• facebook
  • whatsapp
  • telegram

నదీ వ్యవస్థ

కుందు.. సగిలేరు మధ్యలో నల్లమల కొండలు!


తాగునీరు, సాగునీరు అందిస్తుంది.  రవాణాకు ఉపయోగడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. అదే దేశ భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే నదీ వ్యవస్థ. అనేక నాగరికతలు ఆ పరీవాహక ప్రాంతాల్లోనే వెలిశాయి. నదీ తీరాల్లోని ఎన్నో పర్యాటక కేంద్రాలు యాత్రికులను ఆకర్షిస్తూ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తూ భారత శక్తి రంగ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్న నదీ వ్యవస్థ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. నదుల వల్ల ఏర్పడే భూస్వరూపాలు, తీరాల్లోని ప్రముఖ నగరాలు, సరస్సులు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.


1.    ప్రపంచ నీటి దినోత్సవం 2024 నినాదం?

1) వాటర్‌ ఫర్‌ రెస్ట్‌     2) వాటర్‌ ఫర్‌ పీస్‌

3) వాటర్‌ ఫర్‌ లైఫ్‌     4) వాటర్‌ ఫర్‌ మోర్‌


2.    తొలి వేదకాలానికి చెందిన దశరాజ యుద్ధం (బ్యాటిల్‌ ఆఫ్‌ టెన్‌ కింగ్స్‌) ఏ నది ఒడ్డున జరిగింది?

1) చీనాబ్‌   2) బియాస్‌  3) జీలం  4) రావి


3.     కిందివాటిలో జీలం నదికి ఉపనదులు?

ఎ) పూంచ్‌     బి) కిషన్‌గంగ 

సి) చంద్ర      డి) భాగ

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


4.     లాహోర్‌ (పాకిస్థాన్‌) ఏ నది ఒడ్డున ఉంది?

1) జీలం   2) చీనాబ్‌   3) రావి   4) బియాస్‌


5.     ష్యోక్‌ నది ఏ పర్వతశ్రేణుల మధ్య ప్రవహిస్తుంది?

ఎ) కారాకోరం     బి) జస్కర్‌ 

సి) లద్దాఖ్‌     డి) పిర్‌పంజల్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) ఎ, సి


6.     గంగా పరీవాహం అతి తక్కువగా ఉన్న ప్రాంతం?

1) దిల్లీ     2) హిమాచల్‌ ప్రదేశ్‌

3) ఝార్ఖండ్‌     4) హరియాణా


7. పన్నా జాతీయ పార్కు నుంచి ప్రవహించే నది?

1) చంబల్‌   2) సింధూ 3) కెన్‌  4) బెట్వా


8.     పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు సరిహద్దుగా ప్రవహిస్తున్న నది?

1) మానస్‌      2) సంకోష్‌  

3) సుబన్‌సిరి      4) కపిలి


9.     ఏ నదిని ‘బంత్వాల్‌ నది’ అని పిలుస్తారు?

1) జువారి      2) శర్వాతి  

3) నేత్రావతి      4) మహి


10. ‘లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ గోవా’ అని ఏ నదిని పిలుస్తారు?

1) భరత్‌పూజ     2) మాండోవి  

3) జువారి     4) నేత్రావతి


11. గంగా ఫ్లడ్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ      2) కోల్‌కతా 

3) పట్నా     4) అలహాబాద్‌


12. కింది సరస్సుల్లో ‘క్వీన్‌ ఆఫ్‌ లేక్స్‌’?

1) లోనార్‌     2) వెంబనాడ్‌ 

3) సస్థమ్‌కొట్ట     4) లోక్‌తక్‌


13. ఈశాన్య భారతదేశంలోని నాగాకొండలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయి?

ఎ) బ్రహ్మపుత్ర     బి) బరాక్‌ 

సి) ఇర్రావడి     డి) దిహంగ్‌

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, సి   4) సి, డి


14. ఆరావళి పర్వతాలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయి?

ఎ) లూని   బి) బాని   సి) బనాస్‌   డి) మహి

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) ఎ, సి


15. గంగానది పరీవాహక ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస?    

ఎ) బిహార్‌     బి) ఉత్తర్‌ప్రదేశ్‌ 

సి) మధ్యప్రదేశ్‌     డి) రాజస్థాన్‌

1) ఎ, బి, సి, డి     2) బి, సి, ఎ, డి

3) బి, సి, డి, ఎ     4) డి, ఎ, బి, సి


16. ‘పాట్‌హోల్స్‌’ అనే భూస్వరూపాలు దేనివల్ల ఏర్పడతాయి?

1) నదులు     2) హిమనీనదాలు 

3) పవనాలు     4) అలలు


17. ‘స్పర్స్‌’ అనే భూస్వరూపాలను ఏవి ఏర్పరుస్తాయి?

1) అలలు     2) నదులు 

3) హిమనీనదాలు     4) పవనాలు


18. నది తన ప్రయాణంలో నదీ నివేదికలను ఏ దశలో ఏర్పరుస్తుంది?    

ఎ) బాల్య దశ     బి) యవ్వన దశ 

సి) వృద్ధ దశ     డి) ఏ దశలోనైనా

1) ఎ, బి      2) బి, సి  

3) సి, డి      4) బి మాత్రమే


19. నదులు అగాధదరి, గార్జ్‌లను తమ ప్రయాణంలో ఏ దశలో ఏర్పరుస్తాయి?    

1) బాల్య దశ     2) వృద్ధ దశ 

3) యవ్వన దశ     4) ఏ దశలోనైనా


20. నది బాల్య దశలో నీరు, వేగం ఏ విధంగా ఉంటాయి?

1) నీరు తక్కువ, వేగం ఎక్కువ

2) నీరు ఎక్కువ, వేగం ఎక్కువ

3) నీరు తక్కువ, వేగం తక్కువ

4) నీరు ఎక్కువ, వేగం తక్కువ


21. బ్రహ్మపుత్ర నదికి కుడివైపున ఉన్న ఉపనదులు?

ఎ) మానస్‌      బి) లోహిత్‌  

సి) సంకోష్‌           డి) బరాక్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) ఎ, సి


22. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఏ నదులు  కలుస్తాయి?

ఎ) గంగా     బి) అలకనంద 

సి) భగీరథ     డి) యమున

1) ఎ, బి,   2) బి, సి   3) సి, డి   4) ఎ, డి 


23. బ్రహ్మపుత్ర ఉప నదుల్లో భిన్నమైంది?

1) సంకోష్‌   2) మానస్‌   3) తీస్తా  4) కపిలి


24. కిందివాటిలో ఏ నదిని ‘తెల్లు నది’ అంటారు?

1) డిబాంగ్‌      2) లోహిత్‌  

3) బరాక్‌      4) కామెంగ్‌


25. నల్లమల కొండలు కింది ఏ రెండు నదుల మధ్య జలవిభాజకంగా ఉన్నాయి?

ఎ) కుందు నది     బి) జయమంగళి  

సి) సగిలేరు     డి) చిత్రావతి

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) ఎ, సి


26. నదీ, సముద్ర జలాల సాంద్రత సమానంగా ఉన్నప్పుడు ఏర్పడే లోబేట్‌ డెల్టాను ఏర్పరిచే నదులు?

ఎ) కృష్ణా      బి) పెన్నా  

సి) గోదావరి      డి) కావేరి

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


27. నర్మద, తపతి నదులు ఏ రకమైన డెల్టాలను ఏర్పరుస్తాయి?

1) డిజిటల్‌ డెల్టా          2) ఎస్చురైన్‌ డెల్టా

3) లోబేట్‌ డెల్టా           4) పక్షిపాద డెల్టా


28. డిజిటల్‌ డెల్టాను ఏర్పరిచే నదులకు ఉదాహరణ?

ఎ) గోదావరి      బి) కృష్ణా  

సి) గంగా     డి) బ్రహ్మపుత్ర

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, సి


29. పక్షిపాద డెల్టాను ఏర్పరిచే నది?

1) మిసిసిపి (యూఎస్‌ఏ)     2) టైబర్‌ (ఇటలీ)

3) గంగా (ఇండియా)     4) ఎల్లో (చైనా)


30. మనదేశంలో దాదాపుగా 44 శాతం జనాభా ఏ నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తోంది?

1) గోదావరి          2) సింధూ      

3) బ్రహ్మపుత్ర          4) గంగా 


31. నేపాల్‌ రాజధాని ఖాట్మండు ఏ నది ఒడ్డున ఉంది?

1) గండఖ్‌  2) గాగ్ర 3) భాగమతి 4) కోసి


32. కొయానా నదిని ఏమని పిలుస్తారు?

1) మహారాష్ట్ట్ర్ర జీవనరేఖ 2) కర్ణాటక జీవనరేఖ

3) తెలంగాణ జీవనరేఖ  4) మధ్యప్రదేశ్‌ జీవనరేఖ


33. మహానదికి కుడివైపు ఉన్న నదులు?

ఎ) ఒంగ్‌ బి) తెల్‌  సి) ఇబ్‌  డి) యాండ్‌

1) ఎ, బి    2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


34. నర్మదా నదికి ఎడమ వైపున ఉన్న ఉపనదులు?

ఎ) తావ్‌  బి) బంజర్‌ సి) హిరన్‌  డి) ఒర్సాంగ్‌

1) ఎ, డి   2) బి, సి   3) సి, డి   4) ఎ, బి


35. ఏ నదుల కలయిక వల్ల కంబర్జువా అనే కాలువ ఏర్పడింది?

ఎ) జువారి     బి) భరతపూజ 

సి) మాండోవి     డి) నేత్రావతి

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, సి   4) సి, డి


36. ఏ నదిని కేరళలో బారిస్‌ నది అని పిలుస్తారు?

1) పంబా          2) పెరియార్‌       

3) భరతపూజ           4) మాండోవి


37. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ’ ఏ ప్రాంతంలో ఉంది?

1) పట్నా 2) న్యూదిల్లీ    3) కోల్‌కతా      4) రూర్కీ


38. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ఏ నది ఒడ్డున ఉంది?

1) తీస్తా     2) మానస్‌   

3) మహానంద      4) సంకోష్‌


39. కిందివాటిలో విరూపక సరస్సులను గుర్తించండి.

ఎ) త్సోమోరి      బి) పాంగాంగ్‌ త్సో  

సి) వెంబనాడ్‌       డి) లోనార్‌

1) ఎ, సి  2) బి, సి    3) సి, డి  4) ఎ, బి


40. ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ కేరళ’ గా ఏ సరస్సు ప్రాంతాన్ని పిలుస్తారు?

1) అష్టముడి         2) వెంబనాడ్‌       

3) కుట్టనాడ్‌          4) సస్థమ్‌కొట్ట


41. కిందివాటిలో లాగూన్‌ సరస్సు కానిది?    

1) చిల్క              2) వెంబనాడ్‌       

3) లోనార్‌            4) అష్టముడి


42. శ్రీనగర్‌ రత్నం (శ్రీనగర్‌ జువెల్‌) అని ఏ సరస్సును పిలుస్తారు?

1) దాల్‌             2) ఊలర్‌       

3) పాంగాంగ్‌           4) ట్సామోరిరి


43. ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు?

1) రుద్రసాగర్‌            2) చోలామ     

3) లోక్‌తక్‌       4) పరశురామ్‌కుంద్‌


44. దుముకుడు గుంతలు ఏర్పడటానికి కారణం?

1) హిమనీనదాలు         2) నదులు        

3) అలలు        4) పవనాలు


45. పిచ్ఛాకారపు నమూనా ప్రవాహాన్ని కలిగిన నదులు?

ఎ) నర్మద      బి) తపతి  

సి) సింధూ      డి) గంగా

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


46. సమాంతర ప్రవాహ నమూనా ఉన్న నది?

1) సింధూ          2) గంగా         

3) బ్రహ్మపుత్ర           4) గోదావరి


47. దీర్ఘచతురస్రాకార నమూనా ప్రవాహాన్ని కలిగిన నదులు?

ఎ) చంబల్‌             బి) బెట్వా

సి) గంగా              డి) సింధూ

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


48. సింధు నది పరీవాహక ప్రాంతం తక్కువగా ఉన్న రాష్ట్రం?

1) హిమాచల్‌ప్రదేశ్‌        2) చండీగఢ్‌        

3) రాజస్థాన్‌           4) ఉత్తరాఖండ్‌


49. కృష్ణానదికి ఎడమ వైపున ఉన్న ఉపనదులు?

ఎ) భీమ       బి) దిండి    

సి) కొయానా    డి) పంచగంగా

1) ఎ, సి,      2) సి, డి   

3) డి, ఎ      4) ఎ, బి


50. కిందివాటిలో ‘సరస్సుల జిల్లా’ అని దేన్ని పిలుస్తారు?    

1) ఉదయ్‌పుర్‌  2) నైనిటాల్‌        

3) శ్రీనగర్‌    4) సిమ్లా



సమాధానాలు


1-2; 2-4; 3-1; 4-3; 5-4; 6-1; 7-3; 8-2; 9-3; 10-2; 11-3; 12-3; 13-3; 14-4; 15-2; 16-1; 17-2; 18-4; 19-1; 20-1; 21-4; 22-4; 23-3; 24-2; 25-4; 26-1; 27-2; 28-3; 29-1; 30-4; 31-3: 32-1; 33-1; 34-4; 35-3; 36-1; 37-4; 38-3; 39-4; 40-3; 41-3; 42-1; 43-3; 44-2; 45-1; 46-4; 47-1; 48-4; 49-4; 50-2.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 04-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌