• facebook
  • whatsapp
  • telegram

విష పదార్థాలను నిర్వీర్యం చేసే ద్రవ్యజాలం!

పోషణ - జీర్ణవ్యవస్థ - ఆహార సరఫరా వ్యవస్థ

 

సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళంగా మార్చి శరీరానికి పోషకాలను అందించేదే జీర్ణక్రియ. మానవ జీర్ణవ్యవస్థ నోటి నుంచి మొదలవుతుంది. దంతాలు, ఆస్యకుహరం, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, కాలేయం వంటివన్నీ అందులో భాగాలే. జీర్ణవ్యవస్థ సమగ్ర స్వరూపం, పనితీరుపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. జీర్ణక్రియలో అవసరమయ్యే ఎంజైములు, వాటిని ఉత్పత్తి చేసే గ్రంథులు, శరీర పోషణకు కావాల్సిన విటమిన్లు, వాటి లోపంతో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాలి.


1.    మానవుడిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి?

1) 2      2) 3     3) 4     4) 5


2.     నిమ్న నేత్ర కోటర గ్రంథులు ఏ జీవిలో లోపిస్తాయి?

1) జంతువులు        2) పక్షులు    
3) సరీసృపాలు        4) మానవుడు


3.     టయాలిన్‌ అనేది వేటిపై చర్య జరుపుతుంది?    

1) పిండిపదార్థాలు         2) కొవ్వులు   

3) ప్రొటీన్లు       4) లిపిడ్లు


4.     కిందివాటిలో మలకబళనానికి ఉదాహరణ-

1) మానవుడు     2) కుక్క 

3) శాకాహారులు     4) కుందేలు


5.     కానిబల్స్‌ (స్వజాతి భక్షణ)కు ఉదాహరణ-

1) తేలు  2) పాము  3) బొద్దింక  4) 1, 2


6.     కిందివాటిలో సరైనవి?

ఎ) పాల దంతాల సూత్రం = 2102/2102

బి) శాశ్వత దంతాల సూత్రం = 2123/2123

సి) దంతాల్లో అతి తక్కువ కుంతకాలు

డి) దంతాల్లో అతి ఎక్కువ అగ్రచర్వణకాలు

1) ఎ, బి      2) ఎ, బి, సి  

3) ఎ, బి, డి       4) పైవన్నీ


7.    18 ఏళ్ల అమ్మాయికి ఉండే దంతాల సంఖ్య?

1) 13   2) 32   3) 28   4) 28 లేదా 32


8.     దంతాల అధ్యయనాన్ని ఏమంటారు?

1) లారింగాలజీ     2) గెస్టటాలజీ 

3) ఓడెంటాలజీ     4) ఆర్నిథాలజీ


9. గాస్ట్రిన్‌ హార్మోన్‌ స్రవించే భాగం (జీర్ణాశయంలో)?

1) జఠర నిర్గమ     2) హార్దిక జీర్ణాశయం

3) పండిక్‌ జీర్ణాశయం     4) ఆక్జెంటిక్‌


10. మింగడం అనేది ఏ చర్య?

1) అనియంత్రిత     2) నియంత్రిత 

3) సహజ     4) 1, 2


11. కింది వాక్యాలను పరిశీలించి, సరైన జవాబును ఎంచుకోండి.

ఎ) ఆస్యకుహరంలో జీర్ణమైన ఆహారం బోలస్‌.

బి) జీర్ణాశయంలో జీర్ణమైన ఆహారం ఖైౖమ్‌.

సి) చిన్నపేగులో జీర్ణమైన ఆహారం ఖైల్‌.

డి) నెమరువేసే జంతువుల్లో జీర్ణమైన ఆహారం ఖడ్‌.

1) ఎ, బి  2) ఎ, బి, సి  3) ఎ, డి  4) పైవన్నీ 


12. కిందివాటిని అవరోహణ క్రమంలో అమర్చండి.

ఎ) ఆంత్రమూలం     బి) జెజునం 

సి) శేషాంత్రికం     డి) ఉండూకం

1) బి, సి, ఎ, డి        2) సి, ఎ, బి, డి       
3) డి, సి, బి, ఎ        4) ఎ, బి, డి, సి


13. మానవుడి శరీరంలో ఉన్న అవశేష అవయవాల సంఖ్య?

1) 180   2) 115   3) 110   4) 100


14. కాలేయం అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

1) హిమటాలజీ     2) హెపటాలజీ 

3) హైడ్రాలజీ     4) హైనీసాలజీ


15. శరీరం లోపల అతిపెద్ద అవయవం?

1) క్లోమం  2) చర్మం  3) గుండె  4) కాలేయం


16. కిందివాటిలో ప్రొటీన్‌ లోపం వల్ల కలిగే వ్యాధి?

1) మెరాస్మస్‌     2) క్వాషియార్కర్‌ 

3) ఒబెసిటీ     4) అసిడిటీ


17. బెరిబెరి అనే వ్యాధిని తగ్గించే విటమిన్‌?

1) బి1    2) బి2    3) బి3    4) బి6


18. ఒక విద్యార్థిలో ముంజేతి వాపు గమనించిన ఉపాధ్యాయుడు అతడిని రోజూ ఉదయం, సాయంత్రం ఎండలో కూర్చోమని సూచించాడు. అయితే ఏ విటమిన్‌ కోసం ఈ సూచన అవసరం?

1) టోకోఫెరాల్‌     2) థయామిన్‌ 

3) కాల్సిఫెరాల్‌     4) నియాసిన్‌


19. కిందివాటిలో క్లోమరస ఎంజైమ్‌లు కానివి?

1) ఎమైలేజ్‌ 2) పెప్సిన్‌  3) ట్రిప్సిన్‌  4) లైపేజ్‌


20. బెరియాట్రిక్‌ సర్జరీ కిందివాటిలో దేనికి చేస్తారు?

1) గ్రంథులు      2) జీర్ణనాళం 

3) జీర్ణాశయం     4) వాయునాళం


21. ప్రొటీన్‌ల జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం?

1) జీర్ణాశయం     2) చిన్నపేగు 

3) ఆస్యకుహరం     4) జీర్ణనాళం


22. కిందివాటిలో జీర్ణరసాలు లేని రసం?

1) క్లోమం     2) సక్కస్‌ ఎంటరికస్‌

3) కాలేయం     4) జీర్ణాశయం


23. కిందివాటిలో చిన్నపేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచేవి?

1) శేషాంత్రికం     2) చూషకాలు 

3) ఆలిందం     4) అంధనాళం


24. కిందివాటిలో సత్య వాక్యాలను ఎంచుకోండి.

ఎ) నాడీ సంబంధిత వ్యాధులకు కారణం విటమిన్‌ బయోటిన్‌ లోపం.

బి) రక్తం గడ్డకట్టడానికి కారణం విటమిన్‌ కె.

సి) పెల్లాగ్రా విటమిన్‌ బి3 లోపం వల్ల కలుగుతుంది.

డి) రేచీకటికి కారణం విటమిన్‌ డి.    

1) ఎ, బి సత్యం          2) ఎ, బి, సి, డి సత్యం

3) డి అసత్యం      4) ఏదీకాదు


25. ఒక వ్యక్తికి ఆకలి సూచికలు అందడానికి కారణం?

1) గ్రెలిన్‌ 2) లెప్టిన్‌ 3) అడ్రినలిన్‌ 4) ఇన్సులిన్‌


26. రెండో మెదడు అని దేన్ని అంటారు?

1) అనుమస్తిష్కం     2) ద్వారగోర్ధం 

3) జీర్ణనాడీమండలం     4) పైవన్నీ


27. ఆకలిని కలిగించే గ్రెలిన్‌ సమాచారాన్ని మెదడుకు చేర్చడానికి సహాయపడేది?

1) ద్వారగోర్ధం     2) వేగస్‌ నాడీ 

3) మజ్జాముఖం     4) 1, 2


28. కుంతకాలు ఏ ఆకారంలో ఉంటాయి?

1) పదునైన అంచులతో     2) కూసుగా 

3) చదునుగా     4) సమాంతరంగా


29. జీర్ణాశయంలో జఠరరస ఉత్పత్తిని ప్రేరేపించేది?

1) సెక్రిటిన్‌     2) కొలిసిస్టోకైనిన్‌ 

3) గ్యాస్ట్రిన్‌     4) గ్రెలిన్‌


30. ట్రిప్సినోజెన్‌ను ట్రిప్సిన్‌గా మార్చేది?

1) ఎంటిరోకైనేజ్‌     2) ట్రిప్సిన్‌ 

3) ఎమైలేజ్‌     4) లైపేజ్‌


31. కిందివాటిలో చిన్నపిల్లల్లో ఉండి, పెద్దవారిలో లోపించేది?

1) పెప్సిన్‌ 2) హెచ్‌సీఎల్‌ 3) రెనిన్‌ 4) కాజల్‌


32. కాలేయ కణాల్లోని ఏ భాగం విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది?

1) రిక్తిక     2) మైటోకాండ్రియా 

3) రైబోజోమ్‌     4) అంతర్జీవ ద్రవ్యజాలం


33. ఉమామి అనేది ఎవరి సంప్రదాయ వంటకం?

1) జపనీయులు     2) రష్యన్లు 

3) అమెరికన్లు     4) భారతీయులు


34. శరీరంలోని అతి గట్టి పదార్థం?

1) డెంటైయిన్‌     2) ఎముక 

3) ఎనామిల్‌     4) కపాలం


35. శాకాహారుల్ల్లో ఏ దంతాలు లోపించి ఉంటాయి?
1) కుంతకాలు     2) చర్వణకాలు 

3) అగ్రచర్వణకాలు     4) రదనికలు


36. ఉమామి,  మోనోసోడియం గ్లుటామేట్‌లను కలిపి ఏమంటారు?

1) హచింగ్‌ 2) హంటింగ్‌ 3) జర్మిన్‌ 4) పైవన్నీ


37. కిందివాటిలో పెరిస్టాలిటిక్‌ చలనాలు కలగని భాగం? 

1) ఆహారవాహిక     2) జీర్ణాశయం 

3) పేగు     4) ఆస్యకుహరం


38. పెద్దపేగు పొడవు సుమారుగా ఎంత ఉంటుంది?

1) 3 సెం.మీ.     2) 3 మీ. 
3) 1.5 మీ.     4) 15 మీ.


39. కిందివాటిలో పేదవాడి విటమిన్‌?

1) విటమిన్‌ డి     2) విటమిన్‌ ఇ 

3) విటమిన్‌ సి     4) విటమిన్‌ ఎ


40. కిందివాటిలో ఏ విటమిన్‌ లోపం వల్ల డయేరియా కలుగుతుంది?

1) విటమిన్‌ డి     2) విటమిన్‌ ఇ 

3) విటమిన్‌ బి3     4) విటమిన్‌ బి1


41. కిందివాటిలో బ్యూటీ విటమిన్‌ ఏది?

1) టోకోఫెరాల్‌     2) కాల్సిఫెరాల్‌ 

3) ఫిల్లోక్వినోన్‌     4) రెటిన్‌


42. కిందివాటిలో పరాన్న జీవ మొక్క?

1) బోగన్‌విల్లియా     2) రిప్లేక్సా 

3) కస్కుటా     4) ఆంథోసిరాస్‌


43. కిందివాటిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండే ఫలం?

1) మామిడి 2) బొప్పాయి 3) సిట్రస్‌ 4) నారింజ


44. డెర్మటాసిస్‌ ఏ విటమిన్‌ లోపం వల్ల కలుగుతుంది?

1) విటమిన్‌ డి     2) విటమిన్‌ ఇ 

3) విటమిన్‌ ఎ     4) విటమిన్‌ సి


45. కిందివాటిలో పారాథార్మోన్‌లా పనిచేసే విటమిన్‌?

1) విటమిన్‌ ఎ     2) విటమిన్‌ బి 

3) విటమిన్‌ డి     4) విటమిన్‌ ఇ


46. రక్తం గడ్డకట్టడానికి ఎంత సమయం పడుతుంది?

1) 3 - 8 ని.     2) 3 - 6 ని. 

3) 10 ని.     4) 6 - 9 ని.


47. చిన్నపేగులో సంశ్లేషణ చేసే విటమిన్‌ ఏది?

1) బి12     2) బి1 

3) విటమిన్‌ ఎ     4) విటమిన్‌ డి


48. జీర్ణ నాడీమండలం చేయలేని పనులు?

1) నాడీ ప్రచోదన ఉత్పత్తి     2) సమాచార మార్పిడి 

3) సేకరణ              4) పైవన్నీ


49. మింగే ప్రక్రియ కిందివాటిలో దేని ఆధీనంలో ఉంటుంది?

1) మజ్జాముఖం     2) ద్వారగోర్ధం 

3) మస్తిష్కం     4) వెన్నుపాము


50. ఆస్యకుహరంలో మొదటిగా జీర్ణమయ్యే పదార్థాలు?

1) ప్రొటీన్లు     2) కొవ్వులు 

3) పిండిపదార్థాలు     4) పైవన్నీ


51. పాలలో పెరుగుదల కారకం ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జేమ్స్‌ లిండ్‌    2) హెచ్‌.జి.హాఫ్‌కిన్స్‌ 

3) కాసమర్‌ ఫంక్‌    4) ప్రిస్టే


52. లైంగిక విటమిన్‌ అని దేన్ని అంటారు?

1) విటమిన్‌-A    2) విటమిన్‌-B

3) విటమిన్‌-E     4) విటమిన్‌-C


53. కిందివాటిలో పారాథార్మోన్‌ విధి?

1) ఫాస్ఫరస్‌ శోషణ    2) కాల్షియం శోషణ

3) అల్యూమినియం శోషణ    4) 1, 2


54. అత్యంత సున్నితమైన విటమిన్‌?

1) విటమిన్‌-C    2) విటమిన్‌-A

3) విటమిన్‌-D    4) విటమిన్‌-B


55. చిన్నపిల్లల్లో లోపించిన దంతాలు?

1) కుంతకాలు    2) రదనికలు 

3) చర్వణకాలు    4) అగ్రచర్వణకాలు


56. ఆస్యకుహరంలో ఆహార చలనం అనేది ఏ ప్రక్రియ?

1) నియంత్రిత       2) అనియంత్రిత 

3) సహజ           4) పైవన్నీ



సమాధానాలు
 

1-2; 2-4; 3-1; 4-4; 5-4; 6-3; 7-4; 8-3; 9-1; 10-2; 11-4; 12-3; 13-1; 14-2; 15-4; 16-2; 17-1; 18-3; 19-2; 20-3; 21-1; 22-3; 23-2; 24-3; 25-1; 26-3; 27-4; 28-1; 29-3; 30-1; 31-3; 32-4; 33-1; 34-3; 35-4; 36-1; 37-4; 38-3; 39-1; 40-3; 41-1; 42-3; 43-2; 44-3; 45-3; 46-2; 47-1; 48-4; 49-1; 50-3; 51-2; 52-3; 53-4; 54-1; 55-3; 56-1.


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 12-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌