• facebook
  • whatsapp
  • telegram

సామ్రాజ్యాలు - గణతంత్రాలు - ఆవిర్భావం

సాంచీ స్తూపంలో గణరాజ్యాల యుద్ధ సన్నివేశం


భారతదేశ పురాతన ప్రాదేశిక విభాగాలు జనపదాలు. ఇవి వేదకాల సమాజం నుంచి మహాసామ్రాజ్యాలు ఆవిర్భవించడంలో కీలకంగా వ్యవహరించాయి. దేశ ప్రాచీన నాగరికత రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డాయి. భిన్న సంస్కృతులు, పరిపాలనా వ్యవస్థలను పెంపొందించాయి.  రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చట్రాలను ఏర్పరచడంలో  ప్రధానపాత్ర పోషించాయి. భారతీయ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అనంతర కాలంలో మగధ ఒక శక్తిమంతమైన మహా సామ్రాజ్యంగా ఎదిగిన విధానాన్ని అర్థం చేసుకోవాలి.  


1.  ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదానాన్ని ఏమంటారు?

1) గంగా మైదానాలు     

2) సింధూ మైదానాలు  

3) గంగా - సింధూ మైదానాలు  

4)  సింధూ - బ్రహ్మపుత్ర మైదానాలు



2.  గంగా - సింధూ మైదానాలు ఏ రకం నేలలను కలిగి ఉంటాయి?

1) నల్లరేగడి     2) ఒండ్రు  

3) ఎర్ర నేలలు   4) పైవన్నీ



3. సంస్కృతంలో ‘జన’ అంటే?

1) సమూహం  2) సంఘం   3) పదం 4) ఏదీకాదు



4. జనపదాలు ఎన్ని సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి?

1) 2700  2) 7200  3) 2400  4) 4260



5. గంగానది పరిసర ప్రాంతాల్లోని పెద్ద గ్రామాలు/ పట్టణాలను ఏమంటారు?

1) జనపదాలు    2) మహాజనపదాలు 

3) మహారాజ్యాలు   4) పైవన్నీ



6. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) జనపదాల గురించి అధ్యయనానికి పురాతత్వశాస్త్త్ర్రవేత్తలు 1000 గ్రామాల్లో తవ్వకాలు జరిపారు.

బి) వీటి గురించి తెలుసుకోవడానికి పురావస్తు   ఆధారాలున్నాయి.

సి) జనపదాల గురించి తెలుసుకోవడానికి వందలాది గ్రామాల్లో తవ్వకాలు చేశారు.

డి) జనపదాల గురించి తెలుసుకోవడానికి లిఖిత  పూర్వక ఆధారాలు ఉన్నాయి.

1) ఎ, బి, సి, డి   2) బి, సి, డి 

3) ఎ, సి, డి   4) ఎ, బి, సి



7.  మహాజనపదాల్లో దక్షిణాన ఉన్న ప్రాంతం?

1) తక్షశిల  2) ఉజ్జయిని  3) అస్మక     4) అంగ



8.  జనపదాల కాలం నాటి ముఖ్యమైన పురావస్తు ప్రాంతాలు?

1) ఢిల్లీ, కౌశాంబి    2) అత్రంజిఖేరా  

3) అయోధ్య    4) పైవన్నీ



9.  కిందివాటిలో జనపదాల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు? 

1) దిగానికాయ    2) మజ్జిమనికాయ  

3) ధర్మసూత్రాలు    4) పైవన్నీ



10. కిందివాటిని జతపరచండి.

1) భర్తుక   ఎ) రోజువారి కూలీ పనివారు

2) దాస    బి) రాజు అమ్మేసేవారు

3) గృహపతి    సి)  వ్యవసాయం చేసేవారు

4) కమ్మరి   డి) నాగటి కర్రలు తయారుచేసేవారు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     

2) 1-ఎ, 2-సి, 3-డి, 2-బి

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ 

4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి



11. మహాజనపదాల్లోని నగరాల్లో ఏ రకంవారు  అధికంగా ఉన్నారు?

1) గుర్రాల శిక్షకులు  

2) లోహ పరికరాలు తయారుచేసేవారు  

3) తాపీ పనివారు      

4) పైవారంతా



12. జనపదాల్లోని నగరాల్లో విలాసవంతమైన జీవనం గడిపినవారు?

1) గృహపతులు  2) రాజులు  

3) వ్యాపారులు   4) పైవారందరూ



13. జనపదాల కాలం నాటి రాజుల ప్రధాన ఆదాయ వనరు?

1) బలి      2) భాగ    

3) 1, 2    4) పన్నేతర ఆదాయం



14. రాజు ఎంత శాతం ‘భాగ’ వసూలు చేసేవాడు?



15. కిందివాటిలో సరికాని వాక్యాలు?

ఎ) జనపదాల కాలంలో రాజు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు.

బి) ఓడిన రాజు వద్ద నుంచి వసూలుచేసే నష్టపరిహారం - బలి.

సి) వృత్తి పనివారికి పన్నులో మినహాయింపు ఉంది.

డి) పశుషోషకులు నగదు రూపంలో పన్ను చెల్లించేవారు.

1) ఎ, బి, సి   2) సి, డి 

3) బి, సి   4) ఎ, బి, సి, డి



16. మహాజనపదాల్లో గ్రామపెద్దగా ఎవరు చలామణి అయ్యేవారు?

1) అధిక గోవులు ఉన్నవారు 

2) అత్యధిక ధనవంతులు

3) అత్యధిక భూమి ఉన్నవారు  

4) రాజులు



17. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) జనపదాల కాలం నాటి రాజులు నిరంతరం యుద్ధాలు చేసేవారు.

బి) ఓడిన రాజుల సైనికులను బానిసలుగా     పట్టుకోలేదు.

సి) గ్రామ దహనాలకు పాల్పడేవారు.

డి) లూటీలకు పాల్పడేవారు కాదు.

1) ఎ, బి, సి, డి   2) ఎ, సి   3) సి, డి   4) బి, డి



18. మగధ సామ్రాజ్యపు దక్షిణ భాగంలో అధికంగా లభించే ఖనిజం?

1) బంగారం    2) వెండి  

3) ఇనుము     4) పైవన్నీ



19. మగధ రాజ్యం బలంగా ఉండటానికి కారణం?

ఎ) నదులు రవాణాకు, వ్యవసాయానికి అనుకూలంగా ఉండటం.

బి) అడవుల్లోని ఏనుగులను పట్టుకుని యుద్ధ శిక్షణ ఇవ్వడం.

సి) దీన్ని బలమైన రాజులు పాలించడం.

డి) ఇనుము నిల్వలు అధికంగా ఉండటం.

1) ఎ, బి, సి     2) బి, సి, డి  

3) ఎ, బి, సి, డి   4) సి, డి



20. మగధను వాయవ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించిన రాజు?

1) ధన నంద   2) బింబిసార  

3) మహా పద్మనందుడు   4) బిందుసార



21. వజ్జి ఏ రకమైన రాజ్యం?

1) స్వతంత్ర  2) రాచరికం 3) గణ  4) పైవన్నీ



22. వజ్జి, మగధ సామ్రాజ్యానికి ఏ వైపున ఉంది?

1) దక్షిణం  2) ఉత్తరం   

3) తూర్పు   4) పశ్చిమం



23. కిందివాటిలో గణతంత్ర రాజ్యాలకు సంబంధించిన భిన్నమైంది?

1) కురు   2) పాంచాల 3) కోసల  4) అస్మక



24. కిందివాటిలో గణతంత్ర రాజ్యాలకు సంబంధించి భిన్నమైంది?

1) హస్తినాపురం   2) శోతవతి  

3) మత్స్య    4) మగధ



25. కిందివాటిలో గణతంత్ర రాజ్యాలకు సంబంధించి భిన్నమైంది?

1) కంబోడియా   2) గాంధార 

3) అంగ  4) మాళ్వా



26. గణతంత్ర రాజ్యాలకు సంబంధించిన పురాతత్వ ప్రాంతం కానిది?

1) అత్రంజిఖేరా     2) కౌశాంబి   

3) ధరణికోట     4) పాటలీపుత్రం



27. కింది వాక్యాల్లో సరైనవి? 

ఎ) గాంధార జనపదం గంగానది తీరంలో ఉంది. 

బి) పాంచాల జనపదం గంగానదికి ఇరువైపులా ఉంది.

సి) సూరసేనకు పశ్చిమ దిక్కున ఉన్న జనపదం మత్స్య.

డి) గోదావరి నదీ తీరంలో ఉన్న జనపదం అస్మక. 

1) ఎ, బి, సి, డి   2) బి, సి, డి   

3)  ఎ, బి, డి    4) ఎ, సి, డి 



28. జనపదాల కాలంలో గహపతి అంటే? 

1) రోజువారీ కూలీ.

2) యుద్ధంలో ఓడిన రాజు సైనికుడు

3) వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు

4) కమ్మరివాడు



29. కిందివాటిని జతపరచండి.

1) వజ్జి    ఎ) ఉజ్జయిని

2) అవంతి   బి) మత్స్య

3) విరాట నగరం   స్శి వైశాలి

4) తక్షశిల     డ్శి గాంధార

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ



30. కిందివాటిలో సరికాని వాక్యం?

1) వజ్జి మగధకు ఉత్తరాన ఉంది.

2) వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు గణ రాజ్యాలకు చెందినవారు.

3) గణ సమావేశాల్లో మహిళలు, బానిసలు, పిల్లలకు ప్రవేశం ఉంది.

4) వజ్జి ఒక గణ రాజ్యం.



31. ‘మగధ ఒక శక్తిమంతమైన రాజ్యం’ కారణాలు గుర్తించండి.

ఎ) గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉండటం.

బి) మగధలోని అడవుల్లో ఉన్న ఏనుగులకు శిక్షణ ఇచ్చి యుద్ధాల్లో వాడటం.

సి) మగధ దక్షిణ భాగంలో ఇనుము అధికంగా లభించడం.

డి) బింబిసారుడు, అజాత శత్రువు, మహాపద్మ    నందుడు దీన్ని బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి, డి  

3) ఎ, సి, డి      4) ఎ, బి, సి 



32. గాంధార శిల్పకళ లక్షణాలు?

1) వాస్తవికత      2) సరైన కొలతలు  

3) సున్నితమైన పనితనం    4) పైవన్నీ



33. కిందివాటిలో సరికానిది?

1) మహాజనపదాల్లో ఉత్తరాన ఉన్న జనపదం కాంభోజ.

2) మహాజనపదాల్లో సింధూనదికి ఇరువైపులా ఉన్న జనపదం అంగ. 

3) మహాజనపదాల్లో యమునా నది ఒడ్డున ఉన్న జనపదం కురు.

4) మహాజనపదాల్లో దక్షిణాన ఉన్న జనపదం అస్మక.



34. ‘గణ’ అంటే ఏమిటి? 

1) రాజ్యం    2) సభ్యులు  

3) సమాన హోదా    4) పైవన్నీ



35. పెయింటెడ్‌ గ్రేవేర్స్‌ అంటే? 

1) మట్టి పాత్రలు    2) రాగి పాత్రలు

3) రేఖాగణితపు ఆకారాల్లో తయారుచేసిన   నునుపైన పాత్రలు 

4) కంచు పాత్రలు



36. గణరాజ్యాల కాలం నాటి సాంచీ స్తూపంలో ఉన్న రాతి పలకలు? 

1) గణ సమావేశం  

2) రాజు కోట నుంచి బయటకు రావడం 

3) గణ రాజ్యాల కాలం నాటి యుద్ధ సన్నివేశం  

4) పైవన్నీ



37. గాంధార శిల్పకళ అభివృద్ధి చెందిన ప్రాంతాలు?

1) తక్షశిల     2) సూరసేన  

3) మధుర      4) రాజగృహ



38. గాంధార శిల్పకళలో అధికంగా చెక్కిన విగ్రహాలు ఎవరివి?

1) వర్ధమాన మహావీరుడు   2) విష్ణువు   

3) శివుడు      4) బుద్ధుడు 



39. సూరసేన అనే జనపదానికి రాజధాని ఏది?

1) మధురై      2) మధుర  

3) విరాట్‌నగర్‌    4) ఇంద్రప్రస్థం



40. అంగరాజ్యానికి రాజధాని ఏది?

1) పాటలీపుత్రం   2) రాజ్‌గిర్‌  

3) చంపా      4) సుక్తిమతి


సమాధానాలు

1-3; 2-2; 3-1; 4-1; 5-2; 6-2; 7-3; 8-4; 9-4; 10-1; 11-4; 12-3; 13-3; 14-2; 15-2; 16-3; 17-2; 18-3; 19-3; 20-3; 21-3; 22-2; 23-4; 24-3; 25-4; 26-3; 27-2; 28-3; 29-3; 30-3; 31-2; 32-4; 33-2; 34-3 ; 35-3; 36-4; 37-1; 38-4; 39-2; 40-3.  

Posted Date : 05-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.