‌  3) ఆస్ట్రియా  4) డెన్మార్క్‌


34. సెడోవా యుద్ధంలో ఓడిపోయిన ఆస్ట్రియాతో ప్రష్యా చేసుకున్న సంధి?

1) లండన్‌ సంధి     

2) ప్రేగ్‌ సంధి 

3) విల్లాప్రాంకా సంధి     

4) ఎక్స్‌-లా-చాపెల్‌ సంధి


35. లండన్‌ సంధికి విరుద్ధంగా ష్లెష్‌విగ్, హాల్‌స్టీన్‌లను డెన్మార్క్‌లో విలీనం చేసిన రాజు? 

1) ఏడో ఫ్రెడరిక్‌   2) ఏడో ఫెర్డినాండ్‌ 

3) తొమ్మిదో క్రిస్టియన్‌   4) మొదటి విలియం 


36. కిందివాటిలో ప్రేగ్‌ సంధి షరతులు?

1) ఆస్ట్రియా ప్రష్యాకు హాల్‌స్టీన్‌ను ఇవ్వడం.

2) యుద్ధ నష్టపరిహారం ఆస్ట్రియా, ప్రష్యాకి చెల్లించాలి

3) ఇటలీకి వెనీషియాను అప్పగించడం

4) పైవన్నీ


37. ఫ్రాంకో - ప్రష్యా యుద్ధం జరిగిన సంవత్సరం? 

1) 1868  2) 1869  3) 1870  4) 1875 


38. స్పెయిన్‌లో ఇసబెల్లా తరువాత సింహాసనాన్ని అధిష్టించింది? 

1) లియోపాల్డ్‌   2) పెర్డినాండ్‌ 

3) విలియం  4) గారిబాల్డీ


39. లియోపాల్డ్‌ సింహాసనం అధిష్టించడాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు?

1) మొదటి విలియం     

2) ఆటోవాన్‌ బిస్మార్క్‌ 

3) మూడో నెపోలియన్‌     

4) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ 


40. ‘ఎమ్స్‌ టెలిగ్రామ్‌’ అనేది...? 

1) మొదటి విలియం బిస్మార్క్‌కు పంపాడు. 

2) మొదటి విలియం మూడో నెపోలియన్‌కు పంపాడు. 

3) బిస్మార్క్, మొదటి విలియంకు పంపాడు 

4) మూడో నెపోలియన్‌ బిస్మార్క్‌కు పంపాడు.


41. జర్మనీ ఏకీకరణ జరిగిన సంవత్సరం?

1) 1870  2) 1871  3) 1872  4) 1873 


42. కిందివాటిని జతపరచండి.

ఎ) బిస్మార్క్‌    1) ఇటలీ రాజు

బి) గారిబాల్డీ     2) జర్మనీ రాజు 

సి) మొదటి విలియం 3) ప్రష్యా ప్రధాని 

డి) రెండో విక్టర్‌  4) ఇటలీ జాతీయవాది ఇమ్మాన్యుయెల్‌ 

1) ఎ-1, బి-2, సి-3, డి-4 

2) ఎ-4, బి-3, సి-2, డి-1 

3) ఎ-4, బి-2, సి-1, డి-3 

4) ఎ-3, బి-4, సి-2, డి-1 


43. ఫ్రాంకో - ప్రష్యా యుద్ధానికి ప్రధాన కారణం?

1) బిస్మార్క్‌ ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించడం. 

2) మొదటి విలియం బిస్మార్క్‌ను అవమానించడం.

3) మూడో నెపోలియన్‌ ప్రష్యాని బలపరచడం.

4) బిస్మార్క్‌ ఎమ్స్‌ టెలిగ్రామ్‌ ద్వారా ఫ్రెంచి వారిని రెచ్చగొట్టడం.


44. జర్మనీ ‘ఉక్కుమనిషి’ అని ఎవరిని పిలుస్తారు? 

1) మొదటి విలియం   

2) ఆటోవాన్‌ బిస్మార్క్‌

3) కౌంట్‌-కామిలో-డి-కవూర్‌ 

4) నాలుగో ఫ్రెడరిక్‌ విలియం


సమాధానాలు

1-2, 2-4, 3-3, 4-1, 5-3, 6-2, 7-4, 8-3, 9-1, 10-4, 11-3, 12-3, 13-3, 14-3, 15-2, 16-2,  17-3, 18-1, 19-2, 20-3, 21-1, 22-4, 23-1, 24-2, 25-1, 26-1, 27-1, 28-3, 29-2, 30-3, 31-4, 32-1, 33-1, 34-2, 35-3, 36-4, 37-3, 38-1, 39-3, 40-1, 41-2, 42-4, 43-4, 44-2.


 రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 14-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌