• facebook
  • whatsapp
  • telegram

వ్యాధి విజ్ఞానశాస్త్రం

స్త్రీలంటే భయపడితే.. గైనోఫోబియా!


 

వ్యాధి అధ్యయనం, రోగ నిర్ధారణ గురించి వివరించే వైద్యవిజ్ఞాన విభాగాన్నే వ్యాధి విజ్ఞాన శాస్త్రం లేదా రోగ నిర్ణయ శాస్త్రంగా పేర్కొంటారు. ఇది మానవ దేహంలోని కణాలు, కణజాలాలు, అవయవాల్లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా వ్యాధిని నిర్ధారించడంతో పాటు వ్యాధికారకాలను గుర్తిస్తుంది. గాయాలు, అంటురోగాలు, సాంక్రమిక వ్యాధులు, జన్యుపరివర్తనలు, రోగనిరోధక శక్తి వంటి వైద్యపరమైన అంశాలను శాస్త్రీయంగా తెలియజేసే వ్యాధి విజ్ఞాన శాస్త్రంపై పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. మానవాళిని పీడిస్తున్న ప్రధాన వ్యాధులు, వాటి కారకాలు, అవి శరీరంపై చూపే ప్రభావాలు, సంబంధిత పరిశోధనలు చేసి మందులు, టీకాలు కనిపెట్టిన శాస్త్రవేత్తల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

1.    కిందివాటిలో ఉష్ణ దేశాల్లో సాధారణంగా సంభవించే వ్యాధులు?

1) ప్లేగు      2) అమీబియాసిస్‌ 

3) ఫైలేరియాసిస్‌      4) పైవన్నీ


2.     కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.

ఎ) జీవజాతులన్నింటిలో జంతువులన్నీ పరపోషితాలు

బి) పారాసైట్‌ అనే ఆంగ్ల పదం లాటిన్‌ పదమైన పారాసైటోస్‌ నుంచి వచ్చింది.

సి) పరాన్నజీవనంలో రెండు జీవులూ లాభపడతాయి.

డి) సముద్ర చేపలో కోపిపాడ్స్‌ అనేవి బాహ్య పరాన్నజీవులు.

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, డి   4) బి, డి


3.     కిందివాటిలో ఏకాతిథేయి పరాన్నజీవులు?

1) ఆస్కారిస్‌ లుంబ్రికాయిడిస్‌ 

2) ప్లాస్మోడియం వైవాక్స్‌ 

3) ఉకరేరియా బాంక్రాప్టి 

4) నోసిమా నోటాబిలిస్‌


4.     కిందివాటిని జతపరచండి.

i) నియోప్లాసియా ఎ) ఫాసియోలా హెపాటికా ఉండే గొర్రె
ii) గింగాన్‌టిజమ్‌ బి) ట్రిపనోసోమా గాంబియెన్సీ
iii) హైపర్‌ ప్లాసియా సి) క్యాన్సర్‌ను కలిగించే వైరస్‌లు
iV) హైపర్‌ ట్రోపి డి) నత్తలో ఫాసియోలా హెపాటికా  

1) i-సి, ii-ఎ, iii-డి, iv-బి     2) i-డి, ii-ఎ, iii-బి, iv-సి 

3) i-సి, ii-డి, iii-ఎ, iv-బి     4) i-సి, ii-బి, iii-ఎ, iv- డి


5.     కిందివాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి.

1) ట్రిపనోజోమా గాంబియెన్సీ - ఆఫ్రికన్‌ అతినిద్ర వ్యాధి

2) లీష్మానియా డోనావాని - డండం జ్వరం

3) ప్లాస్మోడియం వైవాక్స్‌ -  మలేరియా

4) ఉకరేరియా బాంక్రాప్టి - తౌష్కంట్‌ పుండ్లు


6.     ఎంటమీబా హిస్టోలైటికా జీవిత చక్రంలో లేని దశలు?

1) పూర్వ పోషణ దశ     2) పోషక దశ  

3) కోశస్థ దశ     4) పూర్వకోశస్థ దశ


7. కిందివాటిలో ప్లాస్మోడియానికి ద్వితీయ ఆతిథేయి?

1) దోమ       2) కోతి   

3) మానవుడు      4) పంది


8.     కిందివాటిలో ప్లాస్మోడియం సాంక్రమిక దశ?

1) కొడవలి ఆకారపు స్పోరోజాయింట్లు   2) స్పోరోజాయింట్లు 

3) కణాంతస్థ దశ     4) 1, 2


9.     మలేరియా అనేది ఏ భాషా పదం?

1) జర్మనీ       2) లాటిన్‌  

3) అరబిక్‌      4) ఇటాలియన్‌ 


10. ప్రపంచ మలేరియా దినోత్సవం?

1) ఆగస్టు 20       2) జులై 20   

3) జూన్‌ 30       4) సెప్టెంబరు 20


11. కిందివాటిని జతపరచండి.

i) టైఫాయిడ్‌ ఎ) ఉకరేరియా 
ii) న్యుమోనియా బి) సాల్మోనెల్లాటైఫి
iii) జలుబు సి) స్ట్రెప్టో కోకస్‌
iv) ఫైలేరియాసిస్‌ డి) రైనా వైరస్‌

1) i-బి, ii-ఎ, iii-డి, iv-సి     2) i-బి, ii-ఎ, iii-సి, iv-డి 

3) i-బి, ii-సి, iii-డి, iv-ఎ  4) i-బి, ii-డి, iii-ఎ, iv-సి 


12. మశూచికి వ్యాక్సిన్‌ను కనుగొన్నది?

1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌     2) పాశ్చర్‌ 

3) విలియం హార్వే      4) రాబర్ట్‌ బ్రౌన్‌


13. కిందివాటిలో కలరా వ్యాధి జనకం?

1) సాల్మోనెల్లా     2) విబ్రియోకలరా 

3) రైనాకలరా     4) ప్లాస్మోడియం


14. కిందివాటిలో సైటోజాయిక్‌ పరాన్నజీవి?

1) ఎంటమీబా     2) ఉకరేరియా  

3) స్ఫీరోస్పోరా     4) ప్లాస్మోడియం


15. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు?

1) ఎల్లాప్రగడ  సుబ్బారావు    2) విలియం హార్వే  

3) లూయీపాశ్చర్‌        4) 1, 2


16. కిందివాటిలో క్యాన్సర్‌ నిరోధకం-

1) ఫాస్ఫోక్రియాటిన్‌    2) డైఈథైల్‌కార్బమజైన్‌

3) టెట్రాసైక్లిన్‌         4) మెథోట్రిక్సేట్‌


17. వ్యాధి అధ్యయన శాస్త్రం?

1) సింటమాలజీ     2) ట్రామాలజీ 

3) పాథాలజీ     4) నోటోలజీ


18. ప్లేగు వ్యాధికి ఆతిథేయి?

1) ఎలుక   2) పంది   3) ఈగ   4) దోమ


19. కిందివాటిలో పాండమిక్‌ వ్యాధి కానిది?

1) ధనుర్వాతం     2) బర్డ్‌ఫ్లూ 

3) ఆంత్రాక్స్‌     4) స్వైన్‌ఫ్లూ


20. కిందివాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి.

1) రాబిస్‌ - నాడీవ్యవస్థ       2) టైఫాయిడ్‌ - పేగు 

3) డిఫ్తీరియా - గొంతు     4) డయాబెటిస్‌ - రక్తం


21. మార్చి 24న ఏ వ్యాధి దినోత్సవం?

1) టైఫాయిడ్‌      2) టీబీ  

3) ప్లేగు      4) ఆంత్రాక్స్‌ 


22. కిందివాటిలో లైంగిక వ్యాధి కానిది?

1) గనేరియా      2) సిఫిలిస్‌ 

3) ఎయిడ్స్‌     4) ఆంత్రాక్స్‌


23. కిందివాటిలో జన్యుసంబంధిత వ్యాధి కానిది?

1) స్లీపింగ్‌ సిక్‌నెస్‌      2) హీమోఫిలియా 

3) థలసీమియా      4) గౌషల్‌ 


24. బయోటెక్నాలజీ ద్వారా తయారైన మొదటి     వ్యాక్సిన్‌?

1) బీసీజీ    2) డీపీటీ

3) హెపటైటిస్‌-బి     4) ఎంఎంఆర్‌


25. ఇమ్యునాలజీ పితామహుడు?

1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌     2) విలియం హార్వే 

3) పాశ్చర్‌    4) 1, 2


26. కిందివాటిలో తప్పుగా జతపరిచింది?

1) పెన్సిలిన్‌ - శిలీంధ్రం   2) క్లోరోమైసిన్‌ - శిలీంధ్రం

3) స్ట్రెప్టోమైసిన్‌ - బ్యాక్టీరియా    4) ఎరిత్రోమైసిన్‌ - బ్యాక్టీరియా 


27. కిందివాటిలో రెండో అద్భుత ఔషధం?

1) పెన్సిలిన్‌     2) టెట్రాసైక్లిన్‌ 

3) స్ట్రెప్టోమైసిన్‌     4) క్లోరోమైసిన్‌


28. స్త్రీలంటే భయపడటాన్ని ఏమంటారు?

1) గైనోఫోబియా     2) గ్లీరోఫోబియా

3) గెట్టోఫోబియా    4) 1, 2


29. సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు?

1) ఎడ్వర్డ్‌ జెన్నర్‌     2) విలియం హార్వే 

3) లూయీ పాశ్చర్‌     4) లీవెన్‌ హుక్‌


30. హెన్‌ హెర్జ్స్‌డ్‌ అనేది ఏ వ్యాధి నిర్మూలనా కార్యక్రమం?

1) మలేరియా      2) టీబీ 

3) సిఫిలిస్‌      4) గనేరియా


31. కిందివాటిలో మధుమేహ దినోత్సవం?

1) డిసెంబరు 11        2) నవంబరు 12   

3) నవంబరు 14        4) డిసెంబరు 01


32. కిందివాటిలో బర్డ్‌ఫ్లూ వ్యాధుల నివారణలో ఉపయోగించేది?

1) రెలెంజా      2) డాఫ్సోన్‌ 

3) జనామాలీర్‌     4) కాలమైన్‌


33. సర్‌ రోనాల్డ్‌ రాస్‌ నోబెల్‌ పొందిన సంవత్సరం?

1) 1972      2) 1912  

3) 1942      4) 1902


34. కాలమైన్‌ అనే వ్యాక్సిన్‌ దేనికోసం వాడతారు?

1) తట్టు     2) ఆటలమ్మ 

3) గవదబిళ్లలు      4) చికన్‌ గున్యా


35. ఎయిడ్స్‌ వ్యాధిని మొదటిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎక్కడ కనుగొన్నారు?

1) గుంటూరు      2) కర్నూలు  

3) చిత్తూరు      4) హైదరాబాద్‌


36. పిచ్చికుక్క కాటు వల్ల సంభవించే వ్యాధి?

1) రాబిస్‌     2) ఆంత్రాక్స్‌  

3) ఎయిడ్స్‌      4) ఫైలేరియా


37. అంగుడువాపు వ్యాధి జనకజీవి ఇంక్యుబేషన్‌ సమయం?

1) 15 రోజులు      2) 7 రోజులు  

3) 5 రోజులు      4) 8 రోజులు


38. నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపే వ్యాధి?

1) ఆంత్రాక్స్‌     2) న్యుమోనియా 

3) క్షయ     4) ధనుర్వాతం


39. కిందివాటిలో ట్రిపుల్‌ యాంటీజెన్‌తో సంబంధం లేనిది?

1) డిఫ్తీరియా     2) కోరింతదగ్గు 

3) మలేరియా     4) ధనుర్వాతం


40. ఎడిస్‌ దోమ ద్వారా వ్యాపించే వ్యాధి?

1) డెంగీ    2) చికన్‌ గున్యా
3) స్వైన్‌ఫ్లూ    4) 1, 2


41. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

ఎ) టెట్రాసైక్లిన్‌ - ఎల్లాప్రగడ సుబ్బారావు

బి) పెన్సిలిన్‌ - అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌

సి) పోలియో టీకా  - జోనస్‌ సాక్‌

డి) పోలియో చుక్కల మందు - ఆల్బర్ట్‌ సాబిన్‌

1) ఎ, బి, సి, డి    2) ఎ, సి, డి

3) ఎ, బి, డి    4) ఎ, బి


42. ఊపీంగ్‌ కాఫ్‌ అని దేనిని అంటారు?

1) డిఫ్తీరియా    2) టైఫాయిడ్‌    

3) కలరా     4) కోరింతదగ్గు


43. అజిటోథైమిన్‌ ఏ వ్యాధి నివారణకు ఇస్తారు?

1) బర్డ్‌ఫ్లూ    2) ఎయిడ్స్‌    

3) మలేరియా    4) డెంగీ


44. కిందివాటిలో పాండమిక్‌ వ్యాధి కానిది? 

1) పోలియో        2) క్షయ    

3) కరోనా        4) ఇన్‌ఫ్లూయెంజా




 

సమాధానాలు

1-4; 2-3; 3-1; 4-3; 5-4; 6-1; 7-3; 8-1; 9-4; 10-1; 11-3; 12-1; 13-2; 14-3; 15-1; 16-4; 17-3; 18-1; 19-1; 20-4; 21-2; 22-4; 23-1; 24-3; 25-1; 26-2; 27-2; 28-1; 29-3; 30-1; 31-3; 32-1; 33-4; 34-2; 35-4; 36-1; 37-3; 38-1; 39-3; 40-4; 41-1; 42-4; 43-2;  44-4.


రచయిత: వి. పద్మనాభం 

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌