• facebook
  • whatsapp
  • telegram

అత్యుత్తమ ఇంద్రియ జ్ఞానం స్పర్శ!

జ్ఞానేంద్రియాలు

బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి పరిసరాల జ్ఞానాన్ని మనిషి మెదడుకు జ్ఞానేంద్రియాలు చేరవేస్తాయి. అవే కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. వీటి ద్వారానే చూపు, శబ్దం, వాసన, రుచి, స్పర్శ లాంటివి తెలుస్తుంటాయి. వాటన్నింటినీ మెదడు పూర్తిస్థాయిలో నియంత్రిస్తూ ఉంటుంది.  శరీరంలోని అతిముఖ్యమైన ఈ అవయవాల పనితీరు, ప్రాముఖ్యత, అమరిక గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్కో ఇంద్రియంలోని భాగాలు, లక్షణాలు, వాటికి వచ్చే వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవాలి. 

1.    క్రీ.పూ. 2300లో ప్లేటో, అరిస్టాటిల్‌ ప్రకారం ఇంద్రియ జ్ఞానాలు ఎన్ని?

1) 5      2) 3      3) 1     4) 2


2.     ‘జ్ఞానేంద్రియాల పితామహుడు’ అని ఎవరిని పిలుస్తారు?

1) ప్లేటో       2) జోహాన్స్‌ కెప్లర్‌  

3) ఆల్బర్టస్‌ మాగ్నస్‌       4) అరిస్టాటిల్‌


3.     జ్ఞానేంద్రియాల్లో కన్ను పాత్రను వివరించిన వ్యక్తి?

1) ప్లేటో       2) జోహాన్స్‌ కెప్లర్‌   

3) ఆల్బర్టస్‌ మాగ్నస్‌       4) అరిస్టాటిల్‌


4.     కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) మనకు జ్ఞానేంద్రియాలు 5 కాబట్టి ఇంద్రియ జ్ఞానాలు కూడా 5.

బి) మనకు జ్ఞానేంద్రియాలు 5 కానీ ఇంద్రియ జ్ఞానాలు అనేకం.

సి) పీడనం, స్పర్శ, వేడిమి, చల్లదనం, కంపనాలు, తరచుదనం అనే ఇంద్రియ జ్ఞానాలు అనేకం ఉన్నప్పటికీ వీటిని స్పర్శ జ్ఞానం కిందికి తీసుకుంటారు.

డి) జ్ఞానేంద్రియం కన్ను పాత్రను వివరించింది - జోహాన్స్‌ కెప్లర్‌

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి       

3) ఎ, బి, డి        4) ఎ, సి, డి


5.     కిందివాటిని వరుసలో అమర్చండి.

ఎ) ప్రేరణ       బి) ప్రతిస్పందన   

సి) మెదడు       డి) వెన్నుపాము

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, డి, సి   

3) ఎ, సి, డి, బి       4) డి, ఎ, బి, సి


6.     ‘అధిక స్థాయిలో ఉండే ప్రేరణ, అల్పస్థాయిలో ఉండే ప్రేరణను కప్పేస్తుంది’ అనే వాక్యానికి సరైన ఉదాహరణ..

1) తినగ తినగ వేము తియ్యనుండు

2) గంగిగోవు పాలు గరిటెడైనా చాలు

3) పుత్రోత్సాహంబు తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే

4) ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు


7.     కన్నులో ఎంత శాతం మనకు బయటకు కనిపించదు?


8.     కిందివాటిలో ఏ పొర ఉబ్బడం వల్లన శుక్ల పటలాన్ని ఏర్పరుస్తుంది? 

1) ధృడస్తరం      2) రక్తపటలం   

3) నేత్రపటలం       4) కనుపాప


9.     కిందివాటిలో నలుపు రంగులో ఉండే పొర?

1) దృఢస్తరం       2) నేత్రపటలం   

3) రక్తపటలం       4) కనుపాప


10. కిందివాటిలో రక్తపటలం దేనిని ఆవరించదు?

1) తారక       2) కనుపాప   

3) నేత్రోదయ కక్ష       4) 1, 2


11. స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను తెలిపిన వ్యక్తి?

1) కెప్లర్‌       2) అరిస్టాటిల్‌   

3) మాగ్నస్‌       4) ప్లేటో


12. కిందివాటిలో ఏ భాగం జెల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటుంది?

1) కాచావత్‌ కక్ష      2) నేత్రోదయ కక్ష   

3) నేత్ర పటలం       4) 1, 2


13. నేత్రపటలంలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?

1) దండాలు       2) శంకువులు   

3) అంధ చుక్క       4) 1, 2


14. దండాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడే వర్ణకం?

1) ఐడాప్సిన్‌       2) రెటీనా   

3) రొడాప్సిన్‌       4) అంధ చుక్క


15. రొడాప్సిన్, ఐడాప్సిన్‌ లాంటి కంటి చూపునకు అవసరమైన వర్ణాల ఉత్పత్తికి సహాయపడే విటమిన్‌?

1) A 2) B 3) C 4) D


16. కంటి అధ్యయనాన్ని ఏమంటారు?

1) లారింగాలజీ       2) ఓటాలజీ   

3) రినాలజీ       4) ఆప్తమాలజీ


17. కిందివాటిలో కంటి వ్యాధులు కానివి? 

1) మయోపియా       2) మేక్యులా   

3) హైపర్‌ మెట్రోపియా     4) గ్లూకోమా


18. కింది ఏ దేశ ప్రాచీన వైద్య రాతపూర్వక నిదర్శనాల్లో జ్ఞానేంద్రియాల గురించి ప్రస్తావించారు?

1) భారత్‌  2) చైనా  3) అమెరికా  4) 1, 2


19. కిందివాటిలో ఏ భాగం వెలుపలి చెవి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది?

1) కర్ణభేరి       2) శ్రవణ కుహరం   

3) పిన్నా       4) ఆడిటరీ మీటర్‌


20. కిందివాటిని వరుసలో అమర్చండి.

ఎ) కూటకం       బి) దాగలి   

సి) కర్ణాంతరాస్థి       డి) అంకవన్నె

1) ఎ, బి, సి, డి       2) ఎ, డి, బి, సి   

3) బి, సి, ఎ, డి       4) ఎ, బి, డి, సి


21. కిందివాటిలో సుత్తి ఆకారంలో ఉండే చెవి భాగం?

1) కూటకం       2) దాగలి   

3) కర్ణాంతరాస్థి       4) వర్తులాకార కిటికీ


22. పేటిక ముందు భాగాన్ని ఏమంటారు?

1) యుట్రిక్యులస్‌       2) సెక్యులస్‌   

3) అంతరలసిక       4) కర్ణావర్తం


23. యూట్రిక్యులస్‌ అనేది దేనికి వెనుక భాగంలో ఉంటుంది?

1) పేటిక 2) కూటకం  3) దాగలి  4) కర్ణావర్తం


24. కిందివాటిలో శరీర సమతాస్థితిని కాపాడేది?

1) పేటిక       2) యూట్రిక్యులస్‌   

3) అర్ధవర్తుల కుల్యలు       4) 1, 3


25. కిందివాటిలో పరలసికా ద్రవంతో నిండి ఉండే భాగం?

1) స్కాలావెస్టిబ్యులై       2) స్కాలాటింపాని  

3) స్కాలామీడియం       4) 1, 2


26. చెవి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు?

1) ఓటాలజీ       2) లారింగాలజీ   

3) రైనాలజీ       4) కాలాలజీ


27. చెవిలోని ఎముకల సంఖ్య?

1) 3      2) 6      3) 9      4) 12


28. నాలుకపై ఉండే రుచి మొగ్గలు రుచిని గ్రహించడాన్ని ఏమంటారు?

1) గట్టేషన్‌          2) ఎరీయోషన్‌   

3) గస్టేషన్‌       4) జర్మెషన్‌


29. కిందివాటిలో రుచి కానిది?

1) పులుపు   2) చేదు   3) తీపి   4) కారం


30. సముద్ర మాంసం ఒక రకమైన వాసనతో ఉంటుంది. దాన్ని ఏమంటారు?

1) ఉమామి       2) హచింగ్‌   

3) మెటాలిక్‌ టేస్ట్‌       4) 1, 2


31. ఉమామి, మోనోసోడియం గ్లూటాయేట్‌లను కలిపి ఏమంటారు?    

1) MSG   2) హచింగ్‌  3) మెటాలిక్‌  4) 1, 2


32. నాలుక వెనుక వైపున ఉండి, చేదును గ్రహించే రుచి మొగ్గలను ఏమంటారు?

1) ఫంగిఫార్మ్‌ పాపిల్లే      2) ఫోలియేట్‌ పాపిల్లే  

3) సర్కంవల్లేట్‌ పాపిల్లే  4) 1, 2


33. నాలుక పార్శ్వ భాగంలో ఉండే రుచి మొగ్గలు-

1) పులుపు   2) తీపి   3) చేదు   4) కారం


34. కిందివాటిలో ఉత్తమమైన జ్ఞానం-

1) వినికిడి   2) దృష్టి   3) స్పర్శ   4) 1, 3


35. మానవుడి శరీరంలో అతి పెద్ద అవయవం ఏది?

1) కాలేయం       2) చర్మం       

3) క్లోమం        4) గ్లూటా మాక్సిమస్‌


36. కిందివాటిలో నిర్జీవ కణాలను కలిగి ఉండే పొర?

1) కార్నియం       2) గ్రాన్యులార్‌   

3) మాల్విజియన్‌       4) బహిశ్చర్మం


37. యుక్తవయసులోని ఒక వ్యక్తి శరీరాన్ని కప్పి ఉండే ఉపరితల వైశాల్యం ఎంత?


38. ఒక వ్యక్తి చర్మం రంగును ఏది నిర్ణయిస్తుంది?

1) ఆల్బుమిన్‌       2) గ్లోబ్యులిన్‌   

3) మెలనిన్‌       4) పెసినియన్‌


39. కిందివాటిలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి?

1) పెసినియన్‌       2) నాసిప్టారులు   

3) టాక్టిల్‌       4) 1, 2


40. కిందివాటిలో మెలనిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధి?

1) కుష్ఠు   2) పొంగు   3) పెల్లగ్రా  4) బొల్లి


41. ఇచ్చినవాటిలో బ్యాక్టీరియా వ్యాధి?

1) కుష్ఠు  2) పొంగు  3) ఆటలమ్మ  4) తామర


42. నాలుక విధి ఏమిటి?

1) నమలడంలో సహాయపడటం  2) మాట్లాడటంలో సహాయపడటం

3) రుచిని గ్రహించడం          4) పైవన్నీ 


43. చర్మం అధ్యయనాన్ని ఏమంటారు?

1) ఆప్తమాలజీ       2) డెర్మటాలజీ   

3) లారింగాలజీ       4) ఓటాలజీ


44. కంటికి, టీవీకి మధ్య ఉండాల్సిన కనీస దూరం? 

1) 30  సెం.మీ.     2) 2.5 సెం.మీ.   

3) 2.5  కి.మీ.       4) 2.5  మీ.


45. కనుగుడ్డును కదిలించడానికి అవసరమయ్యే కండరాలు ఎన్ని?

1) 3      2) 6      3) 9     4) 12


46. కిందివాటిలో ముక్కు అధ్యయనం?

1) రైనాలజీ     2) ఆప్తమాలజీ   

3) ఓటాలజీ       4) లారింగాలజీ


47. ఒక వ్యక్తి దూరంగా ఉండే వస్తువులను చూడలేకపోవడాన్ని ఏమంటారు? 

1) దీర్ఘదృష్టి       2) మయోపియా   

3) హ్రస్వదృష్టి       4) 2, 3


48. జిహ్వగ్రాహకాలు, చర్మంపై ఉండే జీవులు?

1) ఉభయచరాలు       2) చేపలు   

3) పక్షులు       4) తిమింగలం


49. పెద్ద పెద్ద శబ్దాలు నేరుగా కపాలంలోని ఎముకల ద్వారా లోపలికి వెళ్లడాన్ని ఏమంటారు?

1) ట్రాన్స్‌మీటస్‌       2) కండెక్షన్‌   

3) బోని కండెక్షన్‌       4) 1, 3


50. మానవ శరీరంలో స్వేదగ్రంథులు లేని/ అతి తక్కువగా ఉండే ప్రాంతం?

1) అర చేతులు       2) పెదవులు   

3) అరికాళ్లు       4) ముఖం


51. కన్నీళ్లు రుచికి ఉప్పగా ఉండటానికి కారణం? 

1) NaCl 2) H2O2 3) H2O 4) Na


52. ఘ్రాణశక్తి అధికంగా ఉండే పక్షి?

1) ఆల్‌బట్రోత్‌  2) స్విఫ్ట్‌  3) గాడ్విచ్‌  4) కివి


53. చనిపోయిన వ్యక్తి కళ్ల (కార్నియా)ను ఎన్ని గంటల్లో దానం చేయొచ్చు?

1) 6       2) 9      

3) 4      4) 12 


54. కిందివాటిలో కార్నియాకు సంబంధించిన వ్యాధి..

1) కంజెక్టివైటీస్‌       2) అస్టిగ్మాటిజం   

3) ట్రకోమా (ట్రైకోమా)      4) దీర్ఘదృష్టి


సమాధానాలు


1-1; 2-3; 3-2; 4-4; 5-3; 6-1; 7-3; 8-1; 9-3; 10-1; 11-3; 12-1; 13-1; 14-3; 15-1; 16-4; 17-2; 18-4; 19-1; 20-1; 21-1; 22-2; 23-1; 24-4; 25-4; 26-1; 27-2; 28-3; 29-4; 30-1; 31-2; 32-3; 33-1; 34-3; 35-2; 36-1; 37-2; 38-3;  54-3; 39-1; 40-4; 41-1; 42-4; 43-2; 44-4; 45-2; 46-1; 47-4; 48-2; 49-3; 50-2; 51-1; 52-4; 53-1; 54-3.


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 
 

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌