• facebook
  • whatsapp
  • telegram

భారతీయ సంస్కృతి, మతాలు

దేవుడికి మానవులందరూ సమానం!

అనేక మతాల సమాహారంగా వృద్ధి చెందిన భారతీయ సంస్కృౖతి సహస్రాబ్దాలుగా వర్ధిల్లుతోంది. విశ్వాసాలు, ఆచారాలు, తత్వాల ఆధారంగా ధర్మాన్ని, కర్మను హిందూ మతం ప్రవచిస్తే, జ్ఞానం, దయ, సామాజిక విలువలు ప్రధానమని బౌద్ధం బోధిస్తోంది. అహింస, సన్యాస జీవనాలను జైనిజం చాటుతోంది. సమానత్వాన్ని, సేవాభావాన్ని సిక్కుమతం ప్రోత్సహిస్తోంది. భారతీయతను ప్రభావితం చేసిన ఇస్లాం సహా భిన్న మతాల విశిష్ట సాంస్కృౖతిక వారసత్వాన్ని పోటీ పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి. వివిధ మతాల స్థాపకులు, వారి ప్రబోధాలు, పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకోవాలి. 


1. సిక్కు మత స్థాపకుడు ఎవరు?

1) గురునానక్‌     2) అర్జున్‌ సింగ్‌ 

3) గురుగోవింద్‌ సింగ్‌     4) కబీర్‌


2. కింది వాటిలో రాజ్యాంగం గుర్తించని భాష?

1)సంస్కృతం    2) కాశ్మీరి   3) నేపాలి 4) ఆంగ్లం 



3. సింధు నాగరికతకు సంబంధించిన పశుపతి ముద్రిక లభించిన ప్రదేశం ఏది?

1) హరప్పా     2) మొహంజొదారో 


  3) లోథాల్‌    4) కాళీభంగన్‌




4. కిందివాటిలో సింధు లిపికి సంబంధించి సరికానిది?

1) ఇది బొమ్మల్లాంటి చిహ్నాలను పోలి ఉంటుంది.

 2) దీన్ని బొమ్మల లిపి అంటారు.

3) ఈ లిపిని ప్రస్తుతం అందరూ అర్థం చేసుకుంటు న్నారు.

4) సింధు లిపిని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.


 

5. అశోకుడి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి?

1) బ్రహ్మి   2) పాళి  3) ఖరోష్ఠి  4) ప్రాకృతం




6. ‘తీర్థంకరులు’ ఏ మతానికి చెందినవారు?

1) జైనం   2) బౌద్ధం  3) సిక్కు  4) హిందూ




7. జైన తీర్థంకరులు మొత్తం ఎంతమంది?

1) 20      2) 22     3) 24     4) 25


8. బౌద్ధమత స్థాపకుడు ఎవరు?

1) వర్ధమానుడు      2)సిద్ధార్థుడు 

3) గోశాలుడు     4) రుషభనాథుడు


9. జైనమత స్థాపకుడు ఎవరు? 

1)  వర్ధమాన మహావీరుడు    2) రుషభనాథుడు 

3)పార్శ్వనాథుడు         4) నేమినాథుడు


10. కిందివాటిలో వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరికాని జత?

1) తల్లి - త్రిశాల      2) తండ్రి - సిద్ధార్థ 

3) భార్య - యశోధర    4) జన్మస్థలం - వైశాలి




11. కిందివాటిలో గోమఠేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? 

1)  శ్రావణ బెళగొళ     2) రామేశ్వరం 

3)మైసూర్‌    4) శ్రీరంగపట్నం



12. పంచ వ్రతాల్లో బ్రహ్మచర్యం అనేదాన్ని చేర్చిన      తీర్థంకరుడు ఎవరు?

1) పార్శ్వనాథుడు     2) వర్ధమాన మహావీరుడు 

3) సంభవనాథుడు     4) అజితనాథుడు


 

13. కిందివాటిలో గౌతమ బుద్ధుడు చూసిన సంఘటలను వరుసలో అమర్చండి.

1) వృద్ధుడు - రోగి - శవం - సన్యాసి

2) రోగి - వృద్ధుడు - సన్యాసి - శవం

3) సన్యాసి - శవం - రోగి - వృద్ధుడు

4) రోగి - శవం - వృద్ధుడు - సన్యాసి



 

14. బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ఏమంటారు?

1) త్రిపీఠికలు     2) ఆర్యసత్యాలు     3) అష్టాంగ మార్గాలు     4) ఏదీకాదు

15. గౌతమ బుద్ధుడు మరణించిన ప్రదేశం?

1) లుంబిని      2) వైశాలి       3) పావపురి    4)కుశీ నగరం

16. కిందివాటిలో ఏ మతం ‘మధ్యేమార్గం’ను     అనుసరించింది?

1) జైన మతం     2) బౌద్ధ మతం    3) హిందూ మతం    4) సిక్కు మతం




 

17. ఇస్లాంలో ‘కాబా’ అనేది?

1) ఒక మసీదు పేరు    2) మహ్మద్‌ ప్రవక్త సంతానం

3) మక్కా మసీదు మధ్యలో ఉన్న భవనం   4)ఏదీకాదు


18. ‘సిక్కు’ అనే పదానికి అర్థం?

1) గురువు    2) శిష్యుడు   3)సింహం    4) పూజారి


19. సిక్కుల పవిత్ర ప్రదేశమైన స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది?

1) లాహోర్‌    2) అమృత్‌సర్‌     3) తల్వండి    4) ఉజ్జయిని




20. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో ‘రొట్టెల పండుగ’ ప్రసిద్ధి?

1) నెల్లూరు      2) చిత్తూరు     3) గుంటూరు  4) విశాఖపట్నం




21. సిక్కుమత గురువులు ఎంత మంది?

1) 10      2) 11      3) 12     4) 1


 

22. సిక్కు మతం పవిత్ర ప్రదేశాలను ఏ పేరుతో  పిలుస్తారు?

1) గురుద్వారాలు       2) మసీదులు    3) గురుగ్రంథ్‌లు    4) గురుపీఠికలు

23. చివరి సిక్కు గురువు?

1)  గురునానక్‌       2) గురు అంగద్‌     3) తేజ్‌ బహదూర్‌      4) గోవింద్‌ సింగ్‌




24. ‘గురుగ్రంథ్‌ సాహిబ్‌’ అనేది?

1)  సిక్కుమత గురువుల దినచర్య

2) దేవాలయాల్లో చేసే ప్రార్థనా గ్రంథం

 3) సిక్కుల పవిత్ర గ్రంథం

4) సిక్కుల పవిత్ర ప్రదేశం



25. ప్రపంచంలో అతిచిన్న దేశం?

1)  ఇరాన్‌     2)మాల్దీవులు    3) ఇండోనేసియా      4) వాటికన్‌ సిటీ 


26. కిందివాటిలో మహావీరుడి బిరుదు?    

1) జినుడు  2) మహావీర    3) తథాగత        4) 1, 2

27. బౌద్ధమత కట్టడమైన ‘సాంచి స్తూపం’ ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌      2) ఉత్తర్‌ ప్రదేశ్‌    3) కర్ణాటక     4) బిహార్‌


28. ‘సల్లేఖన వ్రతం’ ఏ మతానికి చెందింది?

1) బౌద్ధ మతం      2) జైన మతం 

3) క్రైస్తవ మతం     4) అజీవకం

29. కింది మతాలు, వాటి వ్యవస్థాపకులను జతపరచండి.

ఎ) బౌద్ధం              1) వర్ధమానుడు

బి) అజీవకం          2) మహ్మద్‌ ప్రవక్త

సి) ఇస్లాం              3) గోశాలుడు

డి) జైనం               4) సిద్ధార్థుడు


1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-4, బి-3, సి-2, డి-1  

3) ఎ-1, బి-3, సి-4, డి-2   4) ఎ-4, బి-1, సి-2, డి-3

30. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన మగధ రాజు?

1) మహా పద్మనందుడు     2) బిందుసారుడు 

3) చంద్రగుప్త మౌర్యుడు     4) అజాతశత్రువు


31. పంచ వ్రతాల్లో ఒకటైన ‘అస్తేయం’ అంటే?

1) సొంత ఆస్తి ఉండకపోవడం. 

2) దొంగతనం చేయకుండా ఉండటం. 

3) అసత్యం పలకకుండా ఉండటం.

4) దాన ధర్మాలు నిర్వహించడం.



 

32. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌ను రచించినవారు? 

1) గురునానక్‌     2) గురుగోవింద్‌ సింగ్‌ 

3) అర్జున్‌ సింగ్‌     4) గురు అంగద్‌


33. సిద్ధార్థుడు ఏ రాజ్యానికి యువరాజు?

1) కోసల    2) కపిల వస్తు    3) వైశాలి    4) అస్మక




 

34. కింది వాటిలో మహ్మద్‌ ప్రవక్త బోధనలకు  సంబంధించి సరైంది?

1) దేవుడికి మానవులందరూ సమానం. 

2) విగ్రహారాధన సరైంది కాదు.

3) దేవుడికి ఆకారం ఉండదు, ఆయన నిరాకారుడు.

4) పైవన్నీ

35. సింధు ప్రజలు పూజించిన ప్రధాన దైవం?

1) అమ్మతల్లి       2) పశుపతి 

3)  మహేశ్వరుడు     4) పైవారందరూ



36. భారత దేశం ‘లౌకిక దేశం’ ఎందుకంటే?

1) భారత్‌కు అధికార మతం లేదు. 

2) అన్ని మతాలు సమానమే.

3) మతం రాజ్యాధికారాన్ని నిర్ణయించదు.

4) పైవన్నీ




37. గౌతమ బుద్ధుడి పినతల్లి ఎవరు?

1) మాయాదేవి     2) త్రిశాల     3)  గౌతమి     4) సుజాత



 

38. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఏ మతం బ్రాహ్మణ   ఆధిక్యతను ప్రశ్నించింది?

1) బౌద్ధం     2) జైనం    3)  అజీవకం   4)పైవన్నీ
 



39. కిందివాటిలో హిందూ మతానికి సంబంధించి   సరికానిది?

1) హిందూ అనేది సింధు అనే పదం నుంచి వచ్చింది.

2) హిందూ మతం వసుదైక కుటుంబాన్ని చాటి చెప్పింది.

3)  హిందూ మతం అత్యంత నవీనమైంది.

4) వేదాలు, రామాయణం, మహాభారతం ముఖ్యమైన హిందూ గ్రంథాలు.



40. జైనమత మొదటి తీర్థంకరుడు ఎవరు?

1) రుషభనాథుడు     2) వర్ధమాన మహావీరుడు 

3)  అజిత నాథుడు   4) పార్శ్వనాథుడు

41. కింది సిక్కు మత గురువులకు సంబంధించి సరైంది?

1) గురు అర్జున్‌ సింగ్‌ 5వ సిక్కు మత గురువు

2) గురుతేజ్‌ బహదూర్‌ 9వ సిక్కు మత గురువు    

3) గురు రామదాస్‌ 4వ సిక్కు మత గురువు

4) పైవన్నీ సరైనవి

42. ‘రామచరిత మానస్‌’ను రచించినవారు?

 1) తులసీదాస్‌     2) కంబన్‌    3)కవయిత్రి మొల్ల      4) పొన్న కవి


43. కింది వాటిలో మహాభారతానికి సంబంధించి   సరికానిది?

 1) దీని అసలు పేరు జయసంహిత.

 2) మహాభారతం ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం.

3) మహాభారతాన్ని ఆది కావ్యం అని పిలుస్తారు.

4) మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు.


 


44. సింధు ప్రజలతో పూజలందుకున్న పశుపతిని ఆధునిక యుగంలో ఏ దైవంతో పోల్చారు? 

1) శివుడు     2) బ్రహ్మ     3) విష్ణువు    4) కార్తికేయ


 

45. తొలి వేద ఆర్యులు పూజించిన నది?

1) గంగా     2) యమునా 

3) సరస్వతి    4) గోదావరి


46. ఆశ్రమ ధర్మాలు ఎన్ని?

1) 4      2) 5    3) 7     4) 3




47. కిందివారిలో ‘ఆంధ్ర పద కవితా పితామహుడు’ అని ఎవరిని పిలుస్తారు?

1)బమ్మెర పోతన         2) అల్లసాని పెద్దన   

3) తాళ్లపాక అన్నమాచార్యులు     4) శ్రీనాథుడు



48. కింది వారిలో బౌద్ధ మతానికి సేవలందించిన భారత దేశ రాజులు?

1) అశోకుడు       2) కనిష్కుడు   

3) హర్షవర్ధనుడు     4) పైవారందరూ



 

49. కిందివాటిలో రామాయణానికి సంబంధించి     సరికానిది?

1) రామాయణాన్ని ఆదికావ్యం అని పిలుస్తారు.

2) దీనిలోని భాగాలను ‘స్కందాలు’ అంటారు. 

3)తెలుగులో రంగనాథ రామాయణం అత్యంత ప్రసిద్ధి చెందింది.

4) రామాయణాన్ని మొదట సంస్కృతంలో రచించారు.

50. త్రిపీఠికలు, అష్టాంగ మార్గాలు ఏ మతానికి   చెందినవి?

1) జైన మతం    2) బౌద్ధ మతం   

3) అజీవకం      4) ఇస్లాం

సమాధానాలు

1-1; 2-4; 3-2; 4-3; 5-4; 6-1; 7-3; 8-2; 9-1; 10-3;  11-1; 12-2; 13-1; 14-1; 15-4; 16-2; 17-3; 18-2; 19-2; 20-1; 21-1; 22-1; 23-4; 24-3; 25-4; 26-4; 27-1; 28-2; 29-2; 30-3; 31-2; 32-3; 33-2; 34-4; 35-1; 36-4; 37-3; 38-4; 39-3; 40-1; 41-4; 42-1; 43-3; 44-1; 45-3; 46-1; 47-3; 48-4; 49-2; 50-2.



రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు   

Posted Date : 28-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.