• facebook
  • whatsapp
  • telegram

విజయనగర సామ్రాజ్యం

అతడే యవనరాజ్య స్థాపనాచార్యుడు!

కాకతీయ సామ్రాజ్య పతనాంతరం ఆ శిథిలాల నుంచి విజయనగర సామ్రాజ్యం ఆవిర్భవించింది. మూడు శతాబ్దాల పాటు దక్షిణ భారతంలో హిందూ సంస్కృతిని పరిరక్షించి, ముస్లిం పాలకుల చొరబాట్లను, ఇస్లాం మత వ్యాప్తిని నిరోధించింది. నాలుగు వంశాలుగా పాలన సాగించిన విజయనగర రాజులు ప్రజాహితమే ప్రథమ కర్తవ్యంగా వ్యవహరించారు.

నిరంతర యుద్ధాలతో రాజ్యాన్ని విస్తరించి సైనిక, ఆర్థిక శక్తిగా నిలిపారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాలకు స్వర్ణయుగాన్ని లిఖించిన విజయనగర రాజ్యం, ఆ పాలకుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వీరి పాలనా విధానాలు, సాహితీ వికాసానికి చేసిన కృషి, నిర్మించిన విశిష్ట   ఆలయాలు, ముఖ్యమైన యుద్ధాలు, అష్టదిగ్గజ కవుల రచనలు, క్రమానుగత రాజకీయ పరిణామాలపై అవగాహనతో ఉండాలి.


1. కింది ఏ ఢిల్లీ సుల్తాన్‌ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు?

1) గియాజుద్దీన్‌ తుగ్లక్‌      2)  మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌  

3)  ఫిరోజ్‌ షా తుగ్లక్‌         4)  నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌

2. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?

1) 1336  2) 1446  3) 1565     4) 1646

3. విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి ఆశీస్సులతో   స్థాపించారు?

1) సమర్థ రామదాసు      2)  రామానుజాచార్యులు 

3)  భక్త తుకారాం            4)  విద్యారణ్య స్వామి


4. కింది ఏ శాసనం హరిహరరాయలని ‘పూర్వ పశ్చిమ సముద్రాధిపతి’ అని పేర్కొంది?

1)  హంపి శాసనం         2)  అటకలగుండు శాసనం

3)  రామతీర్థం శాసనం  4)  బిట్రగుంట శాసనం

5. ఎవరి కాలంలో హోయసాల రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో విలీనమైంది?

1)  మొదటి హరిహరరాయలు  

2)  మొదటి బుక్కరాయలు        

3)  రెండో దేవరాయలు  

4)  శ్రీకృష్ణదేవరాయలు


6. ‘మధురా విజయం’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1)  తాళ్లపాక తిమ్మక్క      2)  గంగాదేవి 

3)  కవయిత్రి మొల్ల       4)  ఆండాళ్‌

7. మొదటి హరిహరరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యం సందర్శించిన మొరాకో యాత్రికుడు?

1)  అబ్దుల్‌ రజాక్‌      2)  ఇబన్‌ బటూటా

3)  నికోలో కాంటి       4)  మార్కోపోలో

8. మధురై సుల్తానులపై విజయం సాధించిన బుక్కరాయల కుమారుడు ఎవరు?

1)  కుమార కంపన      2)  కుమార సావణ్న

3)  సాళువ మంగు      4)  గోపన దండనాయకుడు

9. విజయనగర, బహమనీ రాజుల గొడవలకు కారణమైన ప్రాంతం?

1)  దివిసీమ  

2)  కావేరి - నర్మదా ప్రాంతం

3)  కృష్ణా - కావేరి ప్రాంతం  

4)  కృష్ణా - గోదావరి ప్రాంతం

10. విజయనగర రాజుల మొదటి రాజధాని?

1)  అనెగొంది      2)  విజయనగరం  

3)  చంద్రగిరి      4)  పెనుగొండ

11. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన మొదటి యుద్ధం ఏది?

1)  పానిపట్‌ యుద్ధం          2)  తళ్లికోట యుద్ధం 

3) రాయచూర్‌ యుద్ధం      4)  ముద్గల్‌ యుద్ధం

12. ‘పెంచికల్‌ దిన్నె’ అనే గ్రామాన్ని మొదటి బుక్కరాయలు ఎవరికి దానంగా ఇచ్చాడు?

1)  విద్యారణ్య స్వామి      2)  సాయనాచార్యులు 

3)  మాధవాచార్యులు       4)  నాచన సోముడు

13. సంగమ వంశంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు?

1)  మొదటి హరిహరరాయలు  

2)  మొదటి బుక్కరాయలు 

3)  రెండో హరిహరరాయలు    

4)  మొదటి దేవరాయలు

14. ముద్గల్‌లోని కంసలి కుమార్తె నేహల్‌ గురించి యుద్ధం చేసిన విజయనగర రాజు?

1)  మొదటి హరిహరరాయలు  

2)  మొదటి బుక్కరాయలు 

3)  మొదటి దేవరాయలు     

4)  రెండో దేవరాయలు

15. సంగమ వంశంలో అత్యంత గొప్పవాడు?

1)  శ్రీకృష్ణదేవరాయలు        2)  అచ్యుత రాయలు

3)  మొదటి దేవరాయలు     4)  రెండో దేవరాయలు

16. రెండో దేవరాయల సాహిత్య సభ పేరు?

1)  ముత్యాలశాల        2)  భువన విజయం

3)  శనివాడ ప్రసాద్‌     4)  మలయ కూటం

17. రెండో దేవరాయల ఆస్థాన పండితుడు డిండిమ భట్టును ఓడించి దేవరాయల దగ్గర కనకాభిషేకం పొందినవారు?

1)  బమ్మెర పోతన     2)  అల్లసాని పెద్దన

3)  శ్రీనాథ కవి           4)  అన్నమాచార్యులు

18. ‘మహానాటక సుధానిధి’ అనే గ్రంథాన్ని రచించింది?

1)  అచ్యుత దేవరాయలు     2)  అళియ రామరాయలు

3)  రెండో దేవరాయలు         4)  శ్రీకృష్ణదేవరాయలు

19. కిందివాటిలో రెండో దేవరాయల బిరుదు?

1 గజబేటకార                             2 రాయగజకేసరి 

3 యవనరాజ్య స్థాపనాచార్య      4 కవి సార్వభౌమ
 

20. సంగమ వంశంలో చివరి రాజు ఎవరు?

1)  మొదటి దేవరాయలు     2)  రెండో ప్రౌడరాయలు

3)  వీరసింహరాయలు         4)  రెండో బుక్కరాయలు

21. సాళువ నరసింహరాయలకు సమకాలీనుడైన వాగ్గేయకారుడు?

1 అల్లసాని పెద్దన          2 అన్నమాచార్యులు 

3 సాయనాచార్యులు      4 నాచన సోముడు

22. వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన సందర్భంలో విజయనగర పాలకుడు?

1 మొదటి దేవరాయలు             2 సదాశివరాయలు

3 ఇమ్మిడి నరసింహరాయలు    4 రెండో దేవరాయలు

23. ‘‘వాణీ నా రాణీ’’ అని ఎవరు ప్రకటించారు?

1)  తాళ్లపాక అన్నమాచార్యులు 

2)  తెనాలి రామకృష్ణుడు 

3)  డిండిమభట్టు     

4)  పిల్లలమర్రి పినవీరభద్రుడు

24. సాళువ నరసింహరాయల ఆస్థానానికి చెందిన పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన గ్రంథం?

1)  జైమినీయ భారతం     2)  శృంగార శాకుంతలం 

3)  1, 2                            4)  సాళువాభ్యుదయం

25. సాళువ వంశంలో చివరివాడు?

1 సాళువ నరసింహరాయలు 

2 ఇమ్మిడి నరసింహరాయలు

3 రెండో ప్రౌఢరాయలు     

4 రెండో దేవరాయలు

26. విజయనగర రాజుల్లో అత్యంత గొప్పవాడు?

1)  రెండో దేవరాయలు 

2)  రెండో వేంకటపతిరాయలు

3)  అచ్యుతరాయలు     

4)  శ్రీకృష్ణదేవరాయలు

27. వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజు ఎవరు?

1)  సాళువ నరసింహరాయలు 

2)  రెండో దేవరాయలు

3)  వీరనరసింహ రాయలు    

4)  శ్రీకృష్ణదేవరాయలు

28. ముస్లింలను అత్యధికంగా తన సైన్యంలో నియమించుకున్న విజయనగర రాజు?

1)  మొదటి దేవరాయలు     2)  రెండో దేవరాయలు 

3)  శ్రీకృష్ణదేవరాయలు        4)  అచ్యుత రాయలు

29. శ్రీకృష్ణదేవరాయలు, అతడి భార్యల లోహ విగ్రహాలను ఏ పుణ్యక్షేత్రంలో ప్రతిష్ఠించారు?

1)  లేపాక్షి ఆలయం              2)  ద్రాక్షారామం ఆలయం

3)  తిరుమల ఆలయం         4)  రంగనాథస్వామి ఆలయం

30. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనుడైన మొగల్‌  చక్రవర్తి?

1)  బాబర్‌          2)  అక్బర్‌ 

3)  షాజహాన్‌     4)  ఔరంగజేబు

31. శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడైన పోర్చుగీసు గవర్నర్‌ ఎవరు?

1)  ప్రాన్సిస్‌-డి-అల్మిడా     2)     ఆల్ఫన్సోడి అల్బూకర్క్‌

3)  నీనా - డ - కున్హా           4)  ఆల్ఫన్సోడి సౌజా

32. రాయచూర్‌ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

1)  1510  2)  1520  3)  1525  4)  1540

33. కోవెలకొండ యుద్ధంలో మరణించిన బీజపూర్‌ సుల్తాన్‌ ఎవరు?

1)  యూసఫ్‌ ఆదిల్‌ షా     2)  ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా 

3)  కమాల్‌ ఖాన్‌                4)  మహ్మద్‌ షా

34. ‘యవనరాజ్య స్థాపనాచార్య’ అనే బిరుదున్న   విజయనగర రాజు?

1)  సదాశివరాయలు         2)  అచ్యుత దేవరాయలు

3)  శ్రీకృష్ణదేవరాయలు     4)  తిరుమల రాయలు
 

35. కిందివారిలో ఒకరు అష్టదిగ్గజాల్లో లేరు?

1)  అల్లసాని పెద్దన             2)  మాదయగారి మల్లన

3)  రామరాజ భూషణుడు    4)  శ్రీనాథుడు

36. కిందివాటిలో శ్రీకృష్ణదేవరాయల రచన కానిది?

1)  జాంబవతి కల్యాణం     2)  ఉషాపరిణయం

3)  ఆముక్తమాల్యద           4)  మహానాటక సుధానిది

37. తుళువ వంశంలో చివరివాడు?

1)  శ్రీకృష్ణదేవరాయలు     2)  సదాశివరాయలు

3)  అళియరామరాయలు     4)  శ్రీరంగరాయలు

38. తళ్లికోట యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడైన విజయనగర పాలకుడు?

1)  సదాశివరాయలు         2)  అళియరామరాయలు

3)  రెండో దేవరాయలు     4)  అచ్యుత దేవరాయలు

39. తళ్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం?

1)  1565  2)  1646  3)  1570  4)  1520

40. విజయనగరం చుట్టూ 7 కోటలు ఉన్నాయని, 7 పెద్దపెద్ద గోడలు ఉన్నాయని తెలిపిన విదేశీ యాత్రికుడు?

1)  అబ్దుల్‌ రజాక్‌     2)  నికోలోకాంటి

3)  మార్కోపోలో     4)  డొమింగో పేస్‌

41. కిందివారిలో ‘పారిజాతాపహరణం’ రచించినవారు?

1)  అల్లసాని పెద్దన 

2)  అయ్యలరాజు రామభద్రుడు

3)  నంది తిమ్మన     

4)  తెనాలి రామకృష్ణుడు

42. అరవీటి వంశంలో చివరివాడు ఎవరు?

1)  తిరుమల రాయలు 

2)  రెండో వెంకటపతి రాయలు

3)  రామదేవరాయలు     

4)  మూడో శ్రీరంగరాయలు

43. విజయనగర రాజుల కాలంలో బంగారు నాణెం?

1)  వరాహ  2)  జిటాల్‌  3)  దినారం  4)  పైవన్నీ

44. మద్రాస్‌ను బ్రిటిష్‌ వారికి అప్పగించిన  విజయనగర రాజు ఎవరు?

1)  మొదటి శ్రీరంగరాయలు 

2)  రెండో వేంకటపతి రాయలు

3)  మూడో శ్రీరంగరాయలు 

4)  మూడో వేంకటపతిరాయలు

45. విజయనగర సామ్రాజ్య కాలంలోని సైనిక వ్యవస్థకు సరిపోలింది?

1)  నాయంకర వ్యవస్థ 2)  అమరనాయంకర వ్యవస్థ

3)  ఇక్తా వ్యవస్థ     4)  మన్సబ్‌దారీ వ్యవస్థ


46. కిందివారిలో ఎవరు క్రైస్తవ మత ప్రచారానికి  అనుమతించారు?

1)  తిరుమల రాయలు 

2)  రెండో వేంకటపతిరాయలు

3)  మూడో శ్రీరంగరాయలు 

4)  శ్రీకృష్ణదేవరాయలు

సమాధానాలు

1-2; 2-1; 3-4; 4-2; 5-1; 6-2; 7-2; 8-1; 9-4; 10-1; 11-4; 12-4; 13-3; 14-3; 15-4; 16-1; 17-3; 18-3; 19-1; 20-2; 21-2; 22-3; 23-4; 24-3; 25-2; 26-4; 27-3; 28-2; 29-3; 30-1; 31-2; 32-2; 33-1; 34-3; 35-4; 36-4; 37-2; 38-2; 39-1; 40-1; 41-3; 42-4; 43-1; 44-4; 45-2; 46-2.

 

 

 

 

 

 

రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు

 


 

Posted Date : 08-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు