• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం - పరిరక్షణ

సిగరెట్‌ పొగలో వందకుపైగా విషవాయువులు!

మానవాళి సహా సమస్త జీవకోటి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యం. ఈ కాలుష్యానికి ప్రకృతిపరమైన పరిణామాలు కూడా కారణమే అయినప్పటికీ ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఉపయోగించే పరికరాల వల్లనే అధిక నష్టం జరుగుతోంది. అడవుల నరికివేతతో భూగోళం వేడెక్కిపోతోంది. కాలుష్యం రకాలు, కారకాలు, దుష్పరిణామాలు, వచ్చే వ్యాధుల వివరాలతోపాటు కాలుష్య నియంత్రణ చట్టాలు, అందులోని నిబంధనలపైనా పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. వివిధ కాలుష్యాలతో  దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు, వాటి ఆశయాలు, నిర్వహించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.


1. 2023లో రవి ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే అతడు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్‌ను ఎన్ని నెలలకు పొందుతాడు?

1) 12     2) 6     3) 3     4) 5 


2.  మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?

1) 1999     2) 1989     3) 1988    4) 1947


3. కింది మౌలిక మూలకాల్లో పరిమాణంలో 3వ స్థానంలో ఉన్న వాయువు?

1) ఆర్గాన్‌        2) నైట్రోజన్‌    

3) ఆక్సిజన్‌     4) కార్బన్‌ డై ఆక్సైడ్‌

4.  కిందివాటిలో విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ?

1) బారెన్‌    2) నార్కోండం    3) కులాల్‌      4) 2, 3


5. ఈక్వెడార్‌లోని క్రియాశీల అగ్నిపర్వత్వాన్ని గుర్తించండి.  

1) కోటపాక్సీ         2) ఎట్నా    

3) స్ట్రాంబోలి        4) ఫ్యూజియామా 


6. భవిష్యత్తులో ఉద్భేదనం కాని అగ్నిపర్వతాన్ని ఏమంటారు?

1) నిద్రాణ    2) విలుప్త    3) క్రియాశీల     4) 1, 3


 

7. వాహనాల నుంచి వచ్చే వ్యర్థ ఇంజిన్‌ ఆయిల్‌ ఒక చుక్క నుంచి ఎన్ని లీటర్ల నీరు కలుషితం అవుతుంది?

1) 10 లీ. 2) 15 లీ.  3) 25 లీ.  4) 40 లీ.


8. వాహనాల నుంచి వెలువడే ఏ రసాయనం మెదడుపై ప్రభావం చూపుతుంది?

1) పాదరసం     2) సీసం    

3) ఆర్సినిక్‌      4) ఫార్మాల్డీహైడ్‌


9. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన గణాంకాల ప్రకారం ఏటా ఎంతమంది వాయుకాలుష్యం వల్ల చనిపోతున్నారు?

1) 2.4 మిలియన్లు        2) 2.4 బిలియన్లు

3) 20 లక్షల 40 వేలు     4) 1, 3 


10. కిందివాటిలో మినిమాటా వ్యాధికి కారణమయ్యే రసాయనం?

1) సీసం        2) పాదరసం    

3) అమ్మోనియా        4) కార్బన్‌ మోనాక్సైడ్‌


11. చెర్నోబిల్‌ దుర్ఘటన సంభవించిన సంవత్సరం?

1) 1986  2) 1945  3) 1975  4) 1990


12. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే వాయువు?

1) CO2    2) CO   3) NO   4)    SO2


13. ప్రస్తుతం భూమిపై ఎంతశాతం అడవులు ఉన్నాయి?

1) 19%  2) 21%   3) 33%   4) 30% 


14. గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమైన వాయువు?

1) SO2   2) CO     3) NO2   4)  CO2 


15. CFC వాయువు దేని నుంచి విడుదలవుతుంది?

1) రిఫ్రిజిరేటర్లు     2) ఏసీలు 

3) జెట్‌ విమానాలు     4) పైవన్నీ 


16. పేపర్‌ మిల్లు నుంచి వెలువడే కాలుష్య కారకం?

1) క్లోరిన్‌  2) ఫ్లోరైడ్‌   3) సీసం   4) ళీవీ2


17. జంతు, వృక్ష కళేబరాల నుంచి వెలువడే విషవాయువు?

1) Cl2   2) O 3) PAN    4) NH3


18. నేలలోని గాలి శాతం?

1) 25%  2) 45%  3) 60%   4) 75% 


19. మంచి నేల pH విలువ?

1) 5.57.5  2) 4.5   3) 2.5   4) 8.5 


20. నేలలోని వ్యర్థాల్లో 15% ఆక్రమించినవి?

1) నిర్మాణ వ్యర్థాలు       2) ప్లాస్టిక్‌   

3) చెత్త       4) లోహాలు


21. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎక్కువ మోతాదులో ఉపయోగించిన రసాయనం?

1) DDT   2) BHC    3) NH4NO3    4) K2O


22. మనదేశంలో రోజూ సుమారు ఎన్ని మెట్రిక్‌ టన్నుల చెత్త ఘనరూప వ్యర్థంగా ఏర్పడుతుంది (పెద్ద పట్టణాల్లో)?

1) 30,000             2) 40,000 

3) 50,00080,000    4) 80,00090,000  


23. కిందివాటిలో ఏ ప్లాస్టిక్‌ కారకం తల్లి పాల నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది?

1) డయాక్సిన్‌           2) ఫార్మాల్డీహైడ్‌

3) పెరాక్సీ ఎసిటైల్‌       4) జియాన్‌ 


24. భోపాల్‌ దుర్ఘటన జరిగిన సంవత్సరం?

1) 1988  2) 1972   3) 1984  4) 1975 


25. భోపాల్‌ దుర్ఘటనలో వెలువడిన వాయువు?

1) MIC    2) PAN   3) BHC   4) DDT


26. తాజ్‌మహల్‌ రంగును కోల్పోవడానికి కారణం?

 1) గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌       2) ఆమ్ల వర్షాలు 

3) భూతాపం            4) గ్లోబల్‌ వార్మింగ్‌


27. వంటగ్యాస్‌లో ఉన్న వాయువు?

1) మీథేన్‌     2) ప్రొపైలిన్‌ 

3) బ్యూటేన్‌     4) అమాగ్జలిన్‌ 


28. సిగరెట్‌ పొగలోని విషవాయువుల సంఖ్య?

1) 120   2) 100    3) 80    4) 150 


29. అసంపూర్తిగా మండిన వాయువుల నుంచి వెలువడే వాయువు?

1) SO2    2) NO2   3) CO2   4)  CO


30. మురికివాడలు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌        2) మహారాష్ట్ర    

3) బిహార్‌        4) తమిళనాడు 


31. కిందివాటిలో గ్రీన్‌హౌస్‌ వాయువు కానిది?

1) CO2   2) CO   3) NO2    4) CFC


32. కిందివాటిలో ఆస్తమాకు ప్రధాన కారణం?

1) CO2       2) యూట్రిఫికేషన్‌   

3) ఏరోసోల్స్‌       4) అవక్షేపనాలు


33. మన దేశంలో గత రెండు దశాబ్దాలుగా భూగర్భజలాలు ఎన్ని మీటర్లు తగ్గాయి?

1) 4 మీ.  2) 10 మీ  3) 6 మీ 4) 12 మీ.

34. వాతావరణంలోని మౌలిక మూలకాల్లో 78%  ఉన్నది? 

1) N   2) NO2    3) N2O   4) O2


35. నీటిలో కుళ్లిన వ్యర్థాల నుంచి వెలువడే కాలుష్య కారకం?

1) అమ్మోనియా        2) మీథేన్‌   

3) బ్యూటేన్‌      4) కార్బన్‌ డై ఆక్సైడ్‌ 

36. భూగోళంపై ఉన్న జీవరాశులు జీవించేందుకు అనువైన ఉష్ణాన్ని కలిగించే ప్రక్రియ?

1) హరితగృహ ప్రభావం     2) ఆమ్ల వర్షాలు 

3) గ్లోబల్‌ వార్మింగ్‌         4) 1, 2

37. వాతావరణంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం?

1) 0.3%    2) 0.03%    3) 0.4%    4) 0.44% 


38. వాతావరణంలోని సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ జీవిత కాలం?

1) 2 - 4 వారాలు    2) 2 - 4 ఏళ్లు

3) 2 - 4 నెలలు     4) 5 - 6 నెలలు 


39. లండన్‌ పొగమంచు ఏర్పడిన సంవత్సరం?

1) 1972  2) 1942  3) 1950  4) 1952 

40. పొగమంచుకు స్మాగ్‌ అని పేరు పెట్టింది?

1) హెచ్‌.వి.డోస్‌బక్స్‌     2) జోసఫ్‌ గాల్విన్‌ 

3) మేధా పాట్కర్‌      4) 1, 2 


41. ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినం?

1) సెప్టెంబరు 18        2) అక్టోబరు 18    

3) సెప్టెంబరు 16        4) జూన్‌ 5 


42. ప్రపంచ పర్యావరణ దినం?

1) సెప్టెంబరు 16       2) మార్చి 22   

3) జూన్‌ 5        4) జులై 11 


43. చిప్కో ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?

1) మేధా పాట్కర్‌     2) సుందర్‌లాల్‌ బహుగుణ

3) అరుంధతీరాయ్‌    4) బాబా ఆమ్టే 


44. పొల్యూషన్‌ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?

1) ఆంగ్లం  2) గ్రీకు   3) లాటిన్‌   4) ఫ్రెంచి 


45. సైలెంట్‌ వ్యాలీ ఉద్యమానికి కారణమైన నది?

1) కుంతీపూజ     2) అస్టాముడి     

3) వెల్లాయని     4) పరవూర్‌ 


46. కిందివాటిలో అతి ప్రమాదకరమైన కాలుష్యం?

1) గాలి కాలుష్యం   2) నీటి కాలుష్యం 

3) నేల కాలుష్యం   4) రేడియోధార్మిక కాలుష్యం


47. ఇండియన్‌ ఇంక్‌లో ఉన్న మూలకం ఏది?

1) పాదరసం        2) కార్బన్‌    

3) బ్రోమైన్‌        4) జింక్‌ 


48. మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ను దేనికోసం నిర్దేశించారు?

1) వాయు కాలుష్యం       2) ధ్వని కాలుష్యం 

3) ఓజోన్‌ పొర రక్షణ      4) ఉద్గారాల తగ్గింపు 


49. గ్రానైట్‌ పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వెలువడే వాయువు వల్ల వచ్చే క్యాన్సర్‌?

1) గొంతు సంబంధిత    2) ఊపిరితిత్తులు 

3) ఎముకలు       4) కండరాలు 


50. తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతంలో ఎంతదూరం వరకు వాహనాలు నిషేధం?

1) 1.5 కి.మీ.     2) 3.7 కి.మీ. 

3) 2.5 కి.మీ.     4) 8 కి.మీ. 


51. ప్రపంచ కాలుష్య దినం?

1) జూన్‌ 5     2) జులై 11    

3) సెప్టెంబరు 16       4) డిసెంబరు 2 


52. గ్రీన్‌హౌస్‌ను మొదటగా గుర్తించింది?

1) జోసఫ్‌ పొరియర్‌     2) బాబా ఆమ్టే 

3) హెచ్‌.వి.డోస్‌బక్స్‌     4) జోసఫ్‌ గాల్విన్‌ 

53. భారత ప్రభుత్వం అమృతా దేవి వన్యప్రాణుల సంరక్షణ అవార్డును ఏ రాష్ట్ర గిరిజన తెగ గుర్తింపు కోసం నెలకొల్పింది?

1) మధ్యప్రదేశ్‌      2) మహారాష్ట్ర  

3) రాజస్థాన్‌     4) మేఘాలయ 


54. కాంతి రసాయన పొగమంచు ఏర్పడటానికి కారణం?

1) నైట్రోజన్‌ ఆక్సైడ్‌     2) కార్బన్‌ డై ఆక్సైడ్‌ 

3) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌      4) 1, 2 



55. పరిశ్రమల నుంచి వెలువడే పార్టిక్యూలేట్‌లను తొలగించే పరికరం?

1) స్లర్రీ   2) స్క్రబ్బర్‌   3) స్టాన్లీ   4) చిమ్నీ 


56. వాహనాలకు అమర్చే కేటలైటిక్‌ కన్వర్టర్స్‌ తయారీలో ఉపయోగించేవి?

1) ప్లాటినం      2) పల్లాడియం  

3) రేడియం     4) పైవన్నీ  

57. మన దేశంలో వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 

1) 1981  2) 1987  3) 1972  4) 1962


58. జాతీయ నది సంరక్షణ పథకం ప్రస్తుతం మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది?

1) 16     2) 18     3) 17     4) 15


59. జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతో పాటు మొక్కలను కూడా ఉపయోగించడాన్ని ఏమంటారు?

1) రెమిడియేషన్‌     2) ఫైటో రెమిడియేషన్‌ 

3) మైక్రో రెమిడియేషన్‌      4) అన్నీ  

60. నేలలోని వ్యర్థాల్లో ఉండే సేంద్రియ వ్యర్థాల శాతం?

1) 32%   2) 15%   3) 7%   4) 8% 


61. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌ అని దేనికి పేరు?

1) హైయాసింత్‌  2) స్ట్రోబిలాంథస్‌ 

3) కురవంజి    4) నీలంబో

62. వేటికి ప్రత్యామ్నాయంగా శానిటరీ లాండ్‌ ఫిల్‌లను ప్రవేశపెట్టారు?

1) డంపింగ్‌ యార్డ్‌    2) పాలిస్టెరీ   41   3) బహిరంగ బర్నింగ్‌డంప్‌లు  4  ) భస్మీకరణ యంత్రం


 


సమాధానాలు

1-1; 2-3; 3-1; 4-4; 5-1; 6-2; 7-3; 8-2; 9-4; 10-2; 11-1; 12-4; 13-1; 14-4; 15-4; 16-1; 17-4; 18-1; 19-1; 20-2; 21-1; 22-3; 23-1; 24-3; 25-1; 26-2; 27-3; 28-1; 29-4; 30-2; 31-2; 32-3; 33-1; 34-1; 35-2; 36-1; 37-2; 38-2; 39-4; 40-1; 41-3; 42-3; 43-2; 44-3; 45-1; 46-4; 47-2; 48-3; 49-2; 50-3; 51-2; 52-1; 53-3; 54-1; 55-2; 56-4; 57-1; 58-3; 59-2; 60-1; 61-1, 62-3

 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌