• facebook
  • whatsapp
  • telegram

ప్రాచీన కాలంలో మతం, సమాజం

పెరియ పురాణంలో ప్రముఖుడు కన్నప్ప!

మనిషి నమ్మకాల నుంచే మతం పుట్టింది. క్రమంగా సమాజ జీవనంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆదిమానవుడు మొదట ప్రకృతి శక్తులనే దైవంగా భావిస్తే, నాగరిక సమాజాలు నిర్దిష్ట రూపాలను దేవతలుగా కొలిచాయి. సింధు నాగరికత నుంచే ఈ విధానం కనిపిస్తుంది.  ఆర్యుల రాకతో వైదిక సంస్కృతి ప్రబలి కులాలు, కట్టుబాట్లు, వర్ణవ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి. హైందవ మత విధానాల్లోని తార్కికతను ప్రశ్నిస్తూ బౌద్ధ, జైన మతాలు విప్లవాత్మక సంస్కరణలను తెచ్చాయి. ప్రాచీన కాలంలో ఉపఖండంలో మత విశ్వాసాల పరిణామక్రమం, సమాజంలో వచ్చిన మార్పులను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశంలో ప్రాంతాల వారీగా స్థిరపడిన సంప్రదాయాలు, అత్యధికులు కొలిచే దేవతలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న స్థలాలు, నిర్మాణాల గురించి అవగాహన కలిగి ఉండాలి.


1. ఎవరి మత విధానాలను అధ్యయనం చేయడం ద్వారా నేటి సమాజంలోని మతవిశ్వాసాలను తెలుసుకోవచ్చు?

1) చెంచు   2) గోండు   3) కొండారెడ్డి    4) పైవారంతా


2. కిందివాటిలో సరికాని వాక్యం?

1) వేటగాళ్లు అడవి జంతువులను పూజించేవారు 

2) వేటగాళ్లు గుహల్లో బొమ్మలను చిత్రించేవారు

3) వేటగాళ్లు జంతు వేషాలు ధరించి సామూహిక నృత్యాలు ఆచరించలేదు

4) వేట సమాజం వాళ్లు మృతులతో పాటు కొన్ని వస్తువులను పూడ్చిపెట్టేవారు 


3. పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినది?

1) 10వ    2) 11వ   3) 12వ    4) 13వ 


4. పెరియ పురాణంలో ఉన్న ప్రముఖుడు?

1) మల్లికార్జున స్వామి   2) లక్ష్మీనరసింహ స్వామి

3) భక్త కన్నప్ప    4) రాముడు


5.   శ్రీకాళహస్తి ఏ జిల్లాలో ఉంది?

1) నెల్లూరు    2) కర్నూలు  

3) తిరుపతి    4) కడప 


6.   చెంచు జాతి అల్లుళ్లుగా భావించే దేవుళ్లు?

1) వేంకటేశ్వర స్వామి     2) మల్లికార్జున స్వామి 

3) నరసింహ స్వామి     4) 2, 3 


7.  చెంచులు నృత్యం చేస్తూ ఆరాధించే దేవతలు? 

1) గంగమ్మ    2) మైసమ్మ     

3) రేణుకామాత    4) 1, 2 


8.  దక్కన్‌ ప్రాంతంలోని బూడిద దిబ్బలు ఎవరు వేయించారు?

1) వేట సమాజం   2) పశుపోషకులు  

3) 1, 2    4) ఏదీకాదు 


9.  బూడిద దిబ్బలను పూర్వీకులు ఏ సందర్భాల్లో మండించేవారు?

1) హోలీ      2) దీపావళి  

3) సంక్రాంతి     4) పై అన్ని సందర్భాల్లో


10. కిందివాటిని జతపరచండి.

ఎ) మహారాష్ట్ర   1) ధంగర్‌

బి) కర్ణాటక    2) కురుబ

సి) ఆంధ్ర   3) కురుమ

1) ఎ-1, బి-2, సి-3

2) ఎ-2, బి-1, సి-3

3) ఎ-3, బి-2, సి-1

4) ఎ-3, బి-1, సి-2


11. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) మహారాష్ట్రలోని పశుపోషకులు పోచమ్మను పూజిస్తున్నారు.

బి) కర్ణాటకలోని వారు ఎల్లమ్మను పూజిస్తున్నారు.

సి) మహారాష్ట్రీయులు విఠోబాను పూజిస్తున్నారు.

డి) ఆంధ్రులు రేణుకామాతను పూజిస్తున్నారు.

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, సి 

3) బి, సి, డి   4) ఎ, సి, డి 


12. కిందివాటిలో పశుపోషకులు పూజిస్తున్న చెట్లు?

1) రావి   2) వేప 

3) జమ్మి, మర్రి   4) పైవన్నీ


13. పశుపోషకుల కాలం నాటి కుండలపై చిత్రించిన ఆకుల బొమ్మలు ఏ చెట్టుకు చెందినవి?

1) రావి   2) మర్రి   3) వేప  4) జమ్మి


14. సింధునది భారతదేశానికి ఏ భాగంలో ప్రవహిస్తుంది?    

1) ఈశాన్య   2) వాయవ్య  

3) నైరుతి   4) ఆగ్నేయ


15. సింధు నాగరికత ఎన్ని వేల ఏళ్ల నాటిది?

1) 4200   2) 4400 

3) 4600   4) 4800 


16. సింధు నాగరికత ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది?

1) 900   2) 1900   3) 1750   4) 950


17. కిందివాటిలో భిన్నమైంది?

1) సింధు సంస్కృతిని హరప్పా సంస్కృతి అని అంటారు.

2) సింధు నాగరికతలో రకరకాల పనివారు ఉన్నారు.

3) సింధు నాగరికతలో స్నానవాటికలు, ధాన్యాగారాల నిర్మాణం జరగలేదు.

4) సింధు నాగరికతలో పెద్ద దేవాలయ నిర్మాణాలు లేవు.


18. సింధు ప్రజల ప్రధాన దేవుడు?

1) రాముడు  2) కృష్ణుడు 

3) పశుపతి   4) బ్రహ్మ


19. సింధు ప్రజల ప్రధాన దేవత?

1) శివుడు   2) పశుపతి 

3) అమ్మతల్లి   4) రావిచెట్టు 


20. రుగ్వేదాన్ని ఎన్నేళ్ల కిందట రాశారు?

1) 2500  2) 3500   3) 4500  4) 5500 


21. వేదాల్లో అత్యంత ప్రాచీనమైంది?

1) రుగ్వేదం  2) యజుర్వేదం 

3) సామవేదం   4) అధర్వణవేదం 


22. కిందివాటిలో సరికానిది?

1) వేదాల్లోని అధిక శ్లోకాలను పురుషులు సంకలనం చేశారు. 

 2) యజ్ఞాల సమయంలో అగ్నికి ఆహుతులను ఇచ్చేవారు.

3) వేదకాలంలో ప్రధాన దేవుళ్లు అగ్ని, ఇంద్ర, శివ.

4) వేదాల్లో కొన్ని శ్లోకాలను స్త్రీలు సంకలనం చేశారు.

23. రుగ్వేదంలో వేటి కోసం ప్రార్థనలున్నాయి?

1) పశువులు     2) అశ్వాలు 

3) మగ సంతానం   4) పైవన్నీ 


24. ఆర్యులు భారత్‌లోకి ఏ పర్వతాల ద్వారా ప్రవేశించారు?

1) హిమాలయ     2) ఆరావళి 

3) హిందూకుష్‌     4) వింధ్య


25. వేదకాలంలో యుద్ధ దేవుడు?

1) అగ్ని   2) విష్ణువు 

3) ఇంద్రుడు   4) శివుడు


26. ఆర్య తెగల మధ్య యుద్ధాలు ప్రధానంగా వేటికోసం జరిగాయి?

1) గోవులు     2) నీరు 

3) గడ్డిభూములు   4) పైవన్నీ 


27. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) వేదకాలంలో ప్రజల మొదటి నివాస స్థలం సప్తసింధు ప్రాంతం.

బి) వేదకాలంలో ప్రజలు తర్వాత కాలంలో గంగా - యమున నదుల మధ్య నివసించేవారు. 

సి) గుర్రాలను రథాలకు కట్టి యుద్ధాల్లో వాడేవారు.

డి) ఈ సమాజంలో వర్ణవ్యవస్థ ఉండేది.

1) ఎ, బి, సి     2) సి, డి 

3) ఎ, బి, సి, డి     4) బి, సి, డి 


28.    కిందివాటిని జతచేయండి.

ఎ) బ్రాహ్మణులు 1) పూజలు 
బి) క్షత్రియులు 2) రాజ్యపాలన 
సి) వైశ్యులు 3) వ్యవసాయం 
డి) శూద్రులు 4) వ్యాపారం
  5) పనులు

1) ఎ-1, బి-2, సి-3, డి-5     

2) ఎ-1, బి-2, సి-4, డి-5 

3) ఎ-2, బి-3, సి-4, డి-5     

4) ఎ-1, బి-4, సి-3, డి-2


29. పెద్ద బండరాళ్లను ఏమంటారు?

1) పురాతన రాళ్లు     

2) పెద్ద రాళ్లు 

3) రాక్షస గుళ్లు     

4) పైవన్నీ 


30. రాక్షస గుళ్లను ఎన్నేళ్ల కిందట నిర్మించారు?

1) 1000    2) 2000  

 3) 3000    4) 4000


31. రాక్షస గుళ్లు ఏ ప్రాంతంలో నిర్మితమై ఉన్నాయి?

1) దక్షిణ భారత్‌     2) ఈశాన్య భారత్‌ 

3) కశ్మీర్‌     4) పైవన్నీ


32. కిందివాటిలో రాక్షస గుళ్లకు సంబంధించి సరైన అంశాలు?

ఎ) ఇనుముతో తయారు చేసిన పరికరాలున్నాయి.

బి) గుర్రపు అస్థిపంజరాలున్నాయి.  

సి) బంగారు ఆభరణాలున్నాయి.

డి) ఇవి అధికంగా ఉపఖండం ప్రాంతంలో ఉన్నాయి.

1) ఎ, బి, సి     2) బి, సి, డి 

3) ఎ, బి, సి, డి     4) ఎ, బి 


33. చావు లేనిది/లేనివి?

1) ఆత్మ   2) బ్రహ్మ  3) బ్రహ్మణం  4) పైవన్నీ 


34. నచికేతుని కథ ఏ పుస్తకంలో ఉంది?    

1) మాండుకోపనిషత్తు     2) కఠోపనిషత్తు 

3) రుగ్వేదం   4) భారతం


35. ‘పుట్టుక - చావు అనే చక్రబంధం నుంచి విమోచన పొందడం ఎలా’ అని అన్నది ఎవరు?

1) బుద్ధుడు     2) గోశాల 

3) వర్ధమానుడు     4) కేశకంబలి


36. త్రిపీఠకాలు ఏ మతానికి సంబంధించినవి? 

1) జైనం     2) బౌద్ధం 

3) అజీవకం     4) పైవన్నీ


37. ‘చిన్న జీవులను హింస పెట్టకూడదు - శరీరాన్ని కఠోర శ్రమకు గురిచేయాలి.’ అన్న విధానం ఏ మతానిది?

1) జైన మతం   2) బౌద్ధ మతం 

3) అజీవక మతం   4) క్రైస్తవ మతం


38. ‘దుఃఖాన్ని జయించడం ఎలా?’ అని చెప్పినవారు?

1) గౌతమ బుద్ధుడు     2) వర్ధమానుడు 

3) 1, 2   4) కేశకంబలి


39. మధ్యేమార్గం ఏ మతానికి చెందింది?

1) బౌద్ధం   2) జైనం   3) హిందూ  4) ఇస్లాం


40. ప్రపంచంలో మొదటి అంతర్జాతీయ మతం?

1) హిందూ  2) క్రైస్తవ 

3) ఇస్లాం   4) బౌద్ధం 


41. చెర్మాన్‌ మసీదు ఏ రాష్ట్రంలో ఉంది?

1) తమిళనాడు     2) కేరళ 

3) ఆంధ్ర     4) కర్ణాటక


సమాధానాలు
 

1-1; 2-3; 3-3; 4-3; 5-3; 6-4; 7-4; 8-2; 9-4; 10-1; 11-3; 12-4; 13-1; 14-2; 15-3; 16-1; 17-3; 18-3; 19-3; 20-2; 21-1; 22-3; 23-4; 24-3; 25-3; 26-4; 27-3; 28-1; 29-3; 30-3; 31-4; 32-3; 33-4; 34-2; 35-3; 36-2; 37-2; 38-1; 39-1; 40-4; 41-2. 


 

Posted Date : 19-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు