• facebook
  • whatsapp
  • telegram

ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ

ఏనుగు గుండె బరువు ఎంతో తెలుసా?


ఉన్నత శ్రేణి జీవులన్నింట్లోనూ అతిప్రధాన అవయవం గుండె. శరీరం జీవంతో ఉండాలంటే అది నిరంతరం పనిచేస్తుండాలి. రక్తాన్ని సరఫరా చేయాలి. దాని వల్ల అన్ని అవయవాలకు, కణజాలాలకు ప్రాణవాయువు, పోషకాల పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ జంతువుల్లోని గుండె నిర్మాణం, రక్తప్రసరణ వ్యవస్థలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. మానవుడి పుట్టుక నుంచి మరణం వరకు హృదయ స్పందనల్లో వచ్చే మార్పుల వివరాలు, రక్తంలోని పలు రసాయనాల గురించి తెలుసుకోవాలి. 


1. కిందివాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి.

A) నిమ్నస్థాయి జీవుల్లో పదార్థాలన్నీ వ్యాపనం, ద్రవాభిసరణ చెందుతాయి.

B) అభివృద్ధి చెందిన జీవుల్లో అనవసర ఆలస్యాన్ని నివారించడానికి ఏర్పడిన వేగవంతమైన చర్య ప్రసరణ వ్యవస్థ.

C) నాడీ స్పందన అనేది వ్యక్తికి వ్యక్తికి మారకుండా స్థిరంగా ఉంటుంది.

D) పదేళ్లలోపు పిల్లల్లో హృదయ స్పందనాల సంఖ్య 70 - 130

1) A, B, C        2) A, B      

3) A, B, D        4) A, B, C, D


2. రెని లెన్నెక్‌ మొదటి ఆవిష్కరణ హృదయ స్పందనాల కోసం దేన్ని ఉపయోగించారు?

1) కాగితపు గొట్టం       2) వెదురు గొట్టం    

3) మానోమీటర్‌       4) స్టెతస్కోపు


3. చిన్నపిల్లల్లో గుండె బరువు ఎంత?

1) 300 గ్రా.    2) 400 గ్రా. 

3) 240 గ్రా.     4) 150 గ్రా.


4. గుండె అధ్యయనాన్ని ఏమంటారు?

1) ఎంజియాలజీ      2) కార్డియాలజీ

3) హిమటాలజీ      4) 1, 2


5. రక్తప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరు?

1) విలియం కోల్ఫ్‌      2) మార్సెల్లో   

3) ఫాబ్రిసీ      4) విలియం హార్వే


6. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. 

1) 1816లో రెని లెన్నెక్‌ స్టెతస్కోపును కనుక్కున్నాడు.

2) క్రీడాకారుల్లో హృదయ స్పందన రేటు: 60 - 100.

3) కర్ణికల గోడలు పలుచగా, ధమనుల గోడలు మందంగా ఉంటాయి.

4) కాలులోని సిరలపై అధ్యయనం చేసే సమయంలో చిన్న కవాటాలను గైరోలామా ఫాబ్రిసి గుర్తించారు.


7. శరీర భాగాలకు రక్తం దేని నుంచి ప్రవహిస్తుంది?

1) ఎడమ జఠరిక      2) కుడి జఠరిక  

3) కుడి కర్ణిక      4) ఎడమ కర్ణిక


8. ద్వివలయ రక్తప్రసరణను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) గైరోలామా ఫాబ్రిసి      2) విలియం కోల్ఫ్‌  

3) విలియం హార్వే      4) 2, 3


9. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) అతి తక్కువ శరీర బరువు, అత్యంత గుండె బరువు, ఎక్కువ హృదయ స్పందనాలున్న జీవి - కోయల్‌ టిట్‌

2) అతి తక్కువ శరీర బరువు, గుండె బరువు, ఎక్కువ హృదయ స్పందనాలున్న జీవి - కోయల్‌టిట్‌

3) ఏనుగు గుండె బరువు 12 - 21 కేజీలు

4) అతి పెద్ద గుండె ఉన్న జీవి - నీలి తిమింగలం


10. జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థగా మారిన జీవులు-

1) హైడ్రా         2) జెల్లీ చేప  

3) ఫాసియోలా హెపాటికా      4) ఏలిక పాము


11. మొదటి ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏర్పడిన జీవులు-

1) వానపాము       2) ఏలికపాము  

3) ఫాసియోలా      4) స్పంజిక


12. వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులేవి?

1) ఇఖైనోడెర్మటా      2) ఆక్టోపస్‌  

3) సెఫలోపోడా      4) బొద్దింక


13. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

A) రక్తం మానవుడి శరీరంలో రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 60 సెకన్లు.

B) రక్తం వ్యాపన పద్ధతిలో 2 మీ. దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 60 ఏళ్లు.

C) రక్తం అనేది ఒక సంధాయక కణజాలం.

D) మన శరీరంలోని ఎర్ర రక్తకణాలను ఒక గొలుసులా అమర్చినట్లయితే దాని పొడవుతో భూమధ్యరేఖను 7 సార్లు చుట్టిరావచ్చు.

1) A, B, C, D       2) A, C, D   

3) A, D       4) A, B, D


14. మానవుడి హృదయం 24 గంటల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది?

1) 25,000      2) 36,000   

3) 15,000      4) 60,000


15. ఎర్రరక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ ప్రధాన విధి...

1) CO2, O2 రవాణా  2) CO2 రవాణా మాత్రమే

3) పోషకాల రవాణా  4) 1, 3


16. ఇచ్చిన వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

1) బొద్దింకలో రక్తం తెలుపు వర్ణంలో ఉంటుంది.    2) నత్త రక్తం నీలం రంగులో ఉంటుంది.

3) మానవుడిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది.     4) అన్నీ సరైనవే


17. కింది ఏ జీవి ఎర్రరక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది?

1) ఒంటె      2) లామా  

3) చాలనీ నాళాలు      4) పైవన్నీ


18. ఎర్ర రక్తకణాల జీవిత కాలం ఎన్ని రోజులు?

1) 120    2) 12   3) 30    4) 20


19. శిశువులో ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అయ్యే భాగం?

1) కాలేయం      2) ప్లీహం  

3) ఎముక మజ్జ      4) 1, 2


20. కిందివాటిలో సూక్ష్మ రక్షక భటులు అని వేటిని పిలుస్తారు?

1) బేసోఫిల్స్‌      2) న్యూట్రోఫిల్స్‌  

3) ఇసినోఫిల్స్‌      4) మోనోసైట్స్‌


21. రక్తంలోని పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు?

1) మోనోసైట్స్‌      2) లింఫోసైట్స్‌  

3) బేసోఫిల్స్‌       4) ఇసినోఫిల్స్‌


22. అతి తక్కువ హృదయ స్పందన ఉన్న జీవి-

1) ఏనుగు       2) మానవుడు  

3) నీలి తిమింగలం      4) ఏదీకాదు


23. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

A) ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను క్రిస్టియన్‌ బెర్నార్డ్, వారెన్‌స్కీకి చేశారు

B) మన దేశంలో మొదటిసారి గుండె మార్పిడిని వేణుగోపాల్, దేవిరామ్‌కు చేశారు

C) మొదటి కృత్రిమ గుండె జార్విక్‌ - 7

D) జార్విక్‌ - 7 తయారీలో పాలీయురెథీన్, అల్యుమినిలను ఉపయోగిస్తారు.

1) A, B, C, D       2) A, C, D  

3) A, D       4) A, D, B


24. కిందివాటిని జతపరచండి.

1) చేపలు ఎ) 13 గదుల హృదయం
2) ఉభయచరాలు బి) 4 గదుల హృదయం
3) బొద్దింక సి) 3 గదుల హృదయం
4) వానపాము డి) 2 గదుల హృదయం
  ఇ) 8 జతల పార్శ్వ హృదయాలు

 1) 1-ఎ; 2-బి; 3-సి; 4-డి      2) 1-డి; 2-సి; 3-ఎ; 4-ఇ 

3) 1-సి; 2-డి; 3-ఇ; 4-ఎ      4) 1-డి; 2-ఎ; 3-ఇ; 4-బి 


25. కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య ఉండే కవాటం-

1) త్రిపత్ర కవాటం      2) అగ్రద్వయ కవాటం

3) మహాధమని కవాటం     4) 1, 2


26. ఎడమ జఠరిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే కవాటం ఏది?

1) పుపుస కవాటం      2) మహాధమని కవాటం  

3) మిట్రల్‌ కవాటం      4) త్రిపత్ర కవాటం


27. కవాటాలను నియంత్రించడానికి తోడ్పడేవి-

1) అర్ధ చంద్రాకార నిర్మాణాలు      2) హృదయ గోడలు  

3) స్నాయు రజ్జువులు      4) రక్తనాళాలు


28. హృదయ స్పందనకు సంబంధించి కిందివాటిలో అసత్యమైంది?

1) ఒక సిస్టోల్‌ + ఒక డయాస్టోల్‌ - హృదయ స్పందన

2) ఒక సంకోచం + ఒక వ్యాకోచం - హృదయ స్పందన

3) ఒక లబ్‌ + ఒక డబ్‌ - హృదయ స్పందన

4) ఒక సంకోచం + ఒక సడలిక - హృదయ స్పందన


29. ఒక హార్ధిక వలయం పూర్తవడానికి పట్టే సమయం..

1) 0.8 సె. 2) 0.12 సె. 3) 0.62 సె. 4) 60 సె.


30. మానవుడిలో రోజుకు హృదయస్పందనాల సంఖ్య?

1) 1,03,000      2) 1,03,900  

3) 1,03,680       4) 72,000


31. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

A) రక్త నాళాల్లో రక్తప్రవాహం వల్ల కలిగే పీడనాన్ని రక్తపీడనం అంటారు.

B) దీనిని స్ఫిగ్మోమానోమీటర్‌తో కొలుస్తారు.

C) దీన్ని 1881లో విల్సన్‌ గ్రేట్‌బాచ్‌ కనుక్కున్నారు.

D) హృదయం స్పందించే రేటును నియంత్రించే మూలకం - మెగ్నీషియం.

1) A, B, C       2) A, B  

3) A, C, D       4) C, D


32. హృదయ స్పందనను పెంచే చర్యలు..

1) సహానుభూత నాడులు       2) ఎపినెఫ్రిన్‌     

3) థైరాక్సిన్‌         4) పైవన్నీ


33. శరీరంలో ఏ భాగాల్లో రక్తనాళాలు లేవు?

1) గోర్లు 2) ఎనామిల్‌ 3) రోమ పుటిక 4) 1, 2


34. శరీరంలోని రక్తం బరువు శాతం-

1) 15% 2) 7-10%    3) 18%  4) 20%


35. నీలిరంగు వర్ణం ఉండే జీవుల రక్తంలోని ప్రొటీను...

1) కాపర్‌       2) మెగ్నీషియం   

3) క్యాల్షియం      4) ఐరన్‌


36. ఎర్రరక్తకణాల నాశన ప్రక్రియను ఏమంటారు?

1) ఎరిథ్రోక్లేషియా       2) పాలీసైథీమియా  

3) ఎరిథ్రోపాయిసిస్‌      4) ఎనీమియా


37. డయాపెడిసిస్‌ అంటే ఏమిటి?

1) తెల్లరక్తకణాల చలనం

2) తెల్లరక్తకణాలు రక్తకేశనాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానం

3) తెల్లరక్తకణాల గుంపు   4) తెల్లరక్తకణాల సంఖ్య పెరగడం


38. రక్త ఫలకికల సంఖ్య తక్కువగా ఉంటే వచ్చే వ్యాధి.. 

1) డెంగీ     2) కరోనా 

3) హెచ్‌ఐవీ       4) మలేరియా


39. కిందివాటిలో రక్తాన్ని గడ్డకట్టించే రసాయన పదార్థం ఏది?

1) ఫాస్ఫరస్‌ పెంటాక్సైడ్‌       2) ఫెర్రిక్‌ క్లోరైడ్‌  

3) జింక్‌ ఫాస్ఫేట్‌     4) అల్యూమినియం హైడ్రాక్సైడ్‌


40. బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తాన్ని ఎన్ని రోజులపాటు నిల్వ చేస్తారు?

1) 50         2) 65    

3) 42         4) 100 



సమాధానాలు

1-3; 2-1; 3-3; 4-2; 5-4; 6-2; 7-1; 8-3; 9-1; 10-3; 11-1; 12-4; 13-1; 14-2; 15-1; 16-4; 17-4; 18-1; 19-4; 20-2; 21-1; 22-3; 23-1; 24-2; 25-1; 26-2; 27-3; 28-2; 29-1; 30-3; 31-4; 32-4; 33-4; 34-2; 35-1; 36-1; 37-2; 38-1; 39-1; 40-3.


 

 

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం

Posted Date : 19-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌