• facebook
  • whatsapp
  • telegram

మొక్కలు - వ్యాధులు

(వృక్షవ్యాధి శాస్త్రం)

పిశాచాల చీపురుకట్ట చెర్రీ!
 


 


ఆహారభద్రతను సాధించడానికి, జీవవైవిధ్య పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి ఆరోగ్యకరమైన మొక్కలు అవసరం. తెగుళ్లు, చీడపీడల బారిన  పడిన మొక్కల వల్ల పర్యావరణం, వ్యవసాయం దెబ్బతిని అంతిమంగా మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి.  ఈ విధమైన ఇబ్బందుల నివారణకే మొక్కలకు వచ్చే వ్యాధులపై బయాలజీలో ప్రత్యేకంగా అధ్యయనాలు నిర్వహిస్తారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల మొక్కల జీవరసాయన చర్యల్లో సంభవించే మార్పులు, మొక్కల్లో వ్యాధి నిరోధకతకు దోహదపడే విధానాలపైనా అవగాహన పెంచుకోవాలి.


1.  మొక్కల వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?

1)  పాథాలజీ       2) ఫైటో పాథాలజీ  

3) జూ పాథాలజీ      4) పైవన్నీ


2. కిందివాటిలో సత్య వాక్యం?

ఎ) పాథోజన్‌ అంటే వ్యాధిని కలిగించే కారకం.

బి) 1959 లో హార్స్‌పాల్‌.. మొక్కకు సంబంధించిన తెగుళ్లకు ప్రత్యేక పేరును సూచించాలని అభిప్రాయపడ్డారు.

సి)  జొన్నలో కాటుక తెగులు స్పిషలోథీకా సొర్గై అనే వ్యాధికారకం నుంచి సంభవిస్తుంది.

డి) ఆతిథేయి, వ్యాధి జనకం పరస్పర చర్యల   ప్రభావమే వ్యాధి.

1) ఎ, బి   2)  ఎ, బి, సి 3) పైవన్నీ 4)  ఏదీకాదు


3 . కిందివాటిని జతపరచండి.

1) పిశాచాల చీపురు కట్ట  (  )  ఎ) వరి

2) ఎండు తెగులు  (  )  బి) చెర్రీ

3) సిట్రస్‌ కాంకర్‌ (  )  సి) చెరకు

4) ఎర్రకుళ్లు తెగులు  (  )   డి) నిమ్మ

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి


4. ఐర్లాండ్‌లో ఏ పంట వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది?

1) చెర్రీ   2) ద్రాక్ష  3) బంగాళదుంప  4) వరి


5.  కిందివాటిలో అసత్య వాక్యం?

1) 1870లో శ్రీలంకలో శిలీంధ్రం వల్ల కాఫీ పంటకు ‘కాఫీ కుంకుమ తెగులు’ సోకింది.

2) 1882లో ఫ్రాన్స్‌లో ప్లాస్మోపారావిటికోలా అనే  బ్యాక్టీరియా వల్ల ద్రాక్షను ‘డౌనీ మిల్‌ డ్యూ’ అనే వ్యాధి సోకింది.

3) అమెరికాలో అరటి పంటకు ‘సిగాటోకా’ అనే వ్యాధి సోకింది.

4) వేరుశనగలో శిలీంధ్రం వల్ల టిక్కా తెగులు  కలుగుతుంది.

6.     కిందివాటిని జతపరచండి.

1) పొగాకు  ఎ) కాటుక తెగులు
2) అరటి బి) ఆకుముడత వ్యాధి
3) జొన్న సి) మొజాయిక్‌ తెగుళ్లు
4) టమాటా డి) బంచీటాప్‌ వ్యాధి

1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


7. బెంగాల్‌ కరవు ఎప్పుడు సంభవించింది?

1) 1930   2) 1882   3) 1942   4) 1870


8.  కిందివాటిలో వ్యాధి జనకం పరంగా భిన్నమైంది?

1) ఎర్రకుళ్లు వ్యాధి    2) ట్రిస్టీజా  

3) లేట్‌బ్లైట్‌       4) ఎర్లీబ్లైట్‌


9. స్పైక్‌ తెగులు ఏ మొక్కలో సంభవిస్తుంది?

1) బంగాళదుంప    2) కోకో     

3) ఆల్మండ్‌    4) మంచి గంధం


10. వ్యాధి జనక జీవులైన బ్యాక్టీరియాలను మొదటిసారిగా అభిరంజనం చేసినవారు?

1) రాబర్ట్‌ కోచ్‌       2) కార్లవాన్‌ వైగెర్డ్‌    

3) సెడిలాట్‌      4) 1, 3


11. జనుముకు సంక్రమించే వైరస్‌?

1) ఫిల్లోడి       2) మొజాయిక్‌  

3) బంచీటాప్‌       4) గ్రాసీ షూట్‌


12. డైనర్‌ ప్రకారం మొక్కల్లో వైరస్‌ వ్యాధుల కారణంగా మొక్కల జీవ రసాయన చర్యల్లో భిన్నమైంది?

1) కిరణజన్య సంయోగక్రియ ప్రమాణంలో తరుగుదల

2) శ్యాసక్రియ ప్రమాణంలో వృద్ధి తగ్గడం

3) నత్రజని సంబంధ పదార్థాల సంచయనం

4) వృద్ధి నియంత్రకాల క్రియాశీలత తగ్గిపోవడం


13. భిన్నమైన లక్షణాలున్న వ్యాధిని గుర్తించండి.

1) నిర్హరితం: పత్రం హరితం కోల్పోయి పసుపు రంగులోకి మారడం.

2) మొజాయిక్‌: పత్రంలో పలు రంగుల్లో   పత్రహరితం ఉండటం.

3) కణజాల క్షయపు మచ్చలు: పత్రాల మధ్యఈనె వైపున పత్రదళం ముడుచుకుపోవడం.

4) చిన్నాకు తెగులు: ఈ వ్యాధి సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవిగా ఉంటాయి.
 

14. వంగలో సాధారణంగా కనిపించే వైరస్‌ వ్యాధి?

1) కంకి తెగులు    2) చిన్నాకు తెగులు  

3) వైరసెన్సు    4) 1, 3


15. కస్కుటా వల్ల వ్యాప్తి చెందే వ్యాధి?

1) టొబ్రా తెగులు    2) రింగ్‌ స్పాట్‌  

3) ఆకు ముడత   4) కర్లీటాప్‌ తెగుళ్లు


16. పొగాకు ఆకుముడత వైరస్‌కు రోగవాహక కీటక జాతి?

1) ఎఫిస్‌ మేడిస్‌       2) ఎఫిస్‌ గాస్సిపై    

3) బెమిసియా టబాసి      4) 1, 2


17. మొక్కలకు వచ్చే వ్యాధులకు సంబంధించి సూక్ష్మ జీవనాశకాల తయారీకి ఎక్కువుగా ఉపయోగించే సూక్ష్మజీవి?

1) న్యూరోస్పోరా    2) కారా    3) క్లోరెల్లా   4) రైజోపస్‌


18. నిల్వఆహార పదార్థాలను తినడంవల్ల వచ్చే వ్యాధి?

1) డయేరియా       2) బొటులిజమ్‌   

3) డీసెంట్రీ     4) 1, 2


19. దోమ లార్వాలను నశింపజేసే శైవల జాతులు?

1) అనబినా 2) ఆలోసిరా 3) నాస్టాక్‌    4) 1, 2


20. బ్యాక్టీరియల్‌ వడపోత పరికరాలతో వడపోయలేని బహురూప పరాన్నజీవులు?

1) మైకోప్లాస్మా   2) బ్యాక్టీరియోఫేజ్‌   

3) శైవలాలు    4) శిలీంధ్రాలు



21. ప్రొటిస్టా రాజ్యంలో శిలీంధ్రాలు, ప్రొటోజోవాలను చేర్చిన వ్యక్తి?

1) ఎండ్లీకర్‌     2) పీట్చ్‌    3) హెకెల్‌    4) డీ కండోల్‌


22. తెగులు తెచ్చే జీవరసాన్ని తయారు చేసినవారు?

1) బైజెరింక్‌   2) ట్వోర్ట్‌   3) స్టాన్లీ  4) బాడన్‌


23. కిందివాటిని జతపరచండి.

1) బ్యాక్టీరియోఫేజ్‌  ఎ) టకహాసి
2) టీఎంవీ సంశ్లేషణ బి) లీవెన్‌ హుక్‌
3) న్యూక్లియో ప్రొటీన్‌ సి) ట్వోర్ట్‌
4) జంతుకాలు డి) బాడన్, పీరీ 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి


24. బ్యాక్టీరియా అనే పదాన్ని ప్రవేశపెట్టింది?

1) ఎండ్లీకర్‌       2) రాబర్ట్‌ కోచ్‌  

3) లూయీ పాశ్చర్‌   4) పర్హెన్‌ బెర్గ్‌


25. మన దేశంలో పునారావృతమయ్యే కుంకుమ   తెగులుపై పరిశోధన చేసినవారు?

1) ఆచార్య మెహతా    2) స్టాన్లీ   

3) పిట్చ్‌     4) ఎండ్లీకర్‌


26. కిందివాటిలో ద్వికేంద్రక స్పోరులను గుర్తించండి.

1) స్పేర్మేషియా       2) బెసిడియోస్పోరులు  

3) టెలిటోస్పోరులు     4) 1, 2


27. కిందివాటిలో స్వీకార తంతువులు?

1) స్పేర్మేషియంలు      2) ఎసియోస్పోరులు  

3) టెలిటోస్పోరులు     4) యూరిడోస్పోరులు


28. ప్రాగ్మో బెసిడియంలో ఉన్న కేంద్రక స్థితి?

1) ఏకస్థితికం       2) ద్వయస్థితికం   

3) త్రయస్థితికం      4) బహుస్థితికం


29. చారల కుంకుమ తెగులును కలిగించే వ్యాధి జనకం?

1) పక్సినియా గ్లుమారమ్‌       2) పక్సినియా ట్రిటిసినా

3) థాలిక్ట్రమ్‌ ప్లావమ్‌       4) పక్సినియా గ్రామినిస్‌


30. కిందివాటిలో శిలీంధ్ర నాశకాలు?

1) డైథేన్‌ 2-78     2) ఆక్సి కార్బాక్సిన్‌      

3) జినెబ్‌      4) పైవన్నీ


31. నల్లకుంకుమ తెగులుకు వ్యాధి నిరోధకత చూపించే రకం?

1) రిడ్లే  2) సోనార్‌-63 3) లెర్మారొజా 4) పైవన్నీ


32. కిందివాటిని జతపరచండి.

1) ఆల్టర్నేరియా బ్రాసికే ఎ) ప్లాక్సు
2) ఆల్టర్నేరియా రఫాని బి) ఆవ మొక్క   
3) ఆల్టర్నేరియా ఇని సి) ఆస్టరేసి
4) ఆల్టర్నేరియా జిన్నే డి) ముల్లంగి

1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


33. అంటువ్యాధులకు సంబంధించిన శాస్త్రం?

1) ఎంటమాలజీ       2) ఎపిడమాలజీ

3) పాథాలజీ            4) 1, 2


34. జాతీయ అంటువ్యాధుల నివారణ సంస్థ ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ   2) చెన్నై  3) కసౌలీ   4) హైదరాబాద్‌


35. వృక్ష వ్యాధిశాస్త్ర పితామహుడు?

1) లిన్నేయస్‌     2) రాబర్ట్‌ కోచ్‌

3) డిబారె    4) డీ కండోల్‌


36. ప్లాస్మాపొర వైటికోలా అనే జీవి ఏ వ్యాధిని    కలిగిస్తుంది?

1) విల్ట్‌ తెగులు     2) ద్రాక్ష డౌనీ మిల్‌ డ్యూ

3) కాటుక తెగులు         4) 1, 2


37. కిందివాటిలో అసత్య వాక్యం?

1) మొక్కలపై దాడిచేసే వైరస్‌ - ఫైటోఫేజ్‌

2) బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్‌ - బ్యాక్టీరియో ఫేజ్‌

3) శైవలాలపై దాడిచేసే వైరస్‌ - మైకోఫేజ్‌

4) ఈస్ట్‌లపై దాడిచేసే వైరస్‌ - జైమోఫేజ్‌


38. కిందివాటిలో బుల్లెట్‌ వైరస్‌?

1) పోలియో వైరస్‌      2) రాబ్డో వైరస్‌   

3) టీఎంవీ    4) ఆడినో వైరస్‌


39. వాదన - ఎ: కణ కవచం లేని విలక్షణమైన జీవులు మైకోప్లాస్మాలు.

ప్రతివాదన - బి: ఇవి నిర్దిష్టమైన ఆకారంలో ఉండవు.

1) ఎ సత్యం, బి అసత్యం    2) ఎ సత్యం

3) ఎ, బి లు సత్యం    

4) ఎ అసత్యం,  బి సత్యం


40. కిందివాటిలో ఏ జీవులు డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ రెండింటినీ కేంద్రక ఆమ్లంగా ఉండే జీవులు?

1) మైకోప్లాస్మా    2) శిలీంధ్రాలు     

3) వైరస్‌లు      4) బ్యాక్టీరియా


41. కిందివాటిలో అసత్య వాక్యం?

1) తోక కప్ప ఆకారంలో ఉండే వైరస్‌ - బ్యాక్టీరియో ఫేజ్‌

2) గోళాకార వైరస్‌ - పోలియో వైరస్‌

3) దీర్ఘ చతురస్రాకార వైరస్‌ - టీఎంవీ        

4) బుల్లెట్‌ వైరస్‌ - రాబ్డో వైరస్‌


42. కిందివాటిలో అతిపెద్ద వైరస్‌?

1) వాక్సీనియా వైరస్‌      2) టీఎంవీ    

3) బ్యాక్టీరియా ఫేజ్‌ నీ2    4) 1, 2


43. మొక్కలపై దాడి చేసే వైరస్‌లలో కేంద్రక ఆమ్లం?

1) డీఎన్‌ఏ     

2) ఆర్‌ఎన్‌ఏ 

3) డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ     

4) ఏదీకాదు


సమాధానాలు
 

1-2; 2-3; 3-1; 4-3; 5-2; 6-1; 7-3; 8-2; 9-4; 10-2; 11-1; 12-2; 13-3; 14-2; 15-4; 16-3; 17-1; 18-2; 19-4; 20-1; 21-3; 22-1; 23-2; 24-4; 25-1; 26-3; 27-1; 28-1; 29-1; 30-4; 31-4; 32-1; 33-2; 34-1; 35-3; 36-2; 37-3;  38-2; 39-3; 40-1; 41-3; 42-1; 43-2.


రచయిత: వట్టిగౌనోళ్ల పద్మనాభం


 

Posted Date : 08-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌