• facebook
  • whatsapp
  • telegram

భాష సరళంగా.. సజీవంగా!  

గ్రాంథిక - వ్యావహారిక భాషోద్యమం - మాండలిక భాష
 

     

   
 

తెలుగు భాషలో చరిత్రాత్మక మార్పు ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధంలో జరిగింది. సాహిత్యం, రచనల్లో వాడుతూ వచ్చిన గ్రాంథిక భాషను క్రమంగా పక్కనపెట్టి, ప్రజలందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆ పరిణామం.  కాలానికి అనుగుణంగా రచనల భాషను సరళంగా మార్చి, సజీవంగా ఉంచేందుకు భాషాభిమానులు ఉద్యమించాల్సి వచ్చింది. ఈ సంఘర్షణను, వాడుక భాషకు పట్టం కట్టిన రచయితలు, వారి కృషి, రచనల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. వివిధ ప్రాంతాల్లోని మాండలికాలు, తరచూ పలికే పదాల గురించి అవగాహన పెంచుకోవాలి.



1.    కావ్య భాష, సాహిత్య భాష, పండిత భాష అని దేనికి పేరు?

1) గ్రాంథిక భాష       2) మాండలిక భాష      

3) వ్యావహారిక భాష       4) ప్రామాణిక భాష



2.     గ్రాంథిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అన్నది ఎవరు?

1) స్కిన్నర్‌       2) మాక్స్‌ముల్లర్‌   

3) ఛోమ్‌ స్కీ      4) బ్లూంఫీల్డ్‌



3.     కిందివారిలో గ్రాంథిక భాషను వ్యతిరేకించినవారు?

1) గంటిజోగి సోమయాజి     2) గిడుగు సీతమ్మ

3) గిడుగు రామ్మూర్తి      4) జయంతి రామయ్య పంతులు


4. సంస్కృత పద ప్రయోగపు రచనా గాంభీర్యం, రచనాశైలి ఏ భాష ప్రత్యేక లక్షణాలు?

1) మాండలిక భాష       2) వ్యావహారిక భాష  

3) గ్రాంథిక భాష       4) ప్రామాణిక భాష



5.  వ్యావహారిక భాషోద్యమానికి వ్యతిరేకం కానివారు?

1) గిడుగు రామ్మూర్తి       2) కొమర్రాజు లక్ష్మణరావు

3) వేదం వేంకటరాయశాస్త్రి    4) జయంతి రామయ్య పంతులు


6.  ‘డైకాటమీ’ అంటే భాష రెండుగా చీలిపోయే ప్రమాదం. దీని నివారణ కోసం కృషి చేసినవారు?    

1) జయంతి రామయ్య పంతులు   2) పానుగంటి లక్ష్మీనరసింహం

3) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి      4) గిడుగు రామ్మూర్తి



7.  ‘త్రాసు’ అనే అన్యదేశాన్ని వాడిన తెలుగు కవి ఎవరు?

1) నన్నయ్య       2) తిక్కన   

3) ఎర్రన       4) శ్రీనాథుడు


8.  కన్యాశుల్కం నాటకం ఎవరు రాశారు? (1896లో) ఇందులో ఆంగ్ల పదాలు విరివిగా వాడింది ఎవరు?

1) కందుకూరి వీరేశలింగం    2) గురజాడ అప్పారావు

3) గిడుగు రామ్మూర్తి     4) పానుగంటి లక్ష్మీనరసింహం



9.  కావలి బొర్రయ్య సహాయంతో కాలిన్‌ మెకంజీ కైఫియత్తులను సేకరించారు. కైఫియత్తు అంటే ఏమిటి?

1) స్థానిక చరిత్ర       2) రాజుల చరిత్ర   

3) వీరుల చరిత్ర     4) మహిళలకు సంబంధించిన చరిత్ర



10. 1746లో తెలుగు పుస్తకాలను అచ్చు వేశారు. ఇది ఎవరి కృషి వల్ల జరిగింది?

1) కాలిన్‌ మెకంజీ       2) బిషప్‌ కాల్డెల్‌   

 3) బెంజిమన్‌ షుల్జ్‌       4) రాబర్ట్‌ క్లైవ్‌



11. తెలుగులో వచ్చిన మొదటి వచన కావ్యం ఏది?

1) మహాభారతం       2) భాగవతం   

3) రాయవాచకం       4) రామాయణం



12. తెలుగు నాటకాల్లో మొదట పాత్రోచిత భాషను 1895లో నాగానందం ద్వారా వాడింది ఎవరు?

1) గిడుగు రామ్మూర్తి    2) వేదం వేంకటరాయ శాస్త్రి

3) కందుకూరి వీరేశలింగం   4) గురజాడ అప్పారావు



13. వ్యావహారిక భాషోద్యమం ఎప్పుడు జరిగింది?

 1) 1945 - 1985       2) 1885 - 1920  

3) 1910 - 1973       4) 1910 - 1930


 

14. హిత సూచని గ్రంథం ఎవరు రాశారు?

1) సామినేని ముద్దునరసింహం     2) కొక్కొండ వెంకటరత్నం

 3) కందుకూరి వీరేశలింగం     4) గిడుగు రామ్మూర్తి



15. 1901 సిమ్లా సమావేశం నాటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

1) రిప్పన్‌  2) కర్జన్‌  3) కానింగ్‌  4) డల్హౌసీ



16. మద్రాసు, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలు ఏర్పడిన సంవత్సరం-    

1) 1957  2) 1947  3) 1857  4) 1885



17. ప్రాదెనుగుకమ్మ, బాలకవి శరణ్యం, గద్య  చింతామణి లాంటి గ్రంథాలు రాసింది ఎవరు?

1) గిడుగు రామ్మూర్తి   2) కందుకూరి వీరేశలింగం 

3) గురజాడ అప్పారావు  4) జయంతి రామయ్య పంతులు



18. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు అనే గ్రంథాలు 1910లో ప్రచురితమయ్యాయి. వీటి రచయిత ఎవరు?

1) గిడుగు రామ్మూర్తి     2) కందుకూరి వీరేశలింగం

3) గురజాడ అప్పారావు    4) జయంతి రామయ్య పంతులు



19. సవర భాషా నిఘంటువు, వ్యాకరణం రాసినవారు ఎవరు?

1) కందుకూరి వీరేశలింగం      2) గిడుగు రామ్మూర్తి  

3) గురజాడ అప్పారావు    4) పానుగంటి లక్ష్మీనరసింహం



20. గ్రీకు పురాణ కథలు, వసంతసేన అనే గ్రంథాలు రాసింది ఎవరు?

1) శ్రీనివాస్‌ అయ్యంగర్‌    2) శెట్టి లక్ష్మీనరసింహం

 3) వేదం వెంకటాచలం   4) కందుకూరి వీరేశలింగం



21. ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 1911లో ఎక్కడ ఏర్పడింది?

1) విజయవాడ       2) విశాఖపట్నం   

3) హైదరాబాద్‌       4) కాకినాడ



22. ఆంధ్ర సాహిత్య పరిషత్‌ స్థాపకులు ఎవరు?

1) జయంతి రామయ్య పంతులు   2) కందుకూరి వీరేశలింగం

3) బుర్రా శేషగిరిరావు     4) శెట్టి లక్ష్మీనరసింహం


23. ‘కాశీయాత్ర చరిత్ర’ గ్రంథ రచయిత ఎవరు?

1) ఏనుగుల వీరాస్వామి   2) సామినేని ముద్దునరసింహం

3) వావికొలను సుబ్బారావు   4) వేదం వేంకటరాయశాస్త్ర



24. ‘గ్రాంథిక వాదుల విజయం కాంక్షించి జయంతి రామయ్యోక్తి గెలిచె’ అన్నది ఎవరు?

1) పానుగంటి లక్ష్మీనరసింహం   2) వడ్డాది సుబ్బరాయకవి

3) జయంతి రామయ్య పంతులు    4) కొమర్రాజు లక్ష్మణరావు



25. ‘సొడ్డు’ అనే రచన ఎవరిది

1) గిడుగు రామ్మూర్తి       2) గిడుగు సీతాపతి

3) గురజాడ అప్పారావు    4) కందుకూరి వీరేశలింగం



26. గిడుగు వారిని ‘రామ్మూర్తీ! ఇంక నీ గంజాం జిల్లాకేగా!!’ అన్నది ఎవరు?

1) గురజాడ అప్పారావు      2) వడ్డాది సుబ్బరాయకవి 

3) పానుగంటి లక్ష్మీనరసింహం  4) కందుకూరి వీరేశలింగం



27. డిసెంట్‌ పత్రం (అసమ్మతి పత్రం) రాసింది ఎవరు?

1) కందుకూరి వీరేశలింగం        2) గిడుగు రామ్మూరి 

3) గురజాడ అప్పారావు     4) పానుగంటి లక్ష్మీనరసింహం


28. గ్రామ్యమా? గ్రాంథికమా? అనే వ్యాసం రాసింది ఎవరు?

1) పురాణం సూరిశాస్త్రి    2) మల్లాది సూర్యనారాయణ శాస్త్రి

3) గురజాడ అప్పారావు   4) బుర్రా శేషగిరిరావు



29. 1915లో ‘ఆంధ్ర భాషా సర్వ స్వార్హనియమ కతిపయములు’ రచన చేసింది ఎవరు?

1) వేదం వేOకటరాయశాస్త్రి     2) గిడుగు సీతాపతి

3) జయంతి రామయ్య పంతులు    4) జయంతి గంగన్న


30. ‘అభినవాచార్యకం’ కర్త ఎవరు?

1) పింగళి లక్ష్మీకాంతం  2) గొడవర్తి సూర్యనారాయణ

3) తాపీ ధర్మారావు   4) చిలుకూరి నారాయణరావు



31. 1937లో ‘జనవాణి’ దినపత్రిక (వ్యవహారిక భాషా పత్రిక) సంపాదకులు ఎవరు?

1) పింగళి లక్ష్మీకాంతం     2) తాపీ ధర్మారావు 

3) జయంతి రామయ్య    4) పానుగంటి లక్ష్మీనరసింహం



32. భాషలోని ప్రాంతీయ భేదాలను మాండలికం అని అన్నదెవరు?

1) హిమనీ       2) మాక్స్‌ముల్లర్‌   

 3) పి.ఎస్‌. సుబ్రహ్మణ్యం     4) పింగళి లక్ష్మీకాంతం



33. ఉప భాష, ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష అని ఏ భాషకు పేరు?

1) ప్రామాణిక భాష       2) గ్రాంథిక భాష   

3) వ్యవహారిక భాష       4) మాండలిక భాష



34. ‘నిజానికి ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు’ అన్నది ఎవరు?

1) పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం     2) మాక్స్‌ముల్లర్‌

3) ఇరివెంటి కృష్ణమూర్తి     4) కందుకూరి వీరేశలింగం



35. గోవులను ‘సొమ్ములు’ అని పిలిచే ప్రాంతం ఏది?

1) కోస్తా       2) కళింగ  

3) రాయలసీమ       4) తెలంగాణ



36. ‘పేడ’ను ‘పెండ’ అనే ప్రాంతం ఏది?

1) కోస్తా       2) తెలంగాణ   

3) రాయలసీమ       4) కళింగ



37. ‘నీ జిమ్మడిపోను’ అనే మాండలికం వాడేవారు?

1) పిల్లలు       2) వృద్ధులు   

3) పురుషులు       4) స్త్రీలు



38. ‘కీసు, ఆసికం, ఆరంజోతి, ఆరె’ అనే పదాలు వాడే మాండలికం ఏది?

1) బ్రాహ్మణ మాండలికం   2) హరిజన మాండలికం

3) వృద్ధుల మాండలికం        4) పైవన్నీ



39. పూజు, ఆనపకాయ, ఉండ, గంటె, గాబు అనే పదాలు ఉండే మాండలికం ఏది?

1) పూర్వ మాండలికం      2) మధ్య మాండలికం

3) దక్షిణ మాండలికం      4) ఉత్తర మాండలికం



40. కపిల, నాగేలి (మడక), గోగాకు, చిలుకు గునాది అనే పదాలున్న మాండలికం ఏది?

1) పూర్వ మాండలికం      2) దక్షిణ మాండలికం

3) ఉత్తర మాండలికం      4) మధ్య మండలం



41. తెలుగు మాండలిక పరిశోధనల్లో అగ్రగణ్యులు?

1) భద్రిరాజు కృష్ణమూర్తి   2) గురజాడ శ్రీరామ్మూర్తి 

3) గిడుగు రామ్మూర్తి    4) కందుకూరి వీరేశలింగం 



42. ‘ఉ భాలు, బేపి, పైన, బంద, భోగట్టా, రేక’ అనేవి ఏ భాష నుంచి వచ్చాయి?

1) కన్నడ       2) తమిళం   

3) ఒరియా       4) మరాఠి



43. సామాజిక మాండలిక వర్గీకరణలో లేనిది?

1) ఆదాయం        2) విద్య   

3) వృత్తి        4) వయసు 



44. గ్రాంథిక వ్యవహారికాలను శైలీభేదాలుగా గుర్తించి వివరించే శైలి సంఘానికి అధ్యక్షుడు- (1965)

1) పింగళి లక్ష్మీకాంతం   2) భద్రిరాజు కృష్ణమూర్తి

3) తాపీ ధర్మారావు     4) జయంతి రామయ్య పంతులు 




సమాధానాలు
 

1-1; 2-4; 3-3; 4-3; 5-1; 6-4; 7-2; 8-2; 9-1; 10-3; 11-3; 12-2; 13-3; 14-1; 15-2; 16-3; 17-1; 18-3; 19-2; 20-2; 21-4; 22-1; 23-1; 24-2; 25-2; 26-3; 27-3; 28-2; 29-1; 30-2; 31-2; 32-1; 33-4; 34-2; 35-2; 36-2; 37-4; 38-2; 39-1; 40-2; 41-1; 42-3; 43-4; 44-1.


రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 02-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.