• facebook
  • whatsapp
  • telegram

 జ్ఞానేంద్రియాలు

కన్ను

1. మనోజ్‌ అనే బాలుడు చిత్రకళ ప్రదర్శనకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని రంగులను గుర్తించాడు. అతడు రంగులను గుర్తించడానికి కంటిలోని ఏ పదార్థం ఉపయోగపడింది?
జ: కోనుల్లో ఉండే వర్ణకం

 

2. కంటిగుడ్డులో కేవలం ఎన్నో వంతు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది?
జ: 1/6వ వంతు

 

3. కన్ను అధ్యయనశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఆప్తల్మాలజీ

 

4. కంటికి వచ్చే వ్యాధుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి ఏది?
జ: ట్రకోమా

 

5. ఆధార్‌ లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు కంటిలో ఏ భాగాన్ని ఫొటోగా తీస్తారు?
జ: కనుపాప

 

6. నేత్రపటలంలో దండాలు, కోనుల నిష్పత్తి?
జ: 15 : 1

 

7. కిందివాటిలో దృఢసర్తం లక్షణం ఏది?
      1) పలుచని, మృదువైన, తంతుయుతం కాని, స్థితిస్థాపకత ఉన్నది
      2) దళసరి, మృదువైన, తంతుయుతం కాని, స్థితిస్థాపకత ఉన్నది
      3) దళసరి, గట్టిగా, తంతుయుతం కాని, స్థితిస్థాపకత లేనిది
      4) దళసరి, గట్టిగా, తంతుయుతమైన స్థితిస్థాపకత లేనిది
జ: 4 (దళసరి, గట్టిగా, తంతుయుతమైన స్థితిస్థాపకత లేనిది)

Posted Date : 13-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.