• facebook
  • whatsapp
  • telegram

మానవ జీర్ణవ్యవస్థ పరిణామం - ప్రాధాన్యం

పోషకాల శోషణకు.. వ్యర్థాల విసర్జనకు!
 


తిన్న ఆహారం నేరుగా శరీరంలోకి చేరిపోదు. నోటి నుంచి మొదలయ్యే జీర్ణక్రియ ఆహారాన్ని అనేక మార్పులకు గురిచేసి ఆఖరికి శరీరం శోషించుకునే స్థితికి చేరుస్తుంది, శక్తిని సమకూరుస్తుంది. ఆ ప్రక్రియను సాగించే సంక్లిష్ట మానవ జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి అనేక అవయవాలతో కూడి ఉంటుంది. అవి వివిధ విధులను నిర్వహిస్తాయి. అందులో భాగంగా శరీరానికి అవసరమైన పోషకాలను స్వీకరించిన తర్వాత వ్యర్థాలను బయటకు విసర్జిస్తాయి. ఈ క్రమంలో పని చేసే  అవయవ భాగాలు, రకరకాల గ్రంథులు, అవి స్రవించే హార్మోన్ల ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. శోషణ చెందిన జీర్ణ పదార్థాలు కణజాలాలను చేరి జీవపదార్థ అనుఘటకాలుగా మారే తీరును అర్థం చేసుకోవాలి. 

1 . మానవుడిలో నాలుక రెండో భాగం దేని సహాయంతో అతికి ఉంటుంది? 

1) ప్రెన్యులమ్‌     2) నాసికాగ్రసని 

3) తాలవ్య గవదబిళ్ల్ల 4) 1, 2 


 

2. కిందివాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి. 

ఎ) రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గినప్పుడు ఆకలి సంకేతాలు కలుగుతాయి.. 

బి)మానవుడి జీర్ణాశయంలోని కొన్ని కణాలు ‘గ్రీలిన్‌’ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. 

సి) ఆకలి వేయడం, గ్రీలిన్‌ ఉత్పత్తి అనేది 10వ కపాలనాడి ‘వేగస్‌’ నాడీ ఆధీనంలో ఉంటుంది. 

డి)ఆకలి వేయడం అనేది దాదాపుగా 30 - 45 నిమిషాల వరకు కొనసాగుతుంది. 

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, బి, సి  4) పైవన్నీ

3.  ‘లెప్టిన్‌’ హర్మోన్‌ ఉపయోగం ఏమిటి? 

1) ఆకలిని కలిగించడం 

2) ఆకలి కోరికను ఆపడం, అణచివేయడం

3) ఆకలి మందగించడం     

4) పైవన్నీ 


 

4. మానవుడిలో నోటి కండరాల విధి...? 

1) ఆహారాన్ని ఆస్యకుహరంలోకి నెట్టడానికి  సాయపడుతుంది.  

2) ఆహారం రుచిని గుర్తించడానికి

3) ఆహారంలోని పిండిపదార్థాలను జీర్ణం చేయడానికి 

4) ఆహారంలోని ప్రొటీన్లను జీర్ణం చేయడానికి


5. జీర్ణాశయంపై ప్రయోగాలు నిర్వహించిన వ్యక్తి? 

1) మార్టిన్‌  2) హార్వే     

3) లిన్నేయస్‌     4) బీమాంట్‌


 

6. బీమాంట్‌ ప్రయోగంలో అసత్య వాక్యాన్ని  గుర్తించండి. 

1) మానవుడిలో జీర్ణాశయంలో ఆహారం జీర్ణమవుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది.

2) జఠర రసంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (హెచ్‌సీఎల)్‌ అధికంగా ఉంటుంది.

3) ఆహారం జీర్ణాశయంలోకి చేరగానే జీర్ణక్రియ మొదలవుతుంది. 

4) జఠర రసం జీర్ణాశయంలో నిల్వ ఉండదు.


7. ఆహారాన్ని మింగడం, జీర్ణం కావడం లాంటివి దేని ఆధీనంలో ఉంటాయి?     

1) స్వయంచోదిత నాడీవ్యవస్థ  2) జీర్ణ నాడీవ్యవస్థ 

3) నాడీవ్యవస్థ    4) 1, 2 


 

8. జీర్ణాంతర నాడీవ్యవస్థ మరోపేరు? 

1) మెదడు  2) రెండో మెదడు 

3) జీర్ణమెదడు   4) 1, 2


 

9. జీర్ణనాడీ మండలంలో ఉన్న నాడీకణాల సంఖ్య? 

1) 100 మిలియన్లు   2) 10 బిలియన్లు 

3) 100 బిలియన్లు   4) 10 మిలియన్లు 

10. కింది వాటిలో తప్పుగా జరపరచినదాన్ని  గుర్తించండి. 

1) కైమ్‌ - చిన్నపేగులో జీర్ణమైన ఆహారం 

2) కైల్‌ - ఆస్యకుహరంలో ఆహారం 

3) కడ్‌ - నెమరువేసే జంతువుల్లో ఆహారపు ముద్ద 

4) బోలస్‌ - ఆస్యకుహరంలో ఆహారపు ముద్ద 

11. కిందివాటిలో జీర్ణాశయ గదులు కానిది? 

1) జాలకం     

2) హార్ధిక జీర్ణాశయం 

3) ఫండిక్‌ జీర్ణాశయం 

4) జఠర నిర్గమ జీర్ణాశయం 


 

12. ఆహారనాళంలో అతిపెద్ద భాగం? 

1) పెద్దపేగు   2) కోలాన్‌ 

3) చిన్నపేగు  4) శేషాంత్రికం 


 

13. జీర్ణనాళంలో వరుసను గుర్తించండి. 

1) ఆంత్రమూలం, శేషాంత్రికం జెజునం, అంధనాళం, కోలాన్, పురీషనాళం

2) ఆంత్రమూలం, జెజునం, శేషాంత్రికం, అంధనాళం, కోలాన్, పురీషనాళం

3) ఆంత్రమూలం, శేషాంత్రికం, జెజునం, కోలాన్, అంధనాళం, పురీషనాళం 

4) జెజునం, ఆంత్రమూలం, శేషాంత్రికం, కోలాన్, అంధనాళం, పురీషనాళం 


 

14. జఠర రసం pH విలువ ఎంత? 

1) 0.9   2) 2.9      3) 3.1   4) 3.9

15. నిర్గమ సంవరిణి ఉన్న జీర్ణాశయ భాగం? 

1) ఫండిక్‌ జీర్ణాశయం   2) హార్ధిక జీర్ణాశయం 

3) జఠర నిర్గమ జీర్ణాశయం  4) 1, 3 

16. కిందివాటిలో ఆంత్రమూలం నుంచి ఉత్పత్తి అయ్యేది? 

1) గ్యాస్ట్రిన్‌   2) సెక్రెటిన్‌ 

3) గ్రీలిన్‌     4) ఎంటరోగ్యాస్ట్రిన్‌ 17. వాంతి చేయడం అనేదాన్ని మెదడులోని ఏ భాగం నియంత్రిస్తుంది?     

1) మస్తిష్కం   2) మజ్జాముఖం 

3) అనుమస్తిష్కం     4) వెన్నుపాము 


18. పెరిస్టాల్టిక్‌ లేని జీర్ణనాళ భాగం? 

1) జీర్ణాశయం   2) ఆహార వాహిక 

3) చిన్నపేగు  4) 1, 3 19. కింది వాటిలో ఉత్పత్తి స్థానం ఆధారంగా  భిన్నమైంది గుర్తించండి. 

1) ట్రిప్సినోజన్‌   2) కైమో ట్రిప్సినోజన్‌  

3) రెనిన్‌    4) 1, 2 20. జతపరచండి.

1) జఠరనిర్గమ గ్రంథులు ఎ) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
2) గ్రీవ కణాలు బి)శ్లేష్మం 
3) పెప్టిక్‌ కణాలు సి) గ్యాస్ట్రిన్‌ 
4) ఆక్సింటిక్‌ కణాలు డి)ప్రో ఎంజైమ్స్‌

1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 

2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ 

3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 

4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ 


 

21. భావన - ఎ: ఆంత్ర గ్రంథులైన జఠర నిర్గమ గ్రంథి, హార్ధిక గ్రంథులు స్రవించే స్రావకాన్ని ‘సక్కస్‌ ఎంటరికస్‌’ అంటారు. 

    భావన - బి: సక్కస్‌ ఎంటరికస్‌లో పెప్టిడేజ్‌లు  డైశాకరైడ్లు ఆంత్ర లైపేజ్‌లు ఉంటాయి.     

1) ఎ సత్యం, బి అసత్యం 

2) ఎ, బి లు అసత్యం 

3) ఎ అసత్యం, బి సత్యం 

4) ఎ, బి లు సత్యం 22. జీర్ణాశయంలో లైసోజైమ్‌ను స్రవించే కణాలు? 

1) గ్రీవ కణాలు     2) పనీత్‌ కణాలు 

3) పెప్టిక్‌ కణాలు     4) పైవన్నీ 

23. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి? 

1) కాలేయం   2) క్లోమం 

3) పీయూష గ్రంథి  4) అధివృక్క గ్రంథి 


 

24. కిందివాటిలో ఎంజైమ్‌లు లేని జీర్ణరసం-

1) సక్కస్‌ ఎంటరికస్‌   2) జఠర రసం 

3) పైత్య రసం     4) క్లోమ రసం

25. కిందివాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.  

1) బైలురూబిన్, బైలువర్దిన్‌ పైత్యరస లవణాలు. 

2) కాలేయం.. ప్లాస్మాప్రొటీన్లను సంశ్లేషిస్తుంది. 

3) కాలేయం బరువు దాదాపు 2.5 కిలోలు.

4) కాలేయం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు వాయుగోణులు.

26. కిందివాటిలో కాలేయ విధి కానిది... 

1) ఉష్ణక్రమత అవయవంగా పనిచేస్తుంది. 

2) పిండ దశలో కాలేయం రక్తకణోత్పాదక అంగంగా, ప్రౌఢదశలో ఎర్రరక్తకణ విచ్ఛిత్తి అంగంగా పనిచేస్తుంది.

3) ఎ, డి, ఈ, కె లను నిల్వచేస్తుంది కానీ ఇనుము, విటమిన్‌-బి12ను నిల్వచేయదు. 

4) డీ-ఎమినేషన్‌ ప్రక్రియలో పాల్గొంటుంది27. మానవుడు తీసుకునే ఆహారంలోని కార్బొహైడ్రేట్లలో స్టార్చ్‌ ఎంతశాతం ఉంటుంది? 

1) 80%   2) 20%   

3) 60%   4) 45% 

28. ఆల్కహాల్‌ను శోషించే జీర్ణనాళ భాగం? 

1) నోరు     2) చిన్నపేగు 

3) పెద్దపేగు  4) జీర్ణాశయం 

29. శోషణ చెందిన జీర్ణపదార్థాలు చివరికి కణజాలాలను చేరి జీవపదార్థ అనుఘటకాలుగా మారడాన్ని ఏమంటారు? 

1) స్వాంగీకరణం     2) మిక్చురేషన్‌ 

3) వ్యాపనం     4) పైవన్నీ 

30. బేరియాట్రిక్‌ సర్జరీ అంటే...

1) ఆస్యకుహరానికి చేసే చికిత్స 

2) జీర్ణాశయానికి కుట్లు వేయడం 

3) చిన్నపేగుకు చేసే చికిత్స 

4) ఆంత్రమూల వంపు వ్యాసాన్ని పెంచడం 

31. 2020లో నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు కనుక్కున్న మానవ శరీర లాలాజల గ్రంథులు...

1) ట్యూబేరియల్‌     2) ఇంటర్‌స్టిటియం 

3) మెసెంటరీ  4) నిమ్ననేత్రకోటర గ్రంథి 

32. ఐక్య కాలేయ, క్లోమనాళం తెరుచుకునే భాగం? 

1) ఆంత్రనాళం     2) జెజునం 

3) శేషాంత్రికం     4) ఆంత్రమూలం 

33. మానవ శరీరంలోని అవశేషావయవాల సంఖ్య? 

1) 80    2) 120    3) 180    4) 200 


 

34. హాస్ట్రాను కలిగి ఉన్న జీర్ణనాళ భాగం? 

1) కోలాన్‌   2) పురీషనాళం 

3) అంధనాళం     4) జెజునం


 

35. భావన - ఎ: మానవుడిలో ఉండూకం అవశేష    అవయవం.

     భావన - బి: మానవుడిలో సెల్యులోజ్‌ జీర్ణం కాదు. 

1) ఎ, బి లు అసత్యం     

2) ఎ సత్యం, బి అసత్యం 

3) ఎ, బి లు సత్యం     

4) ఎ అసత్యం, బి సత్యం 

36. మేకలో ఉండే ఉన్నికి సంబంధించి కిందివాటిలో సరైంది?

1) ఇది ఒక అవశేష అవయవం

2) శత్రువుల నుంచి రక్షణ

3) జీవక్రియలు సక్రమంగా జరగడానికి

4) పైవన్నీ


 

37. కిందివాటిలో పిత్తాశయం లోపించిన జీవి?

1) గుర్రం   2) ఎలుక   

3) గాడిద   4) 1, 2


 

38.  కిందివాటిలో రెండో అతిపెద్ద గ్రంథి?

1) కాలేయం   2) క్లోమం  

3) అధివృక్క గ్రంథి   4) ఆడమ్స్‌ యాపిల్‌

39. ఇన్సులిన్‌ను కనుక్కున్నవారు?

1) టోరంటో   2) బాంటింగ్‌   

3) బెస్ట్‌   4) పైవారందరూ

40. ఎంజైమ్‌ అనే పదాన్ని ప్రతిపాదించినవారు?

1) బెస్ట్‌    2) కూనె   

3) బాంటింగ్‌   4) టోరంటో


 

41. కిందివాటిలో ఏ ఎంజైమ్‌లు క్షార మాధ్యమంలో సమర్థంగా పని చేస్తాయి?

1) క్లోమ రసం  2) పైత్య రసం   

3) ఆంత్ర రసం  4) 1, 3

42. ప్రయాణం చేసేవారిలో సాధారణంగా కనిపించే జీర్ణ సంబంధిత అపశృతి?

1) కామెర్లు     2) మలబద్దకం   

3) అజీర్ణం     4) కైనెటోసిస్‌


సమాధానాలు

1-1; 2-4; 3-2; 4-1; 5-4; 6-1; 7-4; 8-2; 9-3; 10-2; 11-1; 12-3; 13-2; 14-1; 15-3; 16-4; 17-2; 18-3; 19-3; 20-1; 21-3; 22-2; 23-1; 24-3; 25-2; 26-3; 27-1; 28-4; 29-1; 30-2; 31-1; 32-4; 33-3; 34-1; 35-3; 36-1; 37-4; 38-2; 39-4; 40-2; 41-4; 42-4.

 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం


 

Posted Date : 16-06-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు