• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు

పిల్లల ప్రజ్ఞపై తల్లిదండ్రుల ప్రభావమే అధికం!


వ్యక్తుల మధ్య శారీరక, మానసిక అంశాల్లో ఉండే తేడాలనే వైయక్తిక భేదాలు అంటారు. అలాగే తరగతి గదిలోని విద్యార్థుల్లో ఏ ఇద్దరూ ఒకే విధంగా ఉండరు. సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, సృజనాత్మకత, అభిరుచులు, ఉద్వేగాల లాంటివి ఒక్కొక్కరిలో ఒక్కో తీరులో ఉంటూ సందర్భానుసారంగా వ్యక్తమవుతుంటాయి. అనువంశికత, పరిసరాల ప్రభావంతో ప్రతి పిల్లవాడిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. ఇలాంటి భేదాలను ఉపాధ్యాయులు గుర్తించి, అందరికీ అర్థమయ్యేలా బోధించాల్సి ఉంటుంది. ఇందుకోసం అవలంభించాల్సిన బోధనా పద్ధతులపై నేటితరం ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. వ్యక్తంతర, వ్యక్తంతర్గత తేడాలకు మూల కారణాలను తెలుసుకుంటూ పిల్లల్లో ప్రజ్ఞా వికాసాన్ని పెంపొందించడం నేర్చుకోవాలి.


1.   కిందివాటిలో సరైన వాక్యం ఏది?

1) ప్రజ్ఞ ఉన్న విద్యార్థిలో సృజనాత్మకత ఉండొచ్చు, లేకపోవచ్చు.

2) సృజనాత్మకత ఉన్న విద్యార్థిలో అంతర్గతంగా ప్రజ్ఞ ఉంటుంది.

3) సాధారణంగా ప్రజ్ఞను సంకుచిత భావనగా, సృజనాత్మకతను కొంత విస్తృత భావనగా చూడొచ్చు.

4) పైవన్నీ


2.  కిందివాటిలో సరికానిది?

1) పవన్‌ గణితంలో ఎక్కువ ప్రతిభ, ఆంగ్లంలో తక్కువ ప్రతిభ చూపించడం వ్యక్తంతర్గత భేదం.

2) దీప ఆడగలదు, పాడగలదు కానీ ఆమె అందరికంటే చాలా పొడగరి - అంతర్‌వ్యక్తిగత భేదం

3) ఒకే వ్యక్తి పలు అంశాల్లో భిన్నత్వాన్ని ప్రదర్శించడాన్ని అంతర వ్యక్తిగత భేదం అంటారు.

4) ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే భౌతిక, మానసిక భేదాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారు.


3. విభిన్నమైన అభ్యసన అలవాట్లున్న విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుడు వేర్వేరు రకాల అభ్యసన పరిస్థితుల్ని సృష్టిస్తే, ఆ టీచర్‌ కిందివారిలో ఎవరి సిద్ధాంతం వల్ల ప్రభావితమయ్యారు?

1) కోల్‌బర్గ్‌ నైతిక వికాస సిద్ధాంతం

2) గార్డెనర్‌ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం

3) సామాజిక - సాంస్కృతిక వికాస సిద్ధాంతం - వైగోట్‌ స్కీ

4) పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం


4. గార్డెనర్‌ ప్రకారం కిందివాటిలో సరైనవి?

ఎ) పద నేర్పరులు - శాబ్ధిక భాషా ప్రజ్ఞ 

బి) తార్కిక సంఖ్య నేర్పరులు - గణిత తార్కిక ప్రజ్ఞ

సి) సంగీత నేర్పరులు - సంగీత లయ సంబంధ ప్రజ్ఞ

డి) శరీర నేర్పరులు - శరీర స్పర్శాత్మక ప్రజ్ఞ 

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి       3) ఎ, బి, సి   4) డి


5.  స్పియర్‌మన్‌ ప్రకారం ఏదైనా విషయంలో వ్యక్తమయ్యే ప్రతిభ-

1) G కారకంతోపాటు ఆ విషయానికి సంబంధించిన S కారకంపై ఆధారపడుతుంది.

2) S కారకంపై మాత్రమే ఆధారపడుతుంది.

3) G కారకంపై మాత్రమే ఆధారపడుతుంది.

4) ఏ కారకానితో కూడా సంబంధం లేకుండా ఉంటుంది.


6.    డాక్టర్‌ చందర్‌ మోహన్‌ భాటియా 1945లో  రూపొందించిన ‘భాటియా ప్రజ్ఞ మాపని’ లోని ఉపపరీక్ష కానిది? 

1) అలెగ్జాండర్స్‌ పాస్‌ లాంగ్‌ టెస్ట్‌   2) ప్యాటన్‌ డ్రాయింగ్‌ టెస్ట్‌

3) పిక్చర్‌ కన్స్‌స్ట్రక్షన్‌ టెస్ట్‌   4) పిక్చర్‌ అరేంజ్‌మెంట్‌ టెస్ట్‌


7.    కిందివాటిలో వెప్లర్‌ ఇంటెలిజెన్స్‌ స్కేల్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌ పరీక్షకు సంబంధించిన వాక్యం ఏది?

1) ఇందులో 5 శాబ్ధిక, 5 అశాబ్ధిక ఉపపరీక్షలు ఉన్నాయి.

2) ఇది 5-15 ఏళ్ల పిల్లల కోసం రూపొందించింది.

3) స్పియర్‌మన్‌ ద్వికారక సిద్ధాంతంలోని సామాన్య కారకాన్ని మాపనం చేస్తుంది.

4) పైవన్నీ


8.  ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలకు సంబంధించి కిందివాటిలో సరికాని జత?

1) లక్షణ నమూనా - వాసిలి పెట్రైడ్స్‌

2) సామర్థ్య నమూనా - వెయిన్‌ లియోన్‌ పెయిన్‌

3) మిశ్రమ నమూనా - డానియల్‌ గోల్‌మన్‌

4) పైవన్నీ


9. 180 నెలల బుద్ధిమాంద్యత ఉన్న బాలుడి మానసిక వయసు 108 నెలలు అయితే ఈ బాలుడికి ..... ఉంది.

1) మిత బుద్ధిమాంద్యత     2) స్వల్ప బుద్ధిమాంద్యత 

3) తీవ్ర బుద్ధిమాంద్యత 4) సంపూర్ణ బుద్ధిమాంద్యత 


10. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణ-

1) స్త్రీ, పురుషుల మధ్య సగటులో తేడాలను తెలుపుతుంది

2) 100 తర్వాత హఠాత్తుగా పడిపోతుంది

3) సుమారు సాధారణంగా లేదా గంట ఆకారం

4) చాలామంది 80-100 మధ్య ఉంటారని అంచనా


11. వ్యక్తి తన చుట్టూ ఉన్న స్త్రీ, పురుషులను అర్థం చేసుకుని, వారి ఆప్యాయతలు, ఉద్వేగాలు, వ్యాకులతకు జాగ్రత్తగా ప్రతిస్పందించి అనుకున్నది సాధించగలగడాన్ని ఏమంటారు?

1) యాంత్రిక ప్రజ్ఞ    2) సాంఘిక ప్రజ్ఞ   

3) అమూర్త ప్రజ్ఞ       4) మూర్త ప్రజ్ఞ


12.శిశువు ప్రజ్ఞ, వికాసంపై ఏ ప్రభావం ప్రముఖంగా ఉంటుందని మనోవిజ్ఞానవేత్తల అభిప్రాయం?

1) తల్లిదండ్రులు    2) స్నేహితులు   

3) ఇరుగుపొరుగువారు   4) పైవారందరూ


13. ప్రజ్ఞమాపనుల ఉద్యమానికి జీవం పోసినవారు?

1) స్టాన్‌ఫర్డ్‌    2) టెర్మన్‌   

3) మెర్రిల్‌   4) బినే


14. థార్న్‌డైక్‌ బహుకార సిద్ధాంతంలో లేని అంశం ఏది?

1) వాక్యపూరణం   2) సంఖ్యాసామర్థ్యం   

3) పదజాలం   4) నిర్దేశాలు


15. కింద పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షల్లో అసత్యమైన జత ఏది?

1) ఆర్మీ ఆల్ఫా పరీక్ష - సామూహిక పరీక్ష

2) డ్రా - ఎమాన్‌ టెస్ట్‌ - అశాబ్ధిక పరీక్ష

3) ఆర్మీ బీటా పరీక్ష - శాబ్ధిక పరీక్ష

4) రావెన్స్‌ స్టాండర్డ్‌ ప్రోగ్రెసివ్‌ మాత్రికల పరీక్ష-శక్తి పరీక్ష


16. విద్యాసంబంధిత మార్గదర్శకత్వం అందించడంలో వ్యక్తిలోని వ్యక్తంతర సహజ సామర్థ్యాల విభేదాలను అంచనా వేయడంలో తోడ్పడేది-

1) Scholastic Aptitude Tests

2) Differential Aptitude Tests

3) Vocational Aptitude Tests

4) Interest Inventories


17. రావన్స్‌ స్టాండర్డ్‌ ప్రోగ్రెసివ్‌ మాట్రిసిస్‌ అనే ప్రజ్ఞా పరీక్ష -

1) పేపర్‌ పెన్సిల్, వేగ పరీక్ష    2) నిస్పాదన, వ్యక్తిగత పరీక్ష

3) శాబ్ధిక, వ్యక్తిగత పరీక్ష   4) సామూహిక, అశాబ్ధిక పరీక్ష


18. ఏదైనా ఒక నైపుణ్యం సముపార్జించడానికి ఒక వ్యక్తికి ఉన్న సామర్థ్యం, తప్పనిసరిగా ఆ సంబంధిత కృత్యాలను ప్రస్తుతం అతడు ఎంత బాగా నిర్వహిస్తున్నాడనే దాంతో సంబంధం లేని పరీక్ష?

1) ప్రజ్ఞా పరీక్ష       2) సహజ సామర్థ్య పరీక్ష   

3) వైఖరి పరీక్ష       4) ఆసక్తి పరీక్ష


19. వైఖరులకు సంబంధించి కిందివాటిలో అసత్య ప్రవచనం-

1) వ్యక్తుల వైఖరులను బాహ్యప్రవర్తనల ద్వారా  తెలుసుకోగలం

2) వైఖరులు వ్యక్తిలో విడిగా ఉండక అతడి మానసిక శక్తులతో కలిసి పనిచేస్తాయి

3) వైఖరులు పుట్టినప్పటి నుంచి స్థిరంగా ఉంటాయి

4) వైఖరులు అభ్యసనం వల్ల ఏర్పడతాయి


20. ప్రాగుక్తీకరణ ఏ మనోవైజ్ఞానిక భావన లక్షణం?

1) అభిరుచి    2) వైఖరి   

3) సృజనాత్మకత    4) సహజ సామర్థ్యం


21. కింది నికషల్లో దేనిలో అస్పష్ట ఉద్దీపనలుంటాయి?

1) ప్రక్షేపక    2) నిర్ధారణ మాపనులు   

3) శోధికలు   4) అప్రక్షేపక


22. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై పదో తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం ఉపయోగించాల్సిన సరైన పద్ధతి?

1) వ్యక్తి అధ్యయన పద్ధతి    2) పరిశీలన   

3) పరిపృచ్ఛ    4) వైఖరి


23. కింది పరీక్షల్లో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?

1) సంస్కృతి రహిత పరీక్ష    2) సంస్కృతి న్యాయశీల పరీక్ష

3) సాంస్కృతికంగా ప్రాధాన్యత ఉన్న పరీక్ష   4) సంస్కృతి మాంద్యం పరీక్ష


24. సృజనాత్మకత, ప్రజ్ఞ మధ్య ఉన్న సంబంధం-

1) ధనాత్మక   2) రుణాత్మక   

3) నిర్దిష్ట సంబంధం లేదు

4) సగటు ప్రజ్ఞాలబ్ధి కంటే ఎక్కువ ఉండే విద్యార్థుల్లో ఉండే ధనాత్మకత


25. కిందివాటిలో ప్రజ్ఞ గురించి అపోహను గుర్తించండి.

1) ప్రజ్ఞ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడం

2) ప్రజ్ఞ అనేది అమూర్తీకరణంగా వ్యవహరించడం

3) ప్రజ్ఞ అనేది కొత్త పరిస్థితులను అనుకూలనమనడం

4) ప్రజ్ఞ అనేది జ్ఞానం


26. బాగా మాట్లాడే నైపుణ్యం ఉండి, చేతి రాత బాగా లేని శిశువు. ఇది కిందివాటిలో ఏ భావనను వివరించేందుకు సరైంది?

1) వ్యక్తంతర తరగతి భేదాలు   2) వ్యక్తంతర వైయక్తిక భేదాలు

3) వ్యక్తంతర వ్యక్తిగత భేదాలు   4) వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు


27. శిశువు దేనిలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పొచ్చు?

1) సాంఘిక       2) మానసిక       

3) భౌతిక       4) లైంగిక


28. శాబ్ధికేతర ప్రజ్ఞా పరీక్షను ఎవరికి ఉపయోగించవచ్చు?

1) వయసుతో సంబంధం లేకుండా అందరికీ    2) నిరక్షరాస్యులకు మాత్రమే

3) పిల్లలకు మాత్రమే    4) పెద్దలకు మాత్రమే


29. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులందరూ సమానంగా లాభపడుతున్నా లేదా అభ్యసించకున్నా దానికి కారణం?

1) విద్యార్థుల అభిరుచులు   2) విద్యార్థుల సహజ సామర్థ్యం    

3) విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు   4) విద్యార్థుల సామర్థ్యాలు


30. కిందివాటిలో ఒకటి స్వతఃసిద్ధం?

1) ప్రేరణ   2) అభిరుచి   

3) సహజ సామర్థ్యం    4) వైఖరి


31. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధన గురించి ప్రాగుక్తీకరించడానికి ఆ వ్యక్తిలోని వేటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?

1) ప్రజ్ఞ    2) సహజ సామర్థ్యం   

3) అభిరుచులు   4) సామర్థ్యాలు


32. సహజ సామర్థ్యాన్ని ఎలా నిర్వచించవచ్చు?

1) కొత్తదనాన్ని పెంపొందించగలిగే అంతర్గత సామర్థ్యం

2) ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం

3) పరిసరాలతో సర్దుబాటు చేసుకునే అంతర్గత సామర్థ్యం

4) అమూర్త ఆలోచన చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యం


33. అనేక సాధ్యపడే పరీక్షలను ఉత్పాదనలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ సమూహాలను విస్తృతపరిచే ప్రయత్నం ఏ రకమైన ఆలోచనలో జరుగుతుంది?

1) సమైక్య ఆలోచన    2) బహుముఖ ఆలోచన   

3) జ్ఞప్తికి తెచ్చుకోవడం   4) అంతర్‌దృష్టి


34. కిందివాటిలో దూరసాంఘిత్వం (Remote Sensing) దేనికి ప్రతీక?

1) ప్రజ్ఞ    2) సృజనాత్మకత   

3) నిర్ణయాలు చేయడం  4) మూర్తిమత్వం


సమాధానాలు
 

1-4; 2-3; 3-2; 4-1; 5-1; 6-4; 7-4; 8-2; 9-2; 10-3; 11-2; 12-1; 13-4; 14-2; 15-3; 16-2; 17-4; 18-2; 19-3; 20-4; 21-1; 22-3; 23-1; 24-3; 25-4; 26-4; 27-4; 28-1; 29-3; 30-3; 31-2; 32-2; 33-2; 34-2.


రచయిత: కోటపాటి హరిబాబు 

Posted Date : 03-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌