• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం

వ్యవస్థల మధ్య సాగే శక్తి ప్రవాహం!
 


చలిమంట ముందు కాస్త దూరంలో కూర్చుంటే కాసేపటికి శరీరం వెచ్చగా అవుతుంది. పాత్రలో నీటిని వేడి చేస్తే, అడుగున ఉన్న నీరు వేడెక్కిపైకి పోతుంది. పైన ఉన్న చల్లటి నీరు దిగువ భాగానికి వెళుతుంది. సూర్యుడి నుంచి సూర్యరశ్మి రూపంలో వేడి భూమిని చేరుతుంది. ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు సాగే శక్తి ప్రవాహం ఉష్ణం. ఇది వహనం, సంవహనం, వికిరణ మార్గాల్లో శక్తిని బదిలీ చేస్తుంది. సకల జీవక్రియలకు అత్యంత కీలకమైన ఈ భావనను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. వాతావరణంలో, విద్యుత్తు మొదలైన ఉత్పత్తుల్లో ఉష్ణం ప్రభావాన్ని, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.  సంబంధిత నియమాలు, మాపకాలపై అవగాహన పెంచుకోవాలి. 

1.   ఉష్ణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) కెలోరిమెట్రి      2) థర్మామీటర్‌   

3) థర్మోమెట్రి    4) పర్మాంగమెట్రి


2.  వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచే శాస్త్రం?

1) కెలోరిమెట్రి       2) థర్మామీటర్‌   

3) థర్మోమెట్రి     4) పర్మాంగమెట్రి


3.  ఒక కెలోరి ఎన్ని జౌల్స్‌కు సమానం?

1) 3.12 J    2) 3.83 J   3) 4.18 J   4) 14.5 J


4.  ఒక గ్రామ్‌ ద్రవ్యరాశి ఉన్న నీటిని 10C ఉష్ణోగ్రత పెంచడానికి అవసరమైన ఉష్ణాన్ని ఏమంటారు?

1) కెలోరి     2) క్యాలరీస్‌   3) కెల్విన్‌   4) ఫారన్‌హీట్‌


5.  ఒక వస్తువు నుంచి వెలువడిన ఉష్ణరాశిని కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) కెలోరి మీటర్‌    2) సెంటీగ్రేడ్‌ మీటర్‌   

3) పైరోమీటర్‌    4) ఆప్టికల్‌ పైరోమీటర్‌


6. ఉష్ణోగ్రతలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) సెల్సియస్‌    2) ఫారన్‌హీట్‌   

3) కెల్విన్‌    4) పైవన్నీ


7.  ఒక వస్తువు ఉష్ణోగ్రత 00 నుంచి ధనాత్మక విలువలను మాత్రమే కలిగి ఉండేది?

 1) కెల్విన్‌ మానం   2) పరమ ఉష్ణోగ్రత మానం   

3) థర్మోమెట్రి      4) ఉష్ణమాపకం


8.  థర్మామీటర్‌ ఏ నియమం మీద ఆధారపడి  పని చేస్తుంది?

1) పదార్థాలు సంకోచిస్తాయి.    

2) పదార్థాలు వ్యాకోచిస్తాయి.

3) పదార్థాలు సంకోచిస్తాయి, వ్యాకోచిస్తాయి.    

4) ఏదీకాదు


9.  ఊర్ధ్వ స్థిర బిందువును గుర్తించడానికి ఏ మీటర్‌ను ఉపయోగిస్తారు?

1) థర్మామీటర్‌     2) పైరోమీటర్‌   

3) బారోమీటర్‌     4) హిప్సోమీటర్‌


10. సెంటీగ్రేడ్, ఫారన్‌హీట్‌ మాపకాలు ఏ రీడింగ్‌ వద్ద సమానంగా ఉంటాయి?

1) 00      2) 400        3) 1000       4) 440


11. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత?

1) 36.9 0C       2) 98.4 0C    

3) 310K      4) పైవన్నీ


12. 10C ఉష్ణోగ్రత ఏ ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రతకు సమానం?

1) 390F     2) 33.8 0F  

3) 36.9 0F   4) 38.80


13. థర్మామీటర్‌ను మొదటిసారిగాకనుక్కున్న శాస్త్రవేత్త?

1) గెలీలియో    2) జేమ్స్‌డెవర్‌   

3) న్యూటన్‌    4) పాస్కల్‌


14. 3500C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు?

1) క్రయోమీటర్‌   2) బెక్‌మన్‌ pH మీటర్‌  

3) పైరోమీటర్‌    4) మానోమీటర్‌


15. జ్వరమానినిలో ఉష్ణమాపక ద్రవంగా దేన్ని ఉపయోగిస్తారు?    

1) ఆల్కహాల్‌    2) పాదరసం   

3) నీరు    4) నూనె


16. పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత?

1) -39 0C    2) 3570C    3) -440C  4) -400


17. పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఉపయోగించడానికి కారణం?    

1) ఉత్తమ ఉష్ణమాపకం    2) ఏకరీతి వ్యాకోచం  

3) తక్కువ విశిష్టోష్ణం     4) పైవన్నీ


18. ఉష్ణ ప్రసారం ఎన్ని విధాలుగా జరుగుతుంది?

1) 2     2) 3   3) 4    4) 5


19. వేడినీటిలో గరిటెను ఉంచినప్పుడు దాని రెండో చివర వేడెక్కడానికి కారణం?

1) ఉష్ణ వికిరణం    2) ఉష్ణ సంవహనం   

3) ఉష్ణ వహనం   4) ఉష్ణ వ్యాకోచం


20. కిందివాటిలో అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం?

1) రాగి       2) వెండి  

3) అల్యూమినియం     4) ఇనుము


21. కిందివాటిలో ఉష్ణ బంధక పదార్థం?    

1) ప్లాస్టిక్‌    2) వజ్రం   3) థర్మాకోల్‌    4) పైవన్నీ


22. ఒక పాత్రలో నీటిని వేడి చేస్తే అడుగు భాగం మాత్రమే వేడెక్కకుండా పాత్రలో మొత్తం నీరు  వేడెక్కడానికి కారణం?

1) వ్యాకోచంలో మార్పు   2) పీడనంలో మార్పు 

3) సాంద్రతలో మార్పు    4) ఉష్ణోగ్రతలో మార్పు


23. సూర్యుడి నుంచి మనకు వేడి లభించడం, మంట పక్కన ఉన్న వ్యక్తి వేడిని గ్రహించడం ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది?

1) ఉష్ణ వికిరణం     2) ఉష్ణ సంకోచం   

3) ఉష్ణ వ్యాకోచం    4) ఉష్ణ సంవహనం


24. ఉత్తమ ఉద్గారిణి, ఉత్తమ శోషణిగా ఏ రంగును    పరిగణిస్తారు?

1) తెలుపు   2) నీలం  3) ఆకుపచ్చ  4) నలుపు


25. ఏ పదార్థాల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది?

1) ఘన   2) ద్రవ   3) వాయు   4) శూన్యం


26. శీతాకాలంలో ఉదయం పూట చెక్క పలకతో పోలిస్తే, పాలరాయి టైల్స్‌ చల్లగా ఉంటాయి. కారణం?

1) చెక్క పలక కంటే పాలరాయి మెరుగైన ఉష్ణ వాహకం.

2) చెక్క పలకను పాలిష్‌ చేస్తారు.

3) పాలరాయి కంటే చెక్క పలక ఎక్కువ వేడిని  ప్రతిబింబిస్తుంది.

4) పాలరాయి అధమ ఉష్ణవాహకం.


27. రాణి, రాజు శరీర ఉష్ణోగ్రతలు కొలిచినప్పుడు... రాణి 98.40F, రాజు ఉష్ణోగ్రత 370C గా నమోదైంది. అయితే కిందివాటిలో ఏది సత్యం?

1) రాజు కంటే రాణి అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంది.

2) రాణి... రాజు కంటే తక్కువ శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంది.

3) ఇద్దరికీ సాధారణ శరీర ఉష్ణోగ్రత ఉంది.

4) ఇద్దరూ జ్వరంతో బాధపడుతున్నారు.


28. థర్మామీటర్‌ను ఎండలో లేదా మంటకు దగ్గరగా ఉంచరాదు. ఎందుకు?

1) పగిలిపోవచ్చు    2) సంకోచించవచ్చు

3) ఆవిరి ఏర్పడుతుంది    4) పదార్థం రంగు మారుతుంది


29. ఒక ఐస్‌క్రీం కప్పులో ఒక చెంచా ఉంచితే దాని మరొక చివర .........

1) ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది.

2) ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా చల్లగా     మారుతుంది.

3) ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది.

4) ఉష్ణ దక్షత ద్వారా చల్లగా మారుతుంది.


30. సాధారణంగా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రల అడుగు భాగాన రాగిపూత పూస్తారు. కారణం?

1) రాగిపూత పాత్ర మన్నికను పెంచుతుంది.

2) పాత్రలు రంగు రంగులుగా కనిపిస్తాయి.

3) స్టీల్‌ కంటే రాగి మంచి ఉష్ణవాహకం.

4) స్టీల్‌ కంటే రాగిని శుభ్రం చేయడం సులువు.


31. 400C ఉష్ణోగ్రత ఉన్న ఇనుప బంతిని, 400C నీరున్న కప్పులో వేస్తే ఉష్ణం ...

1) ఇనుప బంతి నుంచి నీటిలోకి ప్రవహిస్తుంది.

2) అసలు ఉష్ణ ప్రసారం జరగదు.

3) నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహిస్తుంది.

4) రెండింటి ఉష్ణోగ్రత పెరుగుతుంది.


32. క్లినికల్‌ థర్మామీటర్‌ ఫారన్‌హీట్‌ రీడింగ్‌లు?

1) 35 0F, 42 0F    2) 95 0F, 110 0F
3) 273 0F, 373 0F    4) 0 0F, 100 0F


33. కిందివాటిలో సరైంది?

1) నలుపు కంటే తెలుపు రంగు ఎక్కువ వేడిని  గ్రహిస్తుంది.

2) తెలుపు కంటే నలుపు రంగు ఎక్కువ వేడిని  గ్రహిస్తుంది.

3) అల్యూమినియం కంటే ఇనుము మంచి ఉష్ణ వాహకం.

4) వెండి కంటే రాగి మంచి ఉష్ణ వాహకం.


34. ఉష్ణీయ స్పర్శలో ఉన్న A, B, C అనే వస్తువుల్లో B ఉష్ణోగ్రత 300 అయితే A, B ఉష్ణోగ్రతలు?

1) 300      2) 300 కంటే ఎక్కువ   

3) 300 కంటే తక్కువ     4) 600


35. 1 కెలోరి/గ్రామ్‌ 0C = ...... జౌల్‌/కిలోగ్రామ్‌.0K.

1) 1.486      2) 4.186 x 103   

3) 36 x 105    4) 3.16 x106


36. కిందివాటిలో ఉష్ణ భాండాగారాలు ఏవి?

1) నదులు   2) సముద్రాలు   

3) సరస్సులు    4) గ్లేసియర్‌లు


37. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ?

1) 80 కెలోరీలు   2) 540 కెలోరీలు   

3) 80 కెలోరి/గ్రామ్‌    4) 540 కెలోరి/గ్రామ్‌


38. నీరు మరిగే స్థానం విలువ?

1) 100 0C   2) 212 0F

3) 373 0K       4) పైవన్నీ 


39. కిందివాటిలో శీతలీకరణ ప్రక్రియ ఏది?

1) ద్రవీభవనం   2) మరగడం   

3) సాంద్రీకరణం    4) బాష్పీభవనం


40. కిందివాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ?

1) బాష్పీభవనం    2) ద్రవీభవనం       

3) మరగడం    4) సాంద్రీకరణం


41. కిందివాటిలో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశం?    

1) ఉష్ణోగ్రత    2) ఆర్ధ్రత   

3) గాలివేగం    4) పైవన్నీ


42. ఒక వస్తువులోని అణువుల నుంచి గతిశక్తికి  అనులోమానుపాతంలో ఉండే భౌతిక రాశి?

1) ఉష్ణం   2) ఉష్ణోగ్రత   

3) పరమ ఉష్ణోగ్రత    4) శూన్య ఉష్ణోగ్రత


43. ప్రమాణ ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు ఉష్ణోగ్రతను 10C పెంచడానికి అవసరమైన ఉష్ణం?

1) ఉష్ణదక్షత    2) విశిష్టోష్ణం  

3) కెలోరి   4) ఉష్ణ సమతాస్థితి


44. విశిష్టోష్ణం SI ప్రమాణం?

1) కెలోరి   2) జౌల్‌   

3) కెలోరి/గ్రామ్‌.0C    4) జౌల్‌/కిలోగ్రామ్‌.0K


45. నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ?

1) 80 కెలోరీలు    2) 540 కెలోరీలు   

3) 80 కెలోరి/గ్రామ్‌    4) 540 కెలోరి/గ్రామ్‌


46. నీటి అసంగత వ్యాకోచానికి కారణమైన ఉష్ణోగ్రత?

1) 70C       2) 100C      3) 40C       4) 110C


47. జతపరచండి.

1) ఆర్ధ్రత    ఎ) శీతాకాలంలో గాలిలో ఉండే తుషారం

2) తుషారం    బి) గడ్డి మొక్కలపై ఏర్పడే నీటి బిందువులు

3) పొగమంచు    సి) గాలిలోని నీటి ఆవిరి

1) 1-ఎ; 2-బి; 3-సి    2) 1-సి; 2-బి; 3-ఎ

3) 1-సి; 2-ఎ; 3-బి    4) 1-బి; 2-సి; 3-ఎ


48. ఒక రోజులో కొలవగలిగే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను తెలిపే పరికరం?

1) థర్మిష్టర్‌ థర్మామీటర్‌      

2) డిజిటల్‌ థర్మామీటర్‌

3) సిక్స్‌ థర్మామీటర్‌   

4) రాయమర్‌ థర్మామీటర్‌


సమాధానాలు
 

1-1; 2-3; 3-3; 4-1; 5-1; 6-4; 7-2; 8-2; 9-4; 10-2; 11-4; 12-2; 13-1; 14-3; 15-2; 16-2; 17-4; 18-2; 19-3; 20-2; 21-4; 22-3; 23-1; 24-4; 25-3; 26-1; 27-3; 28-1; 29-1; 30-3; 31-2; 32-2; 33-2; 34-1; 35-2; 36-2; 37-3; 38-4; 39-4; 40-4; 41-4; 42-3; 43-2; 44-4; 45-4; 46-3; 47-2; 48-3. 


 


 

Posted Date : 04-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు