• facebook
  • whatsapp
  • telegram

మొక్కలు - వివిధ జీవుల్లో వ్యర్థాలను తొలగించే వ్యవస్థ

మొక్కల విసర్జకాలతో మలేరియా నివారణ!

జీవుల శరీరాల్లో నిరంతరం జరిగే జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను వెలుపలికి పంపేదే విసర్జక వ్యవస్థ. శరీర సమతౌల్యతకు, అంతర ప్రసరణ వ్యవస్థలు సజావుగా పనిచేసేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి. తీసుకునే ఆహారం, నీటి పరిమాణం ఆధారంగా విసర్జన ఒక్కో జీవిలో ఒక్కో తరహాలో ఉంటుంది. జంతువుల్లో నత్రజని సంబంధిత వ్యర్థాలు విసర్జితమైతే, మొక్కల్లో స్రావాల రూపంలో విడుదలవుతుంది. నిమ్నస్థాయి నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు విసర్జక వ్యవస్థ నిర్మాణంపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మానవులకు సంబంధించి విసర్జక వ్యవస్థలో తలెత్తే సమస్యలు, సంబంధిత వ్యాధులు, నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి.


1.  ‘విసర్జన’ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?    

1) లాటిన్‌   2) గ్రీకు   3) జర్మన్‌   4) పర్షియన్‌



2. కిందివాటిలో కిరణజన్య సంయోగక్రియలో వెలువడనిది?

1) గ్లూకోజ్‌   2) కార్బన్‌ డై ఆక్సైడ్‌    3) నీరు    4)  ఆక్సిజన్‌



3.  నిమ్నస్థాయి జీవుల్లో మొదటగా ఏర్పడిన విసర్జక అవయవం?

1) నెఫ్రీడియా     2) రెనెట్‌ కణం  

3) హరిత గ్రంథులు    4) జ్వాలా కణాలు



4.  రెనెట్‌ కణాల ద్వారా విసర్జన జరిపే జీవులు?

1) అనెలిడా    2) ఆర్ధ్రోపోడా  

3) నెమటోడా    4) ప్లాటీహెల్మెంథిస్‌



5. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.

ఎ) మొక్కల్లో జరిగే బిందుస్రావం, బాష్పోత్సేకం అనేవి విసర్జనకు నిదర్శనాలు.

బి) మొక్కల్లో విసర్జన వ్యవస్థ ఉండదు కానీ, విసర్జన ప్రక్రియ జరుపుతుంది.

సి) మొక్కల్లో ఏర్పడే వ్యర్థాలు ఆకులు, బెరడు, పండ్లలో నిల్వ ఉంటాయి.

డి) కొన్ని రకాల మొక్కలు నిల్వ చేసుకున్న వ్యర్థాలు ఆత్మరక్షణకు సహాయపడతాయి.

1) ఎ, బి, సి, డి    2) ఎ, సి, డి   

3) ఎ, బి     4) ఎ, బి, సి



6. ఎ) వాదన: స్పంజికలు, సీలెంటరేట్లలో ప్రత్యేక   విసర్జక అంగాలుండవు.

బి) కారణం: స్పంజికలు, సీలెంటరేట్లలో ప్రతి కణంలో నీటి ప్రసరణ జరుగుతుంది.

1) ఎ సరైంది కానీ, బి సరికాదు.

2) ఎ సరైంది, ఎ కి బి సరైన వివరణ కాదు.

3) ఎ, బి లు సరైనవి. ఎ కి బి సరైన వివరణ.

4) ఎ సరికాదు కానీ, బి సరైంది. ఎ కి బి సరైన వివరణ కాదు.



7. తన జీవిత కాలంలో నీటిని తీసుకోని జీవి?

1) లెపిస్మా    2) క్యాంగ్రూన్‌ ఎలుక  

3) ఫెన్నిస్‌ ఫాక్స్‌    4) 1, 2



8. మానవుడి శరీరంలో విసర్జన విధి కానిది?

1) వ్యర్థ పదార్థాల వడపోత, విసర్జన

2) రక్తంలోని శిబీను నియంత్రించడం

3) శరీరంలోని నీరు, లవణాలను సమతుల్యపరచడం

4) రక్తంలోని ద్రవోద్గమాన్ని నియంత్రించడం



9. జతపరచండి.

1) వృక్కాలు   (  )  ఎ) సాలెపురుగు

2)  గ్లోమరూలస్‌   (  )  బి) బొద్దింక

3) కోక్సల్‌ గ్రంథులు  (  ) సి) జలగ

4) మాల్ఫీజియన్‌ నాళికలు (  ) డి) బెలనోగ్లాసస్‌

1) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి   

2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి     

3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి 

4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ



10. గ్వానిన్‌ అనే వ్యర్థ పదార్థాన్ని విసర్జించే జీవి?

1) సాలె పురుగు   2) లెపిస్మా  

3) పాములు    4) పక్షులు



11. వ్యర్థ పదార్థాల విష స్థాయి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి.

ఎ) యూరిక్‌ ఆమ్లం   బి) యూరియా   

సి) అమ్మోనియా    డి) గ్వానిన్‌ 

1) ఎ, బి, డి, సి     2) సి, డి, ఎ, బి    

3) డి, ఎ, బి, సి    4) డి, ఎ, సి, బి



12. మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం?

1) వృక్క నాళాలు    2) మూత్రకేశ నాళిక  

3) బౌమన్స్‌ గుళిక    4) 1, 2



13. 40 ఏళ్లు దాటాక దాదాపుగా అందరిలో ప్రతి   పదేళ్లకు ఎంత శాతం నెఫ్రాన్‌లు క్రియాశీలత కోల్పోతాయి?

1) 10%     2) 25%   3) 50%   4) 40%



14. మూత్రాశయంలో గరిష్ఠంగా నిల్వ ఉండే మూత్రం?

1) 700-800 ఎం.ఎల్‌.    2) 300-400 ఎం.ఎల్‌.   

3) 150 - 300 ఎం.ఎల్‌.   4) 900 ఎం.ఎల్‌.



15. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) 1954 లో మొదటి మూత్రపిండ మార్పిడి చేసిన ఘనత చార్లెస్‌ హాప్‌నగెల్‌కు దక్కుతుంది.

బి) మనదేశంలో మొదటిసారి మూత్రపిండ మార్పిడి చేసింది డాక్టర్‌ జానీ, మోహన్‌లు (1971లో).

సి) మన శరీరంలో అనుబంధ విసర్జకావయవాలు ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్ద పేగు.

డి) వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల అతి మూత్ర వ్యాధి సంభవిస్తుంది.

1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, డి    

3) ఎ, సి, డి     4) ఎ, డి మాత్రమే



16. డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ అంటే..

1) వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల అధిక గాఢత ఉన్న మూత్రాన్ని అధికంగా విసర్జించడం

2) వాసోప్రెస్సిన్‌ ఎక్కువ కావడం వల్ల అధిక గాఢత ఉన్న మూత్రాన్ని అల్పంగా విసర్జించడం

3) వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల అల్ప గాఢత ఉన్న మూత్రాన్ని అధికంగా విసర్జించడం

4) వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల అధిక మూత్రాన్ని విసర్జించడం



17. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) మూత్రపిండం అధ్యయనం - నెఫ్రాలజీ

2) మూత్రపిండం ఆకారం - చిక్కుడు గింజ

3) కుడి, ఎడమ మూత్రపిండాలు సమానంగా ఉంటాయి

4) మూత్రపిండం బరువు 170 గ్రా.



18. కిందివాటిలో వల్కలం రంగు- 

1) ముదురు గోధుమ    2) గోధుమ రంగు  

3) లేత ఎరుపు       4) వర్ణ రహితం



19. మూత్రపిండంలోని మూత్రకేశ నాళికల సంఖ్య?

1) 2 మిలియన్లు      2) 1.5 మిలియన్లు   

3) 1.8 మిలియన్లు    4) 2.5 మిలియన్లు



20. మాల్ఫీజియన్‌ దేహం ఏ రెండు నిర్మాణాల  కలయిక?

1) గ్లోమరుల్లస్‌    2) భౌమన్స్‌ గుళిక       

3) హెన్లీ శిక్యం    4) 1, 2



21. భౌమన్స్‌ గుళిక గోడల్లోని కణాలు?

1) పోడోసైట్స్‌      2) అడిపోసైట్స్‌   

3) మయోసైట్స్‌     4) 1, 2



22. వృక్కనాళికలో లేని భాగం?

1) హెన్లీ శిక్యం     2) భౌమన్స్‌ గుళిక   

3) సమీప సంవళిత నాళం   

4) దూరస్థ సంవళిత నాళం



23. మూత్రం ఏర్పడే విధానంలోని దశల వరుస-

ఎ) గుచ్ఛగాలనం   బి) నాళికస్రావం  

సి) అధిక గాఢత ఉన్న మూత్రం ఏర్పాటు  

డి) వరణాత్మక పునఃశోషణం

1) ఎ, బి, డి, సి     2) ఎ, డి, సి, బి    

3) ఎ, డి, బి, సి     4) ఎ, సి, డి, బి



24. కృత్రిమ మూత్రపిండాలను కనుక్కున్నది?

1) విలియం హార్వే    2) విలియం జె.కాఫ్‌   

3) చార్లెస్‌ నగేలి    4) క్రిస్టియన్‌ బెర్నార్డ్‌



25. మూత్రంలో ఏర్పడే ఏ హర్మోన్‌ వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది?

1) రెనిన్‌    2) గాస్ట్రిన్‌   3) కొలిసిస్ట్రొకైనిన్‌     4) రెనిల్‌



26. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.

1) మూత్రం pH విలువ 6            

2) మూత్రం రంగుకు కారణం - యూరోక్రోమ్‌   

3) మూత్రం రంగు లేత పసుపు  4్శ పైవన్నీ



27. కిందివాటిలో జన్యుసంబంధిత మూత్ర వ్యాధి?

1) నెఫ్రోసిస్‌      2) ఆల్కాప్టో న్యూరియా       

3) రీనల్‌ హెమరేజ్‌    4) ప్రోటో న్యూరియా



28. కింది ఏ ప్రక్రియలో 75% నీటి పునఃశోషణ  జరుగుతుంది?

1) నాళికా స్రావం    2) గుచ్ఛగాలనం    

3) వరణాత్మక పునఃశోషణ   4) 1, 2



29. మూత్రంలో నీటి శాతం?

1) 86%  2) 96%   3) 75%  4) 80%



30. A వాదన: మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది.

B కారణం: రక్తంలోని హిమోగ్లోబిన్‌ విచ్ఛిన్నం వల్ల ఏర్పడే యూరోక్రోమ్‌తో మూత్రానికి రంగు వస్తుంది.

1) A సరైంది కానీ, B సరైందికాదు.

2) A, B లు సరైనవి. Aకి B సరైన కారణం కాదు.

3) A, B లు సరైనవి. Aకి B సరైన కారణం.

4) A సరైంది కాదు కానీ, B సరైంది.



31. మొక్క ఏ విసర్జక పదార్థాన్ని మానవుడిలో    మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు?

1) రిసర్ఫిన్‌   2) క్వినైన్‌   3) మార్ఫిన్‌   4) పైరిత్రాయిడ్స్‌



32. కిందివాటిలో సరికానిది గుర్తించండి.

1) మొక్కల్లో ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు - గ్లూకోజ్, ప్రొటిన్‌.

2) మొక్కల్లో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు - ఆల్కలాయిడ్, టాక్సిన్, రెసిన్‌.

3) ముదురు రంగు కర్బన పదార్థాలను ఆల్కలాయిడ్లు అంటారు.

4) లేటెక్స్‌లు తెలుపు వర్ణంలో ఉంటాయి.



33. కిందివాటిలో కాఫీ రుచిని, వాసనను పెంచేవి?

1) చికోరియా ఇంటిబస్‌     2) స్కోపోలమైన్‌     

3) పలాక్వియా   4) కెఫిన్‌



34. ‘చూయింగ్‌ గమ్‌’ మొక్క ఏ ఉత్పన్నం?

1) జిగురు    2) ఆల్కలాయిడ్‌   

3) లేెటెక్స్‌   4) టానిన్‌



35. మొక్కల స్రావకాలపై ప్రయోగాలు జరిపిన వ్యక్తి?

1) బ్రుగ్‌మన్స్‌   2) జె.సి.బోస్‌     

3) ఎంగిల్‌మన్‌    4) జాన్‌ బాప్టిస్టా



36. మూత్రానికి వెళ్లాలని అనిపించడాన్ని ఏమంటారు?

1) గట్టేషన్‌    2) మిక్చురేషన్‌     

3) జర్మేషన్‌   4) గస్టేషన్‌



37. కిందివాటిని జతపరచండి.

1) టానిన్‌  ( ) ఎ) వేప

2) రెసిన్‌   ( ) బి) తంగేడు

3) జిగుర్లు ( ) సి) హీవియం బ్రెజీలియన్సిస్‌

4) లేటెక్స్‌ ( ) డి) పైనస్‌

5) ఆల్కలాయిడ్‌  ( ) ఇ) మార్ఫిన్‌

1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ, 5-ఇ 

2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి, 5-ఇ 

3) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి  

4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ

సమాధానాలు
 

1-1; 2-2; 3-4; 4-3; 5-1; 6-3; 7-4; 8-4; 9-2; 10-1; 11-3; 12-2; 13-1; 14-1; 15-1; 16-3; 17-3; 18-1; 19-3; 20-4; 21-1; 22-2; 23-3; 24-2; 25-4; 26-4; 27-2; 28-3; 29-2; 30-3; 31-2; 32-3; 33-1; 34-3; 35-1; 36-2; 37-2.

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 29-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌