• facebook
  • whatsapp
  • telegram

శక్తి వనరులు

బొగ్గును మండిస్తే తారు తయారు!

జనాభా ఎక్కువగా ఉన్న భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు శక్తి వనరులు అతి ముఖ్యమైనవి. ఆర్థిక వ్యవస్థను నడపడానికి, పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాకు, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అవి అత్యంత అవసరం. బొగ్గు, పునరుత్పాదక శక్తి, అణుశక్తి తదితర భిన్న రకాల వనరులు ఇంధన భద్రతను అందించడంలో, పర్యావరణ ప్రభావాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విధంగా దేశ సుస్థిర ప్రగతికి బాటలు వేస్తున్న ఆ శక్తివనరులపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి. అణువిద్యుత్తు కేంద్రాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. 


1. డిపార్ట్‌మెంట్‌ఆఫ్‌అటామిక్‌ఎనర్జీ (డీఏఈ) ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

1) 1956   2) 1954  3) 1965  4) 1964


2. హోమీబాబా నేషనల్‌ఇన్‌స్టిట్యూట్‌ ఏ నగరంలో ఉంది?

1) ముంబయి  2) కోల్‌కతా     

3) హైదరాబాద్‌  4) చెన్నై


3. భారతదేశంలో అణు విద్యుత్తు స్థాపిత సామర్థ్యం? 

1) 7840 మెగావాట్లు  2) 7640 మెగావాట్లు        

3) 6780 మెగావాట్లు   4) 4780 మెగావాట్లు


4. తారాపుర్‌అటామిక్‌పవర్‌స్టేషన్‌విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం?

1) 1180 మెగావాట్లు  2) 1200 మెగావాట్లు      

3) 1400 మెగావాట్లు  4) 440 మెగావాట్లు


5. 2031 నాటికి అణుశక్తి వాటాను ఎంతకు పెంచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది?

1) 22000 మెగావాట్లు   2) 22480 మెగావాట్లు     

3) 23480 మెగావాట్లు   4) 21000 మెగావాట్లు


6. 2020-2021లో దేశంలోని మొత్తం విద్యుత్తు స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం అణుశక్తి వాటా ఉంది?

1)   2.1 శాతం    2)  5.1 శాతం 

3)   3.1 శాతం   4)   6.1 శాతం  


7. భారతదేశంలోని థాల్‌భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మధ్యప్రదేశ్‌  2) మహారాష్ట్ర       

3) కర్ణాటక  4) ఉత్తర్‌ప్రదేశ్‌


8. 1985లో ఏర్పాటు చేసిన భారజల కేంద్రాలను గుర్తించండి.

ఎ) హజీరా   బి) బరోడా  సి) థాల్‌ డి) తాల్చేరు

1) ఎ, బి     2) బి, సి       3) సి, డి      4) డి, ఎ


9. ఆసియాలోనే మొదటి పరిశోధనా రియాక్టర్‌?

1) అప్సర   2) జర్లీనా  3) ధ్రువ   4) కామిని


10. భారతదేశంలోని పరిశోధనా రియాక్టర్లలో అతి   పెద్దది?

1) కామిని   2) జర్లీనా   3) అప్సర   4) ధ్రువ


11. కూడంకుళం న్యూక్లియర్‌పవర్‌స్టేషన్‌విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఎంత?

1) 1400 మెగావాట్లు  2) 2000 మెగావాట్లు        

3) 880 మెగావాట్లు  4) 440 మెగావాట్లు


12. కింది అటామిక్‌పవర్‌స్టేషన్లలో 440 మెగావాట్ల అణువిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగింది?

ఎ) మద్రాస్‌అటామిక్‌పవర్‌స్టేషన్‌

బి) నరోరా అటామిక్‌పవర్‌స్టేషన్‌

సి) కాక్రపార అటామిక్‌పవర్‌స్టేషన్‌

డి) కైగా అటామిక్‌పవర్‌స్టేషన్‌

1) ఎ, బి, సి   2) బి, సి, డి  

3) డి, ఎ, బి  4) ఎ, బి, సి, డి


13. బరోడా భారజల కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు

1) 1975   2) 1991   3) 1981  4) 198


14. స్వీట్‌గ్యాస్‌గా దేన్ని పిలుస్తారు?

1) హేల్‌గ్యాస్‌     

2) కంప్రెస్‌డ్‌నేచురల్‌గ్యాస్‌ (సీఎన్‌జీ)

3) కోల్‌బెడ్‌మీథేన్‌(సీబీఎం)  

4) లిక్విఫైడ్‌పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పీజీ)


15. వాయురహిత స్థితిలో బొగ్గును మండించినప్పుడు వెలువడేది?

ఎ) కోక్‌    బి) కోల్‌గ్యాస్‌ 

సి) కోల్‌తార్‌  డి) తారు

1) ఎ, బి, సి  2) బి, సి, డి   

3) ఎ, సి, డి  4) ఎ, బి, సి, డి


16. కిందివాటిలో సరికానిది?

1) సీఎన్‌జీ: కంప్రెస్‌డ్‌నేచురల్‌గ్యాస్‌    

2) ఎల్‌పీజీ: లిక్విఫైడ్‌పెట్రోలియం గ్యాస్‌

3) సీబీఎం: కోల్‌బేస్డ్‌మీథేన్‌         

4) బీడబ్ల్యూఆర్‌: బాయిల్డ్‌వాటర్‌రియాక్టర్‌


17. 2050 నాటికి భారతదేశ అణుశక్తి వాటాను ఎంత శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకుంది?

1) 15 శాతం  2) 25 శాతం    

3) 23 శాతం  4) 35 శాతం


18. కిందివాటిలో సరికానిది?

1) బీడబ్ల్యూఆర్‌: బాయిల్డ్‌వాటర్‌రియాక్టర్‌

2) పీహెచ్‌డబ్ల్యూఆర్‌: ప్రెజరైజ్డ్‌హీట్‌వాటర్‌ రియాక్టర్‌

3) వీవీఈఆర్‌(డబ్ల్యూడబ్ల్యూఈఆర్శ్‌: వాటర్‌వాటర్‌ఎనర్జిటిక్‌రియాక్టర్‌

4) హెచ్‌డబ్ల్యూబీ: హెవీ వాటర్‌బోర్డు


19. కోల్‌బెడ్‌మీథేన్‌(సీబీఎం) అధిక నిల్వలున్న రాష్ట్రం ఏది?

1) రాజస్థాన్‌  2) గుజరాత్‌ 

3) ఒడిశా  4) ఝార్ఖండ్‌


20. కిందివాటిని జతపరచండి.

1) శివ సముద్ర హైడ్రో ఎ) సొరంగ ఎలక్ట్రిక్‌ప్లాంట్‌ మార్గంలోనిది
2) కొయానా హైడ్రో  బి) ఎత్తయినది ఎలక్ట్రిక్‌ప్లాంట్‌
3) తెహ్రీ హైడ్రో సి) పెద్దది ఎలక్ట్రిక్‌ప్లాంట్‌  
4) నాథ్‌పా జక్రీ హైడ్రో డి) మొదటిది పవర్‌ప్లాంట్

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి   2) 1-సి, 2-డి, 3-బి,  4-ఎ

3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ  4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి


21. భారజల బోర్డులు, వాటి రాష్ట్రాల ఆధారంగా   సరికాని జతను గుర్తించండి.

1) కోట హెచ్‌డబ్ల్యూపీ  రాజస్థాన్‌

2) హజీరా హెచ్‌డబ్ల్యూపీ  కర్ణాటక

3) థాల్‌హెచ్‌డబ్ల్యూపీ  మహారాష్ట్ర 

4) బరోడా హెచ్‌డబ్ల్యూపీ  గుజరాత్‌


22. కిందివాటిలో సరికానిది?

1) వీఈసీసీ: వేరియబుల్‌ఎనర్జీ సైక్లోట్రాన్‌సెంటర్‌

2) బీఏఆర్‌సీ: బాబా అటామిక్‌రిసెర్చ్‌సెంటర్‌

3) బీఆర్‌ఐటీ: భారత్‌రేడియేషన్, ఐసోటోప్‌టెక్నాలజీ

4) టీఐఎఫ్‌ఆర్‌: టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఫండమెంటల్‌రిసెర్చ్‌


23. భారతదేశంలో మొదటిది, ప్రపంచంలో ఏడోది అయిన ఆక్సిజన్‌- 18 ప్లాంట్‌?

1) కోట భారజల కేంద్రం          

2) బరోడా భారజల కేంద్రం

3) మణుగూరు భారజల కేంద్రం    

4) హజీరా భారజల కేంద్రం


24. అణుధార్మికతకు ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) ఐరిన్‌క్యూరీ  2) మేడం క్యూరీ

3) రూథర్‌ఫర్డ్‌  4) హెన్రీ బెకరెల్‌


25. ప్రపంచంలో అతిపెద్ద పవన విద్యుత్తు క్షేత్రాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు?

1) చైనా   2) అమెరికా      

3) స్కాట్లాండ్‌  4) జపాన్‌


26. ప్రపంచంలో మొదటి విండ్‌మిల్‌ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు?

1) స్వీడన్‌  2) స్కాట్లాండ్‌    3) నార్వే 4) ఫ్రాన్స్‌


27. న్యూక్లియర్‌రియాక్టర్‌ను ఎవరు ఆవిష్కరించారు?

1) ఎన్రికోఫెర్మి   2) ఫెర్రి బెకరెల్‌

3) మేడం క్యూరీ  4) ఐరిన్‌క్యూరీ


28. బోర్డు ఆఫ్‌రేడియేషన్, ఐసోటోప్‌టెక్నాలజీ (బీఆర్‌ఐటీ) ఏ నగరంలో ఉంది?

1) కోల్‌కతా   2) ముంబయి        

3) లఖ్‌నవూ  4) చెన్నై


29. న్యూక్లియర్‌ఫ్లూయల్‌కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ) ఏ  నగరంలో ఉంది?

1) ముంబయి    2) కోల్‌కతా        

3) హైదరాబాద్‌  4) న్యూదిల్లీ


30. ప్రపంచంలో అధికంగా షెల్‌గ్యాస్‌నిల్వలున్న దేశం?

1) భారత్‌   2) చైనా  3) అమెరికా  4) ఫ్రాన్స్‌


31. ప్రస్తుతం భారతదేశం ఎంత శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది?

1) 85 శాతం   2) 75 శాతం   

3) 76.78 శాతం  4) 87.4 శాతం


32. ప్రస్తుతం భారతదేశంలో ఎంత శాతం ముడి  చమురు ఉత్పత్తి అవుతుంది?

1) 11.26 శాతం  2)12.6 శాతం       

3) 14.37 శాతం  4) 15.37 శాతం


33. 2022 - 2023కి మన దేశంలో ఎన్ని మిలియన్‌మెట్రిక్‌టన్నుల ముడిచమురు ఉత్పత్తి అయ్యింది?

1) 29.69  2) 29.18

3) 49.16  4) 49.69 


34. 2021 - 2022తో పోల్చినప్పుడు 2022 - 23 సంవత్సరంలో ముడిచమురు ఉత్పత్తుల్లో తగ్గుదల శాతం ఎంత?

1) 1.72 శాతం 2) 1.82 శాతం        

3) 1.92 శాతం 4) 1.62 శాతం


35. 2022 - 23లో ఎంత ముడి చమురును దిగుమతి చేసుకున్నారు?

1) 240.70 ఎంఎంటీ  2) 237.70 ఎంఎంటీ  

3) 232.70 ఎంఎంటీ   4) 247.70 ఎంఎంటీ  


36. భారతదేశంలో 2023, ఏప్రిల్‌1 నాటికి ముడి చమురు రవాణా చేసే పైప్‌లైన్‌మొత్తం ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది?

1) 11,420 కి.మీ. 2) 10,420 కి.మీ.

3) 13,420 కి.మీ.  4) 15,420 కి.మీ.


37. భారతదేశంలో 2023, మార్చి 31 నాటికి సహజవాయు ఆధారిత పైప్‌లైన్‌ఎన్ని కిలోమీటర్లు  విస్తరించి ఉంది?

1) 35,832 కి.మీ.  2)  34,532 కి.మీ.

3) 33,592 కి.మీ.  4) 37,592 కి.మీ.


38. భారతదేశంలో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించుకున్న రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం?

1) మహారాష్ట్ర   2) గుజరాత్‌        

3)ఉత్తర్‌ప్రదేశ్‌  4) పశ్చిమ బెంగాల్‌


39. భారతదేశంలో 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో  ఎన్ని మిలియన్‌మెట్రిక్‌టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించారు?

1) 201.78  2) 301.74 

3) 223.01  4) 211.78 


40. భారతదేశంలో 2021-2022 ఆర్థిక సంవత్సరాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో వృద్ధి రేటు శాతం?

1) 11.6 శాతం   2) 10.6 శాతం         

3) 15.4 శాతం   4) 6.4 శాతం


41. ప్రపంచవ్యాప్తంగా 2022 నాటికి ముడి చమురు ఉత్పత్తిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న దేశాలు?

ఎ) యునైటెడ్‌స్టేట్స్‌  బి) సౌది అరేబియా   

సి) రష్యా  డి) ఇరాన్‌

1) ఎ, బి  2) బి, సి  3) సి, డి   4) డి, ఎ


42. 2022 నాటికి ప్రపంచ ముడి చమురు ఉత్పత్తుల్లో భారతదేశ స్థానం?

1) 15  2) 20   3) 18   4) 22


సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-3; 5-2; 6-3; 7-2; 8-3; 9-1; 10-4; 11-2; 12-1; 13-1; 14-3; 15-4; 16-3; 17-2; 18-2; 19-4; 20-3; 21-2; 22-3; 23-3; 24-4; 25-1; 26-2; 27-1; 28-2; 29-3; 30-2; 31-4; 32-2; 332; 34-1; 3-53; 36-2; 37-3; 38-2; 39-3; 40-2; 41-1; 42-4.
 


రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌