1. కాంతి రుజుమార్గ ప్రసరణానికి అనువర్తనం ఏది?
జ: గ్రహణాలు ఏర్పడటం
2. కాంతి సరళరేఖా మార్గ ప్రసరణపై ఆధారపడి నిజప్రతిబింబాన్ని ఏర్పరిచేది?
జ: పిన్‌హోల్ కెమెరా
3. కిందివాటిలో కాంతి అధమ పరావర్తకం కానిది?
1) పాలిథిన్ కవర్ 2) చెక్క 3) మనిషి 4) గోడ
జ: 1 (పాలిథిన్ కవర్)
4. రెండు సమతల దర్పణాల మధ్య కోణం 60º అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత?
జ: 5
5. సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగించే దర్పణం?
జ: పుటాకార దర్పణం
6. కాంతి కిరణాలు ఎల్లప్పుడూ తక్కువ దూరం ప్రయాణించే మార్గాన్ని ఎంచుకుంటాయని తెలిపింది?
జ: ఫెర్మాట్
7. సమతల దర్పణం ఆవర్తనం విలువ?
జ: M = 1
8. కాంతికి ఉండే ఏ ధర్మం ఆధారంగా నీడ గడియారం పనిచేస్తుంది?
జ: సరళరేఖా ప్రయాణం
9. సూర్యుడి కాంతి సముద్ర ఉపరితలంపై పతనమై ఎంత లోతు ప్రయాణిస్తుంది?
జ: 262 అడుగులు
10. యుద్ధాల్లో సైనికులు ఉపయోగించే పరికరం?
జ: పెరిస్కోప్
11. ఒక పరావర్తన తలంలో పరావర్తన కిరణానికి, లంబానికి మధ్య కోణాన్ని ఏమంటారు?
జ: పరావర్తన కోణం
12. ఒక సమతలంపై పతన కోణం 60° అయితే పరావర్తన కోణం ఎంత?
జ: 60°
13. రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
జ: అనంతం
14. ఒక వ్యక్తి సమతల దర్పణానికి 20 మీ. దూరంలో ఉన్నాడు. అయితే అతడి ప్రతిబింబానికి, దర్పణానికి మధ్య దూరం ఎంత?
జ: 25 మీ.
15. కాంతి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ: ఆప్టిక్స్
16. ఆగ్రా కోటపై ఏ దర్పణాన్ని ఏర్పాటు చేశారు?
జ: కుంభాకార దర్పణం
17. కిందివాటిలో ‘నీడ’ వస్తువు యొక్క ఏ లక్షణాన్ని తెలుపుతుంది?
జ: ఆకారం
18. విద్యుత్ రసాయన ఫలితం ఆధారంగా పనిచేసే పరికరాన్ని గుర్తించండి.
జ: విద్యుత్ ఘటం
19. విద్యుదావేశానికి SI ప్రమాణం?
జ: కులూంబ్
20. టార్చిలైట్లో బ్యాటరీలను ఏ పద్ధతిలో అనుసంధానం చేస్తారు?
జ: శ్రేణి పద్ధతి
21. వలయంలో బ్యాటరీ, స్విచ్ అమర్చిన తీరును గుర్తించండి.
1) ఘట ధన ధ్రువం → తీగ → స్విచ్ → తీగ → బల్బ్ → తీగ → రుణ ధ్రువం
2) ధన ధ్రువం → తీగ → బల్బ్ → స్విచ్ → తీగ → రుణ ధ్రువం
3) ధన ధ్రువం → బల్బ్ → స్విచ్ → తీగ → రుణ ధ్రువం
4) బల్బ్ → తీగ → రుణ ధ్రువం → తీగ → స్విచ్
జ: 1 (ఘట ధన ధ్రువం → తీగ → స్విచ్ → తీగ → బల్బ్ → తీగ → రుణ ధ్రువం)
22. కిందివాటిలో విద్యుత్ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేయని పరికరం ఏది?
1) ఎలక్ట్రిక్ కుక్కర్ 2) ఎలక్ట్రిక్ హీటర్ 3) విద్యుత్ టీ కెటిల్ 4) విద్యుత్ బ్యాటరీ
జ: 4 (విద్యుత్ బ్యాటరీ)
23. ఒక ఇంట్లో 100 W బల్బులు నాలుగు, 60 W బల్బులు ఆరు, 40 W బల్బులు ఆరు ఉన్నాయి. ప్రతిరోజు అన్ని బల్బులనూ రెండు గంటల చొప్పున వెలిగిస్తారు. అయితే నెలకి ఎన్ని యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది?
జ: 60 U
24. ట్రాన్స్ఫార్మర్ను కనుక్కున్నది?
జ: మైఖేల్ ఫారడే
25. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బుల్లో కొద్ది మొత్తంలో దేన్ని నింపుతారు?
జ: పాదరసం
26. విద్యుత్ వలయాన్ని మూసివేయడానికి ఉపయోగపడేది?
జ: స్విచ్
27. విద్యుత్ వలయంలో రక్షణ పరికరం ఏది?
జ: ఫ్యూజ్
28. కిందివాటిలో కాంతి జనకంగా ఉపయోగపడేది?
1) క్యాసెట్ ప్లేయర్ 2) మిక్సర్ 3) కుక్కర్ 4) టేబుల్ ల్యాంప్
జ: 4 (టేబుల్ ల్యాంప్)
29. విద్యుత్ క్షేత్రానికి, అయస్కాంత క్షేత్రానికి మధ్య సంబంధాన్ని తెలిపింది.
జ: ఆయిర్స్టెడ్
30. కిందివాటిని జతపరచండి.
జ: A-III, B-II, C-IV, D-I
31. మన ఇళ్లలో, పాఠశాలల్లో ఏ తరహా విద్యుత్ వినియోగిస్తారు?
జ: ఏకాంతర విద్యుత్
32. 4 V, 6 V బ్యాటరీలను సమాంతర పద్ధతిలో అనుసంధానం చేస్తే ఫలిత విద్యుత్ చాలక బలం?
జ: 6 V
33. టార్చిలైట్ ఘటంలో విద్యుత్ విశ్లేష్యంగా ఉపయోగించేది?
జ: అమ్మోనియం క్లోరైడ్
34. కిందివాటిని జతపరచండి.
జ: A-IV, B-I, C-II, D-III
35. ఉష్ణశక్తి ప్రసారం ఏ విధంగా ఉంటుంది?
జ: వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు
36. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే మూలకం?
జ: పాదరసం
37. మానవుడి సాధారణ శరీర ఉష్ణోగ్రత?
1) - 98.4°F 2) 37°C 3) 310°K 4) అన్నీ
జ: 4 (అన్నీ)
38. ప్రపంచంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత
జ: -89°C
39. ప్రపంచంలో మొదటి థర్మామీటరును తయారుచేసిన వారు ఎవరు?
జ: గెలీలియో
40. కిందివాటిలో పాదరసం ప్రత్యేక ధర్మం కానిది?
1) పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది 2) గాజు పాత్రకు అంటుకోదు
3) అతి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయగలదు 4) మంచి ఉష్ణవాహకం
జ: 3 (అతి తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయగలదు)
41. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో శక్తి మార్పు ఎలా ఉంటుంది?
జ: ఉష్ణశక్తి - విద్యుత్‌శక్తిగా
42. ఒక పదార్థం వెచ్చదనం లేదా చల్లదనాన్ని ఎలా పిలుస్తారు?
జ: ఉష్ణోగ్రత
43. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది?
జ: పైరోమీటర్
44. ఏ ఉష్ణోగ్రతామానాన్ని రుణ విలువల్లో చెప్పలేం?
జ: కెల్విన్ మానం
45. ఏ ఉష్ణోగ్రత వద్ద సెల్సియస్ మానం, ఫారన్‌హీట్ మానం సమానంగా ఉంటాయి?
జ: -40
46. కిందివాటిలో ఏ పదార్థాల వ్యాకోచం అధికంగా ఉంటుంది?
1) ఘన పదార్థాలు 2) వాయు పదార్థాలు 3) ద్రవ పదార్థాలు 4) చెప్పలేం
జ: 2 (వాయు పదార్థాలు)
47. ఒక వస్తువు పరావర్తన తలంపై 60° కోణంతో పతనమైతే పరావర్తన తలంతో ఎంత కోణం చేస్తుంది?
జ: 30°
48. నీటికి ఏ ఉష్ణోగ్రత వద్ద అధిక సాంద్రత ఉంటుంది?
1) 4°C 2) 277°K 3) 39.2°K 4) అన్నీ
జ: 4 (అన్నీ)
49. ఒక దర్పణంపై వ్యక్తి ప్రతిబింబం తలకిందులుగా, పెద్దదిగా కనిపిస్తే ఆ దర్పణం
జ: పుటాకారం
50. కిందివాటిలో ఉష్ణోగ్రతను పెంచడానికి అందించాల్సిన ఉష్ణం ఏది?
1) విశిష్టోష్ణం 2) గుప్తోష్ణం 3) సమతాస్థితి ఉష్ణం 4) విశిష్ట గుప్తోష్ణం
జ: 1 (విశిష్టోష్ణం)
51. కిందివాటిలో కాంతి లక్షణం కానిది?
1) పరావర్తనం 2) వక్రీభవనం 3) సంపూర్ణాంతర పరావర్తనం 4) తీవ్రత
జ: 4 (తీవ్రత)
52. సమతల దర్పణం యొక్క ఆవర్థనం విలువ?
జ: M = 1
53. టెలిస్కోప్‌లలో ఉపయోగించే దర్పణం?
జ: పుటాకారం
54. కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేయని అనువర్తనం ఏది?
జ: సోలార్ కుక్కర్
55. కిందివాటిలో నీడలు ఏ ధర్మం ఆధారంగా ఏర్పడతాయి?
1) సరళరేఖా ప్రయాణం 2) సంపూర్ణాంతర పరావర్తనం 3) వక్రీభవనం 4) వివర్తనం
జ: 1 (సరళరేఖా ప్రయాణం)
56. కిందివాటిలో కాంతి నిరోధక పదార్థం ఏది?
1) నూనెలో అద్దిన కాగితం 2) పాలిథిన్ కవర్ 3) ఇటుకరాయి 4) ట్రేసింగ్ పేపర్
జ: 3 (ఇటుకరాయి)
57. కాంతి వేగం ఏ పదార్థాల్లో అధికంగా ఉంటుంది?
జ: వాయు పదార్థాలు