• facebook
  • whatsapp
  • telegram

చలనం

కాలంతోపాటు స్థానంలో కలిగే మార్పు!


 

చలనం లేని విశ్వాన్ని ఊహించడం కష్టం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినా, ఊయల ఊగినా, కుట్టుమిషన్‌ కదిలినా, విల్లు నుంచి బాణం దూసుకెళ్లినా, తుపాకీ తూటా పేలినా, ఆఖరికి మనిషి నడిచినా, పరిగెత్తినా అన్నీ ఆ చలనం రూపాలే. భౌతికశాస్త్రం పరిభాషలో వస్తువు స్థితిలో కలిగే మార్పునే చలనం అంటారు. వస్తువులకు, వాటిపై పనిచేసే బలాలకు, దాని స్థితిలో ఏర్పడే మార్పులకు మధ్య సంబంధాన్ని చలనం వివరిస్తుంది. అందులో రకాలను ఉదాహరణలతో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. చలనంతో సంబంధం ఉన్న కాలం, వేగం, దూరం, వాటిని కొలిచే ప్రమాణాలు, పరికరాలతోపాటు త్వరణం, భ్రమణ సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. 


1.    రెండు బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో వస్తువు ప్రయాణించే కనిష్ఠ పొడవును ఏమంటారు?

1) దూరం     2) స్థానభ్రంశం 

3) శక్తి     4) త్వరణం
 

2.  త్వరణం దిశ దేని దిశలా ఉంటుంది?

1) స్థానభ్రంశం     2) వేగంలో మార్పు 

3) వేగం     4) పైవన్నీ
 

3.   సమవేగంతో ప్రయాణించే బస్సు త్వరణం?

1) శూన్యం     2) ధన త్వరణం 

3) రుణ త్వరణం     4) అనంతం


4.   ఒక వస్తువు వేగంలో మార్పు రేటును ఏమంటారు?

1) వేగం     2) త్వరణం 

3) స్థానభ్రంశం     4) వడి


5.  ఒక గంటలో గడియారంలోని నిమిషాల ముల్లు కొన చలనాన్ని పరిశీలిస్తే...

1) దూరం సున్నా     2) సరాసరి వేగం సున్నా 

3) స్థానభ్రంశం సున్నా     4) సరాసరి వడి సున్నా


6.   విద్యుత్తు ఫ్యాన్‌ బ్లేడ్‌పై ఉండే కణం చలనం?

1) సమవడి     2) సమచలనం 

3) వృత్తాకార చలనం     4) పైవన్నీ


7.   వస్తువు ఏ చలనంలో దూర, స్థానభ్రంశాలు సమానం?    

1) రేఖీయ     2) వక్రరేఖీయ  

3) భ్రమణ     4) పరిభ్రమణ


8.  కిందివాటిలో దిశ, పరిమాణం ఉండే భౌతిక రాశి?

1) సదిశ రాశి     2) అదిశ రాశి 

3) ప్రామాణిక రాశి     4) ఉత్పన్న రాశి


9.  దిశ లేకుండా పరిమాణం మాత్రమే ఉండే భౌతిక రాశి?    

1) అదిశ రాశి     2) సదిశ రాశి 

3) ఉత్పన్న రాశి     4) సంపూరక రాశి


10. త్వరణం S.I. ప్రమాణం?

1) మీ./సె.      2) మీ./సెం.మీ.2      

3) మీ./సె.2      4) సెం.మీ./సె.2


11. కిందివాటిలో వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం?

1) స్పీడో మీటర్‌     2) ఒడో మీటర్‌ 

3) అనిమో మీటర్‌     4) మానో మీటర్


12. వాహనాలు ప్రయాణించే వేగాన్ని కొలిచే పరికరం?

1) అనిమో మీటర్‌     2) బారో మీటర్‌ 

3) స్పీడో మీటర్‌     4) ఒడో మీటర్‌


13. స్థానభ్రంశం S.I. ప్రమాణం గుర్తించండి.

1) కిలోమీటర్‌     2) న్యూటన్‌ 

3) మీటర్‌     4) కెల్విన్‌


14. ఏదైనా నిర్దిష్ట కాలంలో ఒక వస్తువు వడిని ఏమంటారు?

1) తక్షణ వడి   2) సగటు వడి

3) వేగం    4) త్వరణం


15. వేగ దిశ నిరంతరంగా మారుతూ, వడి మాత్రం స్థిరంగా ఉండే వస్తువు చలనం?

1) వృత్తాకార   2) సమ వృత్తాకార

3) అసమ వృత్తాకార  4) దీర్ఘ వృత్తాకార


16. ఒక వ్యక్తి ‘a’ యూనిట్ల వ్యాసార్ధం ఉండే వృత్తాకార మార్గంలో అర్ధ భ్రమణం పూర్తిచేస్తే అతడి స్థానభ్రంశం విలువ?



17. ఒక వస్తువు వృత్తాకార చలనంలో తిరుగుతూ తొలిస్థానానికి చేరితే, దాని స్థానభ్రంశం?


18. స్వేచ్ఛాపతన వస్తువు చలనానికి ఉదాహరణ?

1) వక్ర రేఖీయ చలనం    2) సరేఖీయ చలనం

3) వృత్తాకార చలనం     4) భ్రమణ చలనం


19. ఒక వస్తువు కదిలే దూరం అది ప్రయాణించిన దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది?

1) వడి   2) దూరం   3) కాలం   4) వేగం


20. ఒక వస్తువు ఏకరీతి వడిలో వృత్తాకార మార్గంలో కదిలినప్పుడు ఆ చలనాన్ని ఏమంటారు?

1) భ్రమణ చలనం    2) వృత్తాకార చలనం

3) అసమ వృత్తాకార చలనం    4) సమ వృత్తాకార చలనం


21. కదిలే వస్తువు వేగం 0.06 మీ./సె. గా ఉంటే, దానికి సమానమైన వేగం (కి.మీ./గం.ల్లో)

1) 2.16   2) 1.08  3) 0.216  4) 0.0216


22. ఒక వస్తువు పరిమాణం సరాసరి వేగం, సరాసరి వడి నిష్పత్తి ఎంత?

1) ఎప్పుడూ 1 కంటే తక్కువ    2) 1కి సమానం

3) 1 కంటే ఎక్కువ    4) 1కి సమానం, ఎక్కువ


23. ఒక మోటార్‌ కారు A నుంచి B కి V2 వేగంతో ప్రయాణిస్తుంది. B నుంచి Aకు అదే వేగంతో తిరిగి వస్తుంది. అయితే కారు ప్రయాణంలో దాని సగటు వేగం ఎంత?


24. కిందివాటిని జతపరచండి.


25. భావన (A): వస్తువు ప్రయాణించిన దూరం సున్నా కానప్పుడు వస్తువు స్థానభ్రంశం సున్నా కావచ్చు.

కారణం (B): స్థానభ్రంశం అనేది తొలి, తుది స్థానాల మధ్య ఎక్కువ దూరం.

1) A, R లు సరైనవి     2) A, R లు సరైనవి కావు

3) A సరైంది, R సరైంది కాదు   4) A సరైంది కాదు, R సరైంది


26. వస్తువును పరిసరాలతో పోల్చినప్పుడు దాని స్థానం మార్చుకోనప్పుడు అది పరిసరాల దృష్ట్యా ......... ఉంటుంది.

1) విరామంలో      2) చలనంలో

3) జడత్వాన్ని కలిగి     4) కచ్చితంగా చెప్పలేం


27. వస్తువు విరామ స్థితిలో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం?

1) శూన్యం  2) శూన్యం కాదు   

3) ధనాత్మకం   4) రుణాత్మకం


28. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యం కానప్పుడు దాని స్థితి?

1) విరామం   2) చలనం   

3) సమవేగంలో ఉంటుంది  4) శూన్య త్వరణం


29. కిందివాటిలో సాపేక్షాలను గుర్తించండి.

1) చలనం, వేగం  2) విరామం, త్వరణం   

3) విరామం, చలనం  4) పైవన్నీ


30. వేగంగా చలిస్తున్న రైల్లో కూర్చున్న వ్యక్తి రైలు బండి దృష్ట్యా ఏ స్థితిలో ఉంటాడు?

1) విరామం    2) చలనం   

3) తటస్థం   4) సమవేగం


31. ఒక వస్తువు లేదా వస్తువులోని అన్ని అణువులు కాలంతో పాటు వాటి స్థానంలో మార్పు కలిగి ఉంటే ఆ చలనాన్ని ఏమంటారు?

1) స్థానాంతర  2) భ్రమణ       

3) డోలన    4) కంపన


32. ఒక స్థిరమైన అక్షం లేదా బిందువు చుట్టూ తిరిగే వస్తువుకు ఉండే చలనం?

1) స్థానాంతర          2) భ్రమణ       

3) డోలన            4) కంపన


33. మధ్యమ స్థానానికి రెండువైపులా వక్ర మార్గంలో కదిలే వస్తువు చలనం?

1) స్థానాంతర   2) భ్రమణ       

3) డోలన  4) వృత్తాకార


34. ఒక రోడ్డుపై నడిచే వ్యక్తికి ఉండే చలనం?

1) స్థానాంతర     2) భ్రమణ       

3) డోలన     4) వృత్తాకార


35. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే చలనం?

1) స్థానాంతర   2) కంపన      

3) భ్రమణ     4) క్రమచలనం


36. ఊయల, లఘులోలకం, కుట్టుమిషన్‌ లాంటి వాటిలో ఉండే చలనం?

1) స్థానాంతర   2) భ్రమణ       

3) డోలన    4) వృత్తాకార


37. విల్లు నుంచి వదిలిన బాణం, తుపాకీ నుంచి వెలువడిన తూటాల చలనం?

1) వక్రరేఖీయ     2) సరళరేఖీయ    

3) భ్రమణ, స్థానాంతర    4) కంపన


38. కొండ మలుపుల వద్ద వాహనాలకు ఉండే చలనం?

1) వక్రరేఖీయ    2) సరేఖీయ    

3) డోలన    4) హరాత్మక


39. కిందివాటిలో భ్రమణ, స్థానాంతర చలనాలు ఉండే సందర్భాలు?

1) రోడ్డుపై వెళ్తున్న కారు చక్రాలు    2) చెక్కలో బర్మా చలనం

3) సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల చలనం     4) పైవన్నీ


40. కిందివాటిలో వృత్తాకార చలనానికి ఉదాహరణ?

1) సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కల చలనం     2) రంగులరాట్నం చలనం

3) సైకిల్‌ చక్రాల చలనం   4) పైవన్నీ


41. ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరం?    

1) వడి     2) వేగం          

3) త్వరణం     4) ద్రవ్యవేగం


42. వేగం, దూరం, కాలాల మధ్య సంబంధం?


43. కిందివాటిలో ఒక గంటకు సంబంధించి సరైంది?

1) 360 సెకన్లు      2) 3600 సెకన్లు  

3) 60 సెకన్లు      4) 100 నిమిషాలు


44. తొలి, తుది స్థానాల మధ్య ఉండే కనిష్ఠ దూరం?

1) దూరం  2) స్థానభ్రంశం   3) వడి    4) వేగం


45. ప్రమాణ కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశం?

1) దూరం  2) వడి    3) వేగం   4) సరాసరి వడి


46. వేగంగా ప్రయాణించే వాహనాలు బ్రేకులు వేసినప్పుడు కలిగి ఉండే త్వరణం?

1) రుణ     2) ధన        3) సమ     4) శూన్య


47. స్టేషన్‌ నుంచి బయలుదేరిన రైలు కలిగి ఉండే త్వరణం?

1) ధన       2) రుణ      3) సమ    4) శూన్య


48. కాలానికి మూల ప్రమాణాన్ని గుర్తించండి.    

1) గంట     2) రోజు       3) నెల     4) సెకన్‌


49. A: గుడిలో గంటను మోగించిన స్వాతి అది డోలన చలనాన్ని కలిగి ఉందని తెలిపింది. 

B: బొంగరాన్ని తిప్పిన మౌనిక అది భ్రమణ చలనంలో ఉందని తెలిపింది.

పై వాదనల్లో ఏది సరైంది?

1) A సరైంది, B సరికాదు.     2) B సరైంది, A సరికాదు.

3) A, B సరికావు   4) A, B సరైనవి


50. చలనాన్ని వివరించడంలో ప్రముఖ పాత్ర వహించేది?

1) బలం          2) త్వరణం  

3) సాపేక్షం        4) జడత్వం


సమాధానాలు
 

1-2; 2-4; 3-1; 4-2; 5-3; 6-4; 7-1; 8-1; 9-1; 10-3; 11-2; 12-3; 13-3; 14-1; 15-2; 16-4; 17-1; 18-2; 19-3; 20-4; 21-3; 22-4; 23-3; 24-1; 25-4; 26-1; 27-1; 28-2; 29-3; 30-1; 31-1; 32-2; 33-3; 34-1; 35-3; 36-3; 37-2; 38-1; 39-4; 40-4; 41-1; 42-3; 43-2; 44-2; 45-3; 46-1; 47-1; 48-4; 49-4; 50-3. 


 

Posted Date : 12-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌