• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం - ప్రేరణ

ఆత్మసాక్షాత్కారం ఉన్నతమైన అవసరం!

అభ్యసనం అన్ని రకాల నైపుణ్యాలకు పునాది లాంటిది.  దాని ద్వారా జ్ఞానాన్ని గ్రహించడం,  వృద్ధి చేసుకోవడం, నిత్య జీవితానికి ఉపయోగించుకోవడం మొదలైన వాటిని విద్యార్థులకు ఉపాధ్యాయులే నేర్పించాలి. మేధోపరంగా, మానసికంగా, సామాజికంగా అభివృద్ధికి దోహదపడే అభ్యసన వాతావరణాన్ని కల్పించాలి. విభిన్న అభ్యసన శైలులను, సమర్థ బోధనా వ్యూహాలను రూపొందించుకోవాలి. అందుకోసం అభ్యసన పరిమితులను, అవరోధాలను కాబోయే అధ్యాపకులు తెలుసుకోవాలి. ప్రేరణ సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలి. 


1.   బండూరా పరిశీలన అభ్యసనం దేన్ని  ఉద్ఘాటిస్తుంది?

1) సామాజిక ఆకాంక్షలను అందివ్వడం

2) నిబంధనల వల్ల ప్రవర్తనలో మార్పు 

3) దండనలు, బహుమానాలు

4) అనుకరణ, అనుసరణ ప్రక్రియ



2.  వైగోట్‌స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం?

1)  పెద్దలంటే భయం 

2) స్వీయ మార్గదర్శకతకు 

3) ఆత్మవిశ్వాసం పొందడానికి

4) ఇతరులతో మాట్లాడటానికి సాధన చేయడం



3.  ‘నథింగ్‌ సక్సీడ్స్‌ లైక్‌ సక్సెస్‌’ అనే సామెతను కింది ఏ సూత్రానికి అన్వయించుకోవచ్చు?

1)  ఉపయోగ సూత్రం    2) అనుపయోగ సూత్రం 

3) సంసిద్ధతా సూత్రం   4) ఫలిత సూత్రం



4.  కార్య సాధక అభ్యసన పరిమితుల్లో ఒకటి-

1)  స్వీయగమన అభ్యసనం 

2) సత్వర పరిపృష్టి 

3) సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం 

4) అభ్యాసకుడిని చురుకుగా ఉంచుతుంది



5. కిందివాటిలో పియాజే తెలిపిన అనుకూలత ప్రక్రియ కానిది?

1)  సంవేదన     2) సమతుల్యత 

3) సాంశీకరణ    4) అనుగుణ్యం



6.  కిందివాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం?

1)  సాంప్రదాయిక నిబంధనం 

2) కార్యసాధక నిబంధనం 

3) యత్న - దోష నిబంధనం 

4) గెస్టాల్ట్‌ ఉపగమం



7.  ఒక విద్యార్థి పద్య పఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేశారు. దాంతో పది మందిలో మాట్లాడాలంటేనే ఆమెలో భయం మొదలైంది. సాంప్రదాయిక నిబంధనం ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న ‘భయం’ అనేది?

1)  నిర్నిబంధిత ఉద్దీపన 

2) నిబంధిత ఉద్దీపన

3) నిర్నిబంధిత ప్రతిస్పందన

4) నిబంధిత ప్రతిస్పందన



8. ఎరుపు, ఆకుపచ్చ, నారింజ లాంటి ట్రాఫిక్‌   సంకేతాలను పాటించడం ఏ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందింది?

1)  అంతర్‌ దృష్టి    2) ఆవిష్కరణ 

3) నిబంధనం     4) ప్రోగ్రామ్స్‌ నిబంధనం 



9.  మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దేనికి సంబంధించనిది?

1)  సంధాన వాదం     2) ప్రవర్తనా వాదం 

3) సాంప్రదాయిక నిబంధనం   4) నిర్మాణాత్మక వాదం



10. వైగోట్‌స్కీ ప్రకారం పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన, ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఏ భాషను ఉపయోగిస్తారు?

1)  సామాజిక    2) వ్యక్తిగత  

3) అంతర్గత    4) అహం కేంద్రీత 



11. కిందివాటిలో ప్రాథమిక తరగతిలో వ్యవహరించడానికి ఉపాధ్యాయుడికి ప్రాథమిక అవరోధం?

1)  తక్కువ ఆత్మవిశ్వాసం 

2) ఆంగ్లభాషలో మాట్లాడే సామర్థ్యం తక్కువగా ఉండటం

3) విషయంలో ఎక్కువ పరిజ్ఞానం లేకపోవడం 

4) అనుభవ లోపం



12. సాంప్రదాయిక నిబంధనానికి సంబంధించని సూత్రం?        

1)  ఉద్దీపన సామాన్యీకరణం    2) విలుప్తీకరణం

3) ఆకృతీకరించడం    4) అయత్నసిద్ధస్వాస్థ్యం



13. కింది పాఠశాలల్లో ప్రభావంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని

1)  సైనిక పాఠశాలలు    2) సమ్మిళిత పాఠశాలలు

3) ప్లే సూల్స్‌    4) బధిరుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకపాఠశాలలు



14. ప్రేరణ సిద్ధాంతాల ప్రకారం, ఒక ఉపాధ్యాయుడు దేని ద్వారా విద్యార్థి అభ్యసనాన్ని పెంచవచ్చు?

1)  విద్యార్థుల నుంచి ఏమి ఆశించకపోవడం 

2) విద్యార్థుల నుంచి ఎక్కువ సాధనలను ఆశించడం 

3) విద్యార్థుల నుంచి వాస్తవికమైన సాధనలను  ఆశించడం 

4) ఏకరీతి సాధనలను ఆశించడం



15. అవధానం, ధారణ, పునరుత్పత్తి, పునర్బలనాలు సోపానాలుగా ఉండే అభ్యసన సిద్ధాంతం?

1)  సాంఘిక అభ్యసనం   2) అంతర్‌దృష్టి అభ్యసనం 

3) కార్యసాధక నిబంధన    4) యత్న దోషం



16. వైద్య కళాశాలలో సీటు సంపాదించాలనే కోరికతో ఒక విద్యార్థి ప్రవేశ పరీక్షలో మంచి మార్కుల కోసం  కష్టపడుతున్నాడు. ఆ విద్యార్థి ప్రేరణను ఏమనవచ్చు?

1)  అంతర్గత ప్రేరణ    2) బహిర్గత ప్రేరణ 

3) వ్యక్తిగత ప్రేరణ    4) అనుభవాత్మక ప్రేరణ



17. ఫలిత నియమాన్ని ప్రతిపాదించినవారు?

1)  ఇ.ఎల్‌.థార్న్‌డైక్‌      2) ఐ.పి.పావ్‌లోవ్‌ 

3) బి.ఎఫ్‌. స్కిన్నర్‌    4) ఆల్బర్ట్‌ బండూరా



18. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ ముఖ్యపాత్ర-

1)  అభ్యాసకుల్లో ఏకమితి ఆలోచనలను సృష్టిస్తుంది.  

2) యువ అభ్యసకుల్లో అభ్యసించాలన్న ఆసక్తిని పెంపొందిస్తుంది.

3) అభ్యాసకుల స్మృతిని చురుగ్గా మారుస్తుంది.

4) పాత అభ్యసనాన్ని కొత్త అభ్యసనంతో భేద  పరుస్తుంది.



19. ‘పిల్లలు ప్రచోదనాలతో కాకుండా, అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారు’ అని   తెలిపినవారు?

1)  వైగోట్‌ స్కీ   2) ఛోమ్‌ స్కీ 

3) పియాజే     4) బ్రూనర్‌



20. భారత ప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని కింది ఏ ప్రేరణ సిద్ధాంతం సమర్థిస్తుంది?

1)  ప్రవర్తనావాదం 

2) సాంఘిక - సాంస్కృతిక వాదం 

3) సంజ్ఞానాత్మక వాదం 

4) మానవతా వాదం



21. కింది సిద్ధాంతాల్లో ఒకటి ఆకస్మాత్తుగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపేది?    

1)  అంతర్‌ దృష్టి 

2) కార్యక్రమయుత నిబంధన 

3) శాస్త్రీయ నిబంధన     

4) యత్న దోషం



22. థార్న్‌డైక్‌ యత్న దోష సిద్ధాంతాన్ని ఏమంటారు?

1)  R - రకం అభ్యసనం    2) పరికరాత్మక వాదం 

3) పిల్లి సిద్ధాంతం   4) సంధాన వాదం



23. కిందివాటిలో కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది?

1)  అభ్యాసి తన వేగానికి తగినట్లు అభ్యసించలేదు. 

2) విషయం చిన్న చిన్న సోపానాలుగా ఉంటుంది.

3) తక్షణ పరిపృష్టి ఉంటుంది. 

4) ప్రతి సోపానాన్ని అభ్యసించడంలో అభ్యాసికి  చురుకైన పాత్ర ఉంటుంది.



24. ‘మెంటాలిటీ ఆఫ్‌ ఏప్స్‌’ గ్రంథ రచయిత?

1)  లెవిన్‌     2) కోహెలర్‌  

3) థార్న్‌డైక్‌     4) పావ్‌లోవ్‌



25. పావ్‌లోవ్‌ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన ‘విరమణ’ చెందడానికి కారణం-

1)  నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం 

2) ఉన్నత క్రమ నిబంధిత ఉద్దీపన లేకపోవడం

3) నిర్నిబంధిత ఉద్దీపన ఉండటం

4) ఏదీకాదు



26. ఉపాధ్యాయుడు తన బోధనలో క్రీడా పద్ధతిని   అవలంభించడం దేన్ని సూచిస్తుంది?

1)  బహిర్గత ప్రేరణ    2) అంతర్గత ప్రేరణ 

3) సాధన ప్రేరణ     4) ఏదీకాదు



27. జనవరి 12 అనగానే వివేకానందుడి జన్మదినం గుర్తుకురావడం ఏ రకమైన స్మృతి?

1)  బట్టి స్మృతి     2) తార్కిక స్మృతి  

3) త్వరిత స్మృతి    4) సంసర్గ స్మృతి 



28. కిందివాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం?

1)  ఇతరుల నుంచి ప్రశంసలందుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం 

2) గమ్యాన్ని సాధించాలనే వాంఛ 

3) పరీక్షలో ర్యాంకు సాధించడానికి అధ్యయనం చేయడం 

4) ఇతరులను ఆనందపరచడానికి పనిచేయడం



29. ఉపాధ్యాయుడు ఇచ్చిన ఐదు లెక్కలను సులభంగా పూర్తిచేసిన ఒక విద్యార్థి తరువాత కష్టమనిపించే 6వ లెక్కను కూడా సాధించేందుకు    ప్రయత్నిస్తే.. ఇది థార్న్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?

1)  అభ్యసన నియమం     2) సంసిద్ధత నియమం 

3) ఫలిత నియమం     4) పౌనఃపున్య నియమం



30. మాస్లో ప్రకారం ఉన్నతమైన అవసరం?

1)  ఆత్మసాక్షాత్కారం     2) స్వీయగౌరవం 

3) భద్రత    4) శరీరధర్మ



31. కిందివాటిలో ఒకటి అభ్యసనానికి ప్రభావవంతమైన ప్రేరణ?         

1)  బహుమతుల కోసం అభ్యసనం 

2) శిక్షను తప్పించుకోవడానికి అభ్యసనం 

3) ర్యాంకు కోసం అభ్యసనం 

4)  ఆత్మ సంతృప్తికి అభ్యసనం



32. సరైన ప్రేరణను కొనసాగించడానికి నిశ్చయించే లక్ష్యం ఎలా ఉండాలి?

1)  పిల్లవాడి సామర్థ్యాలకు సమానంగా 

2) పిల్లవాడి సామర్థ్యాల కంటే తక్కువగా  

3) పిల్లవాడి సామర్థ్యాల కంటే ఎక్కువగా 

4) సామర్థ్యాలతో సంబంధం లేకుండా



33. మాస్లో తన అవసరాల అనుక్రమణికలో చేర్చడానికి ‘ఆత్మ ప్రస్తావన’ అనే పదాన్ని ఎవరి నుంచి గ్రహించారు?

1)  రూత్‌ బెనెడిక్ట్‌     2) సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ 

3) మాక్స్‌ వర్ధిమర్‌    4) కర్ట్‌ గోల్డ్‌ స్టీన్‌



34. కిందివాటిలో ఆహారం, నిద్ర అనేవి ఏ అవసరాల కిందకు వస్తాయి?

1)  రక్షణ    2) శారీరక 

3) ఆత్మ ప్రస్తావన    4) ప్రేమ, తత్సంబంధిత 



35. కిందివాటిలో అత్యంత ప్రభావంతమైన ప్రేరణను ఎంచుకోండి.

1)  సుస్థిరమైన అంతర్గత ప్రేరణ  

2) సుస్థిరమైన బాహ్య ప్రేరణ  

3) సుస్థిరమైన లేదా అస్థిరమైన అంతర్గత ప్రేరణ 

4) సుస్థిరమైన లేదా అస్థిరమైన  బాహ్య ప్రేరణ



36. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించింది?

1)  ప్రవర్తనను నియంత్రించే స్పష్టమైన బహిర్గత  కారకాలు  

2) అధిక బహిర్గత ప్రేరణ 

3) అనివార్యం లేదా సమ్మతి 

4) వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం



37. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంక పరుస్తుంది. ఇది?

1)  ప్రతిగమనం    2) దమనం  

3) పురోగమన అవరోధం    4) తిరోగమన అవరోధం



38. కిందివాటిలో ప్రేరణ విధి కానిది?

1)  ప్రవర్తనను స్థిరపరుస్తుంది 

2) ప్రవర్తనను నిర్దేశిస్తుంది 

3) వివేచనాన్ని పెంచుతుంది 

4) జీవిని శక్తిమంతం చేస్తుంది


సమాధానాలు

1-4; 2-2; 3-4; 4-3; 5-1; 6-4; 7-4; 8-3; 9-4; 10-2; 11-1; 12-3; 13-2; 14-3; 15-1; 16-1; 17-1; 18-2; 19-1; 20-4; 21-1; 22-4; 23-1; 24-2; 25-1; 26-2; 27-4; 28-2; 29-3; 30-1; 31-4; 32-1; 33-4; 34-2; 35-2; 36-4; 37-3; 38-3.


రచయిత: కోటపాటి హరిబాబు 

Posted Date : 29-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌