• facebook
  • whatsapp
  • telegram

వివిధ జీవుల్లో శ్వాసక్రియ

ఆ సజీవుల్లో శ్వాసక్రియ లేదు!



సృష్టిలోని అన్ని జీవుల్లో, జీవకణాల్లో జరిగే ప్రధాన జీవక్రియ శ్వాసక్రియ. జీవకణంలోని మైటోకాండ్రియాలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో శక్తి విడుదలై ఇతర జీవక్రియలకు సాయపడుతుంది. వాయు సహిత, వాయు రహితంగా సాగే శ్వాసక్రియ విధానం, వివిధ జీవుల్లోని శ్వాస అవయవాలు, శ్వాసతో శరీరానికి ఆక్సిజన్‌ అందే తీరుపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మానవ శ్వాసక్రియ సంపూర్ణ చిత్రం, అందులోని ముఖ్య భాగాలు, వివిధ సందర్భాల్లో ఉచ్ఛ్వాస, నిశ్వాసాల తీరు, ఊపిరితిత్తుల నిర్మాణం, సామర్థ్యం, దానిపై ప్రభావం చూపే అంశాలు, శ్వాస సంబంధిత వ్యాధుల గురించి కనీస పరిజ్ఞానం పెంచుకోవాలి. 


1. రెస్పిరేషన్‌ అనే పదం ‘రెస్పిరే’ నుంచి వచ్చింది. అయితే ఈ ‘రెస్పిరే’ అనేది ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) లాటిన్‌    2) జర్మన్‌  3) గ్రీకు 4) ఆంగ్లం


2. పీల్చడంగా భావిస్తున్న ‘శ్వాసక్రియ’కు ఆ పేరును ఏ శతాబ్దంలో సూచించారు?

1) 12వ  2) 13వ     3) 14వ    4) 15వ 


3. ‘ప్రయోగాలు - పరిశీలనలు’ గ్రంథకర్త?

1) ప్రిస్ట్లే        2) లేవోయిజర్‌ 

3) రాబిన్‌సన్‌     4) జాన్‌ డాపర్‌


4. ‘శ్వాసక్రియ ఒక దహనక్రియ, ఉష్ణం వెలువడే ప్రక్రియ’ అని తెలిపింది?

1) ప్రిస్ట్లే      2) లేవోయిజర్‌ 

3) రాబిన్‌సన్‌     4) జాన్‌ డాపర్‌


5. ‘బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బూడిద బరువు బొగ్గు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది’. అని పేర్కొన్నదెవరు?

1) ప్రిస్ట్లే         2) లేవోయిజర్‌         

3) జాన్‌ డాపర్‌     4) వాన్‌ హెల్మాంట్‌


6. టాడ్‌పోల్‌ డింభకం శ్వాస అవయవం?

1) మొప్పలు         2) ఊపిరితిత్తులు             3) చర్మం              4) ఆస్యకుహరం


7.  విడిచే గాలి(నిశ్వాసం)లో స్థిరమైన వాయువు ఎంత పరిమాణంలో ఉంటుంది?

1) 1/4వ వంతు           2) 1/3వ వంతు                 3) 2/6వ వంతు           4) 1/6వ వంతు


8. కిందివాటిలో ఏ వాయువు పీల్చినప్పుడు, విడిచినప్పుడు స్థిరంగా ఉంటుంది?

1) ఆక్సిజన్‌         2) నైట్రోజన్‌ 

3) కార్బన్‌ డై ఆక్సైడ్‌      4) సల్ఫర్‌


9. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) సముద్ర మట్టం వద్ద O2 (ఆక్సిజన్‌), Hbతో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. 

2) CO2(కార్బన్‌డై ఆక్సైడ్‌) సాధారణంగా బైకార్బొనేట్‌లను రవాణా చేస్తుంది.

3) హిమోగ్లోబిన్‌ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది.

4) వాయు ప్రసారమార్గం ప్రారంభ ప్రదేశం నాసికా రంధ్రాలు.


10. వాయుగోణుల్లోని ఆక్సిజన్‌ ఏ విధానం ద్వారా రక్తంలోకి వ్యాప్తి చెందుతుంది?

1) విసరణ          2) ద్రవాభిసరణ                 3) ద్రవోద్గమం        4) 1, 2


11. జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి-

1) ఆక్సిజన్‌         2) కార్బన్‌ డై ఆక్సైడ్‌           3) నీరు           4) 1, 3


12. బొద్దింకలో 10 జతల శ్వాస రంధ్రాల్లో 3 జతలు క్రియాత్మక శ్వాసరంధ్రాలుండే విధానాన్ని ఏమంటారు?

1) పాలీ న్యూస్టిక్‌         2) హోలో న్యూస్టిక్‌            3) మోనో న్యూస్టిక్‌       4) 1, 3


13. ఇంటిమా, టినీడియాలు లేని వాయునాళికల్లోని  ప్రొటీన్‌?

1) ట్రాకియాబ్లాస్ట్‌            2) ఎపిథిలియం             3) ట్రేకిన్‌               4) 1, 3


14. సజీవులైనప్పటికీ శ్వాసక్రియ జరపలేని జీవులు?

1) బ్యాక్టీరియా             2) వైరస్‌         

3) శిలీంధ్రాలు           4) 1, 2


15. మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది?

1) మజ్జాముఖం        2) ద్వారగోర్ధం       

3) అనుమస్తిష్కం       4) 1, 2


16. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) మానవుడిలో శ్వాసక్రియ ఒక అసంకల్పిత చర్య.

2) పురుషుల్లో శ్వాసక్రియకు విభాజక పటలం సహాయపడుతుంది

3) ఆమ్లజని సహిత వాయువు ఊపిరితిత్తుల్ని చేరడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు.

4). మానవుడు తీసుకునే ఆక్సిజన్‌లో 40% మెదడు వినియోగించుకుంటుంది.


17. 2013, జూన్‌ 1న ధూమపాన నిషేధం అమలు చేసిన దేశం?

1) ఇండియా             2) రష్యా          

3) జపాన్‌               4) అమెరికా 


18. ఊపిరితిత్తుల క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం?

1) వాయుగోణులు         2) శ్వాసనాళికలు           3) రక్తకేశ నాళికలు        4) 1, 2


19. కిందివాటిలో అసత్య వాక్యం గుర్తించండి.

1) ఊపిరితిత్తుల అధ్యయనం - పల్మునాలజీ

2) కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది

3) కుడి ఊపిరితిత్తిలో 2 లంబికలు ఉంటాయి

4) పెద్దవారిలో ఊపిరితిత్తులు బూడిద వర్ణంలో ఉంటాయి


20. ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం?

1) చర్మం 2) ప్లాస్మాత్వచం 3) ట్రాకియా 4) మొప్పలు 


21. కప్పలో శ్వాసక్రియ జరిగే అవయవం?

1) ఊపిరితిత్తులు     2) చర్మం 

3) ఆస్యకుహరం     4) పైవన్నీ


22. పుస్తకాకార ఊపిరితిత్తులున్న జీవి-

1) తేలు   2) నత్త   3) సాలీడు   4) 1, 3


23. కణ శ్వాసక్రియను జరిపే కణాంగం-

1) మైటోకాండ్రియా         2) లైసోజోమ్‌లు 

3) కేంద్రకం         4) రిక్తిక


24. ముక్కు అధ్యయన శాస్త్రం?

1) లారింగాలజీ         2) గెస్టటాలజీ 

3) రైనాలజీ         4) కాలాలజీ


25. మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం (లీటర్లలో)?

1) 1.2 లీ.         2) 5.8 లీ.    

3) 3.4 లీ.        4) 2.6 లీ.


26. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు

2) శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం - రెస్పిరో మీటర్‌

3) ఒక జీవి రక్తప్రసరణ, ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియను ప్రభావితం చేయవు

4) O2 సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు.


27. వాయు శ్వాసక్రియలో ఉండి, అవాయు శ్వాసక్రియలో లేని దశలు..

1) లింకు చర్య    2) గ్లైకాలసిస్‌     

3) 1, 2        4) పైరూవిక్‌ ఆమ్లం చర్య


28. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ATP ల సంఖ్య...

1) 36    2) 4    3) 38      4) 2


29. గ్లైకాలసిస్‌ ఎక్కడ జరుగుతుంది? 

1) మైటోకాండ్రియా      2) క్రిస్టే 

3) కణద్రవ్యం      4) లైసోజోమ్స్‌


30. చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం?

1) నోరు         2) జలశ్వాస పటలికలు 

3) చర్మం     4) పొలుసులు


31. బ్రీత్‌ అనలైజర్‌లో ఉపయోగించే రసాయనం?

1) పొటాషియం పర్మాంగనేట్‌ 2) ద్రవరూప బ్రోమిన్‌ 

3) మెర్క్యూరిక్‌ ఆక్సైడ్‌     4) ఫినైల్‌ ఎలినిన్‌


32. హైపాప్నియా అంటే...

1) వేగంగా శ్వాసించడం   2) నెమ్మదిగా శ్వాసించడం 

3) కొన్ని సందర్భాల్లో శ్వాస ఆగిపోవడం    4) 1, 2


33. కిణ్వనంలో ఏర్పడే ‘జైమేజ్‌’ అనే ఎంజైమ్‌ను ఎవరు కనుక్కున్నారు?

1) బుక్నర్‌     2) విలియం మెక్‌నాలి 

3) లోప్‌మాన్‌     4) ప్లెస్కీ


34. ATP ని ఎవరు కనుక్కున్నారు? 

1) సుబ్బారావు 2) లోహ్‌మన్‌ 3) ప్లెస్కీ 4) పైవారంతా


35. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి-

1) బొద్దింక 2) తేలు 3) రాచ పీత 4) రొయ్యలు


36. శరీర ధర్మశాస్త్రాన్ని రచించింది?

1) లేవోయిజర్‌ 2) జాన్‌ డాపర్‌ 3) రియోక్‌ 4) ప్ర‌స్ట్లే


37. ఊపిరితిత్తుల్లోని వాయుగోణులను విడదీసి పరిస్తే ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి?

1) 160 చ.మీ.         2) 160 చ.సెం.మీ. 

3) 160 చ.అడుగులు     4) 160 చ.కి.మీ.


38. మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకుని బయటకు వదులుతాం?

1) 1200 ఎం.ఎల్‌.         2) 5800 ఎం.ఎల్‌. 

3) 500 ఎం.ఎల్‌.         4) 1600 ఎం.ఎల్‌.


39. శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్‌ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం?

1) పైరూవేట్‌ 2) లాక్టిక్‌ ఆమ్లం 3) ఇథనాల్‌ 4) 2, 3


40. ATP లో నిల్వ ఉండే శక్తి (కిలో కేలరీల్లో)?

1) 7200      2) 4500   3) 7.2    4) 4500 


41. సముద్ర దోసకాయల శ్వాసాంగాలు-

1) శ్వాసవృక్షాలు 2) చర్మం 3) మొప్పలు 4) టినీడియం


42. నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం-

1) శబ్దిని 2) స్టైరిస్‌ 3) వాయునాళం 4) స్వరపేటిక


43. ఊపిరితిత్తులను ఆవరించి ఉండే త్వచాల సంఖ్య-

1) 3     2) 1        3) 2       4) 4


44. వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి-

1) గ్రసని      2) వాయునాళం 

3) శ్వాసనాళం     4) స్వరపేటిక


45. థైరాయిడ్‌ మృదులాస్థిలో ఉబ్బి ఉన్న మధ్య భాగం?

1) ఎరిటినాయిడ్‌         2) హమాయిడ్‌ 

3) ఆడమ్స్‌ ఆపిల్‌         4) టినీడియా


46. శ్వాసక్రియలో ఏ ప్రక్రియలో శబ్దాలు విడుదల అవుతాయి?

1) ఉచ్ఛ్వాస     2) నిశ్వాస   3) ఉదరవితాన సంకోచం, వ్యాకోచం     4) 1, 2


47. వ్యాయామం చేసేవారిలో శ్వాసక్రియ రేటు నిమిషానికి...

1) 12 సార్లు 2) 18 సార్లు 3) 25 సార్లు 4) 32 సార్లు


48. ఆపిల్‌ కోసినప్పుడు రంగు మారడానికి కారణం..

1) పాలిఫినాల్‌     2) ఫినైల్‌ 

3) ఆగ్జాలిక్‌ ఆమం     4) పాలిక్‌ ఆమ్లం


49. వాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి (కిలో కేలరీల్లో)?

 1) 56     2) 7200     3) 686     4) 1, 3


50. కిణ్వనం, అవాయు శ్వాసక్రియ ఉత్పన్నం కానిది?

1) ఆల్కహాల్‌ 2) మీథేన్‌ 3) CO2 4) O2


51. శ్వాస సంబంధిత వ్యాధి కానిది...

1) డిఫ్తీరియా 2) టిటానస్‌ 3) పెర్టూసిస్‌ 4) SARS


52. ఉరివేసుకున్న వారిలో ఏ ఎముక నశించిపోవడం వల్ల శ్వాసక్రియ జరగక చనిపోతారు?

1) ఎరోటినాయిడ్‌      2) హామాయిడ్‌ 

3) థైరాయిడ్‌            4) రిమాగ్లాటిడిస్‌


సమాధానాలు


1-1; 2-3; 3-1; 4-3; 5-4; 6-1; 7-4; 8-2; 9-3; 10-1;11-4; 12-1; 13-3; 14-2; 15-1; 16-4; 17-2; 18-1; 19-3; 20-2; 21-4; 22-4; 23-1; 24-3; 25-2; 26-3; 27-1; 28-2; 29-3; 30-2; 31-1; 32-2; 33-1; 34-4; 35-1; 36-2; 37-1; 38-3; 39-1; 40-3; 41-1; 42-4; 43-2; 44-1; 45-3; 46-2; 47-3; 48-1; 49-3; 50-4; 51-2; 52-2.


రచయిత: వట్టి గౌనళ్ల పద్మనాభం 
 

Posted Date : 09-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌