• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక యుగారంభం

‘మానవతావాదం అంటే సంస్కృతి’
 


మధ్యయుగం అంతమై ఆధునిక యుగం ఆరంభమయ్యే క్రమంలో ఐరోపాలో రాజకీయంగా,  సాంస్కృతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సాంస్కృతిక పునరుజ్జీవనం, మత   సంస్కరణల కోసం అభ్యుదయవాదులు కృషి చేశారు. మానవతావాదం ఒక సాంస్కృతిక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సృజన, విమర్శనాత్మక దృక్పథాలతో కూడిన తత్వ శాస్త్రం, శాస్త్రీయత మేళవించిన కళలు జీవం పోసుకున్నాయి. సాంఘిక, మేధో పరివర్తనలు జరిగాయి. గొప్ప శిల్పులు, చిత్రకారులు, రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, చరిత్ర అన్వేషకులు ప్రపంచానికి పరిచయం అయ్యారు  పిడివాద మత ఆధిక్యం తగ్గి ఆధునిక ఐరోపా ఆవిష్కృతమైంది. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన ఈ  పరిణామక్రమం, దీంతో సంబంధం ఉన్న దేశాలు, ప్రాంతాల గురించి పోటీ పరీక్షారులు  తెలుసుకోవాలి. ఈ మౌలిక మార్పులో కీలకపాత్ర పోషించిన మేధావులు, క్యాథలిక్కులకు   వ్యతిరేకంగా వచ్చిన ప్రొటెస్టంట్‌ ఉద్యమం, ముద్రణతో వచ్చిన మార్పులు, కళలు, నిర్మాణం, విజ్ఞాన శాస్త్రాల మధ్య పెరిగిన అనుబంధం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.



1. రినైసాన్స్‌ అంటే?

1) పునరుద్ధరణ  2) పునర్జన్మ   

3) మళ్లీ జన్మించడం  4) పైవన్నీ


2. ఏ సంస్కృతిని వెలుగులోకి తేవడం సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం?

1) గ్రీకు   2) రోమన్‌   3) పారశీక   4) 1, 2


3. ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మొదటి కేంద్రం?

1) ఫ్లారెన్స్‌   2) వెనిస్‌   3) రోమ్‌   4) జెనీవా


4. కిందివాటిలో సరైన వాక్యాలు..

ఎ) విశ్వవిద్యాలయాలు మొదటగా ఆవిర్భవించిన ప్రాంతం ఇటలీ.

బి) 11వ శతాబ్దం నుంచి పాడువ, బోలాగ్నో విశ్వవిద్యాలయాలు న్యాయశాస్త్ర అధ్యయన  కేంద్రాలుగా ఉన్నాయి.

సి) మానవతావాదం బోధించారు (ఇటలీలో)

డి)  సంగీతం, వ్యాయామం బోధించారు.

1) ఎ, బి, సి, డి      2) బి, సి, డి   3) ఎ, బి, సి  4) ఎ, సి, డి


5. వ్యక్తిని ఏ విధంగా తయారు చేయడాన్ని మానవతావాదం అంటారు?

1) మానసికంగా దృఢం చేయడం   2) శారీరకంగా దృఢం చేయడం

3) 1, 2   4) సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి


6. 15వ శతాబ్దం ప్రారంభంలో మానవతావాదం అనే పదాన్ని వేటికి వర్తింపజేశారు?

1) వ్యాకరణం    2) అలంకార శాస్త్రం   

3) పద్యభాగం, చరిత్ర, తత్వం   4) పైవన్నీ


7. మానవతా వాదం అనే పదం మానవ శాస్త్రం నుంచి వచ్చింది. మానవ శాస్త్రం ఏ భాషా పదం?

1) గ్రీకు   2) లాటిన్‌   3) రోమన్‌   4) ఫ్రెంచ్‌


8. ప్రముఖ న్యాయవాది, కథకుడు అయిన సిసిరో ఏ దేశానికి చెందినవాడు?    

1) రోమ్‌   2) జర్మన్‌  3) ఇంగ్లండ్‌  4) ఫ్రాన్స్‌


9. ‘మానవతావాదం అంటే సంస్కృతి’ అని అన్నదెవరు?

1) సిసిరో   2) డాంటే    

3) జ్యూలియస్‌ సీజర్‌   4) పైవారంతా


10. ఇంగ్లండ్‌లోని ప్రముఖ విద్యాకేంద్రాలు?

1) ఈటన్‌   2) హరో   3) 1, 2   4) రగ్బీ


11. మానవతావాదులు ఏ రకమైన దృక్పథాలను   అలవరచుకున్నారు?

1) విమర్శనాత్మక దృక్పథం   2) సృజనాత్మక దృక్పథం   

3) 1, 2   4) సామాజిక దృక్పథం


12. ఇటలీలో సంప్రదాయ రచనలు, రాత పత్రాలను సేకరించడం అభిరుచిగా ఎంచుకున్న మానవతావాది?

1) ప్లేటో   2) పెట్రార్క్‌   3) మాకియవెల్లి  4) పైవారంతా


13. విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంచుకున్న మానవతావాది?

1) పెట్రార్క్‌     2) లారెంజోవల్లా   3) సీజర్‌     4) సిసిరో


14. కిందివారిలో ప్రముఖ మానవతావాదులు?

1) మాకియవెల్లి  2) పెట్రార్క్‌  3) ప్లేటో  4) పైవారంతా


15. ‘ది ప్రిన్స్‌’ గ్రంథంలో రాజకీయ వ్యవస మీద, ఇటలీ రాజకీయ పరిణామాలపై విరుచుకుపడినవారు?

1) రూసో     2) మాకియవెల్లి  3) పెట్రార్క్‌  4) సీజర్‌


16. కిందివాటిలో మాకియవెల్లి ఫ్లారెన్స్‌కి సంబంధించిన సరైన వాక్యాలు ఏవి?

1) ఫ్లారెన్స్‌ దౌత్యాధికారిగా పలు దేశాల సభలను సందర్శించారు.

2) ప్రాచీన రోమన్‌ చరిత్రను అధ్యయనం చేశారు.

3) ‘రాజ్యం, చర్చి వేరు వేరు, రాజ్యం ఎప్పుడూ అద్భుత శక్తులపై ఆధారపడి ఉంటుంది.’

4) పైవన్నీ


17. కాన్‌స్టాంటినోపుల్‌ను టర్కీ ఆక్రమించిన  సంవత్సరం?

1) 1542   2) 1453  3) 1345  4) 1653


18. 1453 తర్వాత బైజాంటైన్‌ నుంచి ఇటలీలోని ఏ ప్రాంతానికి వెళ్లి వారి గ్రంథాలను దాచారు?

1) ఫ్లారెన్స్‌  2) రోమ్‌  3) మిలాన్‌  4) పైవన్నీ


19. ప్రముఖ ఇటలీ పండితుడు గియోవన్నీఅవ్‌రిస్పా 250 గ్రీకు రాతపత్రాలను, ఇతర గ్రంథాలను  సేకరించారు. అవి ఎవరివి?

1) తుసిడైడ్స్‌     2) సోఫోక్లస్‌  3) యురిఫిడెస్‌ 4) పైవారంతా


20. గుటెన్‌బర్గ్‌ 150 బైబిళ్లను ఎప్పుడు ముద్రించారు?

1) 1453   2) 1455  3) 1462  4) 1543


21. ప్రపంచ సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమ ఆద్యుడు/ పితామహుడు డివైన్‌ కామిడీ గ్రంథకర్త?

1) ప్లూటార్క్‌     2) డాంటే  3) తుసిడైడ్స్‌ 4) ప్లేటో


22. కిందివాటిలో పెట్రార్క్‌ గురించి సరైన వాక్యాలు..

1) మానవతా పునరుజ్జీవన ఉద్యమానికి ఆద్యుడు.

2) మానవ సుఖాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

3) మానవతావాద పునరుజ్జీవన ఉద్యమానికి   పితామహుడు.

4) పైవన్నీ


23.  బొకాసియో గురించి సరైన వాక్యాలు గుర్తించండి.

1) దేశం ఇటలీ, నగరం ఫ్లారెన్స్‌.

2) మానసిక శాస్త్రానికి సంబంధించి ఇతడి మొదటి గ్రంథం - షీయమెట్టా

3) ఇతడి మరొక గ్రంథం హాస్యంతో కూడిన స్త్రీ పురుష సంభాషణలు - డెకా మరాన్‌

4) పైవన్నీ


24. సెయింట్‌ పాల్‌ అనే పాఠశాలను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మానవతావాది?

1) జాన్‌కొలెట్‌  2) బొకాసియో  3) డాంటే     4) డెకా మరాన్‌


25. కిందివాటిలో సరైన వాక్యాలు గుర్తించండి.

1) ఇంగ్లండ్‌ చక్రవర్తి 8వ హెన్రీ వద్ద ఛాన్సలర్‌గా పనిచేసిన థామస్‌ మోర్‌ గొప్ప కవి.

2) థామస్‌ మోర్‌ గొప్ప మానవతావాది.

3) థామస్‌ మోర్‌ యుటోపియాలో ఆదర్శ రాజ్యం, సమాజం గురించి వివరించారు.

4) పైవన్నీ


26. ఫ్రాంకోయిస్‌ రెబిలియస్‌ సన్యాస జీవితాన్ని  ప్రారంభించి గొప్ప మానవతాదిగా ఎదిగాడు. అతడు ఏ దేశసుడు?

1) ఇంగ్లండ్‌  2) ఫ్రాన్స్‌  3) రష్యా  4) అమెరికా


27. ‘డాన్‌ క్విక్సోట్‌’ అనే నవల రాసినవారు?

1) రెబిలియస్‌   2) మిగ్యుల్‌ డి సెర్వంటెస్‌  3) థామస్‌ మోర్‌  4) బొకాసియో


28. ‘గట్ట మెలాట’. అశ్వికుడి విగ్రహం లాంటి శిల్పాలను సహజ రీతిలో చెక్కిన శిల్పకారుడు?

1) లియోనార్డో డావిన్సీ  2) రాఫెల్‌   

3) డోనాటెల్లో  4) ఆండ్రియస్‌ వెసాలజ్‌


29. ఆధునిక పద్ధతిలో కొత్త నిబంధన గ్రంథంలోని మేరి క్రీస్తు కథనం ఆధారంగా చిత్రాలు గీసింది?

1) జిటో బోండోన్‌     2) డోనాటెల్లో   

3) ఫిలిప్పో బ్రూవెల్లెస్సీ     4) పైవారంతా


30. సీస్టన్‌ ఛాపిల్‌ పైకప్పు మీద వేసిన పైటాని శిల్పం రూపొందించింది?

1) ఛాపిల్‌     2) లియోనార్డో డావిన్సీ   

3) డాంటే     4) థామస్‌ మోర్‌


31. శిల్పకారుడు ఫిలిప్పో బ్రూవెల్లెెసీ ఏ ప్రాంతవాసి?

1) ఇంగ్లండ్‌      2) ఫ్లారెన్స్‌  3) మెక్సికో  4) రోమ్‌


32. ‘మోనాలిసా’, ‘ది లాస్ట్‌ సప్పర్‌’ చిత్రాలను గీసినవారు?

1) లియోనార్డో డావిన్సీ   2) డోనాటెల్లో  3) బోండెన్‌      4) రాఫెల్‌


33. మానవ శరీర భాగాలపై పరిశోధనలు చేసింది?

1) లియోనార్డో డావిన్సీ  2) అండ్రియస్‌ వేసాలియస్‌  

3) ఛాపెల్‌      4) పైవారంతా


34. కిందివాటిలో లోరెంజో డి మెడిసి గురించి సరైంది?

1) ఇతడు ఫ్లారెన్స్‌కు చెందినవాడు.   

2) క్యాథెడ్రల్‌ బాప్టిస్ట్‌ చర్చికి 30 ఏళ్లు కంచు ద్వారాలు తయారు చేశాడు.

3) ఇతడు రూపొందించిన ద్వారాలపై సాల్మన్‌ చక్రవర్తి, ఇతర రాణుల ప్రతిమలున్నాయి.

4) పైవన్నీ


35. ప్రస్తుతం ఫ్లారెన్స్‌ మ్యూజియంలోని ‘డేవిడ్‌’ శిల్పం ఎత్తు ఎంత (అడుగుల్లో)?

1) 15     2) 13     3) 14     4) 24 


36. ఫ్లారెన్స్‌లోని క్యాథెడ్రల్‌ గోథిక్‌ గోపురానికి     రూపకల్పన చేసింది?

1) లియోనార్డో డావిన్సీ   2) మైఖెలాంజెలో   3) ఫిలిప్పో  బ్రూవెల్లెస్సీ     4) రాఫెల్‌


37. కోసిమో డీమెడైస్‌ కోసం మెడిసి భవనం నిర్మించిన గొప్ప నిర్మాణ కౌశలం ఉన్న ప్రముఖులు?

1) బర్త్‌లోమియో        2) ట్రెమాంటే     3) 1, 2    4) ఆండ్రియస్‌


38. బాలికల కోసం పాఠశాలను సాపించి విద్యను అందించింది?

1) కాసాండ్రా ఫెడల్‌      2) ఇసబెల్లా-డి-ఎస్టే    3) విట్టోర్నీ-డ-ఫెల్ట్రె    4) పైవారంతా


39. సాహిత్య అధ్యయనం వల్ల మహిళలకు ఎలాంటి గౌరవం లభించనప్పటికీ దాన్ని ప్రతి మహిళ తప్పనిసరిగా చదవాలని అన్నదెవరు?

1) కాసాండ్రా ఫెడల్‌  2) ఇసబెల్లా-డి-ఎస్టే   3) విట్టోర్నీ-డ-ఫెల్ట్రె      4) పైవారంతా


40. పడువ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇచ్చిన కాసాండ్రా ఫెడల్‌కు వచ్చిన భాష/లు?

1) గ్రీకు   2) లాటిన్‌   3) 1, 2   4) ఇంగ్లిష్‌


41. ‘మంటువ’ దేశానికి చెందిన ‘మాషునెస్‌ ఆఫ్‌ మంటువ’గా పేరు పొందినవారు?

1) ఇసాబెల్లా-డి-ఎస్టే    2) కాసాండ్రా ఫెడల్‌

3) విట్టోర్నీ-డ-ఫెల్ట్రె     4) బర్తిలోమియో


42. కింది శాస్త్రవేత్తలు, వారి దేశాల్లో తప్పుగా ఉన్నది

1) కోపర్నికస్‌ - పోలండ్‌     2) జాన్‌ కెప్లర్‌ - జర్మనీ

3) గెలీలియో - ఇటాలియన్‌      4) పైవన్నీ 


43. మార్టిన్‌ లూథర్‌ బైబిల్‌ను జర్మనీ భాషలోకి ఎప్పుడు అనువదించారు?

1) 1512   2) 1522  3) 1532  4) 1542


44. దురాశతో కూడిన వ్యవసగా చర్చి మారిందని  విమర్శించినవారు?

1) ఇంగ్లండ్‌ - థామస్‌ మోర్‌ 

2) హాలండ్‌ - ఎరాస్మస్‌

3) జర్మనీ - మార్టిన్‌ లూథర్‌        

4) 1, 2


సమాధానాలు
 

1-4; 2-4 3-1 ;4-1; 5-3; 6-4 ; 7-2; 8-1; 9-3; 10-3; 11-3; 12-2; 13-2; 14-4; 15-2; 16-4; 17-2; 18-1; 19-4; 20-2; 21-2; 22-4; 23-4; 24-1; 25-4; 26-2; 27-2; 28-3; 29-1; 30-1; 31-2; 32-1; 33-2; 34-4; 35-3; 36-3; 37-3; 38-3; 39-1; 40-3; 41-1; 42-4; 43-2; 44-4. 


 

 

రచయిత: గద్దె నరసింహారావు
 

Posted Date : 14-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు