1. పర్యావరణంలో ఉన్న ఆవరణాల సంఖ్య ఎంత?
జ: 4
2. పర్యావరణంలో ఉండేది
A) వాతావరణం B) జలావరణం C) శిలావరణం, జీవావరణం D) అన్నీ
జ: D (అన్నీ)
3. భూమిని ఆవరించి ఉన్న గాలిపొర
జ: వాతావరణం
4. వాతావరణంలో ప్రధానంగా ఉండే ఖండాల సంఖ్య ఎంత?
జ: 4
5. కిందివాటిని జతపరచండి.
విభాగం | విస్తరించిన ఎత్తు (కి.మీ.) |
1) ట్రోపో ఆవరణం | a) 50 - 85 |
2) స్ట్రాటో ఆవరణం | b) 85 - 500 |
3) మీసో ఆవరణం | c) 0 - 11 |
4) థర్మో ఆవరణం | d) 11 - 50 |
జ: 1-c, 2-d, 3-a, 4-b
6. వాతావరణంలోని ట్రోపో ఆవరణ విభాగంలో ఉండే ఉష్ణోగ్రతల అవధి సుమారుగా
జ: 15°C నుంచి 56°C
7. కిందివాటిని జతపరచండి.
విభాగం | ఉష్ణోగ్రత (°C) |
1) మీసో ఆవరణం | a) 15°C నుంచి 56°C |
2) ట్రోపో ఆవరణం | b) -56°C నుంచి -2°C |
3) థర్మో ఆవరణం | c) -2°C నుంచి -92°C |
4) స్ట్రాటో ఆవరణం | d) -92°C నుంచి 1200°C |
జ: 1-c, 2-a, 3-d, 4-b
8. వాతావరణంలోని ట్రోపో ఆవరణ విభాగంలో ఉండే ముఖ్యమైన రసాయన పదార్థాలు ఏవి?
జ: N2, O2, H2O, CO2
9. వాతావరణంలోని థర్మో ఆవరణ విభాగంలో ఉండే ముఖ్యమైన రసాయన పదార్థాలు ఏవి?
జ: O2+, O+, NO+
10. వాతావరణంలోని ఏ భాగంలో ఓజోన్ పొర ఉంటుంది?
జ: స్ట్రాటో ఆవరణం
11. మానవ కార్యకలాపాల కారణంగా, సహజ సమృద్ధి కంటే అధిక పరిమాణాల్లో ప్రకృతిలోకి ప్రవేశించి జీవరాశులు, మానవులపై దుష్ప్రభావాన్ని ప్రదర్శించే ప్రక్రియను ఏమంటారు?
జ: కాలుష్యం
12. కాలుష్యం ద్వారా దుష్ప్రభావానికి గురయ్యే మాధ్యమాన్ని ఏమంటారు?
జ: గ్రాహకం
13. చాలాకాలం నిలిచి ఉండే కాలుష్యాన్ని తనలో ఉంచుకుని దాంతో అన్యోన్య చర్య జరిపే మాధ్యమాన్ని ఏమంటారు?
జ: సింక్
14. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌కు సింక్లుగా ఉండేవి?
జ: మహాసముద్రాలు
15. ఆరోగ్యవంతుడైన పారిశ్రామిక కార్మికుడు 8 గంటల పనికాలంలో వాతావరణంలోని విష స్వభావ కాలుష్యానికి గురైనప్పటికీ, తాను ఎటువంటి హానికర ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు ఆమోదించిన విష కాలుష్య కనిష్ఠ పరిమాణాన్ని ఏమంటారు?
జ: TLV
16. కలుషిత నీటిలో కరిగి ఉన్న కర్బన రసాయన పదార్థాలను ఆక్సీకరణం చెందించేందుకు అవసరమయ్యే ఆక్సిజన్ పరిమాణాన్ని ఏమంటారు?
జ: COD
17. నీటిలో ఉండే కొన్ని ప్రత్యేక సూక్ష్మజీవులు 20°C వద్ద అయిదు రోజుల కాలవ్యవధిలో ఉపయోగించుకునే ఆక్సిజన్ పరిమాణాన్ని ఏమంటారు?
జ: BOD
18. శుద్ధ నీటి BOD విలువ
జ: 5 ppm
19. BOD ని వ్యక్తపరిచేందుకు అవసరమయ్యే కాలవ్యవధి.
జ: 5 రోజులు
20. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: జూన్ 5
21. 1984లో భోపాల్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది?
జ: మిథైల్ ఐసోసైనేట్
22. పాదరస కాలుష్యం వల్ల కలిగే వ్యాధి
జ: మినిమాటా
23. గాలి అధిక పరిమాణంలో ఉండి నీటిఆవిరి, మేఘాల్లో ఉన్న సంక్షోబిత కణమయ మండలాన్ని ఏమంటారు?
జ: ట్రోపో ఆవరణం
24. కిందివాటిలో వాయుస్థితి గాలి కాలుష్యాలు ఏవి?
A) సల్ఫర్, నైట్రోజన్, కార్బన్ల ఆక్సైడ్లు B) హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రో కార్బన్లు
C) ఓజోన్, ఆక్సీకరణులు D) అన్నీ
జ: D (అన్నీ)
25. కిందివాటిలో కణస్థితి కాలుష్యాలు ఏవి?
A) దుమ్ము, పొగమంచు B) ధూమాలు, పొగ C) స్మాగ్ D) అన్నీ
జ: D (అన్నీ)
26. మానవుల్లో ఉబ్బసం, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లోని వాయుగోళాల వాపు వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే వాయువు
జ: SO2
27. రవాణా వాహనాల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద శిలాజ ఇంధనాలు మండించినప్పుడు ఏర్పడే వాయువులు ఏవి?
జ: NO, NO2
28. అధిక పరిమాణాల్లో ఉండే ఏ వాయువు మొక్కల ఆకులను పాడుచేసి, కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గిస్తుంది?
జ: NO2
29. కిందివాటిలో కార్సినోజెనిక్ పదార్థాలు
A) కార్బన్ ఆక్సైడ్లు B) హైడ్రో కార్బన్లు C) ఫ్లోరో కార్బన్లు D) నైట్రోజన్ ఆక్సైడ్లు
జ: B (హైడ్రో కార్బన్లు)
30. మొక్కలు వాడిపోవడం, కణజాలాలు విచ్ఛిన్నం కావడం, ఆకులు, పువ్వులు, చిగుళ్లు రాలిపోవడం ద్వారా మొక్కలకు హాని కలగజేసేది?
జ: హైడ్రో కార్బన్లు
31. వాహనాల్లో శిలాజ ఇంధనాలు అసంపూర్ణ దహన చర్యకు గురైనప్పుడు వెలువడే వాయువు ఏది?
జ: CO
32. మానవశరీరంలో అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ప్రక్రియను అడ్డుకునే వాయువు ఏది?
జ: CO
33. వాతావరణంలో CO2 ఘనపరిమాణ శాతం ఎంత?
జ: 0.03%
34. శిలాజ ఇంధనాలను మండించడం, శ్వాసక్రియ, మోలాసిస్ కిణ్వన ప్రక్రియ, సున్నపురాయి విఘటనం చెందించడం లాంటి ప్రక్రియలో వెలువడే వాయువు ఏది?
జ: CO2
35. అద్దకపు రంగు తయారీ, ఎరువుల పరిశ్రమల్లో నుంచి వెలువడే కాలుష్య కారకం ఏది?
జ: అమ్మోనియా
36. బ్లాస్టు ఫర్నేస్, రసాయన లోహ ప్లేటింగ్ నుంచి వెలువడే కాలుష్య కారకం ఏది?
జ: హైడ్రోజన్ సయనైడ్
37. కిందివాటిలో హరితగృహ వాయువులు ఏవి?
A) నైట్రస్ ఆక్సైడ్, నీటిఆవిరి B) ఓజోన్, మీథేన్ C) CO2, CFC D) అన్నీ
జ: D (అన్నీ)
38. కుళ్లిన పదార్థాలు, చెత్తకుప్పలు, పెంటపోగులు, వరిపొలాల నుంచి వెలువడే హరితగృహ వాయువు ఏది?
జ: మీథేన్
39. ద్రవీకరణాలు, ఫోమ్‌ల నుంచి వెలువడే హరితవాయువు ఏది?
జ: CFC 12
40. వాతావరణంలో మీథేన్ జీవితకాలం ఎంత?
జ: 12 - 15 సంవత్సరాలు
41. వాతావరణంలో CFC జీవితకాలం ఎంత?
జ: 102 సంవత్సరాలు
42. హరితగృహ ప్రభావాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: జోసెఫ్ ఫోరియర్
43. కిందివాటిలో హరితగృహ వాయువు కానిది ఏది?
A) CO2 B) N2O C) O3 D) N2
జ: D (N2)
44. హరితగృహ ప్రభావాన్ని తగ్గించే చర్య ఏది?
A) చెట్లను, అడవులను పెంచడం
B) నీటిని, విద్యుత్‌ను, శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడుకోవడం
C) పంట పొలాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టకుండా, వాటిని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవడం
D) అన్నీ సరైనవే
జ: D (అన్నీ సరైనవే)
45. వాతావరణంలో హరితగృహ వాయువులు CO2, CH4, NO, O3, H2O ల శాతం
జ: 1%
46. ప్రకృతిలో సహజంగా ఉండని హరితగృహ వాయువు ఏది?
జ: పర్‌ఫ్లోరో మీథేన్
47. పారిశ్రామికీకరణ ప్రారంభమైన 150 సంవత్సరాల్లో వాతావరణంలో CO2 సాంద్రత ఎంత శాతం పెరిగింది?
జ: 31%
48. నేలబొగ్గు కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే CO2 శాతం ఎంత?
జ: 35%
49. గ్రీన్హౌస్ వాయువుల జాబితాలోకి కొత్తగా చేరిన వాయువు ఏది?
జ: పర్‌ఫ్లోరో మీథేన్, సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్
50. ఆమ్లవర్షపు నీటి pH విలువ
జ: 1.5 - 5.0
51. ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువులు
A) SO2, SO3 B) CO2 C) NO, NO2 D) అన్నీ
జ: D (అన్నీ)
52. ఆమ్ల వర్షాలు ఎన్ని రకాలు?
జ: 2
53. ఆమ్ల వర్షాల కారణంగా చెరువులు, సరస్సుల్లోని నీటి pH విలువ
జ: తగ్గుతుంది
54. వాతావరణంలో సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేసే భిన్న రకాల మానవ కార్యకలాపాల అనుజనితమే
జ: ఆమ్ల వర్షం
55. ఆమ్ల వర్షాల వల్ల సరస్సుల్లో ఆమ్లత్వం పెరిగినప్పుడు ఆమ్లాలు సరస్సులోని రేగడి మట్టితో రసాయనిక చర్య జరిపి విడుదల చేసే అయాన్లు ఏవి?
జ: Al+3
56. సాల్మాన్, ట్రవుట్ చేప జాతులు పూర్తిగా కనుమరుగై పోవడానికి కారణం
జ: ఆమ్ల వర్షాలు
57. ఆకులపై ఉన్న పత్రహరితం నశించి తెల్లగా మారి కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగకుండా పంట దిగుబడి తగ్గిపోవడానికి కారణం?
జ: జల కాలుష్యం
58. ఆగ్రాలోని తాజ్‌మహల్ కట్టడం ఆమ్ల వర్షాల వల్ల వన్నె కోల్పోవడానికి కారణమయ్యే వాయువు ఏది?
జ: SO2
59. మానవుల్లో చర్మక్యాన్సర్ వ్యాధికి కారణమయ్యేవి?
జ: UV - కిరణాలు
60. ఓజోన్ పొర తరిగిపోవడానికి ముఖ్య కారణం?
జ: CFC
61. ఒక CFC అణువు ఎన్ని O3 అణువులను నాశనం చేస్తుంది?
జ: 1,00,000
62. ఓజోన్‌కి పడిన రంధ్రాన్ని శాస్త్రవేత్తలు అంటార్కిటికా ప్రాంతంలో ఎప్పుడు గుర్తించారు?
జ: 1986
63. కంటి శుక్లాలు, చర్మం వడిలిపోవడం, చర్మంపై బొబ్బలు ఏర్పడటం వంటి సమస్యలకు కారణం?
జ: ఓజోన్ పొర తగ్గడం
64. పిచికారీ ద్రవాల్లోని కణాలు, గాలిలోని బాష్పాలు ద్రవీకరణం చెందడం ద్వారా ఏర్పడేవి?
జ: మిస్ట్‌లు
65. ఉత్పతనం, స్వేదనం, బాష్పీభవనం, ఇతర రసాయన ప్రక్రియల్లోని బాష్పాల ద్వారా ఏర్పడేవి?
జ: ధూమాలు
66. ప్రపంచంలోని చాలా పట్టణాల్లో ఏ రకమైన గాలి కాలుష్యం కనిపిస్తుంది?
జ: స్మాగ్
67. కాంతి రసాయన స్మాగ్‌లో సాధారణంగా ఉండే అనుఘటకాలు ఏవి?
A) ఓజోన్, ఫార్మాల్డిహైడ్ B) నైట్రిక్ ఆక్సైడ్, ఎక్రోలిన్
C) పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్లు, ఫార్మాల్డిహైడ్ D) అన్నీ
జ: D (అన్నీ)
68. కిందివాటిలో శక్తివంతమైన కంటి ప్రకోపాలు ఏవి?
A) ఓజోన్, PAN B) ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్లు C) ఎక్రోలిన్, ఫార్మాల్డిహైడ్ D) అన్నీ
జ: A (ఓజోన్, PAN)
69. ముక్కు, గొంతులను ప్రకోపానికి గురి చేసేవి ఏవి?
జ: ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్లు
70. రబ్బరు బీటలు ఏర్పడేందుకు, లోహాలు, రాళ్లు, నిర్మాణ వస్తువుల ఉపరితలాల క్షీణతకు కారణం?
జ: కాంతి రసాయన స్మాగ్
71. సాధారణంగా నీటికి ఉన్న మంచి లక్షణాలకు భంగం వాటిల్లడాన్ని ఏమంటారు?
జ: నీటి కాలుష్యం
72. చీడ, క్రిమి సంహారకాలు, రసాయన వ్యర్థ పదార్థాల్లోని ఏ పదార్థం ద్వారా ప్రధానంగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది?
జ: ఆర్సెనిక్
73. థర్మల్, న్యూక్లియర్ శక్తి ఉత్పత్తి కేంద్రాలు; రోదసి పరిశ్రమల నుంచి వెలువడే ఏ విష పదార్థం జల కాలుష్యానికి కారణం అవుతుంది?
జ: బెరీలియం
74. లెడ్ విష ప్రభావం మానవ శరీరంపై ఏ విధంగా ఉంటుంది?
జ: రక్తక్షీణత; మూత్రపిండాలు, నాడీమండల క్షీణత
75. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం ఎంతకంటే తక్కువగా ఉంటే చేపల పెరుగుదలను నిరోధించవచ్చు?
జ: 6 ppm
76. గరిష్ఠ స్థాయిలో కాలుష్యాన్ని ప్రదర్శించే నీటి BOD విలువ ఎంత?
జ: 17 ppm లేదా అంతకంటే ఎక్కువ
77. కిందివాటిలో కార్సినోజెనిక్ పదార్థం ఏది?
A) డిటర్జెంట్లు B) ఎరువులు C) CFC D) PCB
జ: D (PCB)
78. కిందివాటిలో నీటికాలుష్య లక్షణం ఏది?
A) తాగే నీటి రుచి పాడవడం
B) నీటిలో కలుపు మొక్కలు పెరగడం
C) సాగరం, నదుల, సరస్సుల తీరాలు ఘాటైన దుర్వాసనను వెదజల్లడం
D) అన్నీ సరైనవే
జ: D (అన్నీ సరైనవే)
79. తాగేనీటిలో ఉండే లోహ కాలుష్య అత్యధిక అవధి
జ: 0.005 మిల్లీ.గ్రా/ఘ.మీ.
80. తాగేనీటిలో ఉండే Fe అత్యధిక అవధి (ppm లలో)
జ: 0.2
81. తాగేనీటిలో ఉండే Cu అత్యధిక అవధి (ppm లలో)
జ: 3.0
82. తాగేనీటిలో ఫ్లోరైడ్ అయాన్ గాఢత ఎంత ఉండే విధంగా ద్రావణీయ ఫ్లోరైడ్‌ను నీటికి కలుపుతారు?
జ: 1 ppm
83. తాగే నీటిలో ఎంత పరిమాణంలో ఉండే ఫ్లోరైడ్ అయాన్ ఎముకలకు, దంతాలకు హాని కలిగిస్తుంది?
జ: 10 ppm కంటే ఎక్కువ
84. తాగేనీటిలో లెడ్ గాఢత గరిష్ఠంగా ఎంత ఉండాలి (ppb లలో)
జ: 50
85. కలుపు మొక్కల నాశకాల తయారీలో ఉపయోగించే పదార్థాలు ఏవి?
జ: NaClO3, Na3AsO3
86. పర్యావరణ క్షీణతను తగ్గించడం లేదా కాలుష్యాన్ని కనిష్ఠ స్థాయిలో ఉంచడం అనే వాటి ఆధారంగా రూపొందించిన పదార్థ ఉత్పత్తి ప్రక్రియలను ఏమంటారు?
జ: హరిత రసాయన శాస్త్రం
87. వస్త్రాల నిర్జల శుద్ధిక్రియలో ఉపయోగించే పదార్థం ఏది?
జ: కార్బన్ డై ఆక్సైడ్, డిటర్జెంట్ల మిశ్రమం
88. కాగితాలను వివర్ణం చేసేందుకు ఉపయోగించే పదార్థం ఏది?
జ: H2O2