• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

సీస తరువోజల్లో యతులు సమానం!
 


సంస్కృతంలో వేదాలతో ప్రారంభమైన విశిష్ట రచనా విధానమే ఛందస్సు. పద్యాలు, శ్లోకాలు రాయడానికి ఉపయోగించే ప్రత్యేక పద్ధతిగా స్థిరపడిపోయింది. అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడిన గురువు, లఘువు అనే ద్విసంఖ్యామానంపై ఛందస్సు ఆధారపడి ఉంటుంది. ఇందులోని నియమాలతో పాటు సంస్కృతంలో వృత్తాలు, తెలుగులోని జాతులు, ఉపజాతులు లాంటి పద్య విశేషాలపై పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ఛందస్సుపై ఉన్న గ్రంథాలు, వివిధ పద్యాల్లోని గురు లఘువుల సంఖ్యలు, యతిస్థానాల సంఖ్య, ప్రసిద్ధ కవుల కావ్యాల్లో ఉన్న విశేషాల గురించి తెలుసుకోవాలి.
 


1. ఇంద్ర, సూర్య, చంద్ర గణాలకు ఏమని పేరు?

1) నిసర్గ గణాలు     2) ఉప గణాలు 

3) త్య్రక్షర గణాలు     4) ద్వ్యక్షర గణాలు 


2.  సంస్కృతంలో గణవ్యవస్థను రూపొందించినవారు?

1) పాణిని     2) వెల్లంకి తాతంభట్టు 

3) మల్లియ రేచన     4) పింగళుడు


3.  మూడు మాత్రల కాలంలో ఉచ్చరించేది?

1) లఘువు     2) గురువు 

3) ప్లుతము     4) హ్రస్వదీర్ఘము 


4.  ఏకాక్షర గణాలు ఎన్ని?

1) 2      2) 4      3) 6      4) 8 


5.  భగణమునకు అధిదేవత ఎవరు?

1) సూర్యుడు     2) చంద్రుడు 

3) సమీరణుడు     4) పావకుడు 


6. అల్లసానిపెద్దన 32 పాదాలతో చెప్పిన పద్యం ఏది?

1) శార్ధూల విక్రీడితము     2) ఉత్పలమాలిక 

3) బృహతి     4) స్రగ్ధర


7.  చంపకమాల ఏ ఛందస్సులో పుట్టింది?

1) ఆకృతి   2) వికృతి   3) ప్రకృతి   4) కృతి 


8. అన్ని రగణాలున్న పద్యం ఏది?

1) తోటకము     2) భుజంగ ప్రయాతము 

3) స్రగ్విణి     4) ద్రుత విలంబితము


9. మూడు యతిస్థానాలున్న పద్యం ఏది?

1) మాలిని     2) స్రగ్ధర 

3) మహాస్రగ్ధర     4) మంగళ మహాశ్రీ 


10. 11వ అక్షరం యతి స్థానంగా ఉన్న పద్యం ఏది?

1) మాలిని     2) తోటకము 

3) మందాక్రాంతము     4) మత్తేభం


11. 5వ గణం యతిస్థానంగా ఉన్న పద్యం?

1) అల్పాక్కర     2) ఉత్సాహం 

3) మంజరీ ద్విపద     4) ఎర్రన మధ్యాక్కర 


12. పద్యపాదంలో 2వ అక్షరానికి ఏమని పేరు?

1) యతి      2) ప్రాస  

3) ప్రాసయతి      4) పంచపాది


13. అప్పకవి యతికి ఎన్ని పర్యాయపదాలు పేర్కొన్నాడు?

1) 3     2) 4      3) 6      4) 9 


14. యతిని ‘మోనై’ అని ఏ భాషలో అంటారు?

1) తెలుగు     2) తమిళం 

3) కన్నడం     4) మలయాళం 


15. 12వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం?

1) తోటకము     2) వసంత తిలకము 

3) భూతిలకము     4) నిర్కుటము


16. సమాన యతిస్థానాలున్న పద్యాలు?

ఎ) కవిరాజ విరాజితము   బి)తరువోజ 

సి) పంచచామరము    డి) సీసము 

1) ఎ, బి   2) సి, డి   3) బి, డి   4) ఎ, డి  


17. ప్రాసయతి వేయదగిన పద్యాల్లో చేరనిది?

1) ఆటవెలది     2) తేటగీతి 

3) మంజరీ ద్విపద     4) ద్విపద 


18. ప్రాస భేదాలను గరిష్ఠంగా పేర్కొన్న లాక్షణికుడు?

1) అనంతామాత్యుడు     2) అప్పకవి 

3) మల్లియ రేచన     4) భీమన


19. 7 సూర్యగణాలు + 1 గురువు - ఇది ఏ పద్యానికి చెందింది?

1) ఉత్సాహము     2) మానిని 

3) మాలిని     4) పంచచామరము 


20. తరళ పద్యానికి యతిస్థానం?

1) 7వ అక్షరం     2) 8వ అక్షరం 

3) 12వ అక్షరం     4) 14వ అక్షరం 


21. మత్తేభం ఏ సమవృత్తం నుంచి ఏర్పడింది?

1) కృతి   2) ప్రకృతి   3) సంకృతి  4) అతికృతి 


22. పంచచామరములోని గణాలు?

1) నజ జయ     2) జర జర జగ 

3) జత జగగ     4) నన మయయ


23. 4 సగణాలున్న పద్యం?

1) నర్కుటము     2) మందాక్రాంతము 

3) తోటకము     4) భూతిలకము


24. ద్విపదకు, మంజరీ ద్విపదకు తేడా?

1) యతి నియమం     2) ప్రాస నియమం 

3) ఛందో నియమం     4) గణ నియమం


25. 26 అక్షరాలకు మించి ఏర్పడే పద్యాలను   ఏమంటారు?

1) ఉత్పలమాలిక     2) అనుష్టుప్‌ 

3) ఉద్ధురమాల     4) గాయత్రి


26. ఛందస్సుకు అధిదేవత ఎవరు?

1) చంద్రుడు     2) సరస్వతి 

3) గాయత్రి     4) పింగళుడు 


27. తెలుగులో మొదటి ఛందోగ్రంథం ఏది?

1) ఆంధ్ర శబ్ద చింతామణి     

2) అప్పకవీయం 

3) కవిసర్ప గారుడము     

4) కవి జనాశ్రయము


28. ఛందోదర్పణమును అనంతమాత్యుడే కాకుండా ఎవరు రాశారు?

1)  ఆడిదం సూరకవి     

2)  వెల్లంకి తాతంభట్టు 

3)  లింగమకుంట తిమ్మకవి     

4)  మల్లియ రేచన


29. ఎర్రన రాశాడని చెప్పే ఛందోగ్రంథం ఏది?

1)  కవి సంశయ విచ్ఛేదము 

2)  కవి చింతామణి 

3)  కవి వాగ్బంధము    

4)  కవిసర్ప గారుడము


30. ఛందః పదకోశమును రచించింది?

1)  కోవెల సంపత్‌ కుమారాచార్య      2)  విన్నకోట పెద్దన  

3)  చేకూరి రామారావు     4)  రావూరి దొరసామిశర్మ 


31. ఛందస్సులో మాత్ర అంటే?

1)  క్షణంలో 1వ వంతు    2)  క్షణంలో 2వ వంతు  

3)  క్షణంలో 4వ వంతు     4)  క్షణంలో 16వ వంతు 


32. అనంతామాత్యుడు పేర్కొన్న చంద్రగణాలు ఎన్ని? 

1) 8     2) 12     3) 14     4) 16 


33. కిందివాటిలో సూర్యగణం? 

1) మ గణం     2) న గణం 

3) త గణం     4) భ గణం 


34. ఎదురు నడిచే గణాల్లో చేరనిది? 

1) య గణం      2) జ గణం  

3) ర గణం      4) వ గణం 


35. ‘కృత్యాదిన స్రగ్ధర పద్యం వాడటం వల్ల నన్నెచోడుడు మరణించాడు’ అని అభిప్రాయపడింది?

1)  అధర్వణుడు     2)  వెల్లంకి తాతంభట్టు 

3)  మల్లియ రేచన     4)  కస్తూరి రంగకవి


36. త్య్రక్షర గణాలు ఎన్ని?

1) 6      2) 8     3) 12      4) 14


37. ర స జ జ భ ర అనే గణాలున్న పద్యం?

1)  లయగ్రాహి     2) ద్రుత విలంబితము 

3) తరువోజ     4) మత్తకోకిల 


38. శార్దూలంలోని మొదటి గురువును రెండు   లఘువులుగా మారిస్తే ఏర్పడే పద్యం?

1) చంపకమాల     2) ఉత్పలమాల 

3) మత్తేభం     4) ఉద్ధురమాల


39. ఏకాక్షర గణం ఉన్న పద్యం ఏది?

1) ఉత్పలమాల     2) చంపకమాల 

3) మత్తేభం     4) శార్దూలం 


40. ఉత్పలమాల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య ఎంత?

1) 32    2) 28      3) 44     4) 40 


41. ‘దినములోన వేయి ద్విపదలు ఇంపొంద వినుత వర్ణనతో విరచించువాడ’ అని చెప్పిన కవి?

1) తాళ్లపాక అన్నమయ్య   

 2) క్షేత్రయ్య 

3) తాళ్లపాక చిన్నన్న 

4) తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు


42. ద్విపదను రెట్టింపు చేస్తే ఏర్పడే పద్యం ఏది?

1) మంజరీ ద్విపద     2) తరువోజ 

3) మధ్యాక్కర     4) మధురాక్కర 


43. ప్రతి ఆశ్వాసం చివర నియతంగా పంచచామరాలను వాడిన కవి? 

1) నన్నయ  2) తిక్కన  3) పెద్దన  4) ధూర్జటి


44. మేఘసందేశంలోని పద్యాలు?

1) మందాక్రాంతము     2) మానిని 

3) ఉత్సాహం     4) శార్దూలం 


45. శార్దూల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య?

1) 32     2) 44     3) 40     4) 56 


46. గురువులకు రెట్టింపు లఘువులున్న పద్యం?

1) ఉత్పలమాల     2) మత్తేభం 

3) మత్తకోకిల     4) చంపకమాల


47. ద్విపదకు ప్రాసనియతం చేసిన కవి?

1) పాల్కురికి సోమన     2) అప్పకవి 

3) చిన్నన్న     4) తాళ్లపాక అన్నమయ్య


48. మయూర కవిని అనుసరిస్తూ స్రగ్ధర పద్యాలను శ్రీనాథుడు ఏ కావ్యంలో రాశాడు?

1) శివరాత్రి మహాత్మ్యం     2) హరవిలాసం 

3) కాశీఖండం     4) భీమఖండం


49. కవిరాజ విరాజితములోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మారిస్తే ఏర్పడే పద్యం?

1) మానిని      2) మాలిని  

3) స్రగ్ధర      4) తోదకము 


50. పద్యంలో 5 పాదాలుంటే దానినేమంటారు?

1) ఉద్ధురమాల     2) విక్రీడితము 

3) పంచపాది     4) ఉత్పలమాలిక


51. మ, స, జ, స త, త గ- అనే గణాల్లోని మొదటి గురువును లఘువుగా మారిస్తే ఏర్పడే గణాలు ఏవి?

1) ర స జ జ భ ర     2) న భ ర స జ జ గ  

3) స భ ర న మ య వ 4) భ ర న భ భ ర వ


52. స్త్రీలు వడ్లు దంచేచోట పాడే తరువోజ ఛందస్సును రెండు భాగాలుగా చేసిన కవి

1) గౌరన       2) విన్నకోటపెద్దన 

3) అప్పకవి     4) పాల్కురికి సోమనాథుడు 


53. కిందివాటిలో ఎక్కువ గురువులున్న పద్యం ఏది?

1) ఉత్పలమాల     2) చంపకమాల 

3) శార్దూలం     4) మత్తేభం


54.  జగణ బాహుళ్యం ఉన్న ఉపజాతి పద్యం ఏది?

1) ఆటవెలది   2) తేటగీతి   3) సీసం   4) కందం


55. ఎక్కడా వెనువెంట గురువులు రాని పద్యాలు?

ఎ) ఉత్పలమాల     బి) చంపకమాల 

సి) శార్దూలం     డి) మత్తేభం

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) ఎ, డి


56. ప్రాసభేదాలను గరిష్ఠంగా పేర్కొన్న లాక్షణికుడు? 

1) అధర్వణుడు     2) అప్పకవి  

3) కస్తూరి రంగకవి     4) మల్లియ రేచన


57. ‘ప్రయోగశరణం వ్యాకరణం - ప్రయోగ మూలం వ్యాకరణం’ అనే వాక్యాలున్న ఛందోగ్రంథం?

1) కవి జనాశ్రయం      2) ఛందోదర్పణం 

3) ఆనందరంగారాట్ఛందం 4) అప్పకవీయం


58. 26వ ఛందంలో పుట్టే మొత్తం సమవృత్తాల సంఖ్య ఎంత?

1) 23, 41, 16, 726     2) 13, 42, 17, 726  

3) 12, 24, 71, 627     4) 31, 42, 17, 726


59. సలలమునకు గురు లఘువుల క్రమం?

1)  IIIII   2) UUUUU  3) IIIUU  4) IIUII 


60. నగణము నకు అధిదేవత ఎవరు?

1) ఆకాశం     2) దేవగణం 

3) సమీరణుడు     4) పావకుడు


సమాధానాలు


1-2; 2-4; 3-3; 4-1; 5-2; 6-2; 7-4; 8-3; 9-1; 10-3; 11-2; 12-2; 13-4; 14-2; 15-3; 16-3; 17-4; 18-2; 19-1; 20-3; 21-1; 22-2; 23-3; 24-2; 25-3; 26-3; 27-4; 28-2; 29-4; 30-1; 31-3; 32-3; 33-2; 34-3; 35-1; 36-2; 37-4; 38-3; 39-4; 40-1; 41-3; 42-2; 43-4; 44-1; 45-2; 46-4; 47-1; 48-3; 49-1; 50-3; 51-3; 52-4; 53-3; 54-1; 55-1; 56-2; 57-4; 58-2; 59-4; 60-2. 
 

Posted Date : 22-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు