• facebook
  • whatsapp
  • telegram

పాఠ్య పుస్తకాలు

పిల్లల్లో జ్ఞాన నిర్మాణానికి మార్గాలు!

పిల్లల్లో అక్షరాస్యత, సమాచార నైపుణ్యాలను పెంచడానికి ప్రధాన ఆధారాలు పాఠ్యపుస్తకాలు. భాషను నేర్చుకోవడానికి, బోధించడానికీ అవసరమైన అద్భుత వనరులు. జ్ఞాన నిర్మాణమే వాటి పరమోద్దేశం. అవి వ్యాకరణ నియమాలు, పదజాలాలను నిర్మాణాత్మకంగా అభ్యసించడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో భాషతోపాటు సాంస్కృతిక అవగాహనను, విమర్శనాత్మక ఆలోచనాశక్తిని పెంపొందిస్తాయి. రాత పూర్వకంగా, మౌఖికంగా సమర్థ వ్యక్తీకరణకు పునాదులను నిర్మిస్తాయి. ఆధునిక ప్రపంచంలోని సంక్లిష్టతలను, విశ్వాసాలను అర్థం చేసుకుని స్పష్టతతో జీవించడానికి సాయపడతాయి. అందుకే కాబోయే ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల ప్రాధాన్యాన్ని, రకాలను, లక్షణాలను తెలుసుకోవాలి. వాటి రూపకల్పనపై సూచనలు, సలహాలు అందించిన పలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. 

* వైఖరి, వినియోగం, సృజనాత్మకత లాంటి విషయాలు పెంపొందించడం ప్రాతిపదికగా పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి ప్రతిపాదనలు చేసింది: ఆర్టీఈ - 2009.

*  జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ‘భారం లేని విద్య’ ఆధారంగా రూపొందించారు.

*  విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ - 2009)ను భార రహిత అభ్యసనం, జాతీయవిద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రూపొందించారు.

*  జాతీయ ఉపాధ్యాయ మండలి.. ‘ఉపాధ్యాయ విద్య - జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010’ ని  రూపొందించింది.

*  201,0 ఏప్రిల్1 నుంచి విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ - 2009) అమల్లోకి వచ్చింది.  

*  రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం (ఎస్సీఎఫ్- 2011) ను రూపొందించడానికి 18 ఆధార పత్రాలను తయారు చేసింది.

*  ఎన్సీఎఫ్- 2005, ఆర్టీఈ - 2009ల ఆధారంగా భాషా ఆధార పత్రాన్ని రూపొందించారు.

*  విద్యాహక్కు చట్టం 5వ అధ్యాయంలో పాఠ్య పుస్తకాల ప్రస్తావన ఉంది.

*  ‘పిల్లల జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండాలి’ అని పేర్కొంది - ఎన్సీఎఫ్

*  భాషా పాఠ్యపుస్తకాల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను సూచించింది.. ఎన్సీఎఫ్- 2005, ఆర్టీఈ - 2009, ఏపీఎస్సీఎఫ్- 2011.

*  ‘భాషను నేర్చుకోవడానికి, దాన్ని బోధించడానికి ఉపయోగపడే ఒక వనరే పాఠ్యపుస్తకం’ - గ్రేవ్స్2000

*  జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆ ఆవాస్, ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలు  (ఎస్సీఈఆర్ట్) పాఠ్య పుస్తకాల తయారీని చేపడతాయి. 

*  బట్టీ విధానాలకు స్వస్తి పలికి, తాత్విక దృక్పథాల ఆధారంగా నూతన పాఠ్య పుస్తకాలు రూపొందించాలి అని ఎన్సీఎఫ్చెబుతుంది.

*  పాఠ్య పుస్తకానికే పరిమితం కాకుండా పిల్లల స్థాయికి తగిన ఇతర పుస్తకాలను కూడా చదవాలని, నిత్య జీవితంలో అన్వయించుకోవాలని పాఠ్య పుస్తకాల తాత్విక దృక్పథాలను తెలియజేసింది.. ఎన్సీఎఫ్- 2005.

*  పాఠ్య పుస్తకాలు రాజ్యాంగ విలువలను కాపాడటంతోపాటు పిల్లల సర్వోతో ముఖాభివృద్ధికి తోడ్పడాలని సూచించింది.. ఆర్టీఈ - 2009.

వాచకాలు 2 రకాలు

1) భాషా వాచకాలు  

2)  భాషేతర వాచకాలు

*  భాషా వాచకాల్లో భాషకు, దాని నైపుణ్యాలకు ప్రాధాన్యం ఎక్కువ.

*  భాషేతర వాచకాల్లో విషయానికి ప్రాధాన్యం ఎక్కువ.

*  భాషేతర వాచకాల కంటే భాషా వాచకాల్లోని ప్రత్యేకత ఏమిటంటే వాటిలో శాస్త్ర విషయాలుండటమే.

భాషా వాచకాలు 

1) ప్రథమ భాషా వాచకాలు 

2) ద్వితీయ భాషా వాచకాలు 

3) ఉపవాచకాలు

ప్రథమ భాషా వాచకాలు

*  ప్రధాన భాషా వనరు - పాఠ్యపుస్తక

*  భాషా నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, క్షుణ్నపఠనం, మానసిక శక్తులను వెలికి తీయడానికి ఉపకరించేవి- భాషా వాచకాలు

వాచక లక్షణాలు

బాహ్య లక్షణాలు 

1. ముఖచిత్రం

2. మన్నికగల అట్ట

3. ముద్రణ    

4. కాగితం

5. పరిమాణం

6. ధర

అంతర లక్షణాలు

భాషా లక్షణాలు..

1. ముందు మాట

2. పాఠాల పూర్వరంగం

3. వ్యావహారిక గ్రాంథిక భాష

4. శైలి వైవిధ్యం

5. వివిధ ప్రక్రియలు

6. నూతన పదాల పట్టికలు    

7. అధ్యయన వేదికలు

8. విరామ చిహ్నాలు

9. పేరాలు

10. సంధి రూపాలు

విషయ లక్షణాలు 

ప్రాథమిక దశ - విషయం, రసాలు

మాధ్యమిక దశ - విషయం, రసాలు

ఉన్నత దశ - విషయం, రసాలు

ముందు మాట:

*  ప్రణాళిక, బోధనా పద్ధతులను గురించి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చే విభాగం - ముందు మాట.

*  పాఠ్య పుస్తకం తాత్వికతను తెలిపేలా ముందు మాట ఉండాలి.

పాఠాల పూర్వ రంగం:

*   పాఠాల ప్రారంభంలో పాఠాలు రాసిన కవులు, రచయితల వివరాలు, పాఠాల సందర్భం ఉండే విభాగం - పాఠాల పూర్వరంగం.

భాష:

*  ప్రాథమిక దశలోని పాఠాల్లో ఉండాల్సిన భాష - సరళ వ్యావహారిక భాష.

*  బాల గేయాలు, చిన్న చిన్న నీతి పద్యాల్లో ఉండాల్సిన భాష - సరళ గ్రాంథిక భాష.

*  వ్యావహారిక గద్యాలతోపాటు, స్థాయికి తగిన గ్రాంథిక పాఠాలు ఉండాల్సిన దశ - మాధ్యమిక దశ.

*  వ్యావహారిక భాషలో సగం, గ్రాంథిక భాషలో సగం పాఠాలు ఉండాల్సిన దశ - ఉన్నత దశ.  

సంధి రూపాలు:

*  ప్రాథమిక దశలోని వాచకాల్లో, పద స్వరూపం బాగా తెలియడానికి వీలుగా పాటించాల్సినవి - విసంధి రూపాలు

*   6వ తరగతి నుంచి సంధి పాటించవచ్చు.


శైలి - రచయితలు 

*  ప్రాథమిక దశలో ఒక్కో తరగతికి చెందిన వాచకం ఒక రచయిత లేదా రచయితల బృందం కూర్చిందై ఉండాలి.

*  వాచకాన్ని ఒక్కొక్క రచయిత మాత్రమే ఒక్కొక్క తరగతి వాచకం కూర్చడం వల్ల కలిగే ప్రయోజనం - రచనాశైలి ఒకే విధంగా ఉండటం.

*  అధ్యయన కవుల కవితలు ఉండాల్సిన దశ - మాధ్యమిక దశ

*  వివిధ రచయితలు రాసిన పాఠాలు ఉండాల్సిన దశ - మాధ్యమికోన్నత దశ

*  అన్ని రకాల శైలులకు ఏ దశలో అవకాశం ఇవ్వాలి - ఉన్నత దశ


రసాలు

*  భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రసాలతో కూడిన పద్యాలు, వాచకాల్లో ఉండాల్సిన స్థాయి - ప్రాథమికోన్నత స్థాయి.

*  అద్భుత, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంతి రసాలకు చెందిన పాఠాలు ఉండాల్సిన దశ - ఉన్నత దశ

పేరాలు 

*  2, 3 తరగతుల్లో 1, 2 వాక్యాలున్న పేరాలు ఉండొచ్చు.

*  4వ తరగతిలో 3, 4 వాక్యాలున్న పేరాలు

*   5వ తరగతిలో - పాఠాల నిడివిని బట్టి విరామ చిహ్నాలు

*  2, 3 తరగతులు - వాక్యాంత బిందువులు ఉండాలి.

*  4, 5 తరగతులు - వీటికి తోడు కామాలు, ప్రశ్న గుర్తులు, ఆశ్చర్యార్థకాలు, సందర్భ చిహ్నాలు ఉండాలి.

ప్రక్రియలు

*  పొడుపు కథలు, బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడే పద్యాలు ఉండాల్సిన దశ - ప్రాథమిక దశ

*  పద్య, గద్య పాఠాలతోపాటు గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలు లాంటి  ప్రక్రియలకు స్థానం ఇవాల్సిన దశ - మాధ్యమిక దశ

*  పద్య, గద్య పాఠాలతోపాటు ఉదాత్తమైన గేయాలు, సంభాషణ పాఠాలు, వచన కవితలు మినీ కవితలు, కథానికలు ప్రవేశపెట్టాల్సిన దశ - ఉన్నత దశ.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో పాఠ్య పుస్తకం బాహ్యలక్షణం కానిది?

1)  మన్నిక గల అట్ట     2) ముద్రణ 

3) భాష     4) ముఖచిత్రం


2. కిందివాటిలో స్వీయ మూల్యాంకనానికి సంబంధించిన శీర్షిక-

1)  పిల్లలూ ఇలా చేయండి   2) ఇవి చేయండి 

3) ఉన్ముఖీకరణ చిత్రం    4) నేనివి చేయగలనా?


3.  2, 3 తరగతుల్లో ఎన్ని వాక్యాలున్న పేరాలుండాలి?

1)  1, 2 వాక్యాలు     2) 2, 3 వాక్యాలు  

3) 3, 4 వాక్యాలు     4) 2, 4 వాక్యాలు


4. ఉన్ముఖీకరణ చిత్రం ఉద్దేశం?

1)  ప్రమాణాలు పెంపొందించడం 

2) వాగింద్రియాలకు శ్రమ కలిగించకుండా ఉండటం

3) విద్యార్థులను ఆలోచింపజేయడం 

4) స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించడం


5.   కథకు కొత్త ముగింపు ఇవ్వడాన్ని ఈ విద్యా   ప్రమాణాన్ని సాధించినట్లుగా గుర్తించవచ్చు?

1)  పదజాలం    2) సృజనాత్మకత 

3) ప్రశంస     4) ప్రాజెక్టు పని


6.  తెలుగు వాచకంలోని పాఠాలు ఏ రూపంలో ఉండాలి?

1)  వ్యావహారికం     2) గ్రాంథికం 

3) సరళ వ్యావహారికం     4) సరళ గ్రాంథికం


7.  నూతన పాఠ్య పుస్తకాలు దేనికి అధిక ప్రాధాన్యాన్ని కల్పించాయి?

1)  విషయం     2) సాహిత్యం 

3) సృజనాత్మకత     4) ప్రశంస


8.  దేని ఎంపికలో సంస్కృతీ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకోవాలి?

1)  ఇతివృత్తాలు    2) ముందుమాట 

3) అధ్యయన వేదిక       4) స్వీయరచన


9.  పిల్లల జ్ఞాన నిర్మాణమే విద్యా లక్ష్యంగా ఉండాలని అభిప్రాయపడింది?

1)  ఏపీఎస్సీఎఫ్- 2011     2) ఆర్టీఈ - 2009 

3) ఎన్సీఎఫ్- 2005     4) ఎన్సీఈఆర్టీ


10. ఏ దశలో ఒక్కొక్క తరగతికి చెందిన వాచకం ఒక్కొక్క రచయిత మాత్రమే కూర్చిందై ఉండాలి?

1)  ప్రాథమిక దశ     2) ప్రాథమికోన్నత దశ 

3) మాధ్యమిక దశ     4) ఉన్నత దశ


11. వాక్యాంత బిందువులు ప్రవేశపెట్టాల్సిన తరగతులు-

1)  1, 2    2) 2, 3    3) 3, 4     4) 1వ 


12. విద్యార్థి కరపత్రం రాయడం అనేది-

1)  ప్రశంస    2) ప్రాజెక్టు 

3) భాషాంశాలు     4) సృజనాత్మకత


13. ‘ముందు మాట’ ఇలా ఉండాలి.

1)  స్వీయ మూల్యాంకనం చేయగలిగేలా   2) స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేలా 

3) తాత్వికతను తెలిపేలా   4) పదజాలం సాధించేలా


14. పాఠ్య పుస్తకాలను దేని మార్గదర్శకాలను అనుసరించి రూపొందించారు?

1)  ఎస్సీఈఆర్టీ     2) ఏపీఎస్సీఎఫ్- 2011 

3) ఎన్సీఎఫ్- 2005     4) ఆర్టీఈ - 2009


15. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం - 2011ను రూపొందించడానికి తయారుచేసిన ఆధార పత్రాలెన్ని?

1)  7     2) 12     3) 14     4) 18


16. భాషా వాచకాల్లో దేనికి ప్రాధాన్యం ఉండాలి?

1)  విషయం  2) భాష   3) మన్నిక   4) ధర


17. భారత ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-2005ను ఏ నివేదిక ఆధారంగా రూపొందించింది?

1)  భార రహిత అభ్యసనం    2) విద్యాహక్కు చట్టం 

3) రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం   4) ఏదీకాదు


18. పాఠ్య పుస్తకాల గురించి ప్రస్తావించిన విద్యాహక్కు చట్టంలోని అధ్యాయం-

1)  2వ     2) 3వ    3) 4వ    4) 5వ 


19. 1, 2 తరగతుల పాఠ్య పుస్తకాలను ఏ పద్ధతి  ఆధారంగా బోధిస్తారు?

1)  పద పద్ధతి     2) వాక్య పద్ధతి 

3) కథా పద్ధతి     4) చూసి చెప్పే పద్ధతి


సమాధానాలు
 

1-3; 2-4; 3-1; 4-3; 5-2; 6-3; 7-3; 8-1; 9-3; 10-1; 11-2; 12-4; 13-3; 14-2; 15-4; 16-2; 17-1; 18-4; 19-1.

రచయిత: సూరె శ్రీనివాసులు
 

Posted Date : 06-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌